Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అది విన్న ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వి తన ఆసనంలో కూర్చుంటూ, “ఆ విషయం నాకు తెలుసు మంత్రిగారు…. కాకపోతే మీ గూఢచారులు తెచ్చిన సమాచారంలో మీకు తెలియని విషయం ఇంకోటి ఉన్నది,” అన్నాడు.

పూర్ణయ్య ఆదిత్యసింహుడి వైపు ఏమిటది అన్నట్టు చూసాడు.
ఆయన మొహంలోని భావాలు అర్ధం చేసుకున్న ఆదిత్యసింహుడు, “మా వదిన గారు నా పట్టాభిషేకానికి ఆటంకాలు కలిగిస్తారని నాకు తెలుసు…అందుకే నా ప్రయత్నాలలో నేను ఉన్నాను…కాని ఇక్కడ మీకు తెలియవలసి విషయం ఏంటంటే మా వదినగారికి అత్యంత నమ్మకమైన చెలికత్తె మంజుల భర్త ఆమె రాచకార్యం మీద కాదు వెళ్తున్నది,” అంటూ ఒక్క నిముషం ఆగి పూర్ణయ్య వైపు చూసాడు.

[Image: xZ0aGW53_400x400.jpg]

ఆయన చాలా ఆసక్తిగా ఆదిత్యసింహుడు చెప్పేది వింటున్నాడు.
మళ్ళీ ఆదిత్యసింహుడే, “మంజుల భర్త వెళ్తున్నది…నా రాచకార్యం మీద మా వదిన గారి అన్న అయిన పరాశిక రాజ్యానికి రాజయిన విక్రమ వర్మ దగ్గరకు వెళ్ళారు,” అన్నాడు.
ఆదిత్యసింహుడు చెప్పింది విన్న మహామంత్రి పూర్ణయ్య ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కొద్దిసేపు పట్టింది.
ఆయన కళ్ళల్లో ఆదిత్యసింహుడిని మెచ్చుకోలు కనిపిస్తున్నది.
“భళా….ఆదిత్యా….భళా….నీకు రాజతంత్రంతో సరిపోయేవారు ఎవరు లేరు,” అని పూర్ణయ్య ఆదిత్యసింహుడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
కాని అంతలోనే పూర్ణయ్య, “మంజుల భర్త నీ రాచకార్యం చేయడాని ఎలా అంగీకరించాడు….నువ్వు మంజలని ఏమైనా…..” అంటూ మధ్యలో ఆపి ఆదిత్యసింహుడి వైపు అనుమానంగా చూసాడు.
ఆదిత్యసింహుడు నవ్వుతూ మంజులను తన దగ్గరకు తన వదిన పంపించిన దగ్గర నుండి ఇంతకు ముందు రమణయ్యతో జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పాడు.
కాని తను తన వదిన స్వర్ణమంజరిని కోరుకుంటున్నట్టు మాత్రం చెప్పలేదు.
అంతా విన్న పూర్ణయ్య మనసు సంతోషంతో నిండిపోయింది….కాని తన మనసులో, “ఆ లేఖలో ఏమున్నదో చెప్పలేదు,” అని అనుకుంటూ అదే విషయాన్ని ఆదిత్యసింహుడిని అడిగాడు.
“అందులో పెద్ద విశేషం ఏమీ లేదు మంత్రిగారు…మీకు తెలియని రాజత్రంత్రం ఏమున్నది…విక్రమ వర్మను తన సైన్యంతో మన రాజ్యం మీదకు దండెత్తి తనకు సహాయం చేయమని మా వదిన స్వర్ణమంజరి సహాయం కోరినట్టు లేఖ పంపించాను,” అన్నాడు ఆదిత్యసింహుడు.
“కాని వాళ్ళకు మనతో యుధ్ధం చేసేంత బలం కాని, బలగం కాని లేవు ఆదిత్యా…ఆ విషయం విక్రమ వర్మకు కూడా తెలుసు…మరి వాళ్ళు ఎలా యుధ్ధానికి వస్తారనుకున్నావు?” అన్నాడు పూర్ణయ్య.

[Image: chandra_5903113940e1f.jpg]

“ఆ విషయం నాక్కుడా తెలుసు మంత్రిగారు…వాళ్ళు మన ముందు యుధ్దంలో ఒక్క పూట కూడా నిలవలేరు… అందుకనే రమణయ్యను విక్రమవర్మతో రహస్య సమావేశం జరిపి ఏం చేయ్యాలో…ఏ విధంగా తన మీద దాడి చేయించాలో ఒక పధకం రూపొందించి పంపించాను,” అంటూ ఆదిత్యసింహుడు తన పధకాన్ని అంతా వివరంగా పూర్ణయ్యతో చెపి, “ఇందులో ఏమైనా మార్పులు సూచిస్తారేమో అని మిమ్మల్ని సహాయం కోసం పిలిపించాను,” అన్నాడు.
వాస్తవానికి ఈ పధకంలో పూర్ణయ్య సహాయం ఏమాత్రం అవసరం లేదు.
కాని ఆదిత్యసింహుడు తన చక్రవర్తి అయ్యే దాకా పూర్ణయ్యకు చెప్పకుండా తను ఏ కార్యం తలపెట్టడు అన్న భ్రమలో మహామంత్రిని ఉంచుదామని నిర్ణయించుకున్నాడు.
మొత్తం విన్న తరువాత పూర్ణయ్య ముఖం సంతోషంతో వెలిగిపోతున్నది.
తనకు ఆదిత్యసింహుడు ప్రతి విషయాన్ని చెప్పి చేయడం, తన సలహా అడగడం బాగా నచ్చింది.
దాంతో పూర్ణయ్య తన మనసులో ఆదిత్యసింహుడిని చక్రవర్తిని చేయడానికి తన శక్తి అంతా ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాడు.
“ఇందులో మార్పులు చేయడానికి ఏమీ లేదు ఆదిత్యా…అయినా నువ్వు రాజకీయాలలో చాలా ఆరితేరావు….అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది…నువ్వు చక్రవర్తి కావడానికి నేను చేయగలిగినది అంతా చేస్తాను,” అని తన ఆసనంలో నుండి లేచి నిల్చుని, “ఇక నేను వెళ్ళి వస్తాను,” అన్నాడు.
ఆదిత్యసింహుడు కూడా తన ఆసనంలో నుండి లేచి పూర్ణయ్యకు నమస్కరించి అతనిని సగౌరవంగా తన భవనం వెలుపలి వరకు సాగనంపి లోపలికి వచ్చాడు.
***********
మంజుల ఆదిత్యసింహుడి దగ్గర నుండి ఆనందంతో బయలుదేరి స్వర్ణ మంజరి భవనానికి వచ్చింది.
ఆమె మొహంలో ఆనందాన్ని స్వర్ణ మంజరి వెంటనే పసికట్టింది.


[Image: z016912.jpg]
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 04-10-2019, 06:55 PM



Users browsing this thread: