Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తొలి పరిచయం (ఒక ప్రేమ కథ)...by aparna
#2
తొలి పరిచయం

నా పేరు మహేష్. అమ్మాయిలు ఆరాధనగా, ఆంటీలు ఆబగా చూసే పెర్సనాలిటీ నాది. చిన్నప్పటినుండీ చదువే లోకం కావడంతో ఈ చూపులు పెద్దగా పరిచయం కాలేదు. కాలేజ్ లో కొంతమంది అమ్మాయిలు ట్రై చేసి, నేను గమనించక పోయేసరికి “వీడు తేడాగాడు.” అని పేరు పెట్టేసారని కూడా తెలుసు. అయితే నేను పెద్దగా పట్టించుకోలేదు. సెటిల్ అయితే ఇలాంటి అమ్మాయిలు బోలెడంత మంది దొరుకుతారన్నది నా నమ్మకం.

డిగ్రీ అవ్వగానే నాలుగైదు కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చాయి. వాటిలో మంచిదాన్ని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయిపోయా. హైదరాబాద్ లో పోస్టింగ్. జాబ్ లో జాయిన్ అవ్వగానే లక్కీగా దగ్గరలోనే ఒక డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ రెంట్ కి దొరికింది. అంతా ఒక కొలిక్కి వచ్చేసరికి ఒక వారం పట్టింది. ఇక ఇప్పటివరకూ మిస్ చేసుకున్న అవకాశాల్ని అంది పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నా. నా అపార్ట్ మెంట్స్ లో, రోడ్ మీదా, నా ఆఫీస్ లో.. చాలా మంది అందమైన అమ్మాయిలు కనిపించారు. చాలామంది కళ్ళలో, నాకు బాగా అలవాటయిన ఆహ్వానం చాలా స్పష్టంగా కనిపించేది. అలా రోజూ కనిపించే వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం నన్ను ఆకర్షించింది. ఆ అమ్మాయి పేరు అర్పిత. వయసు ఇరవై రెండు. మా కంపెనీలోనే పని చేస్తుంది. బిలో ఏవరేజ్ ఫిగర్. అయినా, ఆ అమ్మాయి నన్ను ఆకర్షించడానికి కారణం, అందరిలా తను నన్ను ఆరాధనగా చూడకపోవడమే. ఒక రకంగా ఆమె నన్ను పట్టించుకోక పోవడం నా ఈగోని దెబ్బతీసిందనే చెప్పుకోవచ్చు. ఎలాగైనా ఆమెని నా వైపుకు తిప్పుకోవాలని డిసైడ్ అయ్యాను.

ఆఫీస్ అయిన తరువాత ఆమె వెళుతుంటే, నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె వెనకే వెళ్ళసాగాను. ఒకటి రెండుసార్లు ఆమె గమనించింది కూడా. కానీ నన్ను పట్టించుకున్న దాఖలాలేవీ కనిపించలేదు. ఆమె అలా నడుస్తూ, ఒక బస్ స్టాప్ లో నిలబడింది. నేనూ పోయి ఆమె పక్కనే నిలబడ్డాను. ఆమె నా వైపు చూడగానే పలకరింపుగా నవ్వాను. ఆమె మాత్రం నేను ఎవరో తెలియనట్టుగా చూసింది నా వైపు. “ఏమిటండీ! నన్ను గుర్తు పట్టలేదా!? నా పేరు..” అని నేను చెబుతూ ఉండగానే, ఆమె “మహేష్..” అంది. నేను ఆశ్చర్యపోతూ “అయితే, తెలియనట్టు చూస్తున్నరెందుకూ?” అన్నాను. ఆమె ఒకసారి నన్ను తేరిపారా చూసి, “నేను పెద్దగా బావుండను కదా, మీరు పలకరిస్తుంది నన్ను కాదేమో అనుకున్నా.” అంది. నిజంగానే జాలేసింది నాకు. దాన్ని కవర్ చేస్తూ “మీరు బాగోరని ఎవరన్నారూ?” అన్నాను నవ్వుతూ. “అద్దం.” అంది ఆమె కూడా నవ్వుతూ. “అయితే మీ అద్దాన్ని చూడాల్సిందే.” అన్నాను నేను. ఆమె ఫక్కున నవ్వింది. అలా నవ్వినప్పుడు బావుంది తను. ఇంకా ఆ నవ్వు ఆమె మొహంలో తొణికిస లాడుతూ ఉండడంతో, చటుక్కున సెల్ లో ఆమె ఫొటో తీసేసాను. అది చూసి ఆమె కాస్త కోపంగా “ఏం చేస్తున్నారు మీరు?” అంది. “నా అద్దంలో మిమ్మల్ని చూస్తున్నాను.” అని నేను తీసిన పిక్ ఆమెకి చూపించి, “ఎలా ఉంది?” అన్నాను. ఆమె కాస్త ఆనందంగా “బావుంది.” అంది. “సో, మీరు నవ్వితే బావుంటారన్న మాట. ఎప్పుడూ ఇలాగే నవ్వండి.” అన్నాను. ఆమె మళ్ళీ నవ్వింది. ఇంతలో ఆమె ఎక్కాల్సిన బస్ రావడంతో, నాకు బై చెప్పి వెళ్ళిపోయింది.


మర్నాడు ఆఫీసుకు వెళ్ళగానే నా కళ్ళు ఆమెకోసం వెదుకుతూ ఉండగా, ఒక అమ్మాయి హడావుడిగా వస్తూ నన్ను ఢీకొని, “ఓహ్..అయామ్ సారీ….” అంది. ఫరవాలేదు అన్నట్టుగా నవ్వాను నేను. “ఐ యామ్ విశాలి.” అంది చెయ్యి చాస్తూ. నేను ఆమె చెయ్యి అందుకొని, “విశాలి! నైస్ నేమ్. ఐ యామ్ మహేష్.” అన్నా. “ఐ నొ, ఐ నొ..” అనేసి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెని చూస్తూ ఉండగా, “బావుంది కదా!” అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూసాను. అర్పిత అప్పుడే వచ్చినట్టుంది. నవ్వుతూ నిలబడింది. “ఎవరు తనూ!?” అని అడిగాను. “ఆమె తెలీదా!?” అంది ఆశ్చర్యంగా. “అంత పాపులర్ ఫిగరా!?” అన్నాను నేనూ అదే ఆశ్చర్యంతో. “మరీ!” అని కళ్ళు పెద్దవి చేస్తూ, “ఎంత మంది ట్రై చేస్తున్నారో తెలుసా తనకి!?” అని, ఒకసారి అటూఇటూ చూసి, “ఎవరికీ పడలేదు. ఇంకో విషయం తెలుసా! ఆమె ఫస్ట్ టైం షేక్ హేండ్ ఇచ్చింది నీకే.” అంది. నాకు కాస్త గర్వంగా అనిపించింది. “ఇంతవరకూ ఈ ఆఫీస్ లో మగాళ్ళతో మాట్లాడని వాళ్ళు ఇద్దరే.” అంది ఆమె. ఎవరన్నట్టుగా ఆమె వైపు చూసాను. “ఒకటి నేను, రెండు విశాలి. ఎవరూ పట్టించుకోక పోవడంతో నేను మాట్లాడను. ఎవరైనా పట్టుకొని వదలరని ఆమె మాట్లాడదు. కానీ విచిత్రం ఏమిటంటే ఇద్దరమూ నీతోనే మాట్లాడాం.” అంది ఆమె. ఆమె అలా గలగలా మాట్లాడడం ఇద్దరు ముగ్గురు ఆశ్చర్యంగా చూడడంతో, ఆమె తల వంచుకొని, “ఓకే! బై.” అని వెళ్ళిపోయింది.
Like Reply


Messages In This Thread
RE: తొలి పరిచయం (ఒక ప్రేమ కథ)...by aparna - by Milf rider - 09-10-2019, 10:20 AM



Users browsing this thread: