Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను బార్బిరకుడిని...by kittyboy
#10
శిబిరం లో భీష్ముని వద్దకు సుయోధనుడు వచ్చి ఏమి పాలుపోవడం లేదు, మీరు అపరాజితులు కదా, మరి నేనెందుకు రోజు యుద్ధం నుండి పారిపోతున్నాను ,సెలవియ్యండి అన్నాడు.
అప్పుడు భీష్ముడు నాయన నేను ఎన్నో సార్లు చెప్పి చూసాను ,కానీ నువ్వు వినలేదు ,కృష్ణార్జనులు నరనారాయణ స్వరూపులని, వారు ఓటమి ఎరుగరని, నా పేరుని సార్ధకం చేసుకోడానికి హస్తినాపురాధీశుని రక్షణకు భీష్మించుకు కూర్చోవలసి వచ్చింది.నా ప్రాణం ఉన్నంతవరకు నీకు రక్షణగా ఉండెద అని అన్నారు.
ఐదవ రోజు కౌరవులు మకర వ్యూహం పన్నారు. ధృష్టద్యుమ్నుడు ప్రతిగా స్యేన వ్యూహం (డేగ ) నిర్మించారు.ఇరు వర్గాల మధ్య భీకర పోరు నడిచింది .దిక్కులు ప్రిక్కటిల్లేలా ఏనుగుల హుంకారాలు, అశ్వనాదాలు ,శంఖారావాలు హోరెత్తాయి. పోట్లగిత్తల్లా ద్వంద్వయుద్ధాలలో వీరులు పోరుసల్పుతున్నారు. ఛిద్ర అవయవాలు రణమరుభూమిలో చెల్లాచెదురయ్యాయి. వేగంగా కదులుతున్న సైన్యం వాళ్ళ రేగిన ధూళి కరుమబ్బులా కమ్ముకుంది. వీరుల దివ్యాస్త్రాలు ఒకదానొకటి ఢీకొని మెరుపులా స్ఫురించింది .అప్పుడు ఆ కరుమబ్బులోంచి రక్తం వర్షమై వచ్చిందా అన్నట్టు నేల మీద రక్తం ఏరులయ్యింది.
ఏనుగులు తమ దంతాలతో రాధాలలో ఉన్న వీరులను బయటకు లాగి, రాధాల్ని తునాతునకలు గావించాయి.
అర్జునుడు,అశ్వద్ధామ ఒకరినొకరు ఎదురుపడి భీకర పోరు సల్పారు .ఆఖరుకు అశ్వద్ధామ కవచాన్ని అర్జునుడు ఛిద్రం చేసి గురుపుత్రుని వొదిలేసాడు.
చిచ్చరపిడుగైన అభిమన్యుడు కార్చిచ్చు లా కౌరవ సమూహాన్ని దహించి వేస్తున్నాడు.అర్జున కుమారుని దుర్యోధనుడు సుతుడైన లక్ష్మణుడు ఎదురు నిలిచాడు. అభిమన్యుడు లక్ష్మణుని సారధిని, రథాశ్వాలను సంహరించాడు. కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు ఈటెను బలం గా అభిమన్యుడి మీదకు విసిరాడు. బాణాలతో ఈటెను ధ్వంసం చేసాడు అర్జనుడు. ఏకాకిగా మిగిలిన లక్ష్మణుని కృపాచార్యుడు తన రధం లో తోడ్కొని వెళ్ళాడు.
ఒకవైపు భీష్ముడు తన ప్రతాపం చూపిస్తుండగా, మరోవైపు కృష్ణుని సోదరుడు సాత్యకి కౌరవుల భరతం పట్టాడు . సాత్యకి కి తన పదిమంది కుమారులు సాయం గా వచ్చారు. సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు సాత్యకిని నిలువరించారు. సాత్యకి అస్త్రాలకు సరైన సమాధానం ఇచ్చిన భూరిశ్రవుడు క్షణ కాలం లో పది బాణాలు సంధించి సాత్యకి కుమారులను సంహరించాడు .దెబ్బతిన్న బెబ్బులిలా సాత్యకి వేటకొడవలి తో భూరిశ్రవుడి మీద విరుచుకు పడ్డాడు. ఇంతలో పుత్రశోకం లో ఉన్న సాత్యకిని కోల్పోయే ప్రమాదం ఉందని భీముడు రధం తో వచ్చి సాత్యకి ని ఎత్తుకుపోయారు.
ఇలా ఇరువైపులా జరిగిన ఘోరకలితో సూర్యుడు ఎర్రబడి అస్తమించాడు.


______________________________
Like Reply


Messages In This Thread
RE: నేను బార్బిరకుడిని...by kittyboy - by Milf rider - 19-10-2019, 08:09 PM



Users browsing this thread: 1 Guest(s)