Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#3
మబ్బు చాటు చందమామ కొంగు చాటు నెలవంక


మబ్బు చాటు చందమామ; కొంగు చాటు నెలవంక
"ఎం రామయ్యా మీ ఇంటికి పైకప్పుకి ఏంవాడావ్?"
"ఆ ఏం వాడతానయ్యా? ఏమీ లేక మా మామగారిని వాడాను"
"అదేలాగయ్యా?!"
"నువ్వు అంతలా నోరు తెరవకు ఈగలు దూరగాలవు"
"ఏ ఈగలేంటి, రాజమౌళి ఈగలా?"
"మహారాజమౌళి ఈగలు"
"ఏమోకానీ ఏదో మీ మామగారిని వాడానన్నావ్, ఏంటో అది?"
"అదే చెప్పబోతున్నాను మధ్యలో...."
"ఆ...ఆ సరే చెప్పు"
"మా ఊర్లో నాకు ఎవ్వరూ పిల్లనిచ్చేవారు కాదు. నా ముఖం అంత చాలా అవకరంగా ఉంటుంది కదా?"
"అవునవును"
"మధ్యలో నీ యదవ కామెంట్స్ ఆపితే.................."
"..............."
"ఎవ్వరూ పిల్లనిచ్చేవారు లేరు. నేను చదివింది రాజనీతి శాస్త్రం. మా ఊరిలో ప్రతి ఒక్కడు ఒక మోనార్క్., అందరూ ఎదో ఒక బిజినెస్లోనో ఎందులోనో పుడ్డింగ్ రాస్కెల్స్., నేను చెయ్యి వేసుకుని ఊరంతా తిరిగానా?! అప్పుడు కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీకి నాలాంటి తెలివైనవాడు కావాల్సి వచ్చింది"
"నువ్వు తెలివైన వాడివి. కాదని ఎవ్వడన్నాడు...............ఆ ఓకే ఓకే నేనేమీ మాట్లాడనులే"
"వాడికి రాజకీయం నేర్పించి మాంచి నదురుగా ఉన్న ఒక దాన్ని వాడి మీదకు తోసాం..........దాంతో వాడు ఫిదా అయిపోయాడు. నీకు ఏం కావాలో కోరుకో అని శ్రీ కృష్ణుడి టైపు లో అడిగాడు. నేను మీ అంత గొప్పవాడిని కావాలంటే మీ వంశం లో పిల్ల కావాలని చెప్పా...ఇంకేముంది వాడి కూతురును ఇచ్చాడు అంతే అక్కడ దొరికాడు నాకొడుకు. కానీ మధ్యలో మేము ఎగదోసిన పిల్ల..పిల్లేంటి మంచి నదురుగా ఉంటేనూ. కసికసిగా ఉండేది రా.........."
"దాని సంగతి ఎందుకు కాని విషయానికి రా......"
"అది కాస్తా మా అత్త అయ్యి కూర్చుంది. వీడు పెళ్ళి చేసుకుంటాడని ఎవ్వడనుకున్నాడు చెప్పు?"
".............."
"దాంతో మా బామర్దులని ప్రయోగించా..వాళ్ళు వీడికంటే ఘనులు., కానీ శ్రీ కృష్ణుడులా వారి పక్కనే ఉన్నా కూడా పాండవులకి రాజ్యం కట్టబెట్టినట్లు పెట్టలేదు. వారికీ లుకలుకలు ఉన్నవిలే.................అది వేరేవిషయం. ఆ తరువాత బావమరిది కోడుకు ఒక్కడు నేను వారసుడిని అని ప్రజల నోళ్ళలో పడ్డాడు. వాడినీ వాడుకున్నా..."
"కానీ ఎక్కడ దెబ్బకొట్టిందంటే అంతా నేనే తినేద్దామని అనుకున్నా కదూ...అక్కడ దెబ్బకొట్టింది. ఈ ఉద్యోగస్తులు నా దెబ్బకి నాకే జవాబు ఇచ్చారు.
ఇంతలో రాజ్యం విడిపోయింది"
"ఈ రాజ్యం ఎవ్వరు?!"
"రాజ్యం అంటే రాజ్యలక్షి కాదు ఈ ఊరు, రాష్ట్రం. మధ్యలో..........విను చెప్పేది విను..సందేహాలు వద్దు చెప్పింది విను అంతే.............అయితే ఆ కుర్రాణ్ణి వాడుకున్నతరువాత వాళ్ళ నాన్నని వెఱ్ఱిపప్పని చేసి ఇంకొకడిని వాళ్ళ నాన్న ఊర్లో నిలబెట్టా. వీణ్ణి ఓటమితో చావు దెబ్బ కొట్టా...ఇప్పుడు లేవలేని స్థితి....విడిపోయిన ముక్కకి మనం రాజు కావాలంటే.........అది సాధ్యం కాదు. మనమీద ప్రజలు తిరిగబడి ఉన్నారు.?! మరి ఏం చెయ్యటం.. అప్పుడే నేను పీకుతా అని KP అని ఒకడు వచ్చాడు. మరీ అమాయకుడిలా ఉన్నాడు. వాణ్ణి వాడా..............
మరి తరువాత నాయకుడు ఎవ్వరు? చిన్నప్పుడు మన చాచా తన కూతురును పార్సీ వాడికి ఇచ్చి చెయ్యను అన్నాడు. వాణ్ణి ఒక మహాత్ముడు దత్తతు తీసుకుని నా కూతురుని ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆ విధంగా ఆ మహాత్ముని వారసత్వం మన చాచాకి వచ్చింది. తెలివంటే అది ఆతరువాత వాళ్ళ కొడుకు. వారి కోడలు, వారి మనుమలు ఇంతమంది ఇదవుతే........నేను ఏం చెయ్యాలి.
మా మామ కుటుంబం తిరగబడకుండా ఇదివరలో వాళ్ళనాన్నను మభ్యపెట్టినట్లే..........మా బామర్దిని మభ్యపెట్టి వాడి కూతురుని నా కొడుక్కి ఇచ్చి చేసుకున్నా దాంతో వాడూ నోరు మెదపలేక పొయ్యాడు.
తోడల్లుడు ఉన్నాడు...ఉన్నాడు...ఉన్నాడు ఉంటే ఉన్నాడు లే............."
కాబట్టి నేను చెప్పేదేంటంటే "నువ్వు కూడా మీ కొడుకుని రాజనీతి శాస్త్రం చదివించు"
"మీ కూతురుని మా కొడుక్కు ఇవ్వడానికి ఎంత కట్నం ఇస్తావ్?"
"కట్నం తీసుకోవడం నేరం మీకు తెలియదా?"
"అబ్బే, లాంచనాలు అంటూ ఉంటాయి కదండీ"
"నా కూతురుకు ఏ కట్నం ఇవ్వను. మా అమ్మాయిని క్రమశిక్షణతో పెంచాను. ఈ రోజు వరకూ కూడా నా మాట జవదాటదు. ఉద్యోగం చేస్తుంది. తన మొత్తం జీతం నాకు ఇస్తుంది. తల వంచుకుని వెళ్ళుతుంది. తల దించుకు వస్తుంది"
"మంచిదండి ఇంత మంచి అమ్మాయిని చేసుకోవడానికి మేము కూడా రెడీ., మాకు కట్నం ఏమీ వద్దు. ఆ అమ్మాయి ఇప్పటి వరకూ సంపాదించినది అంతా ఆ అమ్మాయికే ఇచ్చెయ్యండి"
"అదెలా కుదురుతుంది. నేను మా అమ్మాయిని చదివించడానికి లక్షల లక్షలు పోసి ఫీజులు కట్టాను. మీరు కోరింది కష్టం"
"పెళ్ళి తరువాత అయినా....ఉద్యోగం లో తెచ్చుకున్న జీతం భర్తకు ఇస్తుందా అని"
"ఇస్తే................?!!!!!!!!! ఏమిటండీ మీ ఉద్దేశ్యం., మా అమ్మాయి జీతం పైసలు మీ పిలగాడు తీస్కపోతడా? మీరు ఒక పని చెయ్యండి. అబ్బాయిని అమ్మాయిని వేరు కాపురం పెట్టించండి. అప్పుడు మా అమ్మాయి తన తనఖా ఇస్తాది"
"ఇంట్లో పనులు ఎలాగ? ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తే మా వాడి పరిస్థితి ఏంటి?"
"పనిమనిషిని పెట్టండి. ఆ మాత్రం మీ కోడలికి చెయ్యలేరా?"
"సరే, పెడదాం. కానీ మా అబ్బాయికి కోపం ఎక్కువ ఎప్పుడైనా కొడితే?....."
"మా అమ్మాయి కరాటేలో బ్లాకు బెల్ట్., ఆఫీస్లో పార్టీలో మందుకొట్టి........ తన్నింది చూడండీ....ఆహా"
"ఆహాఆఆ"
"మీరు ఆహా అంటున్నారు దీనికే............కాలేజీ లో ఒక్కరికి తెలియకుండా ఒకరిని మైంటైన్ చేసింది"
"మరి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరా?"
"ఆ ఉంటే...........మాత్రం......పెళ్ళి తరువాత మీకు నేను గారంటీ....మందు, లేట్ నైట్స్ అన్నీ బంద్. ఈవిషయం లో ఇక నా మాటకి తిరుగులేదు. ఇప్పటికి నాకు ౧౦ సార్లు మాట ఇచ్చింది. మానేసింది అంత గొప్ప క్యారెక్టర్"
"మీకు తెలియడం లేదు. అమ్మాయిని పువ్వులా చూసుకోవాలి. ఇంత అందమైన అమ్మాయిని మీకు ఇస్తుంటే.....మీ ఇంటి దీపం కాదుటండీ..........చిదిమి దీపం పెట్టుకోవాలనిపించదూ..........ఎదో దురుసుగా మాట్లాడుతుంది అంతే...ఒక్క నిద్రమాత్ర వేసుకుంటే సరి. నేను అలానే చేస్తుంటా.....మా ఆవిడే సాక్ష్యం"
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:39 PM



Users browsing this thread: 1 Guest(s)