Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గౌతమి పుత్ర శాతకర్ణి...by kittiboy
#11
ఇంతలో శివస్వతి నుండి కబురు వచ్చింది ,"మ్లేత్యులు యవనులు పశ్చిమ తీరం పై ఆవరించి ఉన్నారని"
అప్పుడు మహాబలి ఇచ్చిన పుస్తకాన్ని శాతకర్ణి తెరచి చూశాడు
శత్రువుల బలం మనకంటే పెద్దది ,వారివి మూడంతస్తుల యుద్ధ నౌకలు ,మన నౌకా దళం చిన్నది అని తీవ్రంగా ఆలోచించసాగాడు
సింహళ దేశం నుండి నౌకలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది ఇంతలో వేళ్ళని ఎలా నిలువరించాలి అని సభ ఏర్పాటు చేసాడు
వేగుల ద్వారా వారి సైన్యం పదివేలు నౌకలు అని తెలిసింది ,శాతవాహన బలం వెయ్యి మాత్రమే
తన రహస్య మందిరం లో ఒక వ్యూహం రచించాడు
యుద్ధ నౌకలు తీరాన్ని సమీపిస్తున్నాయి
వెంటనే శాతకర్ణి పాములా పొడవుగా వున్న వంద చిన్న పడవలను రప్పించాడు,అవి మెరుపు వేగం తో కదులుతాయి.
వాటిని బోర్లా పడుకోబెట్టి ఈదుకుంటూ మ్లేత్యుల నౌకలు చుట్టూ అర్ధచంద్రాకారం లాగా ఏర్పరిచారు
శత్రువులకు పాముపడవలు తిరగబడి ఉండటం వలన ఒక తాడులాగా కనిపించాయి
ఇంతలో సింహనాదం వినిపించింది
పడవకు వేలాడదీసిన పీపాకు కట్టిన తాడు కత్తిరించారు ,కత్తులతో వాటి మూతలను తీసేసి వెనక్కి ఈదుకుంటూ వెళ్లిపోయారు గజఈతగాళ్ళు .
వెళ్లే ము కింది అంతస్తులో శత్రునౌకల తెడ్డువేసే వారిని బాణాలతో చంపేశారు
నౌకలు ఎక్కడికక్కడే ఆగి పోయాయి
శత్రువుల కంటికి పీపాలు తేలుతూ కనిపిస్తున్నాయి
ఈటెల వర్షం కురిసింది శత్రు నౌకల నుండి ....
వేలాది డాలులు నీటిపై తేలుతున్నాయి
వాటిని వీపుకు కట్టుకుని ఈదుతూ తప్పించుకున్నారు శాతవాహనులు
సముద్రమంతా నల్లగా తారుతో నిండిపోయింది
ఆకాశం లో కారుమబ్బులు ఆవరించాయి ఇంతలో సముద్రం లో పిడుగు పడింది
మెరుపులు మొదలయ్యాయి
మెర్పుల వెలుతురులో శాతకర్ణి ఆకాశ వీధి లో రధం పై కనిపించాడు
అది పిడుగు కాదు శాతకర్ణి సంధించిన నిప్పుల బాణం
నౌకలు అగ్గి రాజుకున్నాయి ,వెనుక వున్న నౌకలు వెనక్కి తగ్గాయి
ఇంతలో వెనుక నుంచి సింహళ నౌకలు రానే వచ్చాయి .అవి ఐదు అంతస్తుల నౌకలు .అవి మ్లేత్యుల నౌకను చుట్టు ముట్టాయి .
చేసేది లేక యినుప గుండ్లు ప్రయోగించ సాగారు .ఇంతలో ఒక ధ్వజస్తంభం లాంటి దానిని నౌకకు ముందు వుంచి,పదునైన ఇనుప ధ్వజాన్ని
తాడు సాయం తో ఒక్కో నౌక మీద వదిలారు .వెంటనే ఆ దెబ్బకు నౌకలు మునిగి పోయాయి .సుమిత్ర బాలి దీవుల నుండి సువర్ణ వర్మ కూడా సింహళ నావికా బలానికి సాయం వచ్చారు .
మ్లేచ్చులు తమ సైన్య రక్తం సముద్ర నీటి తో ,తారుతో పాటు కలిసిపోవడం చూసి ,యవనులతో సహా ఓటమి అంగీకరించారు.
విజయధ్వానాలు మిన్నుమింటాయి .
ఇంతలో వర్తమానం అందింది నహపాణుడు దండెత్తి రాజ్య వైపు వస్తున్నాడని....
నహపాణుడు ఉత్తర దేశ సైన్యాలన్నీ కలిపి రెండు లక్షల సైన్యం తో యుద్దానికి బయలుదేరారు.
శాతకర్ణి సైన్యం 40 వేలు మాత్రమే .....
శాతకర్ణి మహాబలి ఇచ్చిన పుస్తకం లోనించి బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించాడు .
రాజ్యాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కోటకు రక్షణ కవచం లా అశ్వాలనూ ,ఏనుగులను నిలబెట్టాడు .
ఏనుగులకు ముళ్ల కవచం ఏర్పాటు చేసాడు
తొండానికి ఇనుప గొలుసుతో ముళ్ల ఇనుప గుండ్లు కట్టారు.ఏనుగు కు చుట్టూ పది అశ్వాలను, ఇరవై మంది సాయుధులను ఉంచారు .ఇలాంటివి వందయేనుగుల వరకు ఉంచారు.
చుట్టూ దీర్ఘచతురస్రాకారం లో సైన్యాన్ని మోహరించారు. ముందు వరుస మధ్యలో ఖాళీ వదిలారు
దీన్ని మండల వ్యూహం అంటారు
ఈ వ్యూహాన్ని పసిగట్టి గరుడ వ్యూహం పన్నాడు నహపాణుడు .
పక్షి ముక్కు ముందు వ్యూహాన్ని చీల్చేలా ,రెక్కలు రెండువైపులా చాచి మండల వ్యూహాన్ని రెండు వైపులా చుట్టుముట్టేలా పధకం వేశారు.
తమకు నాలుగు రెట్లు వున్న శత్రువులను ధైర్యం తో ఎదురు నిలిచారు శాతకర్ణి సైన్యం
ముందుకు దూసుకువచ్చింది పక్షి ముందు భాగం అశ్వదళం తో, వెనుక నుండి బాణాల వర్షం కురిసింది శాతకర్ణి సేన మీదకు .అప్పుడు శాతకర్ణి సైనికులు తయారుచేసిన యుద్ధగజాలను ముందుకు వదిలారు.
తొండాలకు కట్టిన ముళ్ల గుండ్ల తో శత్రు అశ్వాలపై విరుచుకు పడ్డాయి.
ఊహించని పరిణామాలకి హుతాశులయ్యారు నాహాపణ సైన్యం .
గరుడవ్యుహం ముక్కు పగిలిపోయింది
శాతకర్ణి మధ్యలోంచి సింహం పైకి ఎక్కి ఉరిమి కత్తి తో ముందుకు ఉరికాడు
కానీ నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు.
శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు.
వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.
Like Reply


Messages In This Thread
RE: గౌతమి పుత్ర శాతకర్ణి...by kittiboy - by Milf rider - 05-10-2019, 11:19 AM



Users browsing this thread: 1 Guest(s)