Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రామాయణ ప్రక్షిప్తము :
#1
రామాయణ ప్రక్షిప్తము : 
*_నేటిమాట_*
*భ్రమ*
*నేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో.....?*

పట్టాభిషేకం జరిగింది, శ్రీ రాముడు విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడు. 
*హనుమ రాముని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు...*
ప్రభూ!  లంకలో విభీషణుడు ఇంటికి వెళ్ళేంతవరకు , నాకు లంకలో అసలు మహాపురుషులు ఉంటారా నాకు కనబడతారా అనే సందేహం ఉండేది.
 ప్రభూ! భక్తులు, సాధువులు, సంత్ లూ కేవలం భరతభూమిలోనే ఉంటారనీ పృథ్విలో ఇంక ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది. 
కానీ లంకలో ఎంత వెతికినా సీతామాతను కనుగొనలేకపోయినవేళలో విభీషణుని సలహామేర తల్లిి 
దర్శనం కలిగిన తరువాత అనిపించింది స్వామి ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధుపురుషుని ద్వారా తెలియజేయబడిందే.. 
బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపేడేమో అని అనుకున్నాను... 

అశోకవనం లో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాతను వధించేందుకు కత్తిదూసిన క్షణంలో ,
ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతం చేయాలనే బలమైనకోరిక నాలో కలిగింది. 
కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడి ని వారించి వాడినుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది.

ప్రభూ! ఎంతచక్కని అనుభవమిచ్చావు, అక్కడ కూడా మంచి వారి రూపం లో మండోదరి తల్లి ని చూపించావు,
నేనే  లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది.   

చాలా మంది కి ఇటుువంటి భ్రమే కలుగుతుంది, నాకూడ కలిిగిిఉండేేది...

కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , ఆ పని స్వయం రావణుని పత్ని మండోదరి చేత చేయించేవు. 
దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరితో నీ పని చేయించిలనుకుంటావో వారి తో ఆ పని నెరవేర్చుకుంటావు. 
ఇందులో మా మహత్వమేమీలేదు. 

దేవా! త్రిజట తన స్వప్ననవృత్తాంతం తోటిరాక్షస స్త్రీలకు చెబుతూ లంక లోకి ఒక కోతి వస్తుందనీ, 
ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను. 
ప్రభు శ్రీీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశమివ్వలేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెప్తోందే మరేం చేయాలి అని. 
రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చచెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించేవని అర్ధమైంది. 

ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది ...
రావణుడు తమ్ముని మాటమన్నించి నన్ను చంపకుండా నా తోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు...

లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవుతున్నందుకు. 
లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ....

ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణునే ఉపయోగించుకొని కార్యం నడిపావు, అటువంటి ది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ!??
దీనిని పట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి , మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు, అని అర్థం అయింది,

*నీతి*
*****
అందుచేత మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే...
మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో మన సాధకత్వమో కాదు..
*అందుకని నేనే కనక లేకపోతే ఏమీజరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు.*

          *_?శుభమస్తు?_* 
?సమస్త లోకా సుఖినోభవంతు?

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రామాయణ ప్రక్షిప్తము : - by Yuvak - 07-05-2019, 06:53 PM



Users browsing this thread: 1 Guest(s)