Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance స్వేచ్చ
#1
Big Grin 
ఇదీ ఒక లవ్ స్టొరీ, అఫైర్స్ లాంటివి ఉండవు, మూవీ లాగా ఉంటుంది. సెంటిమెంట్ ఉంటుంది. సెక్స్ కూడా పెడతాను. 

కధ పేరు : స్వేచ్చ


హైదరాబాద్ ట్రాఫిక్ జాం, విక్రం చాలా హడావిడిగా ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్ ని రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు.

విక్రం "వేరే దారి ఏం లేదా"

విక్రం "ఇంకా ఎంత దూరం"

విక్రం "ట్రాఫిక్ ఎంత పెద్దగా ఉంది"

విక్రం "ప్చ్... ఆహ్... ఫాస్ట్..."

క్యాబ్ డ్రైవర్ "ఏంటి సర్ అంత హడావిడిగా ఉన్నారు"

విక్రం ఏమి చెప్పలేదు.

క్యాబ్ డ్రైవర్ "లవ్ మేటర్ ఆ"

విక్రం "హుమ్మ్"

క్యాబ్ డ్రైవర్ "ఓహో" పెళ్లి ఆపబోతున్నారు అనుకోని "అయినా హాస్పిటల్ అని పెట్టారు, పెళ్లి మండపం కాదా"

విక్రం "ఆహ్... కదిలింది, త్వరగా పోనివ్వు"

క్యాబ్ డ్రైవర్ "హాస్పిటల్ ఏంటి సర్"

విక్రం "లేబర్ లో ఉంది"

క్యాబ్ డ్రైవర్ "మీరు పాష్ గా ఉన్నారు ఆమె లేబర్ ఆ" అన్నాడు.

విక్రం "తను బిడ్డని కనబోతుంది"

క్యాబ్ డ్రైవర్ "పిల్ల తల్లిని లవ్ చేస్తున్నారా!"

విక్రం "కదిలింది, కదిలింది పోనివ్వు"

క్యాబ్ డ్రైవర్ "సర్ మీరు , పిల్ల తల్లిని లవ్ చేస్తున్నారా!" అని అదోలా చూస్తున్నాడు

విక్రం "ఉఫ్" అని గాలి వదిలి "ఆమె నా భార్య"

క్యాబ్ డ్రైవర్ "ఓహో" అని కొద్ది సేపు డ్రైవ్ చేసి మళ్ళి విక్రం వైపు చూస్తూ "మీరు చాలా మంచి వారు సర్..... బాధ పడకండి.... అబ్బాయి పుడతాడు"

విక్రం షాక్ గా "లేదు, అలా జరగకూడదు, అలా జరగదు, స్వేచ్చ నే పుడుతుంది, ఇప్పటికే గతంలో నేను రెండు సార్లు మిస్ అయ్యాను, ఈ సారి మిస్ అవ్వకూడదు"

క్యాబ్ డ్రైవర్ "ఏవరు సార్ స్వేచ్చ"

విక్రం "నాకు పుట్టబోతున్న కూతురు పేరు"

క్యాబ్ డ్రైవర్ "రెండు సార్లు ఎలా మిస్ అయ్యారు, సర్"

విక్రం "ఇక్కడ నుండి షార్ట్ కట్ ఉంది అంట కదా, నేను వెళ్తాను, కొంచెం నా బాగ్స్ హాస్పిటల్ కి తీసుకొని వస్తావా... ప్లీజ్ ప్లీజ్" అంటూ హడావిడిగా అన్నాడు.

క్యాబ్ డ్రైవర్, విక్రంని చూస్తూ "సరే" అన్నట్టు తల ఊపాడు.

క్యాబ్ డ్రైవర్ "మీరు రెండు సార్లు ఎలా మిస్ అయ్యారు"

విక్రం క్యాబ్ దిగుతూ "గత జన్మలో అప్పుడు తనను చూడకుండానే చనిపోయాను"

క్యాబ్ డ్రైవర్ కి ఆ మాటలే తల నిండా గిర్రున తిరుగుతున్నాయి.

విక్రం కంగారుగా రోడ్ దాటుతూ ఉంటే ఎదురుగా ఒక కార్ వచ్చి గుద్దింది. క్యాబ్ డ్రైవర్ కంగారుగా కార్ దిగి "సర్" అని కేక వేశాడు.



క్యాబ్ డ్రైవర్, విక్రం ని పైకి లేపి "ఎలా ఉంది" అన్నాడు. నిజానికి కార్ స్పీడ్ చాలా వరకు తగ్గించుకున్నా, చివరిలో గుద్దేశారు. అందుకే అంత పెద్ద దెబ్బ తగల్లేదు, కాని విక్రం ఒంటి పై గీరుకున్న గాయాలు, అలాగే తల పై నుండి గాయం తాలుకా రక్తం కూడా వస్తుంది.

చుట్టూ ఉన్న జనాన్ని తోసుకుంటూ కుంటుకుంటూ పరిగెడుతూ మధ్య మధ్యలో ఆగుతూ రెండు కిలోమీటర్లు పరిగెత్తి హాస్పిటల్ కి వెళ్తాడు. అందరూ అతన్ని చూసి యాక్సిడెంట్ కేసు అనుకోని ట్రీట్ చేయాలని అనుకుంటూ ఉంటే, తను వాళ్ళను తోసేసి లేబర్ వార్డ్ దగ్గరకు వెళ్ళాడు.

విక్రం వాళ్ళ అమ్మ, నాన్న మరియు ఇంకా చాలా మంది అక్కడే ఉన్నారు. విక్రం వాళ్ళ అమ్మ కంగారుగా విక్రంని చూస్తూ ఉంది. విక్రం ఆమెను పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళాడు.

విక్రం కంగారుగా లోపలికి వెళ్తున్నాడు. లోపల తన భార్య పక్కన పొత్తిళ్ళలో కూతురుని చూడడానికి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. 

ఆమెను చూడగానే తనను తానూ ఆపోకోలేక ఏడ్చేశాడు.

తనను ఫాలో అయి వచ్చిన విక్రం తల్లి విక్రం చూస్తూ ఉంటే, తండ్రి "కొద్ది సమయం వాళ్ళను వదిలిపెట్టు తర్వాత మాట్లాడుతాడు" అన్నాడు.



అప్పుడే పుట్టిన తన కూతురు కూడా ఏడుస్తూ ఉంటే విక్రం కంగారుగా పైకి లేస్తాడు. విక్రం భార్య చేతులు అడ్డం పెట్టింది.

విక్రం వణుకుతున్న గొంతుతో "మన స్వేచ్చ కదా తను" అన్నాడు.

విక్రం భార్య విక్రంని చూసి అతని స్థితిని పట్టించుకోకుండా "ముందు వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకొని రా, అలాగే కుదిరితే స్నానం కూడా చెయ్" అంటుంది.

"సరే" అనుకుంటూనే విక్రం కదలకుండా అక్కడే నిలబడి తనను చూస్తూ ఉన్నాడు.

విక్రం భార్య "విక్రం" అని గట్టిగా అంది.

విక్రం "ప్లీజ్... నేను గత జన్మలో అలాగే ఈ జన్మలోనూ కూడా రెండు సార్లు తనను చూడకుండా మిస్ అయ్యాను. కొద్దిగా నన్ను చూడనివ్వు..."

విక్రం భార్య "విక్రం, ఇన్నాళ్ళు ఎదురు చూశాం... నువ్వు ట్రీట్ మెంట్ తీసుకొని రా...  ఎత్తుకుందువు" అని నవ్వింది.

విక్రం నవ్వి బయటకు వెళ్ళాడు.




కొద్ది సేపటికి విక్రం గదిలోకి వచ్చి కూతురుని ఎత్తుకొని కొద్ది సేపు ఎమోషనల్ అయి ఏడుస్తూ తర్వాత నవ్వుకుంటూ ఉన్నారు. విక్రం తల్లిదండ్రులు, విక్రం భార్య యొక్క అక్క వాళ్ళు, విక్రం భార్య యొక్క తల్లి దండ్రులు కూడా వచ్చి వెళ్ళారు. 

