Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను బార్బిరకుడిని...by kittyboy
#6
ప్రభాసుడు అని సమాధానం వచ్చింది. ప్రభాసుడు పూర్వజన్మ లో అష్టవసుల్లో ఒకరు. కామధేనువు వసిష్ఠుని దగ్గరనుండి దొంగిలించినందుకు గాను భూలోకం లో చాల కాలం జీవించమని శాపం పొందారు.
అతనే దేవవ్రతుడు (భీష్ముడు) .
ఇవ్వాళ యుద్ధం మొదటి రోజు ...కౌరవుల సర్వసేనాని ఆయనే ...అయన గురించి యుద్ధవిరామం లో చెపుతాను అని హనుమంతుల వారు అర్జనుని రధం వైపు వెళ్లారు .
పాండవుల సర్వసేనాని విరాట యువరాజు శ్వేత.
పాండవుల వ్యూహాన్ని ధర్మరాజు రచించారు. తక్కువ సైన్యం వాళ్ళ ఒక్కో వీరుడు సాధ్యమైనంత ఎక్కువ మంది శత్రువులతో తలపడాలని వజ్రవ్యూహం పన్నారు.
మగద దేశం నుండి వచ్చిన 1౦౦౦౦ ఏనుగులు కౌరవులకు రక్షణ వలయం గ ఉన్నాయి .
భీష్మాచార్యుల ధాటి కి పాండవులు నిలువలేక పోయారు. భీముని రక్షణ మిగిలిన వారినుండి రక్షణ మాత్రమే ఇచ్చింది .కర్ణుడు యుద్ధం చేయకుండా వికర్ణుని యుద్ధవ్యూహం చెపుతున్నాడు. భీష్ముని యుద్ధతంత్రాని కి పాండవ సర్వసేనాని శ్వేత మరణించాడు.
విరాటరాజు ఇంకాకొక పుత్రుడు ఉత్తరకుమారుడు శల్యుని చేతి లో మరణించాడు.
పాండవులు ఓటమిభారం తో వెనుదిరిగే సమయానికి అభిమన్యుడు భీష్ముని మీద విరుచుకుపడ్డాడు.కానీ పితామహుని ధాటి కి తట్టుకోలేక వెనుదిరిగాడు.
సూర్యుడు అస్తమించాడు. ......కౌరవులి శిబిరం లో విజయధ్వానాలు మిన్నుమింటాయి.
బార్బిరకుని వద్దకు హనుమంతుడు వచ్చారు. అప్పుడు హనుమంతుడు నాయనా అర్జనునికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసారు .దానికి ప్రత్యక్ష సాక్షి నేనే .గీత సారం మొత్తం ఒక ఘడియ కన్నా తక్కువ సమయం లో భగవానుడు చెప్పారు. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం లో ఉపనిషత్తుల సారాన్ని భవిషత్తు తరాలకు ఉపయోగ పడేలా గీతాసారాన్ని నేనువిన్నాను, తరించాను.త్రేతాయుగం లో అష్టావక్ర గీత జనకుల ద్వారా, వసిష్ఠ గీత రాముని ద్వారా విన్నాను. ఇవ్వాళ భగవంతుని గీత నేను విన్నాను, వర్ణించలేనంత రమణీయం గా ఉంది అని విషాద యోగం గురించి చెప్పారు.


______________________________
Like Reply


Messages In This Thread
RE: నేను బార్బిరకుడిని...by kittyboy - by Milf rider - 19-10-2019, 07:59 PM



Users browsing this thread: 1 Guest(s)