19-10-2019, 09:56 PM
ఇది పూర్తి రొమేంటిక్ కథ. ఇన్ సెస్ట్ గానీ, అడల్టరీ గానీ, బూతులు గానీ ఉండవు. ఇది ఒక అందమైన ప్రేమకథ మాత్రమే. అయితే రొమేన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది.
మీ మేంగో శిల్ప.
సక్రమం {అందమైన జీవితం }
హాయ్...నా పేరు నీరజ. వయసు ఇరవై ఏడు. పెళ్ళై ఐదేళ్ళవుతుంది. మా ఆయన పేరు వాసు. సినిమా హీరోలా బాగానే ఉంటాడు. అఫ్ కోర్స్, నేను కూడా హీరోయిన్ లానే ఉంటాననుకోండి. మా జంటని ఎవరు చూసినా కుళ్ళుకుంటారు. అంత అందంగా ఉంటుంది మా జంట. పెళ్ళైన కొత్తలో హానీమూన్, తరువాత కొత్త సంసారం....అన్నీ చాలా ఎక్జైటింగ్ గా జరిగిపోయాయి. సుమారు నాలుగు సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేసాము. ఇదిగో గత సంవత్సరంగా ఆ ఎంజాయ్ మెంట్ తగ్గిపోయింది. అంటే మా మధ్య సెక్స్ జరగడం లేదని కాదు. అది ఎక్జైటింగ్ గా అనిపించడం లేదంతే. రొటీన్ గా సాగిపోతూ బోరింగ్ గా ఉంటుంది. నాకు నచ్చడం లేదు. అదే విషయాన్ని ఆయనతో చెబితే, నవ్వేసి "ఒకరికొకరు పాతబడిపోయాం కదా. ఇక ఎక్జైటింగ్ గా కనిపించడానికి ఏముంటుందే. ఇందులోనే ఆనందం వెతుక్కోవాలి." అనేసాడు. నాకు వళ్ళు మండిపోయింది. ఇప్పుడు కొత్తమొగుడిని ఎక్కడ వెతుక్కోనూ? అందుకే "ఏదో ఒకటి చేయాలి." అని డిసైడ్ చేసుకొని, నెట్ లో దీనికి సంబదించిన జవాబులు సెర్చ్ చేయసాగాను. ఎన్నో కథలు, మరెన్నో ఎనాలసిస్ లూ. అన్నీ చదివిన తరువాత, నాకో విషయం అర్ధమయింది. మగాడు కానీ, ఆడది కానీ అక్రమ సంబంధంలో కొత్త ఎక్జైట్ మెంట్ పొందుతారనీ, అందుకే చాలా మంది దాని కోసం అర్రులు చాచుతారనీ. నిజమే మరి, ఒక కొత్త వ్యక్తితో సెక్స్ కొత్తగానే ఉంటుంది కదా. అందుకే నేనూ అక్రమసంబంధం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నా. ఎవరితో పెట్టుకోవాలో కూడా డిసైడ్ అయిపోయా. ఆ వ్యక్తి ఎవరో కాదు, వాసు. అదేనండి మా ఆయన. మా ఆయనతో నాకు అక్రమ సంబందం ఏమిటనుకుంటున్నారా? అయితే నన్ను ఫాలో కండి. మీకే అర్ధమవుతుంది.
డాబా పైన వెన్నెల్లో కూర్చొని ఆలోచించడం మొదలెట్టా. వేసవికాలం కావడంతో, పెరట్లోని మల్లెపందిరి శృంగార పరిమళాలని వెదజల్లుతుంది. వెన్నెల కాస్తంత చల్లగా ఉన్నా, మల్లెల వాసన తోడయ్యేసరికి వేడెక్కించడం మొదలెట్టింది. "ఈ రెంటికీ మధ్య ఇదేం పాడు రసాయనచర్యో...?" అని విసుక్కున్నా. ఇంకాసేపు అక్కడే ఉంటే, "మదనుడు" అని పిలవబడే మహానుభావుడు ఊరుకోడని అర్ధమైపోయింది. "హూమ్ఁ..." అని నిట్టూర్చి, కిందకి దిగుతుండగా సెల్ మోగింది. చూస్తే, మా శ్రీవారు కాల్ చేస్తున్నరు. ఒకసారి మూతితిప్పుకొని, ఆన్సర్ చేసా "హలో.." అనీ. " ఏంచేస్తున్నావురా నీరూ?" అన్నాడు ఆయన. మ్..పిలవడం ముద్దుగానే పిలుస్తాడు. కానీ ఆ ముద్దు చేతల్లో మాత్రం ఉండడం లేదు, అనుకొని "ఏమీ లేదు శ్రీవారూ, తమరు ఎప్పుడు కరుణిస్తారో అని వెయిట్ చేస్తున్నా." అన్నా విసుగ్గా. ఆయన నవ్వేస్తూ "సరే, అలాగే ఒకగంట సేపు వెయిట్ చెయ్, వచ్చేస్తా." అని కాల్ కట్ చేసాడు. నేను సెల్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయా, ఎందుకో. దాన్ని అలాగే చూస్తుంటే నా సమస్యకి ఒక పరిష్కారం తట్టింది. యెస్...అలా చేస్తే గురుడు డిఫినెట్ గా దారిలోకి వస్తాడు. రేపట్నుండే నాకు వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నా. హుషారుగా మళ్ళీ మేడ ఎక్కేసి, చందమామ తో, మల్లెపూలతో చెప్పేసా...ఇక మీరెంతోకాలం హింస పెట్టలేరని. చందమామ నెమ్మదిగా మబ్బుల్లోకి పోయి దాక్కుండిపోయాడు. గాలి వీచకపోవడం తో మల్లెవాసన కూడా తోక ముడిచింది. విజయగర్వంతో నేను ఇంట్లోకి పోయా.
వంట పూర్తయ్యే సమయానికి ఇంట్లోకి అడుగుపెట్టారు శ్రీవారు. రాగానే నేరుగా వంటగదిలోకి వచ్చేసి, ముక్కు ఎగబీలుస్తూ "హబ్బా, స్మెల్ అదిరిపోతుంది. ఏం వండావేమిటీ..?" అంటూ గిన్నెలు కెలసాగాడు. వొళ్ళు మంటెక్కిపోయింది నాకు. ఇంత అందమైన పెళ్ళాం వంటగదిలో ఉంటే, ఏ మగాడైనా ఏం చేయాలీ? వెనకనుండి కౌగిలించుకొని, అక్కడక్కడ, అనువైన చోట, అందమైన చోట తడమాలి. అవసరమైతే ఒక ముద్దో, ఒక గిచ్చుడో లేదా చిన్న కొరుకుడో. అవన్నీ మానేసి ఈ మహానుభావుడు గిన్నెలు తడుముకుంటున్నాడు. "చూస్తారా వాసుగా, రేపట్నుండి ఉంటుంది నీపని." అనుకుంటూ ఉండగానే ఫక్కున నవ్వు వచ్చేసింది. ఆయన ఆశ్చర్యంగా నా వంక చూసి "ఎందుకు నవ్వుతున్నావే?" అన్నాడు. "ఏమీ లేదు మహాను �బావా� . మీరు అలా గిన్నెలు కెలుకుతుంటే నవ్వొచ్చింది. పదండి తినేద్దాం." అని ఆయన్ని వంటగదిలోంచి డైనింగ్ టేబుల్ దగ్గరకి గెంటాను. మొత్తానికి ఒక అరగంటలో తినేసి, పడక గదికి చేరాము. ఎప్పటిలాగే � ఇస్తినమ్మా వాయనం...పుచ్చుకొంటినమ్మా వాయనం..� టైపులో కార్యక్రమం పూర్తి చేసుకొని నిద్రపోయాము.
______________________________
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు