Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఎవరికెవరూ ఈ లోకంలో... by naresh
#1
Heart 
      ఎవరికెవరూ ఈ లోకంలో
[Image: th-1.jpg]
                             ... by naresh
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నా పేరు నాని.
ఈ కథ నాకు దిక్కు తోచకుండా చేసిన నా జీవితం.
నాకు చిన్నప్పుడే తల్లి పోయింది. మా అమ్మమ్మకి మా అమ్మ అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మమ్మ నాన్నతో గొడవపడి మరీ చిన్నప్పటి నుంచి తనతోనే ఉంచుకుంది.
ఇక కథలోకి వస్తే నేను ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాను. ఒక పేరు మోసిన కాలేజీలో.
మొదటి సంవత్సరం ఏదో అలా గడిచిపోయింది. నా ప్రేమ కథ ఏదైనా మున్నాళ్ల ముచ్చటే. అప్పుడు నా జీవితంలోకి ప్రవేశించింది అంబి.
తనూ అదే క్యాంపస్ లో బి.ఫార్మ్ చదువుతుంది. తను నా సీనియర్.
నా సీనియర్ ఒక అమ్మాయి నాతో బాగా క్లోజ్ గా ఉండేది.
ఇద్దరం రాత్రిళ్ళు ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం.
ఒక రోజు బోరు కొట్టి మీ హాస్టల్ లో ఎవరైనా ఉంటే ఇవ్వు రోజూ నీతో బోరింగ్ అన్నాను.
అప్పుడు వినపడింది తియ్యని స్వరం.
ఇద్దరం కొంచెం సేపు పోట్లాడుకున్నాం.
తనకి సీనియర్ ని అన్న బెట్టు. నాకు మగాడ్ని అన్న పట్టు. ఛీ మళ్ళీ ఈ అమ్మాయితో మాట్లాడకూడదు అనుకున్నాను.
రెండు రోజులకు మధ్యాహ్నం FM&HM క్లాస్ బోర్ కొట్టి మళ్ళీ మా సీనియర్ మౌనికకి కాల్ చేశాను. ఈ సారి మళ్ళీ అదే అమ్మాయి. మౌనిక ఫోన్ హాస్టల్ రూంలో వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పింది. అప్పుడు మొదలైన మా మాటల ప్రవాహం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. మళ్ళీ రాత్రికి తనతోనే నా మాటలు.
ఒక వారం రోజులు అదే మత్తు. ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఎన్నెన్నో జ్ఞాపకాలు పంచుకున్నాం.
నా ఫోన్ కొన్ని రోజులు ఖాళీ లేదు. ఈ కొన్ని రోజుల్లోనే మీరు నుంచి "నాని బావా " అని పిలిచే వరకు వచ్చేశాను.
ఆ రోజు సాయంత్రం కలుస్తాను అని చెప్పింది. నన్ను " బావా " అని పిలిచే నా మరదలు ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో యూనిఫామ్ షర్ట్ విప్పేసి బ్యాగ్ లో దాచుకున్న టీ షర్ట్ వేసుకుని సెంట్రల్ ఫుడ్ కోర్ట్ కి బయలుదేరాను.
అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే 10నిమిషాల్లో వస్తాను అంది. నాకు ఉత్సాహం ఆగలేదు.
అలాగే హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను. వరుసగా అమ్మాయిలు వస్తున్నారు.
ఎవ్వరూ నా కళ్ళకి కనిపించడం లేదు. హాస్టల్ నుంచి అమ్మాయిలు వచ్చే దారి వంక అలాగే చూస్తున్నా.
కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుకి పక్కగా ఆకుపచ్చ రంగులో గుబురుగా పెరిగిన మొక్కల పక్క నుంచి తెల్ల చుడిదార్ లో హంసలా ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది.
పాత ఇనుప ముక్కలు అన్నీ అయస్కాంతానికి అంటుకుపోయినట్టు నా రెండు కళ్ళూ ఆ అమ్మాయికి అంటుకుపోయాయి.
అలా ఆ అమ్మాయి వెనకే నడుచుకుంటూ వెళ్లిపోయా. తను కూడా నన్ను గమనిస్తుంది. సరిగ్గా నడుస్తూ నడుస్తూ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగి చుట్టూ చూస్తుంది.
నా గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంది. తనని చూడగానే నా ఊపిరి నాకు డాల్బీ డిజిటల్ సౌండ్ లో వినిపిస్తుంది.
ఒకవేళ నేను చూస్తున్న అంబి తనేనా?
వెళ్ళి "అంబి?" అని అడగాలి అనిపిస్తుంది కానీ నా మనసు ఎంత ఉరకలు వేస్తుందో నా శరీరం అంత అచేతనవస్థలోకి వెళ్ళిపోయింది. అక్కడే స్థాణువులా కదలకుండా నిలబడిపోయాను.
నా ఊపిరి వేగం మెల్లగా హెచ్చుతుంది. ఎందుకంటే తను నా దగ్గరికి వస్తుంది.
దగ్గరికి వచ్చి "నరేష్?" అంది.
అప్పుడు నా మొహం చూడాలి. నవరసాలని కళ్ళతోనే పలికిస్తున్న రంగస్థల మహా నటుడ్ని మించిపోయాను.
ఇద్దరం ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఒక అరగంట కూర్చున్నాం. మా ఇద్దరికీ కూడా నెర్వస్ గా అనిపించింది. అక్కడ్నుంచి వెళ్లిపోయాం.
రూంకి వెళ్ళాక అంబి ఫోన్ చేసింది.
ఫోన్ ఎత్తాక తను చెప్పిన మాటల్లో నాకు వినపడింది, గుర్తుంది ఒకటే మాట.
"చాలా మ్యాన్లీగా ఉన్నావ్ బావా"
అర్జెంటుగా బాబాయ్ కొట్టుకు వెళ్ళిపోయి కింగ్ అంటించేసాను.
చల్లని సాయంత్రం వేళ ఖాళీ స్థలంలో కుర్చీ వేసుకుని తను అన్నమాట గుండెల్లో గింగిర్లు తిరుగుతుంటే ఒక్కొక్క దమ్ము లాగుతున్నాను.
మనసంతా ఏదోలా ఉంది.
ఇంటికి వెళ్ళిపోయాను. ఈ రోజు అద్దం ముందు నిలబడి ఎన్ని సార్లు నన్ను నేను చూసుకున్నానో లెక్క లేదు.
అంబికి ఫోన్ చేశాను.
ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు.
మౌనీ నంబర్ కి కాల్ చేశాను.
'ఏరా ఏం చేస్తున్నావ్?' అంది.
ఒక రెండు నిమిషాల సొల్లు కబుర్ల అనంతరం అంబికి ఫోన్ ఇవ్వమన్నాను.
"చెప్పు బావా ఏం చేస్తున్నావ్?" అంది అంబి.
దానితో మాట్లాడటం ఒక కిక్కు.
ఒక వారం లొనే మా బంధం బాగా బలపడింది.
ఒక చల్లని సాయంత్రం వేళ తనతో మాట్లాడుతుంటే ఎందుకో తెలియని ప్రేమ ఫీల్ అయ్యాను తన మీద. ఐ లవ్ యూ అని చెప్పాలి అనిపించింది. కానీ చెప్పేస్తే ఏమవుతుందో?
ఎందుకైనా మంచిది ఒక రాయి వేద్దాం అనిపించింది.
"మీ లవర్ ఏం చేస్తున్నాడు?" అని అడిగాను.
"ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు రా" అనేసింది.
గుండెల్లో గుణపాలు దిగిన సందర్భం అది.
కానీ పైకి అదేమీ చూపించకుండా మాములుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంత దాచినా ఆ భాద బయట పడుతూనే ఉంది. మౌనీకి కూడా ఫోన్ చెయ్యటం మానేసాను.
రెండు రోజులకు మౌనీ దగ్గర్నుంచి కాల్ వచ్చింది. కట్ చేసి తిరిగి కాల్ చేశాను.
"ఏంటి బావా కాల్ చేయట్లేదు? అంత బిజీనా?" అవతలి వైపు నుంచి అంబి.
ఏం చెప్పాలో తెలియట్లేదు.
"అబ్బే అదేమీ లేదు. వర్క్స్ ఉన్నాయ్" అంటూ ఏదో చెప్పాను కానీ నమ్మినట్టు అనిపించడం లేదు.
కొన్ని రోజులు మా మధ్య జీవం లేని మాటలు నడిచాయి.
ఒక రోజు సాయంత్రం కాల్ మాట్లాడుతూ మధ్యలో బావా అని పిలిచింది.
ఆ మాటకు నా గుండె లోతుల్లో ఎక్కడో దాచుకున్న ప్రేమ ఉబికి కన్నీటి రూపంలో బయటకు వచ్చేసింది.
ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నాను.
ఇంతలో అకస్మాత్తుగా అంబి "బావా ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తావా?" అని అడిగింది.
"అడుగు బంగారం" అన్నాను.
"బావా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా?" అని అడిగింది.
నాకు మౌనమే సమాధానం అయ్యింది. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అడిగింది.
"చెప్పు బావా నన్ను ప్రేమిస్తున్నావా?"
"హా.." అన్నాను గద్గద స్వరంతో.
"నన్ను మర్చిపో బావా.. " అంది.
నాకు గుండెల్లో రాళ్లు పడ్డాయి.
"ఎందుకు?" అన్నాను.
"వద్దు బావా నేను మా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటాను. ఈ ప్రేమలు అవి నాకు సెట్ కావు." అంది.
"నా మీద నీకు ప్రేమ లేదా?" అన్నాను.
"ఉంది బావా కానీ ఇంకోసారి ఈ ప్రేమ ఊబిలో పడలేను. "
"సరే మరి నన్ను ఎందుకు కాదు అంటున్నావ్?"
"చెప్పాను కదా. నాకు ఈ ప్రేమ వద్దు. కావాలంటే నాకు పెళ్ళి చెయ్యడానికి ముందు నువ్వు జాబ్ తెచ్చుకుని మీ ఇంట్లో వాళ్ళతో వచ్చి మా ఇంట్లో అడుగు. మా నాన్న నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే అని చెప్తాను. అదే నేను నీకు చేయగలిగే సాయం" అంది.
"సరే నేనే మీ ఇంట్లో అడుగుతాను. నేనే ఉద్యోగం తెచ్చుకుంటాను. నువ్వు నన్ను లవ్ చెయ్యక్కర్లేదు. నాకు పెళ్ళాంగా ఉండు చాలు " అన్నాను.
అసలు ఆ సమయంలో ఆ మాట ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నా మనసులో ఉందల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిని వదులుకోకూడదు.
మరి ఎందుకు ఒప్పుకుందో తెలీదు కానీ సరే అనేసింది.
తర్వాత ప్రేమగానే మాట్లాడేది.. నేను కూడా చాలా ప్రేమ చూపించేవాడిని. నాలో పొంగుతున్న ప్రేమ కొద్దికొద్దిగా తనని వివసురాలిని చెయ్యడం మొదలుపెట్టింది. వద్దు వద్దు అనుకున్నా తనలో ప్రేమ బయటపడేది.
కొన్నాళ్ళకి ఇద్దరం ప్రేమలో మునిగిపోయేవాళ్ళం.
కొన్నాళ్ళకి తనకి ఒక రోజు రాత్రి ఉదయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఉదయ్ తన మాజీ ప్రియుడు.
తనతో కొన్నాళ్ల సహవాసం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవలిసి వచ్చింది.
అప్పుడే తను నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది.
"ఏం చేస్తున్నావ్? ఎలా ఉన్నావ్ " అన్న మాటల సమాహారం మా ప్రేమ కథ వరకు వచ్చింది. తను నాకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టింది. నేను మామూలుగానే మాట్లాడాను.
ఆ తర్వాత రోజూ ఫోన్ చేసేవాడు ఉదయ్. నేను కూడా కాన్ఫరెన్స్ లో ఉండేవాడిని. అలా కొన్ని రోజుల మాటల తర్వాత మా జీవితంలోకి ప్రవేశించాడు కార్తీక్.
Like Reply
#3
ఒక్క update తో నిలిచింది... ఇది
[+] 1 user Likes Milf rider's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)