Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు లోని మర్మము...by sarasulu
#4
జాకెట్ లో జాబిల్లి

మనిషి ఎంత మారినా రొమాన్స్, శృంగారం మనం బయటకు మాట్లాడుకోలేని విషయాలు. ఇక్కడ చాల మంది అబ్బాయిలు ఈ విషయం లో తమ భావాలని, ఊహలని బయట మాట్లాడలేని విషయాలను నిస్సంకోచంగా ఇక్కడ రాయడం చూసాను. అలాగే చాల మంది అబ్బాయిలు అలా మా అమ్మాయిలు ఏమి చెబుతారో అని అడగడం కూడా చూసాను. నా ముందు కథలు కొంత మందికి నచ్చడంతో, శిల్ప లాంటి కొంత మంది రచయిత్రులు ఇప్పటికే తమ శైలితో రాస్తున్నారు, వారి శైలికి భిన్నంగా నా పాత కథల తరహాలో కాకుండా రాయాలి అంటే పైన చెప్పినట్లుగా ఒక కథ కాకుండా ఒక ఆడపిల్లగా నా అంతరంగాన్నే రాస్తే బాగుంటుంది అనిపించింది. ఇది బాగుంది అని తీరా మొదలు పెట్టాక ఏ విషయం ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు.

అప్పుడు మా శ్రీ వారు, మా అబ్బాయిలకు మీలో అన్నిటకంటే ఇంటరెస్టింగ్ అయినది, ఎన్ని రకాలుగా వర్ణించినా, ఎంత మంది ఎన్ని రకాలుగా చూపించినా మళ్ళీ ప్రతి సారి కొత్తగా కనిపించేది, మీరు ఎన్నో రకాలుగా ప్యాక్ చేసి దాచినా కొంచం కొంచం కనిపిస్తూ పిచ్చేకిన్చేది, ఏ చిన్న దర్శనం అయినా దొరకక పోతుందా అని గంటలు గంటలు అయినా వెయిట్ చేయించేది ఏమిటో దాని గురించి రాయి అని ఒక సలహా ఇచ్చారు. ఆ వర్ణనకి వెంటనే టాపిక్ దొరికిపోయింది. మీకు కూడా అర్ధం అయ్యే ఉంటుంది. ఆ విషయం చుట్టూ నా జ్ఞాపకాలు, నా చుట్టూ పక్కల ఆడ వాళ్ళ, నా అనుభవాలు ఇంకా నాకు వచ్చిన కొన్ని ఆలోచనలు అన్నీ రాస్తా ఇక్కడ. ఇక చదవండి.

ఆలోచిస్తే ఆ విషయంలో నాకు గుర్తు వచ్చినంత వరకు నా మొదటి సంఘటన ఇది. సెలవులకు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అమ్మ, అక్క, నేను, తమ్ముడు. నాన్న స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించి ఆఫీసు కి వెళ్ళిపోయారు. ఒక గంట వెళ్ళాక బోర్ కొట్టటం మొదలు పెట్టింది. మా తమ్ముడుకి అప్పటికి 8-9 ఏళ్ళు ఉంటాయేమో. విసిగించడం ఎక్కువ అయిపోయింది. ఆ విసుగులో ఏది అమ్మ వస్తే అది కావాలి అని గొడవ మొదలు పెట్టాడు. కొన్ని తిన్నాక ఇంకా అలా అడ్డమైనవి తింటే పొట్ట పాడు అయిపోతుంది రా అంటే ఏడుపు. అప్పుడు అక్క వాడిని మేనేజ్ చెయ్యటానికి అంత్యాక్షరి ఆడుదామా అంది. వెంటనే నేను రెడీ అయిపోయా. అప్పట్లో పాటలు అంటే కొంచం ఎక్కువ పిచ్చి ఉండేది మరి. అలా పాటల్లో నడుస్తుంటే మా వాడి ఛాన్స్ వచ్చింది. అప్పుడు మా నాగార్జున ఘరానా బుల్లోడు రిలీజ్ అయి పాటలు బాగా నడుస్తున్న రోజులు. మా తమ్ముడు వెంటనే ఆ పాట అందుకున్నాడు.
చుక్కల్లో తలుకులా.. మబ్బులలో మెరుపులా, పూర్తిగా గుర్తు లేదు కాని ఇలా మొదలు పెట్టాడు పాట. అసలే మన పాటల పిచ్చి, అందులో మన డ్రీం బాయ్ సినిమా. నేను ఆగలేక అక్కడ నుంచి అందుకున్నా.
నింగి నుంచి తొంగి చూసి జర్రుమంటూ జారింది.. జాకెట్లో జాబిల్లి.. (వాడు) ఓ ఓహో.. (నేను) జాజుల్లో నా మల్లి. ఇలా పాటలో మునిగిపోయి పాడుతుంటే అక్క గట్టిగా గిచ్చింది. ఏంటి అని కోపం గా దాని వైపు చూస్తుంటే అది అమ్మ వైపు కళ్ళు చూపించింది. అటు అమ్మ ఏమో మొహం ఎర్రగా చేస్కొని చంపెసేతట్లు చూస్తుంది మా వైపు. ఏమి జరిగిందో అర్ధం కాలేదు కాని ఏదో తప్పు జరిగింది అని తెలిసింది. పాట ఆపేసాను. మా తమ్ముడు ఇంకొక పాట మొదలు పెట్టబోతుంటే నోరు తెరిస్తే చంపేస్తాను. నోరు మూస్కొని కూర్చో అంది. వాడికి ఇక ఆటలు సాగవు అని అర్ధం అయిపోయింది. తర్వాత అక్కని జరుగు అని చెప్పి తమ్ముడిని నన్ను అమ్మ కూర్చున్న వైపు పంపి, అమ్మ అటు వైపు వచ్చి కూర్చుంది. పైటని వెనక నుంచి తీసి రెండు భుజాల మీదుగా పూర్తిగా శాలువా లాగ కప్పుకోంది.

ఇక మా వూరు చేరే వరకు అమ్మ కోపంగానే వుంది. మధ్య మధ్యలో పైట సర్డుకున్తూనే ఉంది. మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక మా తమ్ముడు ఆకలి అవుతుందే అన్నాడు. మా అత్తయ్య స్వీట్స్ ఏవో చేసాను రా నీ కోసమే తెస్తా వుండు అని లోపలి వెళ్తుంటే మా అమ్మ ఏమి అక్కర్లేదు. ఇవాళ వీళ్ళు ఇద్దరికీ ఏమి లేదు తినడానికి అంది. నేను కోపంగా నేనేం చేసాను అని అడిగా. అత్తయ్య రావడంతోనే ఏంటి గొడవ ఏమి అయ్యింది అని అడిగింది. అప్పుడు నాకు విషయం కొంచం తెలిసింది. అన్నీ పనికి మాలిన పాటలు. ట్రైన్లో ఈ పాటలు పాడుతున్నారు చూడు అని చెప్పింది. అప్పుడు అత్తా మీ వయసుకు తగ్గట్లు వుండండి రా. అవును మీకు సాయంత్రం వరకు ఏమి లేదు అప్పుడే తెలుస్తుంది అంది. మమ్మలి సపోర్ట్ చేస్తుంది అనుకున్న అత్త అటు వైపు జంప్ అయిపోయంది.

అప్పుడు అమ్మ చెప్పింది. అటు వైపు సీట్లో ఒక కుర్రాడు ఒక కొంచం పెద్ద అతను ఉన్నారు. వీళ్ళు పాడినప్పటి నుంచి ఇద్దరి దొంగ చూపులతో సిగ్గేసి చచ్చిపోయ అనుకో అని చెప్పింది. అప్పుడు అర్ధం అయింది నాకు అమ్మ పైట అంత లాగా ఎందుకు సర్డుకుందో, మమ్మల్ని అటు వైపు పంపి తను ఇటు ఎందుకు వచ్చిందో. అంతకు ముందు సినిమాలలో చూసినా ఇంకా వేరే సంఘటనలు చూసినా. అబ్బాయిలకు పైటలోపల ఇంట్రెస్ట్ ఉంటుంది అని అమ్మాయిలు దాచుకుంటారు అని మాత్రం బలంగా అర్ధం అయ్యింది

ఆ సంఘటన జరిగిన చాల సంవత్సరాల తర్వాతే కాని దానికి దగ్గరగా ఉన్న ఇంకొక సంఘటన ఇది. తేడా ఏమిటంటే అప్పటిలా కాకుండా ఇది జరిగినప్పుడు ఆ విషయం గురించి నాకు బాగా తెలుసు. [Image: wink.gif] నాకు పెళ్లి అయిన కొన్ని ఏళ్ళ తర్వాత అన్నమాట. మా పిన్ని, తన కూతురు, ఇంకొక అత్త వాళ్ళ కూతురుతొ కలిసి షాపింగ్ కి వెళ్ళాము ఆటోలో. చాల రోజుల తర్వాత కలిసాము అని అమ్మయిలము కబుర్లలో పడిపోయాము. కొంత సేపటికి పిన్ని ఆటో వాడిని తిడుతుంటే ఏమిటా అని కబుర్ల నుంచి బయటకి వచాము. వాడు చాల చుట్టూ దారిలో తీసుకు వెళ్తున్నాడు. మా పిన్ని బాగా క్లాసు పీకింది. వాడు ఏదో ఒకటి సనుగు తూనే చివరికి తీసుకు వెళ్ళాడు. ఆటో దిగుతుంటే మీటర్ మీద ఎక్కువ ఇవ్వమని మొదలు పెట్టాడు. పిన్ని ఏమో ఎందుకు ఇవ్వాలి అసలే తిప్పి తీసుకు వచ్చావు. ఇప్పుడు ఇదా అని అంది. అప్పటికే వాడి మోసానికి చిరాకులో ఉన్న మా పిన్ని కూతురు కోపం వచ్చి వాళ్ళ బుర్రలు, ఆలోచనలు చిన్నవె. అక్కడే ఉంటారు ఎందుకు వాడితో ఇచ్చేయి అంది. ఆ ఆటో వాడు అదే స్పీడ్లో ఆ సర్లేమ్మ మా బుర్రలు చిన్నవే, మీ మనసులు, గుండెలు చాల పెద్ద పెద్దవి కదా. డబ్బులు ఇచ్చేయచు గా అన్నాడు ఒక క్షణం దానిని అక్కడ దొంగ చూపు చూస్తూ. దానికి వెంటనే వెలగలేదు అనుకుంటా, మోసం చేసింది కాక అంటూ ఏదో అనబోయింది. అప్పటి దాక డబ్బులు ఇవ్వను అంటున్న మా పిన్ని వెంటనే వాడి చేతిలో పెట్టి చిల్లర కూడా అడగకుండా పదవే నోరు మూసుకొని అని తీసుకు పోయింది.

ఆ రోజు ఇంటికి వెళ్ళాక మా అత్త వాళ్ళ అమ్మాయి దానిని తెగ ఆడుకుంది ఆ డైలాగ్తో. 
Like Reply


Messages In This Thread
RE: మనసు లోని మర్మము...by sarasulu - by Milf rider - 17-10-2019, 04:56 PM



Users browsing this thread: 1 Guest(s)