Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ ః 8

(తరువాత అప్డేట్ 40 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=40)

మంజుల ఆదిత్యసింహుడి వైపు చూసి, “అది ఏమిటంటే ప్రభు….నేను నా చిన్నతనం నుండి స్వర్ణమంజరి రాణిగారికి చెలికత్తెగా ఉంటున్న విషయం మీకు తెలిసిందే, కొద్ది సంవత్సరాల క్రితం నేను స్వర్ణమంజరి గారి గదిలో ఆమెకు సపర్యలు చేస్తుండగా ఆమెకు మీ అన్నయ్యగారితో వివాహం అయిన తరువాత…మీ వదిన గారు తన అన్న అయిన విక్రమవర్మగారితో ఏకాంతంగా మాట్లాడుతుండగా, మాటల సందర్బంలో మీ వదిన గారు తన అన్న గారితో తను ఏమైనా రహస్య సందేశం పంపించాలనుకున్నప్పుడు ఒక రహస్య సంకేతం చెప్పి పంపిస్తానన్నది,” అన్నది.

దాంతో ఆదిత్యసింహుడు ఆత్రంగా, “ఏమిటా సంకేతం?” అని అడిగాడు.
“ఆ సంకేత ఏంటంటే ప్రభూ…“మహాభారతంలో శకుని పాండవులకు ఆప్తమిత్రుడు” ఈ సంకేతం విక్రమవర్మ మహారాజు గారికి చెబితే మీ పని ఇంకా సులువుగా అయిపోతుంది ప్రభు…అప్పుడు రమణయ్య గారితో ఎవరు వెళ్లినా కార్యం అయిపోతుంది ప్రభూ,” అన్నది మంజుల.

మంజుల మాటలు విన్న ఆదిత్యసింహుడు, రమణయ్య చాలా సంతోషపడిపోయారు.

రమణయ్య అయితే ఆనందం ఆపుకోలేక ఆదిత్యసింహుడి వైపు చూసి, “ప్రభూ….ఈ మంజుల మన కార్యాన్ని చాలా తేలిక చేసింది ప్రభు…..ఇప్పటి దాకా మనం ఈ కార్యం గురించి తర్జనభర్జన పడుతుంటే….ఒక్క మాటలో మన మార్గం సుగమం చేసింది….మీరు తప్పకుండా మంజులకు భారి పారితోషకం ముట్టచెప్పాల్సిందే,” అన్నాడు.

[Image: 8cea9af21e5a4a9ab0fe9b5025b34164_850X1275.jpg]


రమణయ్య మాటలకు ఆదిత్యసింహుడు కూడా అవునన్నట్టు తల ఆడిస్తూ, “మంజులా నువ్వు ఈ సంకేతం చెప్పి మాకు చాలా మేలు చేసావు….ఇది చెప్పడం వలన మాకు చాలా మేలు చేసావు…..అందుకు ప్రతిఫలంగా నిన్ను మా రహస్య స్త్రీ గూఢచారి విభాగానికి ముఖ్య అధికారిగా నియమిస్తున్నాను….ఇక నుండి నువ్వు నా ఆదేశాలతో పాటు, రమణయ్య గారి ఆదేశాలు పాటిస్తూ, ఆయనుకు లోబడి పనిచెయ్యి…..” అన్నాడు.

ఆ మాట విన్న మంజుల మనసు చాలా ఆనందంతో నిండిపోయింది.

ఆ ఆనందం ఆమె మొఖంలో స్పష్టంగా తెలుస్తున్నది.

దాంతో మంజుల సంతోషంగా ఆదిత్యసింహుడికి అభివాదం చేసి అక్కడనుండి వెళ్ళిపోయింది.

మంజుల వెళ్ళి పోయిన తరువాత బయట ఉన్న అందరు లోపలికి వచ్చారు.

ఆదిత్యసింహుడు రాజయ్య వైపు చూసి, “రాజయ్యా…ఇక నీవు ఈ రోజు నుండి రమణయ్య గారి అనుచరుడిగా నిన్ను మా గూఢచారిగా నియమిస్తున్నాను,” అన్నాడు.

అది విన్న రాజయ్య ఆనందంతో, “ధన్యవాదాలు ప్రభూ….నా ఊపిరి ఉన్నంత వరకు మీకు నమ్మినబంటుగా ఉంటాను ప్రభూ….” అన్నాడు.

“నువ్వు వెళ్ళి బయట ఉండు…నేను ప్రభువుల వారితో మాట్లాడి వస్తాను,” అని రాజయ్య వైపు చూసాడు రమణయ్య.

“అలాగే నండి,” అని రాజయ్య ఆదిత్యసింహుడికి, రమణయ్యకు అభివాదం చేసి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు.

తరువాత కొద్దిసేపు ఆదిత్యసింహుడు, రమణయ్య మంజుల తెచ్చిన లేఖను ఉపయోగించాలో చర్చించిన అనంతరం రమణయ్య తన ఆసనం మీద నుండి లేచి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి, “ఇక నాకు సెలవు ఇప్పించండి ప్రభూ… తొందరలోనే మీకు శుభవార్తతో మిమ్మల్ని కలుసుకుంటాను,” అన్నాడు.

“అలాగే….కాని ఈ కార్యం మాత్రం చాలా జాగ్రత్తగా జరగాలి…..,” అన్నాడు ఆదిత్యసింహుడు.

“అది మీరు వేరే చెప్పాలా ప్రభూ……చాలా జాగ్రత్తగా కార్యం పూర్తి చేస్తాను,” అని రమణయ్య అక్కడనుండి వెళ్ళిపోయాడు.

అలా రమణయ్య వెళ్ళిన కొద్దిసేపటికి కాపలాదారుడు వచ్చి, “ప్రభూ…..మహామంత్రి పూర్ణయ్య గారు మీ దర్శనం కోసం బయట ఉన్నారు,” అన్నాడు.

“ఆయన ఎప్పుడు వచ్చినా వెంటనే లోపలికి పంపించమని చెప్పాను కదా,” అని ఆదిత్యసింహుడు తన ఆసనంలో నుండి లేచి గబగబ బయటకు వచ్చి అక్కడ నిల్చున్న మహామంత్రి పూర్ణయ్యకి ఎదురెళ్ళి నమస్కారం చేసి, “మీరు నన్ను కలవడానికి అనుమతితో అవసరం లేదు పూర్ణయ్యగారు…..మీరు మాకు పితృ సమానులు…..నాకు సలహా కాని, నన్ను మందలించే అధికారం కాని మీకు ఎల్లప్పుడు ఉంటాయి,” అని ఆయన్ను లోపలికి తీసుకువచ్చి అక్కడ ఆసనంలో కూర్చోబెట్టాడు.

[Image: rajat001.jpg]


ఆదిత్యసింహుడు తన పట్ల చూపిస్తున్న మర్యాదకు పూర్ణయ్య ఉబ్బితబ్బిబ్బైపోయాడు….చాలా ఆనందపడిపోయాడు.

ఆయన మొహంలో ఆనందం చూసి ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వుకుని, “చెప్పండి మంత్రిగారు…..మీరు నన్ను కలవడానికి ఇంత శ్రమ తీసుకుకుని రావల్సినంత పని ఏమొచ్చింది,” అన్నాడు.

పూర్ణయ్య ఆదిత్యసింహుడి వైపు చూసి, “నా గూఢచారులు మీ వదిన స్వర్ణమంజరి సమావేశం గురించి ఒక ముఖ్య సమాచారం తీసుకొచ్చారు,” అన్నాడు.

ఆదిత్యసింహుడు ఏమీ తెలియనట్టు, “ఏం సమాచారం తీసుకొచ్చారు మంత్రి గారు,” అని అడిగాడు.
పూర్ణయ్య ఆదిత్యసింహుడి మాటల మీద నమ్మకం కుదరక అతని వైపు అనుమానంగా చూస్తూ, “ఈ విషయం నీకు తెలియదంటే నాకు నమ్మశక్యంగా లేదు ఆదిత్య…” అని మళ్ళీ ఆదిత్యసింహుడుతో, “సరె…నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు నాకు అత్యంత ఆప్తుడవు కాబట్టి చెబుతున్నాను…మీ వదిన స్వర్ణ మంజరి నీ పట్టాభిషేకం ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నది…అంతేకాక తనకు అత్యంత నమ్మకమైన మంజుల భర్తని ఒక రాచకార్యం మీద ఎక్కడికో పంపిస్తున్నది….నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి,” అన్నాడు.
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 04-10-2019, 06:48 PM



Users browsing this thread: 12 Guest(s)