Thread Rating:
  • 62 Vote(s) - 2.85 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance శృంగార కథామాళిక

Showing only the posts of Mahesh.thehero: 2,513 of 6,028 posts. Show all posts

కీర్తి నా ప్రక్కనే రా అని పడుకున్న ఇద్దరినీ ఎత్తుకుని ICU దగ్గరకువచ్చాడు . లావణ్య బుజ్జిమహేష్ ను - అంటీ పెద్దమ్మ బుజ్జిఅమ్మను ఎత్తుకుని జోకొట్టారు . కీర్తిని ఎత్తుకుని లోపల చూసి కన్నీళ్లను తుడుచుకుని లావణ్య కీర్తి అమ్మానాన్నలు........
ప్రక్కనే అని సైగచెయ్యడంతో మేమున్న దగ్గరకు వచ్చాడు . తన పేరెంట్స్ ను చూడగానే దుఃఖం తన్నుకువచ్చేసింది కీర్తికి , అమ్మా అంటూ గుండెలపైకి చేరిపోయింది .
ప్రాణంలా హత్తుకొని థాంక్స్ బాబు , అన్నయ్యకు ఏమీకాలేదు తల్లీ ......... కాసేపట్లో నడుచుకుంటూ వచ్చి నిన్ను ప్రేమతో ఎత్తుకుంటాడు అని ఓదార్చింది .

కృష్ణగాడు పరిస్థితి ఏమిటి అని అడిగాడు . 
 ప్రక్కకు పిలుచుకొనివచ్చి కీర్తి అన్నయ్యకు మాత్రమే కాలు విరిగింది , మిగతావారందరికి బలమైన దెబ్బలే తగిలాయి కానీ ఎముకలు విరగలేదు అని బదులిచ్చాను . 
మరి మహి ?
బ్లడ్ ఎక్కువగా పోవడం వలన స్పృహ కోల్పోయింది . చెల్లీ నేను బ్లడ్ ఇచ్చాము . కుడి అరచేతికి కుట్లు పడ్డాయి . మత్తు ఇంజక్షన్ వెయ్యడం వలన స్పృహలోకి రావడానికి మరొక గంట పట్టొచ్చు . 

ఆనాకొడుకులను ......... అంటూ కోపంతో ఊగిపోయాడు కృష్ణగాడు మొత్తం వాడి బ్యాచ్ ను మొత్తం రాత్రికి రాత్రి బొక్కలో వేసేలా ఆర్డర్స్ వేసాను , మన స్ట్రీట్ మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లను ఉంచాను . రేయ్ మామా ......... వాడు నిజానికి అక్కయ్య వెనుక పొడవబోయాడట , బుజ్జిఅక్కయ్య అడ్డునిలబడింది అధిచూసి మహి పరుగునవచ్చి ఇంతేరా ఇంత గ్యాప్ లో అక్కయ్యకూ - బుజ్జిఅక్కయ్యకు చిన్న దెబ్బ కూడా తగలనీకుండా రెండుచేతులతో కత్తిని ఆపి............ అంటూ కన్నీళ్ళతో నన్ను కౌగిలించుకున్నాడు . 
ఇద్దరమూ .......... బుజ్జిఅమ్మను బుజ్జిమహేష్ ను వాళ్ళ వాళ్ళ గుండెలపై పడుకోబెట్టుకొని కూర్చున్న పెద్దమ్మ లావణ్య ప్రక్కనే కుర్చీలలో కూర్చున్నాము . మహికి ఏమీకాకూడదని అమ్మవారిని ప్రార్థించాము .
డాక్టర్స్ 15 నిమిషాలకొకసారి మహినీ - కుర్రాళ్ళనూ చెక్ చేసి వెళుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం .

అర గంట తరువాత కీర్తి అన్నయ్యను తప్ప మిగతావారందరినీ జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చెయ్యడంతో వాళ్ళ పేరెంట్స్ వెళ్లి పలకరించారు , కీర్తి తన పేరెంట్స్ తోపాటు ICU కు వెళ్లి ఇంకా స్పృహలోకి రాని తన కొడుకు ప్రక్కనే కూర్చున్నారు .
 దాదాపు రెండు గంటల తరువాత అక్కడ కీర్తి అన్నయ్య ఇక్కడ మహి , బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా అమ్మా అమ్మా ............అని కలవరించడంతో , 
చెల్లి పరుగునవచ్చి అన్నయ్యా ........మహీ కలవరిస్తోంది అని పిలిచింది .
పిల్లలను ఎత్తుకుని లావణ్య లాస్య పెద్దమ్మ అంటీతోపాటు కాస్త సంతోషంతో లోపలికివెళ్లాము .
మహి స్పృహలోకి వచ్చి , అక్కయ్య ఒడిలో కన్నీళ్ళతో బాధపడుతూ కూర్చున్న బుజ్జిఅక్కయ్యను చూసి సడెన్ గా లేచి కూర్చుని , బుజ్జిఅమ్మా .......... మీకేమీ కాలేదు కదా రెండుచేతులతో అందుకోబోయింది .
మహీ మహీ ......... జాగ్రత్త అని బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టూ చేరిన అందరూ చేతులవైపు చూయించారు .
చిన్న గాయాలకే ఇంతపెద్ద కట్లు వేసేశారా అని నవ్వుకుని , అయితే బుజ్జిఅమ్మను ఎత్తుకోలేనా అని బాధపడింది .
మహీ ......... అంటూ అక్కయ్య మీద నుండే బెడ్ పైకి చేరి చేతులను తాకకుండా గుండెలపై వొదిగిపోయి , నాకేమీ కాలేదు మహీ ....... దేవతలా వచ్చి ఇద్దరు అమ్మలనూ కాపాడావు కదా ...........ఇప్పుడు ఎలా ఉంది మహీ ......... నొప్పిగా ఉందా అని బాధతో అడిగింది .

ఇప్పటివరకూ ఉండేది మా బుజ్జిఅమ్మ హత్తుకోగానే ఎగిరిపోయింది , నిజం బుజ్జిఅమ్మా .......... హాయిగా ఉంది అని తన చెంపలతో బుజ్జిఅక్కయ్య కన్నీళ్లను తుడిచి , ప్రాణంలా చూస్తున్న నావైపు చూసి కన్నుకొట్టి , బుజ్జిఅమ్మా అమ్మా ఒసేయ్ లావణ్య లాస్య పెద్దమ్మా అంటీ నొప్పికూడా లేదు అని చేతులను మడుచుకోబోయింది.
ఆహా .......... కుట్లు ఊడిపోతాయి అలాగే ఉంచమని చెప్పాను .
లావణ్య లాస్య వైపు చూసి నవ్వుకుని బుజ్జిఅమ్మా........... మీ తమ్ముళ్లు వాళ్ళను భలే కొట్టారు లేకపోతే మా బుజ్జిఅమ్మనే పొడవాలని చూస్తారా...........
నీ రక్తం చూసి మరింత కోపంతో అలా ......... అని కృష్ణగాడు నానుండి కాస్త దూరం జరిగాడు . 
మహి లావణ్య ముసిముసినవ్వులు నవ్వుకుని , పెద్దమ్మా - ఒసేయ్ లావణ్య బుజ్జిఅమ్మనూ - బుజ్జిమావయ్యను బెడ్ పై పడుకోబెట్టండి ఎంతసేపు ఎత్తుకుంటారు అని ప్రక్కకు జరిగింది . ప్రక్కనే బుజ్జిఅమ్మనూ - పాదాల దగ్గర బుజ్జిమహేష్ ను పడుకోబెట్టారు .

 బుజ్జిఅక్కయ్య :  తమ్ముళ్లూ .......... మహి స్పృహలోకి వచ్చింది చూసారు కదా సంతోషమే కదా కాసేపు బయట ఉండండి అనిచెప్పింది.
అక్కయ్య : బాబూ .......... మీరు లేకపోయుంటే ఏమిజరిగేదో ఊహించుకుంటేనే భయమేస్తోంది . మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని దండం పెట్టబోతే , 
బుజ్జిఅక్కయ్య వెంటనే చేతులను ఆపేసి , అక్కయ్యా .......... మీరలా చేస్తే వాళ్ళు తట్టుకోలేరు . మీకు ఏమైనా అదే అదే నాకు ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళు ప్రాణాలతో ఉండేవారు కాదు , తమ్ముళ్లూ ......... మీరు వెళ్ళండి అని అక్కయ్య కన్నీళ్లు తుడిచింది .
లవ్ యు బుజ్జిఅక్కయ్య ......... అని గుండెలపై చేతినివేసుకొని బయటకువెళ్లాము .
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... నాకు అడ్డుగా నిలబడ్డావు కత్తి కదా నీకేమైనా అయ్యుంటే నేను ప్రాణాలతో ఉండేదాన్నా ...........
బుజ్జిఅక్కయ్య : మా ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యకు చిన్న దెబ్బ తగిలినా నాతోపాటు త......... మా అమ్మ అదే మీ చెల్లి గుండె ఆగిపోతుంది అక్కయ్యా ........., మా ప్రాణాలర్పించయినా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము .

బుజ్జిఅక్కయ్య మాటలకు అందరూ చలించిపోయి ఉద్వేగంతో ప్రాణంలా హత్తుకున్నారు . అక్కయ్య మహి ప్రాణంలా బుజ్జిఅక్కయ్యను అలా చూస్తూ ఉండిపోయారు . బుజ్జిచెల్లీ ......... అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకొని ముద్దుల వర్షం కురిపించారు . 
మహీ : బుజ్జిఅమ్మా .......... నాకు కూడా అలానే ముద్దులుపెట్టాలని ఉంది .
అక్కయ్యా ......... ఒక్క నిమిషం అని మహి గుండెలపైకి చేరి బుగ్గలను చూపించడంతో , లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా....... అని ముద్దుల వర్షం కురిపించి మురిసిపోతుంటే ,
లవ్ యు మహీ ........ అంటూ బుజ్జిచేతులతో గట్టిగా హత్తుకొని ఉమ్మా ఉమ్మా ....... అంటూ ముద్దులు పెట్టడంతో , అందరూ కన్నీళ్లను తుడుచుకుని నవ్వుతూ చప్పట్లు కొట్టారు . 
ఆ సౌండ్ కు బుజ్జిఅమ్మ మేల్కొని లేచి కూర్చుని అమ్మా ఆకలి అనబోయి , మహి చేతులను దాచుకునేలోపు చూసేసి , మహీ ........ ఏమైంది ఇంతకీ ఎక్కడ ఉన్నాము అని చుట్టూ చూసి , దాచుకున్న మహి చేతులను చూస్తూ ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్ళతో మహిని హత్తుకుంది .
బుజ్జిఅమ్మా ..........ఏమీ కాలేదు చిన్న గాయం అంతే , అప్పుడే డాక్టర్ గారు లోపలికి రావడంతో , 
మహి : డాక్టర్ గారూ .......... నేను బానే ఉన్నాను . Please please.......... నన్ను డిశ్చార్జ్ చెయ్యండి . ఇక్కడి కంటే ఇంటిదగ్గర చుట్టూ  నా ప్రాణమైన వాళ్ళతోనే హ్యాపీ .......... please please ..........
లావణ్య : ఒసేయ్ ఒక్కరోజైనా ...........
డాక్టర్ : its alright .......... మహీ ........ నీ ఇష్టప్రకారమే చుట్టూ ప్రాణమైన వాళ్ళతోనే హాయిగా రెస్ట్ తీసుకో ఇంకా త్వరగా కొలుకుంటావు , మందుల కంటే ప్రేమే అన్ని రోగాలనూ నయం చేస్తుంది . రోజూ ఒకసారి హాస్పిటల్ కు వస్తే సరిపోతుంది . ప్రక్క ICU లో ఉన్నవాళ్లు కూడా ఇదే కోరుకుంటున్నారు . నర్స్ ........ ఆ ఏర్పాట్లు చూడమని చెప్పారు . 

బుజ్జిఅమ్మా .......... ఇదిగో డాక్టర్ గారు కూడా చెప్పారు ఇంటికి వెళ్లిపోతున్నాము . బుజ్జిఅక్కయ్య , బుజ్జిఅమ్మ కన్నీళ్లను తుడవడంతో , 
లవ్ యు బుజ్జిఅమ్మా - బుజ్జిబుజ్జిఅమ్మా ........ అంటూ చిరునవ్వులు చిందిస్తూ బుగ్గలపై చెరొక ముద్దుపెట్టింది .
లవ్ యు మహీ ......... అంటూ ఇద్దరూ ఒకేసారి చెరొకవైపు ముద్దులుపెట్టడంతో మహి ఆనందాన్ని చూసి అందరూ ఆనందించారు .
అర గంటలో నర్స్ డిశ్చార్జ్ పేపర్స్ తీసుకొచ్చి సర్ ......... బిల్ మీరే ........ 
Yes yes ........ అంటూ కృష్ణగాడు వెళ్లి అందరి ట్రీట్మెంట్ బిల్స్ కౌంటర్లో పే చేసి , ట్రీట్మెంట్ తరువాత బిల్ అడిగినందుకు చాలా చాలా థాంక్స్ అనిచెప్పేసి నాదగ్గరకు వచ్చి నర్సుకు చూపించాడు .
 అందరివీ పే చేసేసారు అని మహి ఫైల్ అందించి వెళ్లి ఎవరి ట్రీట్మెంట్ ఫైల్ వారికి అందజేశారు .
నర్స్ .......... ట్రీట్మెంట్ అమౌంట్ ..........
బయట ఉన్నవారు అందరివీ పే చేసేసారు మీరు ఇంటికి వెళ్లొచ్చు , పూర్తి రికవరీ అయ్యేంతవరకూ రోజూ ఒకసారి హాస్పిటల్ కు వస్తే సరిపోతుంది .

మీరు ఇప్పుడు ఇలా మమ్మల్ని పట్టుకుని లేచి నిలబడ్డారంటే - ప్రాణాలతో ఉన్నారంటే వాళ్ళిద్దరి వల్లనే ఎలా వచ్చారో దేవుళ్ళా వచ్చి కాపాడారు .
 ఐదుగురూ ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్ళతో నాన్న అమ్మా ..........మమ్మల్ని క్షమించండి . మమ్మల్ని రౌడీలు కొట్టడానికి కొద్దిసేపటి ముందు మేము ఆరుగురమూ కలిసి కేవలం క్యారెమ్ బోర్డ్ పగలగొట్టారని కోపంతో ఆ అన్నయ్యల నోటిలోనుండి  వచ్చేలా కొట్టాము అని బాధపడుతూ చెప్పారు . 
అంకుల్ వాళ్ళు........ పెద్ద తప్పు చేశారు ..........అని ఫీల్ అవుతున్నారు .
నాన్నగారూ వెంటనే ఆ అన్నయ్యల దగ్గరకు తీసుకువెళ్లండి , కాళ్లపై పడైనా క్షమాపణ కోరుకుంటాము అని వీల్ చైర్లో కీర్తి అన్నయ్యకూడా మాదగ్గరకువచ్చి నొప్పి ఉన్నా , అన్నయ్యలూ క్షమించరాని తప్పు చేసాము క్షమించండి అని పాదాలను తాకాబోతుంటే , తమ్ముళ్లూ ........ అని ఆపాము .
మీరేమీ తప్పు చెయ్యలేదు మీ చెల్లెళ్ళపై ప్రేమ వలన మాకు వార్నింగ్ ఇచ్చారు , ముందుగానే జాగ్రత్త పడటం మాకైతే సంతోషమే . చెల్లిని టీజ్ చేశారని కొట్టడం ఏంటి నరికేయ్యొచ్చు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి . ఇక వాళ్ళు కాదు కదా వాళ్ళ మనుషులు ఎవ్వరూ మీపై రాకుండా మీ సెక్యూరిటీ అధికారి అన్నయ్య సెట్ చేసేసారు .
సర్ ........ మీరు సెక్యూరిటీ అధికారి ........ అని తలదించుకున్నారు . 
అవును అన్నయ్యా ......... కృనాల్ గారు పెద్ద సెక్యూరిటీ అధికారి నా బెస్ట్ ఫ్రెండ్ బుజ్జిఅమ్మ నాన్నగారు అని చెప్పానుకదా ............

 క్షమించండి సర్ అని కన్నీళ్ళతో చెప్పారు .
 కృష్ణ : తమ్ముళ్లూ ........... దేశానికి మీలాంటి అన్నయ్యల అవసరం ఎంతైనా ఉంది . మేము చాలా గర్వపడుతున్నాము . సర్ కంటే అక్కయ్యలూ అనిపిలిస్తే అదికూడా సంతోషంతో మరింత హ్యాపీ ...... sorry sorry ......... ఇలాంటి పరిస్థితుల్లో నవ్వమని చెప్పడం అన్యాయం అనిచెప్పాడు .
 ఆరుగురూ నవ్వి అన్నయ్యలూ ............ ఐదుగురు చుట్టుముట్టినా బాహుబలుల్లా ఒక్క విధుల్పుతో అంతెత్తుకు ఎగిరిపడేంత బలం ఉన్నా , ఇద్దరే ఇద్దరము పట్టుకుని కొడుతుంటే మమ్మల్ని ఎందుకు కొట్టలేదు అని అడిగారు .
ఇద్దరమూ నవ్వుకుని మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది . తమ్ముళ్లూ ........ క్యారెమ్ బోర్డ్ ఒకటి చాలా లేక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి .............
అన్నయ్యలూ ............ అని మళ్ళీ కాళ్లపై పడిబోతుంటే ఆపి , అన్నయ్యలూ ........ అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లండి వెనుకే మేమూ వచ్చేస్తాము అనిచెప్పాను .

అవును బాబు - అన్నయ్యలూ .......... మహికి ఎలా ఉంది అని అడిగారు . 
చేతికి కుట్లు పడ్డాయి అంకుల్ ........... 
అంతా మావల్లనే నాన్నగారూ , అన్నయ్యలూ ............ ఇంటికిరాగానే మహిని చూడాలి అని కన్నీళ్ళతో కృంగిపోతున్నారు . 
తమ్ముళ్లూ .......... మీ ఆప్యాయమైన చెల్లి నవ్వుతోంది చూడండి అని కృష్ణగాడు ICU డోర్ తెరిచి చూపించాడు .
కారుణ్య ఇంద్రజ వెళ్లి .......... మహీ అంటూ కన్నీళ్ళతో హత్తుకొని , ఎలా ఉంది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , అన్నయ్యలు బాధపడుతున్నారని చూయించింది .

మళ్లీ నావైపు కన్నుకొట్టి నవ్వి , అన్నయ్యలూ ......... నొప్పిగా ఉందా అని బాధపడుతూ అడిగింది .
అందరూ కళ్ళల్లో చెమ్మతో లేదు మహీ ........., మా వల్లనే .......... అని వారి నాన్నలపై వాలి బాధపడుతున్నారు .
అయ్యో అన్నయ్యలూ ......... నాకైతే నొప్పినే లేదు . చూడండి సంతోషంగా నవ్వితున్నాను . మీ వెనుకే నేనూ వచ్చేస్తున్నాను . ఈ రాత్రంతా హాయిగా రెస్ట్ తీసుకోండి ఉదయం కలుద్దాము . నేనే మా బుజ్జాయిల ఇంటికి వస్తాను అని చెప్పడంతో , 
కన్నీళ్ళతోనే థాంక్స్ మహీ .......... అని బయటకువెళ్లి కార్లలో కూర్చున్నారు . 

నర్స్ లోపలికివెళ్లి....... మీ ఇష్టం మేడం ఏక్షణమైనా వెళ్లిపోవచ్చు ఉండాలన్నా ఉండొచ్చు అనిచెప్పింది . 
వెంటనే వెళ్లిపోతాము , హాస్పిటల్ వాతావరణం అంటేనే నాకు భయం అందుకే ఇప్పటిదాకా ఒక్క ఇంజక్షన్ కూడా వేసుకోలేదు అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి నవ్వుకుంది . 
బుజ్జిఅమ్మా ........ వెంటనే వెళ్లిపోదాము . నొప్పి అయినప్పుడల్లా చెబుతాను మీరు ముద్దుపెట్టాలి . వెంటనే ఎగిరిపోతుంది . 
లవ్ యు మహీ ........... అని బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్య మీదకు చేరి జాగ్రత్త మహీ ........... లావణ్య లాస్య .......... జాగ్రత్తగా పట్టుకోండి . 
 లావణ్య : ఒసేయ్ మహీ ......... నువ్వు స్పృహలో లేనప్పుడు మనోజ్ గారేనే నిన్ను రెండుచేతులతో ఎత్తుకుంది . కాస్త రొమాంటిక్ గా ఆలోచించవే ..........
మహి : అవునా .........ప్చ్ ........ ఆ ఫీల్ మిస్ అయిపోయాను గుసగుసలాడారు . 
 లావణ్య : ఇప్పటికీ ఆ అవకాశం ఉందికదా ఉందికదా ...........అని బుగ్గపై ముద్దుపెట్టింది .
మహి తియ్యదనంతో జలదరించి డోర్ వైపే ప్రేమతో చూస్తూ , వద్దులేవే అమ్మ బాధపడుతుంది . 
లావణ్య : నీకు ఇష్టమని ఒక్కమాట చెప్పు మిగతాది మేము చూసుకుంటాము . నీ ఆనందం కంటే అమ్మకు మరొక సంతోషం ఏముంటుంది చెప్పు .
మహి ఆలోచనలో పడటం చూసి , ఇక నాకు వదిలెయ్యవే అని బుజ్జిఅక్కయ్యకు మాత్రమే కనిపించేలా అక్కయ్య వెనక్కువచ్చి , మహి ......... మీ తమ్ముడు ఎత్తుకోవాలని ఆశపడుతోంది కానీ అమ్మ .......... అని సైగలతో చెప్పింది .

బుజ్జిఅక్కయ్య వెంటనే మహివైపు తన అందమైన సిగ్గుని చూసి లవ్ యు లవ్ యు లవ్ యు .......... ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... లవ్ యు sooooo మచ్ మహి , అక్కయ్యా .......... ఫ్రెండ్స్ అందరూ ఒక కారులో వస్తారు మనం మరొక కారులో వెళదాము పదండి , మహి ఇంట్లోకి వచ్చేలోపు తనకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అన్నీ ఏర్పాట్లు చెయ్యాలి కదా , అమ్మా మీరు మహితోపాటు రండి - పెద్దమ్మా అంటీ ......... వంట మధ్యలో వదిలేసి వచ్చారు పదండి వండుదాము అని చెల్లివైపు కన్నుకొట్టడంతో ,
 చెల్లి : ఏదో గమ్మత్తు ఉండే ఉంటుంది అని నవ్వుకుని అలాగే బుజ్జిఅక్కయ్యా ......... , అక్కయ్యా ......... వెళ్ళండి నేను జాగ్రత్తగా పిలుచుకొని వస్తాను అని చెప్పడంతో , అందరూ లేచి లావణ్య లాస్య జాగ్రత్తగా రండి అనిచెప్పి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ICU బయటకువచ్చారు అక్కయ్య . 
రేయ్ మామా కార్లు రెడీగా ఉన్నాయేమో చూడమని పంపించి నేనూ అక్కయ్య వెనుకే వెళ్లబోతోంటే , 
తమ్ముడూ .......... మావెంట నాన్న ఉంటారులే , తమరు మరొక కారులో రండి అని ముసిముసినవ్వులతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , ఆ ముద్దును నాకు విసిరింది .
క్యాచ్ పట్టేసి బయటే నిలబడ్డాను . 

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే చెల్లి , చెల్లెమ్మా .........అని ఏవో మాటలు వినిపించడంతో ఆగిపోయాను . 
లావణ్య :  ఒసేయ్ మహీ .......... ఇదే మంచి అవకాశం మనోజ్ గారికి ప్రపోజ్ చేసెయ్యి , మనోజ్ గారి ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిఅక్కయ్యను కాపాడావు . నువ్వు చేయకపోయినా నీలో ఉన్న మనోజ్ గారి మరియు కృష్ణ అమ్మ రక్తం వలన చివరికి చేరేది ఆ గూటికే , అమ్మా మీకు ఇష్టమేగా ..........
చెల్లి : ఏమో ఏమో ......... ఇందులో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చెయ్యకండి . కావాలంటే చెవులు మూసుకుంటాను .
లవ్ యు చెల్లీ ........... అని నవ్వుకున్నాను .
మహి : బుజ్జిఅక్కయ్య .......... మనోజ్ గారికి ఎంతైతే ప్రాణమో , నాకూ మనకూ అమ్మకూ అంతే ప్రాణం కదే , బుజ్జిఅక్కయ్యకు ఏమైనా జరుగుంటే ........... అమ్మా తల్లీ ........ అలా ఎప్పటికీ జరగకూడదు అని అమ్మవారిని ప్రార్థించి . కావాలంటే నా ప్రాణం తీసేసుకో , ఎందుకో తెలియదు రోజుల్లోనే మా ప్రాణం కంటే ఎక్కువ అయిపోయింది బుజ్జిఅమ్మ . ఈ సమయంలో మనోజ్ గారికి ప్రపోజ్ చేస్తే బ్లాక్మైల్ అవుతుంది . మీ బుజ్జిఅక్కయ్యను కాపాడాను కాబట్టి నన్ను ప్రేమించాల్సిందే అని ......... నాకు వారి మనసులో స్థానం కావాలి . బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా చూసుకుంటాను అని వారికి నమ్మకం కలగాలి . బుజ్జిఅమ్మ కోసం అవసరమైతే నేను పిల్లలను కూడా కనను . బుజ్జిఅమ్మే నాకు సర్వస్వం . 
అంతే మహీ .......... అంటూ చెల్లి వెళ్లి ప్రాణంలా మహిని కౌగిలించుకున్నట్లు , నా హృదయం చలించిపోయింది . 

కృష్ణ అమ్మా ......... ఒక్కటి మాత్రం నిజం మనోజ్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను . మాకు తెలుసు ఇంటిని మార్చడం - నా ఫీజ్ కట్టడం - అమ్మను కించపరిచిన కాలేజ్ స్టాఫ్ కు బుద్ధిచెప్పి అమ్మకు sorry చెప్పించి అమ్మ గౌరవాన్ని లాపాడటం - కార్లు కొనడం - షాపింగ్ - బుజ్జాయిలకు గిఫ్ట్స్ ........... అన్నీ అన్నీ మనోజ్ గారే చేసారని ...........
నేను షాక్ లో ఉండిపోయాను .
ఇవన్నీ చేసారనో నేను ప్రేమించడం లేదు , వారిని తొలిసారి చూడగానే ఇతడే ఇతడే అని నా హృదయం మనసు తెలిపిన క్షణం నుండే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను . ఏదో శక్తి మమ్మల్ని కలపడానికి ప్రయత్నిస్తోందని బలంగా నమ్ముతున్నాను . బుజ్జిఅమ్మను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను - మిమ్మల్ని ప్రాణంలా సేవించుకుంటాను . ఇవన్నీ అమ్మకు నచ్చి మనఃస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే అని ఉద్వేగంతో చెప్పింది .
మా బంగారం మహీ నువ్వు .......... మా అక్కయ్యను పిల్లలను ఎలా చూసుకున్నావో మాకు తెలియదా .........., అంతకంటే అదృష్టమా ......... ఇప్పుడు నీకు నేను ఏ సహాయమూ చేయలేను తల్లీ , ఎందుకు అనేది త్వరలోనే తెలుస్తుంది . అయినా నీ ప్రేమను ఆపమని నేను చెప్పడం లేదు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది చెల్లి.
లవ్ యు అమ్మా ............ అని చేతులు తాకించకుండా సంతోషంతో హత్తుకుంది .

లావణ్య : ఒసేయ్ మహీ ......... ఈరోజు ప్రపోజ్ చెయ్యడం లేదు అయితే , కానివ్వు ఏమిచేస్తాం wait చేస్తాం అని అందరూ నవ్వుకుని , మహీ are you రేదీన్ని అడిగింది.
తల ఊపడంతో .........
లావణ్య బయటకువచ్చి థాంక్స్ మనోజ్ గారూ ఇక్కడే ఉన్నందుకు , మహి నడవలేకపోతోంది - వీల్ చైర్లో కూర్చోపెడదామంటే కూడా చేతులు తగిలి నొప్పి ......
స్స్స్......... అన్నాను .
 లావణ్య : అందుకే అందుకే ...........
నేను :  అందుకే ............
 లావణ్య : అందుకే ..........మీరు ఎత్తుకుని ......... అప్పుడు ఎలాగైతే ఎత్తుకుని హాస్పిటల్ కు వచ్చారో అలా ..........మావల్ల కావడం లేదు .
నేను : మీవల్లనే కావడం లేదు అంటే , ఇక నావల్ల ఎలా అవుతుంది . 
లావణ్య : ఫైట్ గుర్తుచేసుకున్నట్లు తలను పైకెత్తి , అమ్మో ........ పందులలాంటి వాళ్ళను విసిరేశారు .
నేను : అప్పుడేదో మహి రక్తం చూసి ఆవేశంతో ............అలా .......
లావణ్య : నా చేతిని అందుకొని లాక్కుని వెళ్లి ఒకసారి ఆ కట్లను చూసి చెప్పు పాపం అనడం ఆలస్యం .
మహిని రెండుచేతులతో జాగ్రత్తగా ఎత్తుకుని ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా బయటకు నడిచాను .
యాహూ ........ అంటూ ఎగిరి గెంతులేసి నా వెనుకే ఫాలో అయ్యారు . మహి ఆఅహ్హ్హ్......... అని వెంటనే పెదాలపై చిరునవ్వుతో అందమైన సిగ్గుతో కన్నార్పకుండా నన్నే చూస్తూ పరవశించిపోతోంది .

మమ్మల్ని చూడగానే వదినగారు బయటకు పరుగుతీసి డోర్స్ మొత్తం తెరిచింది . వెనుకే వచ్చిన చెల్లిని ముందు కూర్చోమనిచెప్పి , మహీ ......... చేతులు జాగ్రత్త అని అతినెమ్మదిగా కారులోని చెల్లి ప్రక్కనే కూర్చోబెట్టాను . 
నా బుగ్గపై మహి పెదాలు తాకగానే జిల్లుమంది . 
Sorry మనోజ్ గారూ ........... 
Its alright .......... చెల్లెమ్మా ......... సీట్ బెల్ట్ పెట్టు చేతులు దేనికీ కదలకుండా చూసుకోమని చెప్పి ముందు ఎక్కి కూర్చున్నాను .
లావణ్య వాళ్ళు ఎక్కి ప్రపోజ్ చేయకపోయినా ముద్దు ......... wow లవ్ యు అంటూ అందరూ ముద్దులతో ముంచెత్తారు .

ఆలస్యమైనా పర్లేదు కాస్త నెమ్మదిగా వెళ్ళండి సడెన్ బ్రేక్ వెయ్యకండి అని వదినకు చెప్పాను . స్టార్ట్ చేసి నెమ్మదిగానే పోనిచ్చారు . 
 మహి చెల్లి భుజం పై తలవాల్చి కన్నార్పకుండా నన్నే ప్రేమతో చూస్తుండటం మిర్రర్ లో చూసి వెంటనే వెనక్కు తిప్పేసాను .
వెనుక అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
లావణ్య : మనోజ్ గారూ ........ ఇంటర్ ఫెయిల్ అయినా కూడా ఫైట్ భలే చేసారండి , ఒక్క ఫైట్ తో ఏరియా మొత్తానికి హీరో అయిపోతారు రేపటి నుండి కంగ్రాట్స్ .........
9 సంవత్సరాలు జైలు జీవితం గడిపినవాళ్లకు ఆమాత్రం శక్తి ఉంటుంది . 
అంతే వెనుక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి చెల్లివైపు చూసారు .
నిజం .......... అన్నయ్య మాత్రమే కాదు నేను మా వారు కూడా అని బదులిచ్చింది చెల్లి .

కాసేపు నిశ్శబ్దం తరువాత ఎందుకు అని అడగబోతే ...........
మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఇప్పుడే చెప్పలేము . అన్నయ్యను ప్రేమించడంలో ఇదికూడా ......... ఒక సమస్య ......... అంతలోనే ఇంటికి చేరుకున్నాము . 
చెల్లెమ్మా ........ జాగ్రత్త అని కిందకు దిగివెళ్లి కృష్ణగాడు గేట్ ఓపెన్ చేశాడు నేనూ వెళ్లి  అక్కడే నిలబడ్డాను . మహీ ....... ఒక్కటి మాత్రం నిజం నీ ప్రేమ ఎంత స్వఛ్చమైనదో , అన్నయ్య అంత మంచివారు అని నుదుటిపై ముద్దుపెట్టబోయి ఆగడంతో , 
అమ్మా ........ అంటూ ప్రాణంలా గుండెలపై తలవాల్చింది . 
చెల్లి ముద్దుపెట్టడంతో లవ్ యు అంది .
మహీ ......... వచ్చేసావా అని బుజ్జిఅమ్మతోపాటు బుజ్జిఅక్కయ్య పరుగున వచ్చారు. వెనుకే అక్కయ్యావాళ్ళు రావడంతో , చెల్లిని హత్తుకునే కిందకు దిగి నావైపే ప్రేమతో చూస్తూ నెమ్మదిగా లోపలికివెళ్ళింది మహి .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

Heartfully thank you soooooooo much to all .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

Thankyou sooooo much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply

Heartfully thankyou sooooooo much .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply

(17-07-2020, 06:06 PM)Milffucker Wrote:  clp); clp); clp); clp); Iex Iex Iex
Heart Heart Heart

Thankyou sooooo much .
Like Reply

(24-07-2020, 06:02 PM)Samkedi23 Wrote:  Hi Mahesh garu okka sari hi cheppandi

Sure మిత్రమా ........... hi .
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply

(22-07-2020, 12:18 PM)Bvgr8 Wrote:  హాయ్ మహేష్ గారు

ఎప్పటిలాగే అప్డేట్ బాగుంది లాస్ట్ 2 అప్డేట్స్ మొత్తం 2 డేస్ స్టోరీ ఆల్మోస్ట్ అంత షాపింగ్ రాసారు కానీ వాసంతి మహేష్ కొంటానే తీసుకుంటా అన్నది ఊరు డెవలప్మెంట్ కోసం మహేష్ చేసిన ప్లాన్స్ ఎంత వరకు వచ్చింది అలానే దుబాయ్ లో కన్స్ట్రక్షన్ కి ప్లాన్ సెండ్ చేసాము సో అక్కడ ఏమి జరిగింది నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుతడి అనుకుంటున్న

దుబాయ్ లో కన్స్ట్రక్షన్ వల్ల జానకి గురించి తెలియచు అనుకుంటున్న
అలనే మహి మీద మహేష్ కి ప్రేమ కలిగేలా రాయండి

వెయిటింగ్ ఫర్ అప్డేట్

హృదయపూర్వక ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply

(23-07-2020, 12:50 PM)Samkedi23 Wrote:  Mahesh sir meeru Chala lucky intha Mandi story ni love chestunnaru because of your narration . waiting for your next super update

Heartfully thankyou sooooo much .
Like Reply

(29-07-2020, 12:11 AM)Samkedi23 Wrote:  I read every update 2 or 3 times waiting for the next update

Thanks .
Like Reply

(29-07-2020, 05:55 PM)Samkedi23 Wrote:  Mana Mahesh kavi gari Peru manasu kavi Chala bagundi

Thankyou so sooooo much .
Like Reply

(31-07-2020, 11:44 AM)giri001 Wrote:  Mitrma elavunnav ? Ni rachana saili chala bagundi
Akka thammudi dagudumuthalu bagunnai e kadha ni entho manasu petti rastunnav anduke kannillu vastunnayi
Anduke E khada updated kosam yentho usthahamga yeduruchustunnam..........mitrama

Heartfully thankyou so so so sooooooo much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply

(30-07-2020, 08:37 PM)asiademouser Wrote:  Friends I think today we don't have Luck to get Update, I think Mahesh Garu is Busy with his other works.

Don't Disappoint, wait with more cheares for a big update. Mahesh don't disappoint us.

Mahesh Garu we are expecting more big update than last update. I feel compressing JTKP update he some small need more big update to Last week JTKP update

With our Love ???? Thanks one more time from bottom of my heart for your story ???

Coming with bang guys ............ మిత్రుడు కోరినట్లు the biggest .............
ఈరోజు ఇవ్వాల్సింది కానీ అప్డేట్ sad తో ఎండ్ చెయ్యడం మిమ్మల్ని టెన్షన్ లో పెట్టడం ఇష్టం లేక అప్డేట్ కాస్త హ్యాపీగా ఉండాలని కొనసాగిస్తున్నాను . రేపు తప్పకుండా ఇస్తాను . మీరు వేచి ఉన్నందుకు ప్రతిఫలం లభిస్తుంది అనిమాత్రం చెప్పగలను . 
లవ్ యు గయ్స్ ...........


Your mahesh .
Like Reply

(18-07-2020, 10:03 AM)Saradhi41 Wrote:  Again and again no words of your narration mahesh super mamalini malli tension lo pettaru  superrr super

Thankyou sooooo much .
Like Reply

(18-07-2020, 09:57 AM)Hydguy Wrote:  Super update. We are awaiting next update

Thankyou sooooo much .
Like Reply

(18-07-2020, 07:05 AM)Alpha@84 Wrote:  Nice update

Thankyou .
Like Reply

(18-07-2020, 06:55 AM)shafihuseni242 Wrote:  Mahesh malli update aadharagottaru Cheppadaniki matalu saripovatlee.. we can't wait for next week...

Thankyou sooooo much .
Like Reply

(18-07-2020, 03:37 AM)royale248 Wrote:  EXCELLENT UPDATE BRO

Thankyou sooooo much .
Like Reply

(22-07-2020, 09:28 AM)Sachin@10 Wrote:  Superb update

Thankyou so much .
Like Reply

(22-07-2020, 03:12 AM)RAANAA Wrote:  Namaskar

thanks

yr):

Heart Heart Heart Heart Heart

Thankyou so much .
Like Reply

(18-07-2020, 10:13 AM)Hitman7396s Wrote:  Wow super.
Mahi love chala bagundi.
Chudali mundu mundu em jarugutundo.

Thank you so so so sooooooo much .
Like Reply




Users browsing this thread: 7 Guest(s)