Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను బార్బిరకుడిని...by kittyboy
#9
నాల్గవ రోజు ఒక కాంతి పుంజం తన తో పాటు మూడు రోజుల నుండి యుద్దభూమి లో కనిపిస్తుందని హనుమంతుని తో చెప్పాను .అప్పుడు ఆయన అది సంజయుని దివ్యదృష్టి అని చెప్పి ,ధ్రుతరాష్టునికి సంజయుడు యుద్ధం గురించి చెబుతున్నారని చెప్పారు.ఈ రోజు యుద్ధం పాపం ధృతరాష్టునికి గర్భశోకం మిగిల్చింది. భీముని చేతిలో ఎనిమిది మంది కౌరవులు హతులయ్యారు. నాకు అభిమన్యుని తెగువ చుస్తే ముచ్చటేసింది. అశ్వథామ, భూరిశ్రవ, చిత్రసేన, శల్య పుత్రుని తో ఒక్కసారిగా మా పినతండ్రి పంజా విప్పిన కొదమసింహం లా విరుచుకుపడ్డాడు.వారు సుభద్రాపుత్రుని ధాటికి బాంబేలెత్తిపోయి యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. అది చూసిన దుర్యోధనుడు త్రిగర్త సైన్యాన్ని అభిమన్యుడి మీదకు పంపాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు అభిమన్యుడిని రక్షణగా వచ్చాడు .ధృష్టద్యుమ్నుడు గదతో శాలుడు అర్ధచంద్రాకారంలో ఉన్న భారీఖడ్గం తో ద్వంద యుద్ధం చేసారు.ఫలితం ఎంతకూ తేలకపోవడం తో మా తాత భీమసేనులు వచ్చారు. కానీ తాతను సుయోధనుడు నిలువరించడానికి ప్రయత్నించాడు. అప్పుడు మా తాత విశ్వరూపం చూసాను. దుర్యోధనుడు తన మత్త మగధ గజాలను తాత మీదకు వదిలాడు. వాటి ధాటికి భూమి కంపించింది. వృకోదరుడైన తాత బెబ్బులి లా గాండ్రించి ఏనుగుల కుంభస్థలం పై ముళ్ళ గద తో మోదాడు. మాద్రి పుత్రులు భీమునికి రక్షణ కవచం ఏర్పరిచారు. మగధ మహారాజు ఐరావతం లాంటి ఏనుగు తో నేల మీద ఉన్న భీముని మీద విరుచుకు పడ్డాడు. ఆ గజం ముందు రెండు కాళ్ళు గాల్లో లేపి హుంకురించింది. భీముడు నిశ్చేస్టుడయ్యాడు .మగధ రాజు వెంటనే బళ్ళెం భీముని పై విసరబోయాడు. ఇంతలో అభిమన్యుడు ఒకేసారి వదిలిన రెండు దివ్యాస్త్రాలు మత్తగజాన్ని ,మగధ రాజును ఒక్క వేటుతో నేల కరిపించాయి .తేరుకున్న భీముడు చుట్టూవున్న గజాలను కొండలను పిప్పి చేసినట్టుగా ఊచకోత కోశాడు. చుట్టూతా నేలకొరిగిన గజలే .రక్తం ఏరులై పారింది. యమధర్మరాజు అంశతో పుట్టిన మా తాత కౌరవులకు పాశం విసిరే యముడి లా గోచరిస్తున్నాడు. భీష్ముడు భీమునికి ఎదురొచ్చాడు. ఇంతలో సాత్యకి భీష్ముని తో తలపడ్డాడు. కౌరవ పుత్రులందరు మా తాత పై విరుచుకుపడ్డారు. వారందరి ని చూసి ఆకలిగొన్న తోడేలు లా విజృభించారు మా తాత. అడ్డువచ్చిన అష్ట కౌరవులను సంహరించాడు భీములవారు. ప్రగ్యోక్తిసాపురాధీశుడైన భగదత్తుడు తన శ్వేత గజం సుప్రతీక మీద నుండి భయంకర అస్త్రాలను భీముని మీదకు వదిలాడు. స్పృహ కోల్పోయిన తాతను సారధి విశోకుడు యుద్ధరంగం నుండి తీసుకుపోయాడు.
ఆ గజాన్ని చూసి అందరూ బెదిరిపోయారు. ఇంతలో ఆకాశం లో మెరుపులు, ఉరుములు. వాటి మధ్య చండ్రనిప్పుల్లా ఉన్న కన్నులతో ఉన్న మా తండ్రి ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు .నాలుగు దంతాలతో ,ఒళ్ళంతా పొడవాటి వెంట్రుకలతో ఉన్న హిమాలయ గజం మీద ఉన్న మా తండ్రి తన స్నేహితుల తో భగదత్తుని మీద దాడి చేసి సుప్రతీకను చంపేశారు.భగదత్తుడు పలాయనం చిత్తగించాడు. హుతాశులైన కౌరవ గణం పారిపోయింది మా తండ్రి ప్రకోపం గాంచి.
చీకటి పడింది.
శిబిరం లో భీష్ముని వద్దకు సుయోధనుడు వచ్చి ఏమి పాలుపోవడం లేదు, మీరు అపరాజితులు కదా, మరి నేనెందుకు రోజు యుద్ధం నుండి పారిపోతున్నాను ,సెలవియ్యండి అన్నాడు.


___________________________
Like Reply


Messages In This Thread
RE: నేను బార్బిరకుడిని...by kittyboy - by Milf rider - 19-10-2019, 08:07 PM



Users browsing this thread: 1 Guest(s)