19-10-2019, 07:49 PM
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు
నేను బార్బిరకుడిని...by kittyboy
|
19-10-2019, 07:49 PM
19-10-2019, 07:51 PM
నేను బార్బిరకుడిని
[size=undefined] నేను బార్బిరకుడిని .నా తండ్రి ఘటోత్కచుడు .నేను కురుక్షేత్ర యుద్ధం చూడటానికి ఈ కొండ మీద ఉన్నాను ఒంటరిగా .ఎవరన్నా తోడు ఉంటారని చూస్తున్నాను ...ఎవ్వరు రావటం లేదు. అయినా మొండెం లేకుండా ఉండడం కష్టమే ...... నా మొండెం ఏమైందో తెలియాలంటే నా గురించి చెప్పాలి .......[/size]
19-10-2019, 07:53 PM
మహాభారతం ఓ జీవసాగరం. ఒకటా రెండా... అందులో వందలాది పాత్రలు. ప్రతీ పాత్రకీ ఏదో ఒక ప్రత్యేకత. అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు. బర్బరీకుడు ఎవరో కాదు! ఘటోత్కచుని కుమారుడే. అతని తల్లి పేరు మౌర్వి. బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు.
ఒకపక్క బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా! బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి, పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. ‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. ‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు. ‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు. మహాభారతం ఓ జీవసాగరం. ఒకటా రెండా... అందులో వందలాది పాత్రలు. ప్రతీ పాత్రకీ ఏదో ఒక ప్రత్యేకత. అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు. బర్బరీకుడు ఎవరో కాదు! ఘటోత్కచుని కుమారుడే. అతని తల్లి పేరు మౌర్వి. బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. ఒకపక్క బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా! బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి, పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. ‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. ‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు. ‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద అకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. ‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు. ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. అందుకే... ‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. కృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాటాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద అకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. ‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు. ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. అందుకే... ‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. కృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాటాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. బర్బరీకుడు పూర్వజన్మలో శాపగ్రస్తుడైన యక్షుడనీ, అతనికి శాపవిమోచనం కలిగించేందుకే తాను అతని తలను కోరాననీ వివరిస్తాడు కృష్ణుడు. అంతేకాదు... కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడనీ, అతణ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు కృష్ణుడు. మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం వల్ల, ఆయన కాలు మిగతా శరీరంకంటే బలహీనపడిపోయింది. అందుకని, శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నం అయినప్పుడు, ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది. దక్షిణ భారతాన ఖాటు శ్యాంను ఆరాధించేవారి సంఖ్యే కాదు, అసలు ఆ పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన, ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్*లోనూ ఖాటు శ్యాం బాబాను ఆరాధించేవారి సంఖ్య అసాధారణం. శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటు శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను కడతేర్చడం చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం. బర్బరీకుడు పూర్వజన్మలో శాపగ్రస్తుడైన యక్షుడనీ, అతనికి శాపవిమోచనం కలిగించేందుకే తాను అతని తలను కోరాననీ వివరిస్తాడు కృష్ణుడు. అంతేకాదు... కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడనీ, అతణ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు కృష్ణుడు. మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం వల్ల, ఆయన కాలు మిగతా శరీరంకంటే బలహీనపడిపోయింది. అందుకని, శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నం అయినప్పుడు, ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది. దక్షిణ భారతాన ఖాటు శ్యాంను ఆరాధించేవారి సంఖ్యే కాదు, అసలు ఆ పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన, ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్*లోనూ ఖాటు శ్యాం బాబాను ఆరాధించేవారి సంఖ్య అసాధారణం. శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటు శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను కడతేర్చడం చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం. ఘటోత్కచుని కుమారుడైన బర్బరీకుడు మహాబలశాలి. అతను కనుక కురుక్షేత్రంలో పాల్గొంటే యుద్ధం తారుమారైపోతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకంగా బర్బరీకుని తలను తనకు కానుకగా అడుగుతాడు. అలా బర్బరీకుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంగా అందించిన తల రాజస్థాన్*లోని ఖాటు అనే గ్రామంలో పడిందట. అ శిరస్సుని దర్శించుకునేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది జనం ఖాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా! రాజస్తాన్*- ఖాటు జైపూర్*కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి �ఖాటు శ్యాం�గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్*సింగ్* చౌహాన్* అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీవినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్*సింగ్* 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు. శ్యాం కుండ్*, శ్యాంబగీచా ఖాటు శ్యాం శిరస్సు కనిపించిన చోటుని శ్యాంకుండ్*గా పిలుచుకుంటారు జనం. ఈ కొలనులో కనుక స్నానం చేస్తే సర్వ పాపాలూ, సకల రోగాలూ నశిస్తాయన్నది భక్తుల నమ్మకం. ఆ పక్కనే ఉన్న శ్యాం బగీచా అనే అందమైన పూల తోట నుంచే ఆలయంలోని ఇలవేల్పుని అలంకరించేందుకు కావల్సిన పుష్పాలను సేకరిస్తారు. ఇక ఖాటు శ్యాం ఆలయానికి దగ్గర్లోనే గౌరీశంకర ఆలయం పేరుతో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా అత్యంత పురాతనమైనదే. మహిమ కల్గినదే! ఔరంగజేబు సైనికులు ఒకనాడు ఈ శివాలయంలోని లింగాన్ని ధ్వంసం చేయబోగా, శివలింగం నుంచి రక్తధార వెలువడిందట. దాంతో భయపడిన సైనికులు తోక ముడిచారని అంటారు. భక్త జనం, పర్వదినం ఉత్తరాదిన ఎన్నో వేల కుటుంబాలకు �ఖాటు ఖ్యాం� ఒక ఇలవేల్పు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఖాటు శ్యాంను దర్శించుకునేందుకు లక్షలాది మంది ఈ గ్రామానికి చేరుకుంటారు. ఖాటు శ్యాం కేవలం కృష్ణుడి పేరు మాత్రమే కాదు, కృష్ణుని అంశ సైతం ఉన్న దైవంగా భావిస్తారు. అందుకే శ్రీకృష్ణునికి సంబంధించిన పండుగలన్నీ ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఇక ఖాటు శ్యాం జన్మించిన శుక్ల పక్ష ఏకాదశి, ఆయన తలను దానం చేసిన శుక్ల పక్ష ద్వాదశి తిథులలో ఆలయం కిక్కిరిసిపోతుంది. పిల్లలకు తలనీలాలను అందించేవారు. కోరికలను తీర్చమంటూ నిషాన్* పేరుతో ఆలయంలో జెండాను ఉంచేవారు ఖాటుకు పోటెత్తుతారు. ఇక ఆలయంలో ఖాటు శ్యాంను ప్రతిష్టించిన �ఫల్గుణ శుద్ధ ఏకాదశి� సందర్భంగా జరిగే ఫాల్గుణ మేళా గురించి చెప్పుకొనేందుకు మాటలు చాలవు. పాదయాత్రలు చేసుకుంటూ, భజనలు పాడుకుంటూ, ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ లక్షలాది మంది జనం ఈ జాతరకు చేరుకుంటారు. ఆ సమయంలో ఖాటు అనే కుగ్రామం కాస్తా ఒక జనసంద్రంగా మారిపోతుంది. అహ్మదాబాద్* మొదల్కొని, నేపాల్* వరకూ శ్యాంబాబాకు అనేక ఆలయాలు ఉన్నాయి. శ్యాంబాబాబా, బలీయదేవ్*, తీన్* బాణ్ ధారి, ఖాటు నరేష్*, మోర్వీ నందన్*... ఇలా ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఏ ఆలయంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికే కలియుగదైవం శ్యాంబాబా అన్నది ఉత్తరాది భారతీయుల నమ్మకం. భక్త జనం, పర్వదినం ఉత్తరాదిన ఎన్నో వేల కుటుంబాలకు �ఖాటు ఖ్యాం� ఒక ఇలవేల్పు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఖాటు శ్యాంను దర్శించుకునేందుకు లక్షలాది మంది ఈ గ్రామానికి చేరుకుంటారు. ఖాటు శ్యాం కేవలం కృష్ణుడి పేరు మాత్రమే కాదు, కృష్ణుని అంశ సైతం ఉన్న దైవంగా భావిస్తారు. అందుకే శ్రీకృష్ణునికి సంబంధించిన పండుగలన్నీ ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఇక ఖాటు శ్యాం జన్మించిన శుక్ల పక్ష ఏకాదశి, ఆయన తలను దానం చేసిన శుక్ల పక్ష ద్వాదశి తిథులలో ఆలయం కిక్కిరిసిపోతుంది. పిల్లలకు తలనీలాలను అందించేవారు. కోరికలను తీర్చమంటూ నిషాన్* పేరుతో ఆలయంలో జెండాను ఉంచేవారు ఖాటుకు పోటెత్తుతారు. ఇక ఆలయంలో ఖాటు శ్యాంను ప్రతిష్టించిన �ఫల్గుణ శుద్ధ ఏకాదశి� సందర్భంగా జరిగే ఫాల్గుణ మేళా గురించి చెప్పుకొనేందుకు మాటలు చాలవు. పాదయాత్రలు చేసుకుంటూ, భజనలు పాడుకుంటూ, ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ లక్షలాది మంది జనం ఈ జాతరకు చేరుకుంటారు. ఆ సమయంలో ఖాటు అనే కుగ్రామం కాస్తా ఒక జనసంద్రంగా మారిపోతుంది. అహ్మదాబాద్* మొదల్కొని, నేపాల్* వరకూ శ్యాంబాబాకు అనేక ఆలయాలు ఉన్నాయి. శ్యాంబాబాబా, బలీయదేవ్*, తీన్* బాణ్ ధారి, ఖాటు నరేష్*, మోర్వీ నందన్*... ఇలా ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఏ ఆలయంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికే కలియుగదైవం శ్యాంబాబా అన్నది ఉత్తరాది భారతీయుల నమ్మకం. ______________________________ ఇలాంటి మరిన్ని బొమ్మల కోసం కింద ఉన్న లింక్ ను నొక్కండి
19-10-2019, 07:55 PM
నా మొండెం ఏమైందో తెలియాలంటే నా గురించి చెప్పాలి .......
నా తండ్రి ఘటోత్కచుడు ,తల్లి అహిలవతి .నా తల్లి నాగకన్య .పరమశివుని మేడలో ఉన్న సర్పం పేరు బాశాంకుడు .ఆయన మా తల్లి జనకుడు. పరమ శివునికి వాడిపోయిన పువ్వులతో పూజచేయడం వల్ల పార్వతి దేవి ఆమెను ఒక రాక్షసుడు భర్తగ వస్తాడని శపించారు. భీమసేనులవారి మీద విషప్రయోగం జరిగిన తరువాత ఆయన స్పృహ తప్పి నాగ లోకం చేరుకున్నారు .వాయుపుత్రుని గుర్తించిన ఆమె తన తండ్రి తో భీమసేనులవారికి అమృతం ఇప్పించి ప్రాణం పోసింది. తరువాత ఆమె భూలోకం లో ముర రాజు పుత్రిక కామకతంతక గా జన్మించింది. శ్రీకృష్ణుడు ముర అసురుని సంహరించాక ,అతని పుత్రిక తో యుద్ధం చేసారు.భీకర యుద్ధం తర్వాత కామాఖ్యా దేవి ప్రత్యక్షం అయ్యి శ్రీకృష్ణుని తో ..ఈమెకు నేను అన్ని అస్త్రశాస్త్రాలు నుండి రక్షణను ప్రసాదించాను ..కావున మీ సుదర్శనచక్రాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పారు. కామకతంటక తో దేవి ......శ్రీకృష్ణులు శివునితో సమానం ...కావున యుద్ధం విరమించు అన్నారు. ఆలా తన మనవడికి సమఉజ్జి అయిన భార్యను శ్రీకృష్ణులు కనిపెట్టారు. మా తండ్రి ఘటోత్కచుని తో మా తల్లి కమక తంటక (మౌర్వి) దేశానికి పంపారు. మా తల్లి తనకు కాబోయే భర్త ఆమె పెట్టిన పరీక్షలో నెగ్గాలి అని షరతు పెట్టారు,పరీక్షలో ఓడినవారికి మరణశిక్ష . మా తండ్రి ఘటోత్కచుడు శ్రీకృష్ణుల వారి ఆశీస్సులతో పరీక్ష లో పాల్గున్నారు. మా తల్లి తనకు సమాధానం చెప్పలేని ప్రశ్న అడగమన్నారు. అప్పుడు అయన ఒక కధ చెప్పారు. ఒకవూరి లో ఒక మోతుబరి ఉన్నాడు. ఒక అమ్మాయిని కని అయన భార్య చనిపోయింది. తన ఎదిగిన సౌందర్యవతి అయినా కూతుర్ని చూసి ,తాను తన బంధువు అమ్మాయిని పెంచుకున్నానని అబద్దం చెప్పి కూతురిని పెళ్లి చేసుకున్నాడు .వాళ్లకు పుట్టిన పిల్లలు ఎవరెవరికి ఏమి అవుతారు. మా తల్లి సమాధానం చెప్పలేక ఓటమి అంగీకరించి పెళ్లి చేసుకున్నారు. చిన్న తనం నుండి నా తల్లి నుండి సకల విద్యలు నేర్చుకున్నాను. పరమశివుని వరప్రసాదితమైన మూడు అస్త్రాలు నా బలం. నా తల్లి నన్ను కురుక్షేత్ర యుద్ధం లో పాల్గొనమని చెప్పింది. నేను బలహీనమైన పక్షాన పోరాడుతానని ఆమెకు మాట ఇచ్చి బయలుదేరాను. ఈ యుద్ధ సమయం లో ధర్మసందేహాలు తీర్చుకోవాలని మనసులో అనుకున్నాడు. మార్గమధ్యం లో ఒక ముసలాయన నాకు కనిపించారు .మహాతేజస్సు కలిగిన ఆయనను చూసి నమస్కరించాను . ఆయన నన్ను ఎక్కడికి పయనం అని అడిగారు . నేను కురుక్షేత్ర యుద్ధానికి అని చెప్పారు . ఎవరి తరుపున పోరాడతావు అన్నారు . పాండవులకు ఆరు అక్షయుహిణి ల సైన్యం ఉంది, కౌరవులకు పదకొండు బలం ఉంది.కాబట్టి పాండవుల అదే మా తాతయ్య భీమసేనులవారు తరుపున పోరాడుతానని చెప్పాను. ఎంతసేపటిలో యుద్ధాన్ని ముగించగలవు బాలక అని ముసలాయన నన్ను అడిగారు. అప్పుడు నేను కామాక్షిదేవి కి ప్రార్ధించి ..ఆర్యా నా వద్ద మూడు బాణాలు ఉన్నాయి. ఒకటి ప్రయోగించగానే ఎవరి చంపాలో గుర్తిస్తుంది ,ఇంకొకటి ఎవరిని కాపాడాలో గుర్తిస్తుంది.మూడవది శత్రుసంహారం గావిస్తుంది,నాకు యుద్ధం ముగించడానికి ఒక ఘడియ చాలు అని చెప్పాను . అబ్బురపడిన వృద్ధుడు ఒక సారి ఈ రవి చెట్టు ఆకులను కొట్టి చూపించగలవా అని అడిగారు. వెంటనే బాణం సంధించాను .బాణం అన్ని ఆకులని కొట్టివేసి వృద్ధుని కాలికి గుచ్చుకుంది .కాలు ఎత్తిచూస్తే కాలికింద ఒక అకు వుంది. ఆ బాణం తీసి నొప్పిగావుందేమో అని ఆయన ముఖము చూసాను. ముఖము లో ఏ భాధ లేని ఆయనను చూసి ఈయన మాములు వ్యక్తి కాదు దేవుడు అని స్ఫురించి, ఆ దివ్యపురుషునిని గుర్తించాను . శ్రీకృష్ణ మహాప్రభో ..మిమ్ములను గుర్తించలేకపోయాను .క్షమింపుడి అని అన్నాను. అప్పుడు భగవానుడు తన రూపం లోకి వచ్చారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కాంచి పరమానందభరితుడయ్యాను. శ్రీకృష్ణుని నావద్ద నీకు అర్పించడానికి ఏమి లేవు, ఏమివ్వగలనని చింతించుచు అడుగగా పరమాత్ముడు కురుక్షేత్ర యుద్ధానికి ఒక మహావీరుని బలి ఇవ్వాలని. ..ఆ బలిదేవుడు నేనేనని చెప్పారు. అప్పుడు పరమాత్ముని నీ విశ్వరూపం, కురుక్షేత్ర యుద్ధం చూడాలని నా అంతిమ కోరిక అని కాళ్లుపట్టుకున్నాను. శరాఘాతం వల్ల ఇంకా రక్తం వస్తుంది. అది చూసి ఏమిటిది స్వామి మీకు గాయమా అని అడిగాను. దుర్వాసుని శాపం వల్ల నా పాదము శక్తిహీనం అయింది.వాలి ఈ జన్మలో జరుడికింద పుట్టి తన బాణం తో ఈ గాయం మీదే కొట్టి నా అవతారం చాలించేలా చేస్తాడు అని నాకు విశ్వరూపం చూపించారు భగవానుడు. ఆ సమ్మోహన నారాయణ స్వరూపం చూసినతర్వాత నాకు ఏమి చూడబుద్ది కాలేదు . కానీ నా కళ్ళముందు నా పూర్వజన్మ కనపడింది. నేనొక యక్షుడను. విష్ణుమూర్తిని సేవించుచుండగా బ్రహ్మ తదితరులు వచ్చి భూలోకం లో అధర్మం పెట్రేగిపోయింది, ధర్మం కాపాడుటకు మీరు భువిపై అవతరించే సమయం ఐంది అని విషుమూర్తిని దేవతలు విన్నవించుకున్నారు. దానికి నేను నవ్వి ఈ స్వల్పకార్యానికి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు దేనికి, నేను వెళ్లి భూలోకం లో అధర్మం రూపుమాపి ధర్మం ప్రజ్వరిల్లేలా చూస్తాను అని అవహేళనగా బ్రహ్మ దేవుడికి చెప్పాను. నా వ్యర్ధ ప్రసంగానికి కోపోద్రిక్తుడైన చతుర్ముఖుడు ,నీవు భూలోకం లో పుట్టి విష్ణువు వలన సంహరింపబడి పాపవిమోచనం పొందెదవు అని శపించారు. ........ శ్రీకృష్ణుని లీల నాకు అర్ధమైంది ......... నా బలిదానం మిగిలింది. నా నీలమేఘ వర్ణరంజితమైన అశ్వాన్ని అధిరోహిస్తూ శ్రీకృష్ణుని పాదాలమీద బాణం సంధించాను.బాణం నుండి గంగ ఉప్పొంగి దేవదేవుని పాదాలకు అభిషేకము చేసినది. గాయం నుండి రక్తస్రావం ఆగినది. వెంటనే సూర్యుని తేజస్సు కలిగిన తన సుదర్శన చక్రం తో నా శిరస్సును దక్షిణ గా తీసుకుని. ...ఈ యుద్ధం అయ్యే వరకు నీ శిరస్సు లో ప్రాణం ఉంటుంది అని ఖటు పర్వతం మీద నా శిరస్సు ఉంచి నాకు తోడుగా ఒక దివ్యజ్ఞాని ని పంపుతానని చెప్పి అదృశ్యమైనారు భగవంతుడు. యుద్ధాన్ని చూస్తున్నాను ఇంకా మొదలవ లేదు ,ఒక పండుముసలి వారు అటువైపువస్తున్నారు. ఆయనను చూసి ఎవరో దివ్యపురుషుడిలా అనిపించారు.
