Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను బార్బిరకుడిని...by kittyboy
#5
యుద్ధo కోసం చూస్తున్నాను ఈరోజు ఇంకా మొదలవ లేదు ,ఒక పండుముసలి వారు అటువైపువస్తున్నారు. ఆయనను చూసి ఎవరో దివ్యపురుషుడిలా అనిపించారు.
అయన నా వైపు ఆర్ద్రం గా చూసి నాయనా నేను నీ గురించి ,నీ త్యాగం గురించి తెలుసుకున్నాను .నిన్ను కలసి వెళదామని వచ్చాను.
అయన నుండి వస్తున్న తేజస్సు చూసి ,మహానుభావా మీరెవరో సెలవివ్వండి అని అడిగాను.
అప్పుడు ఆయన నేను హనుమంతుడిని అని చెప్పారు .
నీవు ఎన్నో ధర్మసందేహాలతో ఉన్నావని వాటిని తీర్చమని శ్రీకృష్ణుడు నన్ను ఇక్కడికి పంపారు .
మీ వంటి బ్రహ్మజ్ఞానిని కలుసుకోవడం నా అదృష్టం అని చెప్పాను హనుమంతులవారితో ......
నాయనా నాకు తెలిసింది ,అర్జనుని రధం మీద ఉండగా కృష్ణుని గీతామృతం విని ఆకళింపు చేసుకున్నది నీకు చెబుతాను అని హనుమంతులవారు అన్నారు.
ఇప్పటివరకు యుద్ధం ఏమి జరిగింది అని అడిగాను .నాకు ఇంకో సందేహం ఋగ్వేదం లో దశ రాజ్ఞా (పది రాజుల యుద్ధం ) అని చదివాను ,ఆ విషయాన్ని విపులీకరించండి.ఇప్పుడున్న వారిలో మహాయోధుడు ఎవరు ......మీరు చూసిన వారిలో బలమైన ప్రత్యర్థి ఎవరు అని కళ్ళతో నమస్కారం పెట్టాను.
నేను యుద్ధరంగం లో తలపడిన వారిలో రావణుని పుత్రుడు మేఘనాధుడు బలమైన ప్రత్యర్థి .

త్రిమూర్తులకు మహామహారధి అని బిరుదు ఉంది, శివ పుత్రులకి కూడా ......
తరువాత స్థాయి అతిమహారధి ......మేఘనాధుడు, పరశురామునికి దక్కింది ..............
త్రిమూర్తుల అంశ లేకుండా ఉన్నది ఒక్క మేఘనాదుడే .....బలమైన ప్రత్యర్థి ....అని చెప్పారు.
కానీ పరశురామునితో ఒక యోధుడు సరిసమానం గా 23 రోజులు యుద్ధం చేసి సమఉజ్జిగా నిలిచిన వీరాధివీరుడు ఒకరున్నారు ఆయనే ఇప్పుడున్న యుద్ధవీరుల్లో అగ్రగణ్యుడు ..........
ఎవరాయన అని అడిగాను .........
ప్రభాసుడు అని సమాధానం వచ్చింది.
Like Reply


Messages In This Thread
RE: నేను బార్బిరకుడిని...by kittyboy - by Milf rider - 19-10-2019, 07:57 PM



Users browsing this thread: