Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సక్రమం { అందమైన జీవితం }..by mangosilp
#3
ఆయన పొద్దున్న ఆఫీస్ కి వెళుతుంటే పదివేలు కావాలని అడిగా. "అంత ఎందుకే?" అన్నాడాయన. "ఆఁ...నా బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వడానికి." అన్నా కచ్చిగా. ఆయన నవ్వేసి " అయితే సరే, రా ఏ.టి.ఎం లో డ్రాచేసి ఇస్తా." అని, కూడా తీసుకెళ్ళి, డ్రా చేసి ఇచ్చాడు. ఆయన్ని పంపించేసి ఇంటికి వచ్చేసి, కావలసిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని దగ్గర లోని ఒక సెల్ కంపెనీకి వెళ్ళి , అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి, ఒక సిమ్ కార్డ్ తీసుకున్నా. దానితో పాటు ఒక సెల్ ఫొన్ కూడా. వాళ్ళిచ్చిన అప్లికేషన్ పూర్తిచేసి ఇచ్చా. అయితే ఆ అప్లికేషన్ పూర్తిచేసే హడావుడిలో ఒక తప్పుచేసా. అందమైన తప్పు. అదేంటో తరువాత చెబుతా. సిమ్ ని ఫొన్ లో వేసిచ్చి, మరో రెండు గంటలలో ఏక్టివేట్ అవుతుందని చెప్పాడు షాప్ వాడు. థేంక్స్ చెప్పి, ఇంటికి చేరుకున్నా. అది ఎప్పుడు ఏక్టివేట్ అవుతుందా అన్న ధ్యాసలో కాలం చాలా భారంగా గడిచింది. మొత్తానికి ఓ మూడుగంటల తరువాత ఏక్టివేట్ అయ్యింది. "ఒరే వాసుగా...నీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది." అని మనసులో నవ్వుకుంటూ, ఆయనికి ఒక మెసేజ్ పంపా, "హాయ్...హౌ ఆర్ యు?" అని. ఒక నిమిషం తరువాత రిప్లై వచ్చింది "హు ఆర్ యు?" అని. ఇక మెసేజ్ ల పరంపర మొదలయ్యింది.

నేను: నాపేరు స్వప్న...

ఆయన: ఓకె..వాట్ కెన్ ఐ డు ఫర్ యు?

నేను: మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మలని ఒకసరి కలవాలని ఉంది.

ఆయన: సారీ, మీరు రాంగ్ నంబర్ కి మెసేజ్ చేసారు. నా పేరు వాసు. నాకు పెళ్ళయింది.

నేను: సో వాట్? నాకూ పెళ్ళయింది. పెళ్ళయితే ప్రేమించ కూడదా?

ఆయన: సారీ, రాంగ్ నంబరే కాదు, రాంగ్ పెర్సన్ ని ఎప్రోచ్ అయ్యారు మీరు.

నేను: ఒక్కసారి నన్ను కలవండి. నా పెర్సనాలిటీ చూస్తే మీరు షాక్ అవుతారు.

ఆయన: మీరు మిస్ ఇండియా అయినా ఐ డోంట్ కేర్. ఒకసారి మా ఆవిడని చూడండి. ఖచ్చితంగా తన కంటే అందంగా ఉండరు మీరు.

(ఒక్కసారిగా సిగ్గేసి, మురిసిపోయాను. "అబ్బాయి గారికి నా పెర్సనాలిటీ ఇంకా నచ్చుతుందన్న మాట." అనుకొని, మళ్ళీ మెసేజ్ పెట్టాను.)

నేను: ప్లీజండీ...మీరంటే పిచ్చి నాకు.

ఆయన: సారీ, పిచ్చోళ్ళంటే భయం నాకు. ( ఫక్కున నవ్వొచ్చింది నాకు. మళ్ళీ మెసేజ్ పెట్టా..)

నేను: ప్లీజ్..ప్లీజ్...ప్లీజ్..

అంతే ఆ తరువాత మళ్ళీ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా, ఆయన దగ్గరనుండీ మెసేజ్ రాలేదు నాకు. ముందు ఆనందం వేసింది, ఒక స్త్రీ టెంప్ట్ చేస్తున్నా మా ఆయన లొంగలేదని. తరువాత చిరాకు వచ్చింది, నా మొగుడు ఇంత పప్పు సుద్ద ఏమిటా అని. అంతలోనే నా ఈగో కూడా హర్ట్ అయ్యింది, మా ఆయన నాకు పడడా అని. "ఎలాగైనా పడగొట్టి తీరుతా నిన్ను వాసుగా." అనుకున్నా కచ్చిగా.


______________________________
Like Reply


Messages In This Thread
RE: సక్రమం { అందమైన జీవితం }..by mangosilp - by Milf rider - 19-10-2019, 09:57 PM



Users browsing this thread: 1 Guest(s)