Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను బార్బిరకుడిని...by kittyboy
#4
నా మొండెం ఏమైందో తెలియాలంటే నా గురించి చెప్పాలి .......
నా తండ్రి ఘటోత్కచుడు ,తల్లి అహిలవతి .నా తల్లి నాగకన్య .పరమశివుని మేడలో ఉన్న సర్పం పేరు బాశాంకుడు .ఆయన మా తల్లి జనకుడు. పరమ శివునికి వాడిపోయిన పువ్వులతో పూజచేయడం వల్ల పార్వతి దేవి ఆమెను ఒక రాక్షసుడు భర్తగ వస్తాడని శపించారు. భీమసేనులవారి మీద విషప్రయోగం జరిగిన తరువాత ఆయన స్పృహ తప్పి నాగ లోకం చేరుకున్నారు .వాయుపుత్రుని గుర్తించిన ఆమె తన తండ్రి తో భీమసేనులవారికి అమృతం ఇప్పించి ప్రాణం పోసింది.
తరువాత ఆమె భూలోకం లో ముర రాజు పుత్రిక కామకతంతక గా జన్మించింది. శ్రీకృష్ణుడు ముర అసురుని సంహరించాక ,అతని పుత్రిక తో యుద్ధం చేసారు.భీకర యుద్ధం తర్వాత కామాఖ్యా దేవి ప్రత్యక్షం అయ్యి శ్రీకృష్ణుని తో ..ఈమెకు నేను అన్ని అస్త్రశాస్త్రాలు నుండి రక్షణను ప్రసాదించాను ..కావున మీ సుదర్శనచక్రాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పారు. కామకతంటక తో దేవి ......శ్రీకృష్ణులు శివునితో సమానం ...కావున యుద్ధం విరమించు అన్నారు. ఆలా తన మనవడికి సమఉజ్జి అయిన భార్యను శ్రీకృష్ణులు కనిపెట్టారు.
మా తండ్రి ఘటోత్కచుని తో మా తల్లి కమక తంటక (మౌర్వి) దేశానికి పంపారు.
మా తల్లి తనకు కాబోయే భర్త ఆమె పెట్టిన పరీక్షలో నెగ్గాలి అని షరతు పెట్టారు,పరీక్షలో ఓడినవారికి మరణశిక్ష . మా తండ్రి ఘటోత్కచుడు శ్రీకృష్ణుల వారి ఆశీస్సులతో పరీక్ష లో పాల్గున్నారు. మా తల్లి తనకు సమాధానం చెప్పలేని ప్రశ్న అడగమన్నారు. అప్పుడు అయన ఒక కధ చెప్పారు.
ఒకవూరి లో ఒక మోతుబరి ఉన్నాడు. ఒక అమ్మాయిని కని అయన భార్య చనిపోయింది. తన ఎదిగిన సౌందర్యవతి అయినా కూతుర్ని చూసి ,తాను తన బంధువు అమ్మాయిని పెంచుకున్నానని అబద్దం చెప్పి కూతురిని పెళ్లి చేసుకున్నాడు .వాళ్లకు పుట్టిన పిల్లలు ఎవరెవరికి ఏమి అవుతారు.
మా తల్లి సమాధానం చెప్పలేక ఓటమి అంగీకరించి పెళ్లి చేసుకున్నారు.
చిన్న తనం నుండి నా తల్లి నుండి సకల విద్యలు నేర్చుకున్నాను. పరమశివుని వరప్రసాదితమైన మూడు అస్త్రాలు నా బలం. నా తల్లి నన్ను కురుక్షేత్ర యుద్ధం లో పాల్గొనమని చెప్పింది. నేను బలహీనమైన పక్షాన పోరాడుతానని ఆమెకు మాట ఇచ్చి బయలుదేరాను.
ఈ యుద్ధ సమయం లో ధర్మసందేహాలు తీర్చుకోవాలని మనసులో అనుకున్నాడు.
మార్గమధ్యం లో ఒక ముసలాయన నాకు కనిపించారు .మహాతేజస్సు కలిగిన ఆయనను చూసి నమస్కరించాను .
ఆయన నన్ను ఎక్కడికి పయనం అని అడిగారు .
నేను కురుక్షేత్ర యుద్ధానికి అని చెప్పారు . ఎవరి తరుపున పోరాడతావు అన్నారు .
పాండవులకు ఆరు అక్షయుహిణి ల సైన్యం ఉంది, కౌరవులకు పదకొండు బలం ఉంది.కాబట్టి పాండవుల అదే మా తాతయ్య భీమసేనులవారు తరుపున పోరాడుతానని చెప్పాను.
ఎంతసేపటిలో యుద్ధాన్ని ముగించగలవు బాలక అని ముసలాయన నన్ను అడిగారు.
అప్పుడు నేను కామాక్షిదేవి కి ప్రార్ధించి ..ఆర్యా నా వద్ద మూడు బాణాలు ఉన్నాయి. ఒకటి ప్రయోగించగానే ఎవరి చంపాలో గుర్తిస్తుంది ,ఇంకొకటి ఎవరిని కాపాడాలో గుర్తిస్తుంది.మూడవది శత్రుసంహారం గావిస్తుంది,నాకు యుద్ధం ముగించడానికి ఒక ఘడియ చాలు అని చెప్పాను .
అబ్బురపడిన వృద్ధుడు ఒక సారి ఈ రవి చెట్టు ఆకులను కొట్టి చూపించగలవా అని అడిగారు.
వెంటనే బాణం సంధించాను .బాణం అన్ని ఆకులని కొట్టివేసి వృద్ధుని కాలికి గుచ్చుకుంది .కాలు ఎత్తిచూస్తే కాలికింద ఒక అకు వుంది.
ఆ బాణం తీసి నొప్పిగావుందేమో అని ఆయన ముఖము చూసాను.
ముఖము లో ఏ భాధ లేని ఆయనను చూసి ఈయన మాములు వ్యక్తి కాదు దేవుడు అని స్ఫురించి, ఆ దివ్యపురుషునిని గుర్తించాను .
శ్రీకృష్ణ మహాప్రభో ..మిమ్ములను గుర్తించలేకపోయాను .క్షమింపుడి అని అన్నాను.
అప్పుడు భగవానుడు తన రూపం లోకి వచ్చారు.
ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కాంచి పరమానందభరితుడయ్యాను.
శ్రీకృష్ణుని నావద్ద నీకు అర్పించడానికి ఏమి లేవు, ఏమివ్వగలనని చింతించుచు అడుగగా పరమాత్ముడు కురుక్షేత్ర యుద్ధానికి ఒక మహావీరుని బలి ఇవ్వాలని. ..ఆ బలిదేవుడు నేనేనని చెప్పారు.
అప్పుడు పరమాత్ముని నీ విశ్వరూపం, కురుక్షేత్ర యుద్ధం చూడాలని నా అంతిమ కోరిక అని కాళ్లుపట్టుకున్నాను. శరాఘాతం వల్ల ఇంకా రక్తం వస్తుంది. అది చూసి ఏమిటిది స్వామి మీకు గాయమా అని అడిగాను. దుర్వాసుని శాపం వల్ల నా పాదము శక్తిహీనం అయింది.వాలి ఈ జన్మలో జరుడికింద పుట్టి తన బాణం తో ఈ గాయం మీదే కొట్టి నా అవతారం చాలించేలా చేస్తాడు అని నాకు విశ్వరూపం చూపించారు భగవానుడు.
ఆ సమ్మోహన నారాయణ స్వరూపం చూసినతర్వాత నాకు ఏమి చూడబుద్ది కాలేదు .
కానీ నా కళ్ళముందు నా పూర్వజన్మ కనపడింది.
నేనొక యక్షుడను. విష్ణుమూర్తిని సేవించుచుండగా బ్రహ్మ తదితరులు వచ్చి భూలోకం లో అధర్మం పెట్రేగిపోయింది, ధర్మం కాపాడుటకు మీరు భువిపై అవతరించే సమయం ఐంది అని విషుమూర్తిని దేవతలు విన్నవించుకున్నారు. దానికి నేను నవ్వి ఈ స్వల్పకార్యానికి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు దేనికి, నేను వెళ్లి భూలోకం లో అధర్మం రూపుమాపి ధర్మం ప్రజ్వరిల్లేలా చూస్తాను అని అవహేళనగా బ్రహ్మ దేవుడికి చెప్పాను. నా వ్యర్ధ ప్రసంగానికి కోపోద్రిక్తుడైన చతుర్ముఖుడు ,నీవు భూలోకం లో పుట్టి విష్ణువు వలన సంహరింపబడి పాపవిమోచనం పొందెదవు అని శపించారు. ........
శ్రీకృష్ణుని లీల నాకు అర్ధమైంది .........
నా బలిదానం మిగిలింది.
నా నీలమేఘ వర్ణరంజితమైన అశ్వాన్ని అధిరోహిస్తూ శ్రీకృష్ణుని పాదాలమీద బాణం సంధించాను.బాణం నుండి గంగ ఉప్పొంగి దేవదేవుని పాదాలకు అభిషేకము చేసినది. గాయం నుండి రక్తస్రావం ఆగినది. వెంటనే సూర్యుని తేజస్సు కలిగిన తన సుదర్శన చక్రం తో నా శిరస్సును దక్షిణ గా తీసుకుని. ...ఈ యుద్ధం అయ్యే వరకు నీ శిరస్సు లో ప్రాణం ఉంటుంది అని ఖటు పర్వతం మీద నా శిరస్సు ఉంచి నాకు తోడుగా ఒక దివ్యజ్ఞాని ని పంపుతానని చెప్పి అదృశ్యమైనారు భగవంతుడు.
యుద్ధాన్ని చూస్తున్నాను ఇంకా మొదలవ లేదు ,ఒక పండుముసలి వారు అటువైపువస్తున్నారు. ఆయనను చూసి ఎవరో దివ్యపురుషుడిలా అనిపించారు.
Like Reply


Messages In This Thread
RE: నేను బార్బిరకుడిని...by kittyboy - by Milf rider - 19-10-2019, 07:55 PM



Users browsing this thread: 1 Guest(s)