19-10-2019, 07:57 PM
యుద్ధo కోసం చూస్తున్నాను ఈరోజు ఇంకా మొదలవ లేదు ,ఒక పండుముసలి వారు అటువైపువస్తున్నారు. ఆయనను చూసి ఎవరో దివ్యపురుషుడిలా అనిపించారు.
అయన నా వైపు ఆర్ద్రం గా చూసి నాయనా నేను నీ గురించి ,నీ త్యాగం గురించి తెలుసుకున్నాను .నిన్ను కలసి వెళదామని వచ్చాను. అయన నుండి వస్తున్న తేజస్సు చూసి ,మహానుభావా మీరెవరో సెలవివ్వండి అని అడిగాను. అప్పుడు ఆయన నేను హనుమంతుడిని అని చెప్పారు . నీవు ఎన్నో ధర్మసందేహాలతో ఉన్నావని వాటిని తీర్చమని శ్రీకృష్ణుడు నన్ను ఇక్కడికి పంపారు . మీ వంటి బ్రహ్మజ్ఞానిని కలుసుకోవడం నా అదృష్టం అని చెప్పాను హనుమంతులవారితో ...... నాయనా నాకు తెలిసింది ,అర్జనుని రధం మీద ఉండగా కృష్ణుని గీతామృతం విని ఆకళింపు చేసుకున్నది నీకు చెబుతాను అని హనుమంతులవారు అన్నారు. ఇప్పటివరకు యుద్ధం ఏమి జరిగింది అని అడిగాను .నాకు ఇంకో సందేహం ఋగ్వేదం లో దశ రాజ్ఞా (పది రాజుల యుద్ధం ) అని చదివాను ,ఆ విషయాన్ని విపులీకరించండి.ఇప్పుడున్న వారిలో మహాయోధుడు ఎవరు ......మీరు చూసిన వారిలో బలమైన ప్రత్యర్థి ఎవరు అని కళ్ళతో నమస్కారం పెట్టాను. నేను యుద్ధరంగం లో తలపడిన వారిలో రావణుని పుత్రుడు మేఘనాధుడు బలమైన ప్రత్యర్థి .
త్రిమూర్తులకు మహామహారధి అని బిరుదు ఉంది, శివ పుత్రులకి కూడా ......
తరువాత స్థాయి అతిమహారధి ......మేఘనాధుడు, పరశురామునికి దక్కింది .............. త్రిమూర్తుల అంశ లేకుండా ఉన్నది ఒక్క మేఘనాదుడే .....బలమైన ప్రత్యర్థి ....అని చెప్పారు. కానీ పరశురామునితో ఒక యోధుడు సరిసమానం గా 23 రోజులు యుద్ధం చేసి సమఉజ్జిగా నిలిచిన వీరాధివీరుడు ఒకరున్నారు ఆయనే ఇప్పుడున్న యుద్ధవీరుల్లో అగ్రగణ్యుడు .......... ఎవరాయన అని అడిగాను ......... ప్రభాసుడు అని సమాధానం వచ్చింది.
19-10-2019, 07:59 PM
ప్రభాసుడు అని సమాధానం వచ్చింది. ప్రభాసుడు పూర్వజన్మ లో అష్టవసుల్లో ఒకరు. కామధేనువు వసిష్ఠుని దగ్గరనుండి దొంగిలించినందుకు గాను భూలోకం లో చాల కాలం జీవించమని శాపం పొందారు.
అతనే దేవవ్రతుడు (భీష్ముడు) . ఇవ్వాళ యుద్ధం మొదటి రోజు ...కౌరవుల సర్వసేనాని ఆయనే ...అయన గురించి యుద్ధవిరామం లో చెపుతాను అని హనుమంతుల వారు అర్జనుని రధం వైపు వెళ్లారు . పాండవుల సర్వసేనాని విరాట యువరాజు శ్వేత. పాండవుల వ్యూహాన్ని ధర్మరాజు రచించారు. తక్కువ సైన్యం వాళ్ళ ఒక్కో వీరుడు సాధ్యమైనంత ఎక్కువ మంది శత్రువులతో తలపడాలని వజ్రవ్యూహం పన్నారు. మగద దేశం నుండి వచ్చిన 1౦౦౦౦ ఏనుగులు కౌరవులకు రక్షణ వలయం గ ఉన్నాయి . భీష్మాచార్యుల ధాటి కి పాండవులు నిలువలేక పోయారు. భీముని రక్షణ మిగిలిన వారినుండి రక్షణ మాత్రమే ఇచ్చింది .కర్ణుడు యుద్ధం చేయకుండా వికర్ణుని యుద్ధవ్యూహం చెపుతున్నాడు. భీష్ముని యుద్ధతంత్రాని కి పాండవ సర్వసేనాని శ్వేత మరణించాడు. విరాటరాజు ఇంకాకొక పుత్రుడు ఉత్తరకుమారుడు శల్యుని చేతి లో మరణించాడు. పాండవులు ఓటమిభారం తో వెనుదిరిగే సమయానికి అభిమన్యుడు భీష్ముని మీద విరుచుకుపడ్డాడు.కానీ పితామహుని ధాటి కి తట్టుకోలేక వెనుదిరిగాడు. సూర్యుడు అస్తమించాడు. ......కౌరవులి శిబిరం లో విజయధ్వానాలు మిన్నుమింటాయి. బార్బిరకుని వద్దకు హనుమంతుడు వచ్చారు. అప్పుడు హనుమంతుడు నాయనా అర్జనునికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసారు .దానికి ప్రత్యక్ష సాక్షి నేనే .గీత సారం మొత్తం ఒక ఘడియ కన్నా తక్కువ సమయం లో భగవానుడు చెప్పారు. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం లో ఉపనిషత్తుల సారాన్ని భవిషత్తు తరాలకు ఉపయోగ పడేలా గీతాసారాన్ని నేనువిన్నాను, తరించాను.త్రేతాయుగం లో అష్టావక్ర గీత జనకుల ద్వారా, వసిష్ఠ గీత రాముని ద్వారా విన్నాను. ఇవ్వాళ భగవంతుని గీత నేను విన్నాను, వర్ణించలేనంత రమణీయం గా ఉంది అని విషాద యోగం గురించి చెప్పారు. ______________________________
19-10-2019, 08:02 PM
అప్పుడు నేను అన్నాను ,హనుమా నా తండ్రి ఒకసారి నన్ను శ్రీ కృష్ణుని వద్దకు తీసుకువెళ్లారు. అప్పుడు నేను శ్రీకృష్ణుల వారిని ముక్తికి మార్గం చెప్పమని అడిగాను .అప్పుడు నాకు ఆయన కర్మ యోగం ఉపదేశించారు. ఆయన మహీసాగర సంగమం వద్ద నలువైపులా ఉన్న నవదుర్గలకు ఉపాసన చెయ్యమన్నారు .వారు నా భక్తి కి మెచ్చి నాకు దివ్యాస్త్రాలు ప్రసాదించారు. వారు నన్ను విజయుడు అనే గురువు వద్ద శిష్యరికం చెయ్యమన్నారు.మగధ వెళ్లి నేను విజయుడి వద్ద ధర్మసూక్ష్మాలు తెలుసుకున్నాను.అక్కడ ఒక బిచ్చగాడు విజయుడి వద్దకు వచ్చాడు, అతనికి బిక్ష ఇవ్వబోతుండగా .....బిచ్చగాని నోటి లో అగ్ని కనపడింది.వెంటనే అతన్ని మూర్ఛపోయేలా గుద్దాను.అతను నా ఘాతానికి ఒక గుహలోకి పారిపోయాడు.అక్కడ లోపల చాలా మంది బందీలై ఉన్నారు. వెంటనే బిచ్చగాడు పెద్ద రాక్షసుడిలా మారాడు.అతని తో కొన్ని రోజులు పాటు యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఇంతలో అక్కడ వాసుకి (నాగరాజు , బాషాక్ నాగు) ప్రత్యక్షమై నాయనా ,నీవు నా మునిమనవడవు,నీ వల్ల నాగలోక వాసులకు ఈ పలాషుడు అనే రాకాసి నుండి విముక్తి కలిగింది అని నాగశాస్త్రం బోధించారు, నాకు,విజయుడికి.
నేను మహిసాగర సంగమం లో ఉన్న గుప్తక్షేత్రం లో ఉండగా అక్కడకు అయిదు మంది వచ్చారు .నేను అమ్మవారికి పూజ కోసం నీరుతెచ్చే కొలను లో ఎవరో స్నానం చేయబోతున్నారు ,నేను మురికిగా ఉన్న వారి పాదాలను చూసి వారించాను. కొలను అపవిత్రం అవుతుంది అని చెప్పాను .వారిలో బలవంతుడు ఒకాయన వచ్చి నాతో ఘర్షణ కు దిగారు.ఆ వీరుణ్ణి ఎత్తి సాగరం లో విసరబోయాను. అప్పుడు ఆకాశం లోంచి అశరీరవాణి ఇలా పలికింది. .నాయనా ,ఆయన మీ తాత భీమసేనుడు ,కాబట్టి ఆయనను వదిలి పెట్టి పూజించు ".ఆ విషయం తెలుసుకున్న నేను నా అపరాధానికి మన్నించమని భీమసేను వారిని కోరుకొని ప్రాణ త్యాగం చేయబోయాను,ఇంతలో అశరీరవాణి మళ్ళి నాయన నీవు ఒక మహత్కార్యం చేయవలసి ఉంది కావున...నీవు నీ తప్పు తెలుసుకొని పాండవులను శరణు వేడు అని పలికింది. భీమసేనుల వారు నన్ను మెచ్చుకొని అరణ్యవాసం గురించి చెప్పి భవిష్యత్తు లో నీ సాయం మాకు తప్పక కావాలి అని చెప్పి వెళ్లి పోయారు. అప్పుడు ధర్మరాజులవారు దేవిఁఉపాసన చేసారు. మా తాత భీముడు ఒక ఆడువారి స్తోత్రం పఠించడం చూసి ధర్మరాజునులవారిని తూలనాడారు. వెంటనే ఆ పాపానికి భీమసేనులవారి కంటిచూపు కోల్పోయారు.చేసిన తప్పు గుర్తించి నవదుర్గను వేడుకోవడం తో కంటిచూపు మళ్లీ పొందారు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణులవారు నన్ను సహృదయ అని పిలిచేవారు. ఈ విషయాలు తెలిసిన శ్రీకృష్ణులవారు నన్ను సహృదయ అని పిలిచేవారు.
నేను హనుమంతులవారిని ఒక సందేహం అడిగాను "మీరు బ్రహ్మజ్ఞాని ,మీరు అర్జనుని రధాన్ని అధిరోహించడం ఎలా తటస్థిoచింది ,వివరించగలరు అన్నాను. " అప్పుడు హనుమంతులవారు నాయనా ,నేను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుండగా భీముడు అక్కడకు వచ్చి నేనెవరినో తెలియక అడ్డుగా ఉన్న నా తోకను పక్కకుజరపలేక శతవిధాలాప్రయత్నించి చివరకు నేనెవరినో తెలుసుకుని నాకు నమస్కరించాడు.నేను అతనికి సమయం వచ్చినపుడు సహాయం చేస్తానని మాటఇచ్చాను . కొంత సేపటికి అర్జనుడు ఆ దారిలో వచ్చి నేను చేస్తున్న రామజపాన్ని చూసి నవ్వి, నాతో విప్రవర్యా,రాముడు అంత ధనుర్ధారి అయితే బాణాలతో లంకకు వంతెన కట్టివుండొచ్చు కదా అన్నాడు. నేనప్పుడు నాయనా వనరుల బలం ముందు బాణాలవంతెన కూలిపోతుంది అన్నాను. అప్పుడు అర్జనుడు నవ్వి వట్టి మాటలు,నేను బాణాలతో వంతెన నిర్మిస్తే ఎవ్వరూ కూల్చలేరు అని చెప్పాడు. వెంటనే నేను నా వజ్రకాయ రూపాన్ని ధరించి చూద్దాం అన్నాను. ఆశ్చర్యపోయిన అర్జునుడు నాకు నమస్కరించి ,స్వామీ! నేను ఈ పరీక్షలో ఓడిపోతే ప్రాణత్యాగం చేస్తాను అన్నారు. అప్పుడు నేను "మా తల్లి అంజనాదేవి ని స్మరించి ,రామస్తుతి గావించి నాయనా ,నీవు అమాయకుడవు, ఒకవేళ నీవు నిర్మించినవంతెన నన్నుతట్టుకున్నట్లైతే నేను నీ రధం యొక్క ధ్వజాన్నై నిన్ను కాపాడతాను "అన్నాను. అర్జనుడు సరస్సుపై బాణాలతో వంతెన కట్టాడు ,నేను ఒక్క ఉదుటున దూకేసరికి వంతెన చిన్నాభిన్నం అయిపోయింది. గర్వభంగం ఐన అర్జనుడు ప్రాణత్యాగం చేయబోగా నేను వారించాను. ఇంతలో శ్రీకృష్ణులవారు వచ్చి అర్జునా ,క్రుంగిపోకు ఇంకొక సారి ప్రయత్నించు అని అన్నారు. శ్రీకృష్ణుని ఆసిస్సులు తీసుకుని మళ్ళీ ప్రయత్నించాడు అర్జనుడు. ఈ సారి నేను ఎన్ని సార్లు దూకినా వంతెనకు ఏమి కాలేదు .నేను వంతెన కిందకు చూసాను ఒక ఎర్ర ధార నీటిపై ఉంది ,నీటి లో దూకి చూస్తే ఒక పెద్ద కూర్మము(తాబేలు) వంతెన కు దన్నుగా ఉంది,కూర్మము కుడి నాసిక నుండి రక్తం కారుతున్నది .కూర్మావతారుడైన శ్రీమన్నారాయణునికి నమస్కరించి పైకి వచ్చాను .ఇంతలో శ్రీకృష్ణుని చూసి ఆనందం తో అర్జనుడు పాదాభివందనం చేసాడు. నేను ప్రమాణం చేసినట్టుగా అర్జనుని ధ్వజమై కాపాడుతానని ప్రమాణం చేశాను. నేను అప్పుడు శ్రీకృష్ణుని నాసికలోంచి కారుతున్న రక్తాన్ని నా చేతితో తుడిచాను ,త్రివిక్రముని త్రిఅవతారాలు చూసిన ఆనందం తో ,నా రాముణ్ణి గాయపరిచానన్న దుఃఖం కలగలిసి కన్నీరు కారుస్తూ అని హనుమంతుడు ముగించారు.
19-10-2019, 08:04 PM
రెండవ రోజు యుద్ధం మొదలైంది ..మొదటి రోజు ఓటమి** ఎదుర్కొన్న పాండవులు ఎదురు దాడి మొదలుపెట్టారు. మా తాత భీమసేనుడు ధాటికి శత్రు సైన్యం కకావికలు అయ్యింది.భీష్మఁ వ్యూహ*ం బెడిసి కొట్టింది.క్రౌంఛ వ్యూహం తో పాండవులు ఎదురుదాడి చేసారు.మా తాత భీముడు చాకచక్యం తో అటు గదా యుద్ధం, విల్లు తో కూడా పరా క్రమం చూపించారు. కౌరవులకు వెన్ను దన్ను గా ఉన్న కళింగ మహాసేన భీముడు ధాటికి ఊచకోత కోయబడ్డారు.
రెండవ రోజు ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాధిపతి అయ్యారు. పాండవ సైన్యం విజయధ్వానాలు మిన్ను మింటాయి. భీష్మ పితామహుడు తన శక్తి యుక్తులు ప్రదర్శన చెయ్యటం లేదని దుర్యోధనుడి అభిప్రాయం. ఆ రోజు యుధ్ధం ముగిసింది. ఆంజనేయుల వారు నా దగ్గరకు వచ్చారు. నాకు కర్మ యోగం ఉపదేశించారు. ఆయన నాతో ఒక విషయం చెప్పారు. యుద్ద విరామం లో కర్ణుడి గురించి కృష్ణ భగవానుడు ఇలా వివరించారు... ఒక సారి కృష్ణుడు కర్ణుని వద్దకు వెళ్లారు... అప్పుడు తైలం వెండి గిన్నె లో వేసుకుని కర్ణుడు కుడి చేతి తో తనవంటికి లేపనం చేస్తున్నారు. కృష్ణుడు ఆ వెండి గిన్నె తనకు కావాలని అడిగారు.వెంటనే ఆ గిన్నె ను ఎడమచేతి తో ఇచ్చారు. కృష్ణుడు ఎడమ చేతి తో ఇవ్వడం అపరాధం కదా అని అడిగారు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నారు..కృష్ణా మీరు అడిగిన తరువాత నేను కుడి చేతి ని శుభ్రపరచి ఇవ్వవచ్చు... కానీ ఈలోగా నా మనసు మారవచ్చు..నాకేమన్న జరుగవచ్చు.. అప్పుడు నీకు ఇవ్వకపోవడం నాకు అపరాధం కదా అందుకే ఎడమ చేతి తో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పారు. ఆ మహా పురుషుడి ని ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది... మూడవ రోజు యుధ్ధం మొదలైంది. భిష్ముఢు గరుడ వ్యూహం తో ఎదురుదాడి మొదలుపెట్టారు.ధృష్టద్యుమ్నుడు పాండవుల రక్షణ కోసం అర్ధ చంద్ర వ్యూహం నిర్మించారు.అర్జునుడు అన్ని రకాలశస్త్రాలు ప్రయోగించి కౌరవులను పారిపోయే పరిస్థితి కల్పించాడు. ఇది చూసిన సుయోధనుడు భిశ్మునితో ఇంద్రాది యోధుల సమానమైన నా సైన్యం ఎందుకు పలాయనం చిత్త గింఛ వలసి వచ్చింది అన్నాడు. అప్పుడు సైన్యాన్ని ఉద్దేశించి భిష్ముఢు సుయోఃధన ఇప్పుడే నీకు నా పరాక్రమం చూపిoచేద అని రధాన్ని ముందుకు ఉఱికించి శరవేగంగా బాణాలను వదిలారు. పాండవుల చుట్టూ వృత్త కారంలో తిరుగుతూ రెప్ప పాటులో వీరులను నేలమట్టం చేసారు.క్షణ క్షణానికి దిక్కులు మారుతూ ఎటుచూసినా తానై ప్రళయ తాండవం చేస్తున్న భిశ్ముని ఆపడానికి అర్జున బలం సరిపోలేదు.అర్జున రధం ముందుకు వెళ్లకుండా బాణాల కోట నిర్మించారు భిష్ముఢు.భిశ్ముని ఘోరకలి ఆపడానికి శ్రీకృష్ణుడు రధం దూకి సుదర్శన చక్రాన్ని భిశ్ముని వైపు ప్రయోగిస్తుంఢగా అర్జునుఢు కృష్ణుని కాళ్ళు పట్టుకొని నిలువరించి ఆయుధం తాకను అన్న కృష్ణుని ప్రతిజ్ఞ గుర్తు చేసాడు.శ్రీమన్నారాయణుడు చేతిలో చావు కోసం ఆయుధం విడిచి భిష్ముఢు చేతులు చాచి మోకాళ్ల మీద నిలబడ్డారు . శ్రీకృష్ణుడు శాంతించి అర్జునుని యుధ్ధం కొనసాగిoచమన్నారు. కోపం తో అర్జునుడు మహేంద్ర అస్త్రం ప్రయోగించారు.ఆ అస్త్రం ధాటికి కౌరవులు చెల్లా చె దురు అయ్యారు.సూర్యాస్తమయం అయ్యింది.రోజు మగి సిం ది. ______________________________
19-10-2019, 08:07 PM
నాల్గవ రోజు ఒక కాంతి పుంజం తన తో పాటు మూడు రోజుల నుండి యుద్దభూమి లో కనిపిస్తుందని హనుమంతుని తో చెప్పాను .అప్పుడు ఆయన అది సంజయుని దివ్యదృష్టి అని చెప్పి ,ధ్రుతరాష్టునికి సంజయుడు యుద్ధం గురించి చెబుతున్నారని చెప్పారు.ఈ రోజు యుద్ధం పాపం ధృతరాష్టునికి గర్భశోకం మిగిల్చింది. భీముని చేతిలో ఎనిమిది మంది కౌరవులు హతులయ్యారు. నాకు అభిమన్యుని తెగువ చుస్తే ముచ్చటేసింది. అశ్వథామ, భూరిశ్రవ, చిత్రసేన, శల్య పుత్రుని తో ఒక్కసారిగా మా పినతండ్రి పంజా విప్పిన కొదమసింహం లా విరుచుకుపడ్డాడు.వారు సుభద్రాపుత్రుని ధాటికి బాంబేలెత్తిపోయి యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. అది చూసిన దుర్యోధనుడు త్రిగర్త సైన్యాన్ని అభిమన్యుడి మీదకు పంపాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు అభిమన్యుడిని రక్షణగా వచ్చాడు .ధృష్టద్యుమ్నుడు గదతో శాలుడు అర్ధచంద్రాకారంలో ఉన్న భారీఖడ్గం తో ద్వంద యుద్ధం చేసారు.ఫలితం ఎంతకూ తేలకపోవడం తో మా తాత భీమసేనులు వచ్చారు. కానీ తాతను సుయోధనుడు నిలువరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు మా తాత విశ్వరూపం చూసాను. దుర్యోధనుడు తన మత్త మగధ గజాలను తాత మీదకు వదిలాడు. వాటి ధాటికి భూమి కంపించింది. వృకోదరుడైన తాత బెబ్బులి లా గాండ్రించి ఏనుగుల కుంభస్థలం పై ముళ్ళ గద తో మోదాడు. మాద్రి పుత్రులు భీమునికి రక్షణ కవచం ఏర్పరిచారు. మగధ మహారాజు ఐరావతం లాంటి ఏనుగు తో నేల మీద ఉన్న భీముని మీద విరుచుకు పడ్డాడు. ఆ గజం ముందు రెండు కాళ్ళు గాల్లో లేపి హుంకురించింది. భీముడు నిశ్చేస్టుడయ్యాడు .మగధ రాజు వెంటనే బళ్ళెం భీముని పై విసరబోయాడు. ఇంతలో అభిమన్యుడు ఒకేసారి వదిలిన రెండు దివ్యాస్త్రాలు మత్తగజాన్ని ,మగధ రాజును ఒక్క వేటుతో నేల కరిపించాయి .తేరుకున్న భీముడు చుట్టూవున్న గజాలను కొండలను పిప్పి చేసినట్టుగా ఊచకోత కోశాడు. చుట్టూతా నేలకొరిగిన గజలే .రక్తం ఏరులై పారింది. యమధర్మరాజు అంశతో పుట్టిన మా తాత కౌరవులకు పాశం విసిరే యముడి లా గోచరిస్తున్నాడు. భీష్ముడు భీమునికి ఎదురొచ్చాడు. ఇంతలో సాత్యకి భీష్ముని తో తలపడ్డాడు. కౌరవ పుత్రులందరు మా తాత పై విరుచుకుపడ్డారు. వారందరి ని చూసి ఆకలిగొన్న తోడేలు లా విజృభించారు మా తాత. అడ్డువచ్చిన అష్ట కౌరవులను సంహరించాడు భీములవారు. ప్రగ్యోక్తిసాపురాధీశుడైన భగదత్తుడు తన శ్వేత గజం సుప్రతీక మీద నుండి భయంకర అస్త్రాలను భీముని మీదకు వదిలాడు. స్పృహ కోల్పోయిన తాతను సారధి విశోకుడు యుద్ధరంగం నుండి తీసుకుపోయాడు.
ఆ గజాన్ని చూసి అందరూ బెదిరిపోయారు. ఇంతలో ఆకాశం లో మెరుపులు, ఉరుములు. వాటి మధ్య చండ్రనిప్పుల్లా ఉన్న కన్నులతో ఉన్న మా తండ్రి ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు .నాలుగు దంతాలతో ,ఒళ్ళంతా పొడవాటి వెంట్రుకలతో ఉన్న హిమాలయ గజం మీద ఉన్న మా తండ్రి తన స్నేహితుల తో భగదత్తుని మీద దాడి చేసి సుప్రతీకను చంపేశారు.భగదత్తుడు పలాయనం చిత్తగించాడు. హుతాశులైన కౌరవ గణం పారిపోయింది మా తండ్రి ప్రకోపం గాంచి. చీకటి పడింది. శిబిరం లో భీష్ముని వద్దకు సుయోధనుడు వచ్చి ఏమి పాలుపోవడం లేదు, మీరు అపరాజితులు కదా, మరి నేనెందుకు రోజు యుద్ధం నుండి పారిపోతున్నాను ,సెలవియ్యండి అన్నాడు. ___________________________
19-10-2019, 08:09 PM
శిబిరం లో భీష్ముని వద్దకు సుయోధనుడు వచ్చి ఏమి పాలుపోవడం లేదు, మీరు అపరాజితులు కదా, మరి నేనెందుకు రోజు యుద్ధం నుండి పారిపోతున్నాను ,సెలవియ్యండి అన్నాడు.
