Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక ప్రేమకథ... by sindhukumari
#26
ఫోన్ లిఫ్ట్ చేయగానే, "నిన్ను కలవాలి.." అన్నాడు.
"ఎక్కడికి రావాలి..?" అన్నా.
తను, "మా ఇంటికి రా.." అన్నాడు.
నేను రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళా... అంకుల్, ఆంటీ నన్ను బాగా రిసీవ్ చేస్కున్నారు. వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పాక ఆర్యన్ వచ్చి నన్ను తన రూమ్*కి పట్టుకెళ్ళాడు... రూమ్లోకి అడుగుపెట్టగానే తను నన్ను గట్టిగా పట్టుకుని, "నా లైఫ్ లో జరుగుతుందో లేదో అనుకున్న విషయాన్ని ఇంత త్వరగా ఎలా చేయగలిగావు..?" అని కళ్ళలో నీళ్ళతో అడిగాడు.
"సారీ ఆర్యన్... ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను," అని ముందుగా తనకి సారీ చెప్పి, "అయినా... నీకేనా సర్ప్రైజులు ఇవ్వడం తెలుసు, నాకు తెలుసు..." అని నవ్వుతూ అన్నాను.
"అసలు... ఇదంతా... ఎప్పుడు... ఎలా... జరిగింది?" అని తను అడిగాడు.
"అసలిదంతా మా వినాయకుని చలవ... ఆయన మహిమ వల్లనే అంకుల్ ని కలుసుకోగలిగాను... తర్వాత మిమ్మల్ని అందరినీ కలపగలిగాను..."
"అసలు ఏం జరిగింది?" అన్నాడు తను మళ్ళీ...
"రెండు నెలల క్రితం మనిద్దరినీ internship కోసం సెలక్ట్ చేసారు కదా... అది చెప్పిన రోజు నేను చాల కోపంతో ఉన్నాను... అప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదుగా... సారీ!" అన్నాను నేను.
"హ్మ్... చెప్పు," అన్నాడు తను.
"ఆరోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ వినాయకుడి గుడి ముందు ఆగి, 'ఏంటి ఇలా చేసావు, స్వామీ!' అని మనసులో అనుకున్నా... అప్పుడే రోడ్ సైడ్ ఒక యాక్సిడెంట్ అయ్యింది... దగ్గరికి వెళ్తూ ఆంబ్యులెన్స్ కి ఫోన్ చేసా... అక్కడ రక్తంతో తడిసి ఉన్న ఒకతన్ని పట్టుకుని లేపి హాస్పిటల్ కి తీస్కెళ్ళి అడ్మిట్ చేసాను. అప్పాకి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పా... అవసరమైతే బ్లడ్ కూడా డొనేట్ చేసాను... కాసేపట్లో అప్పా వచ్చారు, దేవుడి దయవల్ల ఆయన 'ఔట్ ఆఫ్ డేంజర్' అని డాక్టర్ చెప్పారు. అప్పా కూడా 'I am proud of you రా... తల్లీ!' అని నా నుదుటిమీద ముద్దుపెట్టుకున్నారు.
మళ్ళీ మన ఇంటర్వ్యూకి అని నేను డ్రెసెస్ తీసుకుందామని షాపింగ్ కి వెళ్ళానా... ఆ రోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆయన ఉన్నారు అక్కడ... తనే వచ్చి నన్ను పలకరించారు.. ఆరోజు తనకి హెల్ప్ చేసినందుకు thanks చెప్పారు... నేనూ casual గా అతని హెల్త్ డిటెయిల్స్* అడిగా... అలాగే నా ఇంటర్వ్యూ సంగతి కూడా చెప్పాను అతనికి.
తర్వాత ఆయన నన్ను తన ఇంటికి పిలిచారు... నేను 'తర్వాత వస్తాను' అన్నా నన్ను తన ఇంటికి పట్కెళ్ళారు...
అక్కడికి వెళ్ళాక నువ్వు ఆంటీ ఉన్న pics చూసాక అర్ధమయ్యింది, అతను మీ ఫాదర్ అని...
అయినా, ఏమీ తెలీనట్టు, 'ఈ ఫొటోలో ఉంది ఎవరు అంకుల్?' అని... 'my wife and my son' అని చెప్పారు... అలా చెప్తున్నప్పుడు ఆయన గొంతులో గర్వం తొణికిసలాడింది.
