Thread Rating:
  • 3 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#11
నాలో నేను నా పేరు
విజయవాడ నన్ను బెజవాడ అని కూడా పిలుస్తారు.
నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఒకరు కృష్ణవేణి
ఇంకొకళ్ళు ఇంద్రకీలాద్రి.
నా మనస్సు ఎందుకో ఒక పులకిన్తకు లోనవుతోంది. పుడమి తల్లి అందమైన పూలు పూయిస్తోంది.
ఆహా తెలిసింది లే దుర్గమ్మ; లోకాలను పాలించేతల్లి ఎందుకో నా మీద విశ్రాంతి తీసుకోవాలనిపించింది.
అడుగు పెట్టింది లే....అందుకే ఈ పులకింత....అమ్మ పాదం సోకగానే ఎంత వేగిర పడుతున్నానో....
ఈ కృష్ణవేణి కూడా ఉరకలెత్తుతోంది.

ఏమయ్యింది ఈ కృష్ణవేణికి అంత అందమైన ముక్కుపుడక
అయ్యో..., ముక్కు పుడకకేసి సాగిపోవాలని ఎంత ఆరాటం.
ఆ ఆ ఇలానే సాగిపోతే ప్రళయం వస్తుందని నేను నీళ్ళల్లో మునిగిపోతానని
బ్రహ్మం గారు చెప్పారు కదా?!
సరేలే కృష్ణవేణీ "నీకు ఎలాగైనా కొంత ఇదుంది, కంట్రోల్ చేసుకోవాలమ్మాయి....లోకాలకు తల్లి కదా ఆ ముక్కు పుడక మీద ఎందుకో ఆశపడటం...హమ్ చూశాంలే.................ఆ ఇదంతా కోపమనుకునేరు....ఎదో చిన్న అలుక".
ఏ....నేను అలగ్గూడదా?"

______________________________
నేనేనండి బెజవాడ
విజయపురి
ఓకే విజయవాడ ఓకే
మరి ఈ బెజవాడ, బెజ్జం వాడ ఏంటండి?..
సరేలే ఎలా పిలుస్తే ఏముంది.
మీరు చెప్పుకునే ఆంగ్ల సంవత్సరాదులు
మహా కవి క్షేత్రయ్య ఈ కృష్ణ ఒడ్డునే పుట్టాడు.
1800 అనుకుంటా అనేక మంది రచానాలు చేశారు. సిద్దేంద్ర యోగి తరువాత
ఒక అబ్బాయి భోగరాజు పట్టాభిరామయ్య
స్వాతంత్రం నా జన్మ హక్కు అని తిలక్ ఇచ్చిన పిలుపుకి స్వతంత్ర ఉద్యమాన్నితనవిగా చేసుకున్నాడు.
ఆ సమయం లో చదువు అంటే విజయవాడ, ఆపైన ఆంగ్లేయులు మద్రాస్ అన్నారు దాన్ని కూడా ఒక తెలుగు వాడు చెన్నమ నాయుడు అనేవాడు ఇచ్చాడుట ఆ స్థలం లో ఆంగ్లేయులు చెన్నపట్నం కట్టుకున్నారు...ఇంగ్లీష్ వారికి నోరు తిరగక మద్రాస్ అన్నారు బృకుటి వేసిన కనుబోమ్మలా ఉంటుంది కదా అందుకని.
మహానటి సినిమా చూసారు కదా.............ఆ సావిత్రి నాన్న సావిత్రిని హైదరాబాద్ తీసుకు వెళ్ళలేదు. మద్రాస్ కే తీసుకువెళ్ళాడు.
అక్కినేని, కాంగ్రెస్ వాళ్ళతో కలిసిపోయి., తన స్టూడియో అదేనండి అన్నపూర్ణా స్టూడియోస్ కోసం
హైదరాబాదు కు ఫిలిం ఇండస్ట్రీ తెచ్చాడు.
దాంతో అందరూ ఇక్కడకు రాసాగారు. లేకుంటే ఇక్కడకు వచ్చే చూతేగాడు ఎవ్వడు. సారీ బూతులు మాత్రం బాగా వచ్చేసాయి.

______________________________
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:53 PM



Users browsing this thread: 1 Guest(s)