Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హై-ఫై...by 123boby456
#14
బ్రేకింగ్ న్యూస్ : సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడుతున్నా కిడ్నాపర్లు...బొక్కలో టీవీ లో ఎక్సక్లూసివ్ గా చూడండి...

ఒక పది నిమిషాలు యాడ్స్ ఉదరగొట్టాక ?

కమీషనర్ అండ్ ఇద్దరు మినిస్టర్స్ టీవీ లో కనిపించారు..

కాసేపట్లో కాల్ మోగింది...

ఎదో మాట్లాడుతున్నారు..ఏమి వినపడట్లేదు...మీడియా వాళ్ళు అందులోను బొక్కలో టీవీ వాళ్ళు చొవెరగె కోసం చేస్తున్న రచ్చ లో అసలు విషయం వినపడలేదు...

వినయ్: ఛా...మేటర్ తెలీకుండా అయిపోయింది..

కాసేపటికి స్పీకర్ ఆన్ అయ్యింది...సో విన్నారు గా ?

షాలిని: నో..మాకేమి వినపడలేదు...

విక్రమ్: మాకు ఏమి జరిగిందో చెప్పండి ప్లీజ్

వినయ్: ప్లీజ్..

రేవతి: ప్లీజ్ బాస్ ప్లీజ్

స్పీకర్: వావ్..రేవతి..బాస్ అని భలే పిలిచావ్..ఐ లైక్ ఇట్...సరే చెప్తాను...కానీ మీరు నేను చెప్పిన పని చెయ్యాలి..లేదంటే...

షాలిని: ఏంటది ?

స్పీకర్: సెక్యూరిటీ ఆఫీసర్లకి నాకు ఒక ఒప్పదం జరిగింది...మీరు నేను చెప్పిన పని చేస్తే మీరు బయటకి వస్తారు...లేదంటే లేదు..

రోజీ: ఏంటా పని ?

రమణ: మేము ఎందుకు చెయ్యాలి ?

ఫాతిమా: ఇంతకీ ఆ పని ఏంటి ? మేము ఇక్కడ నుంచి బయట పడాలి..

స్పీకర్: నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని...లేదంటే ఈ జన్మ లో మీరు బయటకి వెళ్ళలేరు..

రోహిత్: ఇంతకీ పని ఏంటి ?

వివేక్: సెక్యూరిటీ ఆఫీసర్లు మమ్మల్ని ఆ పని చెయ్యమన్నారా ?

స్పీకర్: హహ్హాహ్హాహ్హాహ్హా నేను మీతో రేపు మాట్లాడతాను..ఇవ్వాళ్టి రెస్ట్ తీసుకోండి....రేపటినుంచి మీకు బోలెడంత పని...హ్హాహ్హాహ్హాహ్హా..

అసలు అక్కడ ఏమి జరిగిందో మనం చూద్దాం...

కాల్ మోగింది..

కమీషనర్: హలో నేను సెక్యూరిటీ అధికారి కమీషనర్ మాట్లాడుతున్నాను ? మీరెవరు మీ డిమాండ్స్ ఏంటి ? చెప్పండి లేదంటే ?

కిడ్నాపర్: లేదంటే ?

ACP వెంకట్: సర్, వాళ్ళ దగ్గర మన వాళ్ళు ఉన్నారు...మీరు కాస్త మెల్లగా మాట్లాడండి...

కమీషనర్: ఓకే, చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి, పబ్లిక్ ని ఎందుకు కిడ్నాప్ చేశారు ?

కిడ్నాపర్: ఉమ్మ్ నీ వాయిస్ నాకు నచ్చలేదు కమీషనర్. నాకు ఎవరన్నా వేరే ఆఫీసర్ కావాలి

కమీషనర్: వాట్ ?

కిడ్నాపర్: యేః...నాకు నీ వాయిస్ నచ్చలేదు..పైగా నువ్వు నా డిమాండ్స్ నెరవేర్చేంత పనిమంతుడివి కాదు....

కమీషనర్: హే వాట్ ర్ యూ టాకింగ్ ? ఐ అం ది కమీషనర్ సెక్యూరిటీ అధికారి...

కిడ్నాపర్: అయితే నాకేంటి బే ? సరే నీ ఇష్టం..ఉన్నవాళ్ళని చంపేస్తా ? తరువాత

మినిస్టర్: హలో హలో ఆగండి...మీరెవరు మీకేం కావాలి ? నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను..

కిడ్నాపర్: ఓహ్ మినిస్టర్ గారా..సరే నేను అడిగిన ఇద్దరినీ ఆఫీసర్స్ ని అక్కడికి పిలవండి...అప్పుడు చెప్తా ?

మినిస్టర్: ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి ?

కిడ్నాపర్: ACP వెంకట్, ACP రజని.....

మినిస్టర్: తొందరగా వాళ్ళని పిలవండయ్యా..


అక్కడే ఉన్న వెంకట్ నిర్ఘాంతపోయాడు....మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాడు అని..

పది నిమిషాల్లో అక్కడికి రజని వచ్చింది..

రజని ని చూడగానే వెంకట్ కళ్ళు ఎగరేసాడు ఫాంట్ మ్యూట్ లో పెట్టి..

రజని: నో క్లూ..వాడు సాటిలైట్ ఫోన్ వాడుతున్నాడు..

రూమ్ లో అందరు విస్తుపోయారు...

మినిస్టర్: మీరడిగిన ఇద్దరు ఆఫీసర్స్ వచ్చారు...

కిడ్నాపర్: సర్ మినిస్టర్ సర్...థాంక్స్....సర్...ఇక మీరు పక్కకి దొబ్బేస్తే మేము డీల్ మాట్లాడుకుంటాం...

థాంక్ యు సర్ అన్నాడు వెటకారంగా..

లెట్స్ కం టు ది పాయింట్, వెంకట్ మీడియా ని అక్కడ నుంచి పంపెయ్యండి..

రజని, ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేసెయ్యండి....

రూమ్ లో మినిస్టర్, కమీషనర్, వెంకట్ & రజని తప్ప ఎవరు ఉండకూడదు...

రూమ్ మొత్తం ఖాళి అయిపొయింది...

వెంకట్: చెప్పు నీ డిమాండ్స్ ఏమిటి, ఇక్కడ ఎవరు లేరు...

కిడ్నాపర్: హహహ వెంకట్,, నేను చిన్న పిల్లాడ్ని కాదు...అక్కడ ఉన్న మిగిలిన సెక్యూరిటీ ఆఫీసర్లని పంపేయి.

వెంకట్: ఇక్కడ ఎవరు లేరు

కిడ్నాపర్: వెంకట్, వెంకట్ నువ్వు మీడియా ని పంపిస్తే నాకేమి తెలీదనుకున్నావా ?

ఆ బొక్కలో టీవీ ఛానల్ వాడు నీ టేబుల్ మీద పెట్టిన చిన్న కెమెరా లో లైవ్ ఇస్తున్నాడు రాజా
వెంకట్ కి ఒళ్ళు మండింది...కెమెరా తీసి నేలకేసి కొట్టి అందరిని పంపేశాడు...

తలుపు మూస్తూ ఇక్కడ బొక్కలో టీవీ రిపోర్టర్ ఎవరు ?

నేనే సర్ అంటూ ఉత్సాహంగా వచ్చాడు ఒకడు..

వెంకట్:టేబుల్ మీద కెమెరా పెట్టింది నువ్వేనా ?

ఎస్ సర్. నేనే...
లాగి ఒకటి కొట్టాడు వెంకట్. మీ వెధవ తెలివి తేటలకి అక్కడ కిడ్నాప్ అయినా వాళ్ళ ప్రాణాలు పోతాయి..ఇడియట్...అని తలుపేసేసాడు..

కిడ్నాపర్: ఓకే వెంకట్ అండ్ రజని రిలాక్స్ గా కూర్చోండి ఇప్పుడు మీతో మా బాస్ మాట్లాడుతారు..

కిడ్నాపర్: వెల్ మిస్టర్ వెంకట్ అండ్ మిస్సెస్ రజని...వెల్కమ్...మిమ్మల్నే ఈ పనికి ఎందుకు సెలెక్ట్ చేసానంటే...

వాయిస్ మారిపోయింది..ఇందాక మాట్లాడిన వాయిస్ కాదు....

కిడ్నాపర్:మీరు బాగా ఎఫిసియెంట్ అని మీకు నమ్మకం కదా...అందుకే మీకు ఒక టాస్క్...అది మీరు చెయ్యగలిగితే కిడ్నాప్ అయినా వాళ్ళు బయటకి వస్తారు...

లేదంటే చస్తారు...

వెంకట్: ఏమిటా టాస్క్ ?

కిడ్నాపర్: వావ్ వెంకట్ అప్పుడే రెడీ అయినట్టు ఉన్నారు...

రజని: ఇంతకీ ఏమి కావాలి నీకు...

కిడ్నాపర్: వావ్ రజని...సరే వినండి..

ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున అంటే కరెక్ట్ గా పది రోజుల్లో విల్లా మహల్ పాలస్ లో డైమండ్ ఎక్సిబిషన్ జరగబోతోంది...

నేను అక్కడ నుంచి వేల కోట్ల విలువ చేసే ఆ డైమండ్స్ ని కొట్టెయ్యబోతున్నా....మీరిద్దరూ మీ టీం తో దాన్ని ఆపాలి..

మీరు నన్ను ఆపగలిగితే కిడ్నాప్ అయినా వాళ్ళు వస్తారు...లేదా నేను డైమండ్స్ తీసుకుపోతూ వాళ ప్రాణాల్ని కూడా తీసుకుపోతాను..

రజని: డైమండ్స్ తీసుకుపోయేటప్పుడు పబ్లిక్ ని కిడ్నాప్ చెయ్యడమెందుకు...డైరెక్టుగా దొంగతనం చెయ్యచ్చుగా...

కిడ్నాపర్: నైస్ క్యూస్షన్...నా ప్లాన్స్ నాకుంటాయి....

వెంకట్: అసలు ఏంటి ఈ డ్రామా ?

కిడ్నాపర్: డ్రామా ఏంటి...కిడ్నాప్ దొంగతనం...క్రైమ్...అనాలి..డ్రామా ఏముంది ఇందులో...

వెంకట్: ఇదేమన్నా సినేమానా గేమ్ ఆడటానికి...

కిడ్నాపర్: హుమ్మ్ ఓకే అసలు విషయం చెప్పేస్తాను...

నేను మీ అంత ఎఫిసియెంట్ కాదని నన్ను బయటకి గెంటేశారు...అకాడమీ నుంచి....సో ఇప్పుడు మీరు ఎఫిసిఎంతా నేనా తేలిపోవాలి...

వెంకట్: రాజ్..పర్సనల్ గొడవలు తేలుచుకోవటానికి పబ్లిక్ ఎందుకు ?

కిడ్నాపర్: హే గుర్తుపట్టేశావ్..ఇంకా మర్చిపోలేదా నన్ను...

రజని: రాజ్, ఇది సినిమా కాదు..పబ్లిక్ తో ఇలా ఆడుకోకూడదు..

కిడ్నాపర్: నేను అంత పోటుగాడినే అయితే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని కదా రజని...

రజని కొయ్యబారిపోయింది...

వెంకట్: ఏంటి ఈ అర్ధం లేని స్టేట్మెంట్. రాజ్...

కిడ్నాపర్: హహ్హాహ్హాహ్హాహ్హాహ్ కాల్ కట్ అయిపొయింది...





నలుగురు అదే గది లో ఉన్నారు..

రజని ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోయింది..

వెంకట్ కమీషనర్ తో మినిస్టర్ తో మాట్లాడుతున్నాడు..

పావుగంట లో ఇంకో కాల్..

కిడ్నాపర్: మై ప్లాన్ స్టార్ట్స్ టుమారో ఎట్ నైన్ ఇన్ ది మార్నింగ్ షార్ప్...లెట్స్ ది గేమ్ బిగిన్....హహహ్హహ్హహ్హహ్హ

అని గట్టిగా నవ్వుతు కాల్ కట్ చేసాడు....
Like Reply


Messages In This Thread
హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:09 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:15 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:19 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:22 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:26 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:27 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:29 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:34 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:39 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:41 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:45 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:48 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:50 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:53 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 09:56 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:01 AM
RE: హై-ఫై...by 123boby456 - by Milf rider - 07-10-2019, 10:04 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:36 AM
RE: హై-ఫై...by 123boby456 - by rascal - 08-10-2019, 10:40 AM
RE: హై-ఫై...by 123boby456 - by chinnodu - 08-10-2019, 12:03 PM
RE: హై-ఫై...by 123boby456 - by Kspairo - 09-10-2019, 04:50 PM
RE: హై-ఫై...by 123boby456 - by kesava9059 - 09-10-2019, 06:56 PM



Users browsing this thread: 1 Guest(s)