05-10-2019, 11:09 AM
ఆ కన్య పరివారం ఒక అందమైన తటాకం (చెరువు) వద్ద ఉంది.బహు నున్నగా చెక్కిన రాళ్లతో తటాకమునకు చుట్టూ గోడ కట్టబడి ఉన్నది. చెరువు లోకి మెట్లు మరియు తూరలు కట్టిన పనితనం చూసి శాతకర్ణి విస్తుపోయాడు .శతధృవంశ యోధుల్లా ఉన్న పెద్ద వృక్షాలు ,దట్టమైన నీడ తో పటు పిల్ల గాలులు కూడా వీస్తుండండం తో మైమరచి ,పిల్ల కోసం వెతకసాగాడు .కానీ నీటి లో పిల్ల తిమ్మెరలు చూసి ఏమి ఈ సౌందర్యం అనుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద ఉడత ఒక చెట్టు మీదనుంచి ఇంకొక చెట్టు మీదకు ఉరుకులు పరుగులు చూసాడు. చెట్టు మీద రెండు కోతులు కూర్చొని ఉన్నాయి ,వాటి తోకలతో పిల్లకోతి ఉయ్యాలలూగుతోంది.నేల మీద పచ్చిక మృదువుగా కాళ్లకు తగులుతోంది. తుమ్మెదలు, తేనెటీగల ఝుంకారాల మధ్య పెద్ద పళ్లెం లాగా ఉన్న ఆకులతో ఉన్న ఎర్ర కలువలు మరింత వికసిస్తున్నాయి. పక్షుల కిలకిలారావాలు విని చెరువు లో ఉన్న ఒక దిబ్బ మీద ఒక దృశ్య కావ్యం చూసాడు శాతకర్ణి. చెరువులో దిబ్బ మీద ఎర్ర చిలువ బాతులు ,నారాయణ పక్షులు, నీటి కోడిల గుంపు చూసి విహంగ జంటల ప్రేమకేళి చూసి మళ్ళి సుందరాంగి గుర్తుకు వచ్చింది. అలా వెళ్లగా ఒక శివాలయం కనపడింది .అక్కడ ఆ దివ్యంగన చెలికత్తెలతో కూడి దేవునికి హారతి అర్పించి ,చెరువు లోకి దిగింది. చెలికత్తెలు ఇక్కడ మొసళ్ళు ఉండవు కదా అని పరిహాసమాడారు. ఇంతలో స్నానం ముగించి దివ్యంగన మహాదేవునికి పూజాదికాలు చేసింది. కానీ శాతకర్ణికి ఆమె మోము (ముఖం) అగుపించుట లేదు. వేరే వైపుకు వెళ్లి చూద్దామని బయలుదేరాడు, పూజ ముగించుకొని ఆమె కూడా శాతకర్ణి వైపు వచ్చింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దెబ్బతో ఇంతకూ ముందు చూసిన ప్రకృతి సౌందర్యం అంతా మనస్సులోంచి మటుమాయం అయిపోయింది .ఆమెను చూస్తూ స్థాణువు ల ఉండి పోయాడు . ఇంతలో భటులు వచ్చి శాతకర్ణి ని చుట్టుముట్టారు.ఆమె శాతకర్ణి అందము చూసి ముగ్ధురాలై సరస్సు లోనుండి ఒక కాలువను తెంపి పంటితో కొరికి తన స్తనద్వయం మీద కలువను పెట్టి శాతకర్ణి మీదకు విసిరి చెలికత్తెలతో పారిపోయింది. వారు చాల దూరం వెళ్లిన తరువాత శాతకర్ణి ని భటులు యువరాణిని చూసినందుకు ఒక చెట్టుకు కట్టేసి అడవి లో ఒంటరిగ వదిలేసారు.ఆ దివ్యంగన మత్తు లో ఉన్న శాతకర్ణి ఆమె రూపాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు. ఇంతలో ఇందాక ఉయ్యాల ఊగుతున్న కోతిపిల్ల శాతకర్ణి కట్లు విప్పేసి కేరింతలు కొడుతూ వెళ్ళిపోయింది. అప్పుడు శాతకర్ణి అనుకున్నాడు "ఆమె గంధర్వురాలై ఉంటుందా,లేక మత్స్యకన్యా ? లేక నాగకన్యా ?. ఏమి సౌందర్యo ! ....పూర్ణచంద్రుడు లాగా పరిపూర్ణంగా ,జాలువారుతున్న కురులు తేనెటీగల సమూహంలా,నెలవంకను పోలిన వికసించిన పెదవుల సమాహారం, సివంగిని గుర్తుకు తెచ్చే ఆ నడుము, ఆ వయ్యారాల హంస నడక, శ్వేతాంబరాల వంటి మేనిఛాయ ,కస్తూరి సువాసనలతో ,మల్లెపువ్వు లాగా ,కోకిల కంఠం తో ,మన్మధుడే దిమ్మతిరిగేలా వెల్లువిరిసిన వసంతం లాగా ఉంది ఆ దివ్యంగన."
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు