Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బేతాళుడు చెప్పిన కథలు...by satis
#8
ఒక అరగంట లో ఊరు చేరుకున్నారిద్దరు. ఆడ పెళ్ళివారింట్లో సాదరంగా ఆహ్వానించారు సూర్యాన్ని. వారికివ్వాల్సిన బట్టలు ఇచ్చేసాక భోజనం చేసి వెళ్లమని బలవంత పెట్టారు సూర్యాన్ని. కాదనలేక సరేనని బజారు తిరిగివస్తామని బయటకి వచ్చారు ఇద్దరు. బండి మీద ఊరంతా తిరుగుతూ మార్కెట్ చేరుకున్నారు.
కనిపించిన ప్రతి ఒక్కరిలో ఆమెని వెతికాడు సూర్యం. కానీ ఎక్కడా ఆమె జాడే లేదు.

చీరకొనడం కోసం ఒక చిన్న బట్టలదుకాణం చేరుకున్నారు. ఏం కావాలండీ? అడుగుతోంది ఓ 19 ఏళ్ళ అమ్మాయి.
సీర కావాలమ్మ చెప్పాడు సుబ్బడు.ఆమె ఒక్కోటి విప్పి చూపిస్తోంది(చీరలు). ఇది చూడండి ఫాన్సీ శారీ విత్ ఎంబ్రయిడరీ డిజైన్ అంటూ షాప్ లో వున్న చీరలు ఒక్కొక్కటి గా చూపిస్తోంది.
సుబ్బడు ఉత్సాహంగా చూస్తున్నాడు గానీ, సూర్యం మనసు ఎక్కడో వుంది. అసలామె ఈ ఊళ్ళో వుందా ? లేదా తిరిగి వెళ్ళిపోయుంటుందా? ఎక్కడా కనబడదేం? రకరకాలుగా ఆలోచిస్తున్నాడు.
పసుప్పచ్చని రంగులో ఎర్రని బోర్డరుతో ఉన్న ఒక చీర నచ్చింది సుబ్బడికి. బాబుగోరు ఇది ఎలా వుంది? తీసుకోమంటారా? అడిగాడు సూర్యాన్ని. తీసుకోరా బాగుంది అన్నాడు.

2000 చిల్లర లేదండి. 750 ఉంటే ఇస్తారా అడిగింది అమ్మాయి. లేదమ్మా.....
సరేనండి చిల్లర తెస్తాను.. అమ్మా! 2000 చిల్లర వుందా అంటూ షాపు లోంచి ఇంట్లోకి వెళ్ళింది. లేదే ... పక్కషాప్ లో అడిగి తీసుకురా అంటూ బయటకి వచ్చింది ఆ అమ్మాయ్ వాళ్ళమ్మ.
ఆమెను చూడగానే సడన్ గా షాక్ అయ్యాడు సూర్యం. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లుంది. ఎవరికోసం తెగ వెతుకుతూ తపించిపోతున్నాడో ఆ బస్సు సుందరి ఆమే.
ఆమె కూడా అలాంటి స్థితిలోనే వుంది అతడిని సడెన్ గా చూసేసరికి.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: బేతాళుడు చెప్పిన కథలు...by satis - by Milf rider - 19-10-2019, 11:15 AM



Users browsing this thread: 1 Guest(s)