విక్రం భార్య నుదుటి పై ముద్దు పెట్టుకొని "గతజన్మలో నేను లేకుండా ఒక్క దానివి, కూతురుని ఎలా పెంచావ్"

విక్రం భార్య నవ్వేసి విక్రం చేతులను పట్టుకొని "నువ్వు తప్పకుండా తిరిగి వస్తానని మాట యిచ్చి వెళ్ళవు అప్పటి నుండి, నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను"

విక్రం తల వంచుకొని "నన్ను క్షమించు, నేను రాలేదు అక్కడే చనిపోయాను, నీకు ఎక్కువగా నా అవసరం ఉన్న సమయంలో నేను నీతో లేను"

విక్రం భార్య నవ్వేసి విక్రం చేతులు గట్టిగా నొక్కుతూ "నా జ్ఞాపకాలలో ఎప్పుడు నాతోనే ఉన్నావు, ఇప్పుడు కూడా నా కోసం తిరిగి వచ్చావు, అందుకే మన కోసం స్వేచ్చ కూడా తిరిగి వచ్చింది" అంటూ నిద్రపోతున్న కూతురుని చూశారు.

అయినా బాధ పడుతున్న విక్రంని చూస్తూ విక్రం భార్య, అతన్ని హత్తుకొని అతని చెవిలో "పోయిన జన్మ కంటే ఈ జన్మలో నా సళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయ్ కదా" అంది.

విక్రం తనను దూరంగా నెట్టి ఆమెను చూసి నవ్వాడు. విక్రం భార్య కూడా నవ్వుతూ "కదా" అంది. విక్రం ఏం మాట్లాడడం లేదు, నవ్వుతున్నాడు. 

అప్పుడే గదిలోకి వచ్చిన విక్రం భార్య యొక్క అక్క మరియు బావ నవ్వుతూ ఉన్న విక్రం మరియు అతని భార్యని చూస్తూ "ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు"

విక్రం "గత జన్మ" అంటూ నవ్వాడు. విక్రం భార్య కూడా నవ్వేసింది.

విక్రం భార్య యొక్క అక్క మరియు బావా ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని "పిచ్చి వాళ్ళు అనుకోని సైగ చేసుకున్నారు", 

వాళ్ళ సైగలు గమనించిన విక్రం భార్య మరియు విక్రం కూడా నవ్వేశారు.

విక్రం భార్య యొక్క బావా మాత్రం "సరిగ్గా కూతురు పుడుతుంది అని మీకు ఎలా తెలుసు" అన్నాడు.

విక్రం భార్య యొక్క అక్క "అది ఒక ఇన్సిడెన్స్" అంది.

విక్రం మరియు అతని భార్య ఇద్దరూ ఆ పాప మీద చెయి వేసి ఇద్దరూ "ఇదీ కొ ఇన్సిడెన్స్ కాదు, తను మా కూతురు స్వేచ్చ" అన్నారు.

తల్లి దండ్రుల చేత స్వేచ్చ గా పిలవబడుతున్నా ఆ పసి పాప అప్పుడే నిద్ర లేచి చుట్టూ చూస్తూ నవ్వుతుంది.
ఎప్పటికైనా నా బెస్ట్ ఇదే: https://xossipy.com/thread-60633-post-55...pid5525841
[+] 9 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
స్వేచ్చ - by 3sivaram - 10-04-2024, 09:49 PM
RE: స్వేచ్చ - by 3sivaram - 10-04-2024, 10:38 PM
RE: స్వేచ్చ - by Sachin@10 - 11-04-2024, 07:13 AM
RE: స్వేచ్చ - by The Prince - 11-04-2024, 11:56 PM
RE: స్వేచ్చ - by hijames - 11-04-2024, 11:58 PM
RE: స్వేచ్చ - by Raaj.gt - 12-04-2024, 12:15 AM
RE: స్వేచ్చ - by sri7869 - 12-04-2024, 01:09 AM



Users browsing this thread: 1 Guest(s)