Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఒక రచయిత ఆవేదన, కోపం.
#1
నా "మడి' కధకి కొన్ని గంటలు యాక్సెస్ లభించలేదు. నాకు ఒక పాఠకుడి నించి మెసేజ్ వచ్చింది. కధ బ్రాహ్మణులని కించపరిచే విధంగా ఉంది, డిలీట్ చెయ్యమని. ఎడ్మిన్ సరిత్ గారికి కూడా మెసేజ్ ఇచ్చాడు అతను. అందుకని డిలీట్ చేసారు అనుకున్నాను.

నా కధ బ్రాహ్మణుల గురించి అని నేను ఎక్కడా అనలేదు. పేర్ల చివర బ్రాహ్మణ కులాన్ని సూచించే వాచకాలు పెట్టలేదు.

మడి ఒక్క బ్రాహ్మణులలోనే ఉండాలని లేదు. ఏ సందర్భంగా అయితేనేమి, శుభ్రత ఉండాలని కాని, కొంత సమయం ఎవరూ తాకకూడదు అని కాని చేసే పని ఇది. మనసు శుభ్రత ముఖ్యం, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అని వేమన అన్నట్టు, మనసు, శ్రద్ధ ఇవి ముఖ్యం. కానీ చిన్నది చేయకుండా పెద్దది చెయ్యలేరు చాలామంది. శరీర శుభ్రత పొందడం చిన్న విషయం, మనసు పవిత్రంగా ఉంచుకోవడం కష్టం. అందుకే ముందు శరీర శుభ్రత సాధించి, దాని నించి మసను శుభ్రత సాధించే ప్రయత్నం.

అలానే పురోహితులు అంటే బ్రాహ్మణులే అవ్వాలని లేదు. కొన్ని కులాల్లో, వారి కులాలకే చెందిన వారు పురోహితులుగా ఉంటారు.

నా కధకి కేంద్రం మడి కాదు. నా కధకి కేంద్రం మడి చీర, తడి చీర. ఆ మడి చీరకి నేపధ్యంగా తద్దినాన్ని, ఒక పురోహిత పాత్రని, ఒక కుర్రవాడి పాత్రని ఎంచుకున్నాను. అంతే కానీ ఒక బ్రాహ్మణ కుర్రవాడు అంగం లేపుకుని, ఎక్కడ చీర కనపడుతుందా, దాన్ని ఎప్పుడు వేద్దామా అని చూస్తూ ఉంటాడని కాదు. I do not generalize things, unless I know that they are true.

కులం గురించి మాట్లాడటానికి ఈ ఫోరం వేదిక కాదు. దొంగనాకొడుకులు అన్ని కులాల్లో ఉంటారు, ఉత్తములూ అన్ని కులాల్లో ఉంటారు. గుణానికీ, కులానికీ సంబంధం లేదు. నాకు ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశ్యం, అవసరం లేవు. వసుధైక కుటుంబం, సర్వేజనా: సుఖినోభవంతు, live and let live, నేను ఇది.

ఆలోచన, సృజన, శ్రమ, టైం, ఇన్ని కేటాయించి ఒక కధ రాస్తే, అది ఒక్క ఫిర్యాదుతో డిలీట్ అయితే, ఆ రచయితకి ఎలా ఉంటుంది? ఇంకో కధ రాసే మనసు వస్తుందా? కళలకి ముందు కావల్సింది మనసు, ఆ మనసు నించే సృజన పుడుతుంది. సైన్స్ మెదడులో పుడితే, ఆర్ట్ మనసులో పుడుతుంది. ఆ మనసే విరిగితే, ఒక్క అక్షరం రాదు. నా వరకైతే ఇది పరిస్థితి.

పాఠకుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉన్నట్టే, రచయితకి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉండాలి కదా, నాకు ఆ అవకాశం దొరకలేదని అనిపించింది. Prosecution, defence రెండూ ఉంటాయి ఏ నేరం దగ్గరైనా కూడా. మన అడ్మిన్ సరిత్ గారు, నా కధని డిలీట్ చెయ్యలేదని, హోల్డ్ చేసి, బానే ఉంది అనుకుని, కంటిన్యూ చెయ్యమని చెప్పి, మళ్ళీ యాక్సెస్ ఇచ్చారు.

నేను ఈ కధకి బ్యాకప్ కూడా తీసుకోలేదు. ఎంత రాసింది నేనే అయినా, కధ సర్వర్ నించి డిలీట్ అయ్యింటే, రాసింది as it is మళ్ళీ నేను రాయలేను, మొత్తం అలానే గుర్తు ఉండదు. ఒక ఫ్లోలో రాస్తాను నేను. మళ్ళీ రాయాలంటే ముందులా రాదు కధ. నేను ఎలా అయితే రాద్దామనుకున్నానో, ఆ ఫీల్, ఆ టోన్, ఆ ఎస్సెన్స్ అన్నీ పోతాయి.

పాఠకుల రిప్లైస్, లైక్స్, నన్ను మరిన్ని కధలు రాసేలా చేస్తున్నాయి. ఏదో సరదాకి రాస్తున్నాను, బాగున్నాయి అంటున్నారు, అందుకే ముందుకి వెళ్తున్నాను.

ఇక మీదట ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే, నాకు మెసేజ్ ఇచ్చి, నా వివరణ తెలుసుకుని, అప్పటికీ మీరు తృప్తి చెందకపోతే, తదుపరి ఇంకేదైనా చెయ్యండి. అసలు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే చూస్తాను నేను.

Thank you very much admin for not deleting my story, which if had happened, would have given me hurt and loss.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఒక రచయిత ఆవేదన, కోపం. - by earthman - 05-04-2022, 01:26 PM



Users browsing this thread: 1 Guest(s)