అప్పుడు భీష్ముడు నాయన నేను ఎన్నో సార్లు చెప్పి చూసాను ,కానీ నువ్వు వినలేదు ,కృష్ణార్జనులు నరనారాయణ స్వరూపులని, వారు ఓటమి ఎరుగరని, నా పేరుని సార్ధకం చేసుకోడానికి హస్తినాపురాధీశుని రక్షణకు భీష్మించుకు కూర్చోవలసి వచ్చింది.నా ప్రాణం ఉన్నంతవరకు నీకు రక్షణగా ఉండెద అని అన్నారు. ఐదవ రోజు కౌరవులు మకర వ్యూహం పన్నారు. ధృష్టద్యుమ్నుడు ప్రతిగా స్యేన వ్యూహం (డేగ ) నిర్మించారు.ఇరు వర్గాల మధ్య భీకర పోరు నడిచింది .దిక్కులు ప్రిక్కటిల్లేలా ఏనుగుల హుంకారాలు, అశ్వనాదాలు ,శంఖారావాలు హోరెత్తాయి. పోట్లగిత్తల్లా ద్వంద్వయుద్ధాలలో వీరులు పోరుసల్పుతున్నారు. ఛిద్ర అవయవాలు రణమరుభూమిలో చెల్లాచెదురయ్యాయి. వేగంగా కదులుతున్న సైన్యం వాళ్ళ రేగిన ధూళి కరుమబ్బులా కమ్ముకుంది. వీరుల దివ్యాస్త్రాలు ఒకదానొకటి ఢీకొని మెరుపులా స్ఫురించింది .అప్పుడు ఆ కరుమబ్బులోంచి రక్తం వర్షమై వచ్చిందా అన్నట్టు నేల మీద రక్తం ఏరులయ్యింది. ఏనుగులు తమ దంతాలతో రాధాలలో ఉన్న వీరులను బయటకు లాగి, రాధాల్ని తునాతునకలు గావించాయి. అర్జునుడు,అశ్వద్ధామ ఒకరినొకరు ఎదురుపడి భీకర పోరు సల్పారు .ఆఖరుకు అశ్వద్ధామ కవచాన్ని అర్జునుడు ఛిద్రం చేసి గురుపుత్రుని వొదిలేసాడు. చిచ్చరపిడుగైన అభిమన్యుడు కార్చిచ్చు లా కౌరవ సమూహాన్ని దహించి వేస్తున్నాడు.అర్జున కుమారుని దుర్యోధనుడు సుతుడైన లక్ష్మణుడు ఎదురు నిలిచాడు. అభిమన్యుడు లక్ష్మణుని సారధిని, రథాశ్వాలను సంహరించాడు. కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు ఈటెను బలం గా అభిమన్యుడి మీదకు విసిరాడు. బాణాలతో ఈటెను ధ్వంసం చేసాడు అర్జనుడు. ఏకాకిగా మిగిలిన లక్ష్మణుని కృపాచార్యుడు తన రధం లో తోడ్కొని వెళ్ళాడు. ఒకవైపు భీష్ముడు తన ప్రతాపం చూపిస్తుండగా, మరోవైపు కృష్ణుని సోదరుడు సాత్యకి కౌరవుల భరతం పట్టాడు . సాత్యకి కి తన పదిమంది కుమారులు సాయం గా వచ్చారు. సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు సాత్యకిని నిలువరించారు. సాత్యకి అస్త్రాలకు సరైన సమాధానం ఇచ్చిన భూరిశ్రవుడు క్షణ కాలం లో పది బాణాలు సంధించి సాత్యకి కుమారులను సంహరించాడు .దెబ్బతిన్న బెబ్బులిలా సాత్యకి వేటకొడవలి తో భూరిశ్రవుడి మీద విరుచుకు పడ్డాడు. ఇంతలో పుత్రశోకం లో ఉన్న సాత్యకిని కోల్పోయే ప్రమాదం ఉందని భీముడు రధం తో వచ్చి సాత్యకి ని ఎత్తుకుపోయారు. ఇలా ఇరువైపులా జరిగిన ఘోరకలితో సూర్యుడు ఎర్రబడి అస్తమించాడు. ______________________________
19-10-2019, 08:11 PM
ఆరవ రోజు దృష్టద్యుమ్నుడు పాండవులను మకర వ్యూహం లో సమీకరించాడు. కౌరవులు క్రుంచ వ్యూహంలో ముందుకొచ్చారు.
సూర్యుడి లేలేత కిరణాల తాకిడి కి సైనికుల కవచాలు మెరుస్తున్నాయి. మళ్ళీ మా తాత భీమసేనుని ధాటికి కురుసైన్యం విలవిలలాడింది. ఒంటరిగా రధం దిగి భీములవారు తన గదతో శత్రుసైన్యం పై విరుచుకుపడ్డారు. దృష్టద్యుమ్నుడు భీముని వెనుక వెళ్లి చూసే సరికి గుట్టలు గా పడిఉన్న శవాల మధ్యలోంచి సుడిగాలి లా భీముడు వచ్చారు. దృష్టద్యుమ్నుడు వెంటనే వెళ్లి రక్తంతో నిండిన భీముని రధం పైనుండి లాక్కొని వెళ్ళిపోయాడు. కానీ కౌరవులు చుట్టుముట్టారు. వెంటనే దృష్టద్యుమ్నుడు ప్రమోహన అస్త్రాన్ని సంధించి శత్రువులను వివశులు గావించాడు. సైన్యం మొద్దుబారిపోవడం చూసి ద్రోణాచార్యులు ప్రజ్ఞ అస్త్రాన్ని ప్రయోగించి సైన్యం లో ఉత్తేజం నింపారు. మళ్ళీ కౌరవులు చుట్టుముట్టారు.ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి అభిమన్యుడు ద్రౌపది కుమారులతో కలిసి సూచి(సూది)వ్యూహం తో కౌరవ సమూహం లోకి దూసుకెళ్ళారు. అభిమన్యుని రక్షణ లో భీముడు,ధృష్టద్యుమ్నుడు రక్షింపబడ్డారు. కానీ ద్రోణుని తో ధృష్టద్యుమ్నుడు హోరా హోరి తలపడ్డారు . ______________________________
|
« Next Oldest | Next Newest »
|