Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*?? నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు??*
#1
*?? నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు??*

?? అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

?? భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం. 
బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

?? సంసారం అంటే కలసి ఉండడమే కాదు.
కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడు వీడకుండా ఉండడం.

?? ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ
అర్థం చేసుకునే భర్త
ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...
మళ్లీ తన భార్య కళ్లలో 
కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

? ?ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ...
గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క...!

?? అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.
భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

?? మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. 
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.

? ?బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే
ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.
మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

? ?మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.
కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

? ?కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.అలాగే 
భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

?? ప్రేమ అనేది చాలా విలువైనది.
దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

?? గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...
ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

? ?కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...
నేడు పట్టుకున్న ఆమె చేయి...
విడవకు ఎన్నటికీ.

? ?వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.
పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

? ?కలిమి లేములతో...
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...

? ?బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.
పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.
ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ...
మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.

? ?భర్తకి భార్య బలం కావాలి
బలహీనత కాకూడదు. 
భార్యకి భర్త భరోసా కావాలి
భారం కాకూడదు. 
భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి
అయోమయం కాకూడదు.

? ?మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

?? పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.
ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

? ?ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.
కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.

??వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పుల సంగమాన్ని పండుగ చేసుకోవటమే.
నమస్కారం.                            ?????
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)