'వాళ్ళు ఎక్కడ అంకుల్... బయటకు వెళ్ళారా?' అని అడిగాను నేను. 'లేదమ్మా.. నేను.... వాళ్ళకి దూరంగా ఉంటున్నా...' అని ఆయన చెప్పారు. 'ఎందుకు అంకుల్... వాళ్ళకి మీరంటే ఇష్టం లేదా..?' అన్నాను నేను..
'నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం' అన్నారు ఆయన.
'మరి... మీకు వాళ్ళంటే ఇష్టం లేదా?' అని, 'అయినా... ఇష్టం లేకపోతే వాళ్ళ ఫొటోస్ ఉంచుకోరుగా...!' అన్నాను నేను.
ఆయన నావైపు చూస్తూ, 'ఇష్టమా...! ప్రాణం అమ్మా... వాళ్ళు నాకు. కానీ, అంతా నా ఖర్మ... నేను చేసిన తప్పుల వల్లే నాకీ గతి పట్టింది...' అని, 'చిన్నప్పుడు వాడు గొప్పవాడు కావాలని ఎన్నో కలలు కనేవాడ్ని... వాడు కూడా అలానే ఉండేవాడు. కానీ, వాడిమీద అతి ప్రేమతో.. అతి జాగ్రత్తతో... ఉండే నాతో ఎవరైనా వాడి గురించి చెడుగా చెప్తే తట్టుకోలేకపోయేవాడ్ని.. వాడు ఎక్కడ చెడిపోతాడో అనే భయంతో వాడిని కొట్టేసేవాడ్ని... తర్వాత అవన్నీ అబద్ధాలు అని తెల్సినా.. నేను వాడితో తప్పుగా ప్రవర్తించాననే గిల్టీతో వాడిని దగ్గరికి తీసుకోలేకపోయేవాడ్ని... అదే మా ఇద్దరి మధ్యా దూరం పెంచేసింది. వాడు ఫస్ట్ వచ్చాడని మెచ్చుకుంటే దానివల్ల వాడికి గర్వం పెరిగి ఎక్కడ చదువుమీద ఏకాగ్రతని కోల్పోతాడేమో అని మెచ్చుకొనేవాడ్ని కాదు... కానీ, మనసులోనే ఎంతో మురిసిపోయేవాడ్ని...
వాడికి కావల్సినవి అన్నీ అందించాలని ఎంతో తాపత్రయపడుతూ ఉండేవాడ్ని... అందుకే, హై శాలరీ జాబ్స్ కోసం వెదుకుతూ ఆ ప్రయత్నంలో వాళ్ళకు దూరముగా ఉండేవాడ్ని... నా వైఫ్ కి నేనంటే ఎంతో ఇష్టమమ్మా.. అయినా, నేను వాడి మంచి కోసం వాడ్ని హాస్టల్లో జాయిన్ చేసి తనని నాతో ఉండమని అడిగినప్పుడు తను కూడా వాడి కోసం నాకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. తనతో గొడవపడి కోపంతో అక్కడికి వెళ్ళడం మానేసాను. అదే మమ్మల్ని ఇలా దూరం చేసేసిందమ్మా...' అన్నారు అతను.
'అదేంటి అంకుల్ అలా అంటారు... మీరు చేసిందంతా తన మంచి కోసమే కదా...' అని, ' ఇప్పటికైనా వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చుగా...!' అన్నా..
'గతంలో నేను వాళ్ళతో ఎంత కఠినంగా ఉన్నానో తల్చుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తోంది... ఇప్పుడు వాళ్ళ దగ్గరకి వెళ్ళటానికి నాకు మొహం చెల్లట్లేదు. అందుకే, ఇలా ఫొటోస్ తో కాలక్షేపం చేస్తూ వాటిలోనే వాళ్ళని చూస్కుంటున్నా...' అన్నారు.
అక్కడ్నుంచి వచ్చేసిన తర్వాత, 'మిమ్మల్ని ఎలా కలపాలి?' అని అనుకున్నా... మామూలుగా అంకుల్ తో 'వెళ్ళి ఓసారి వాళ్ళని కలవండి...' అంటే అతను వెళ్ళి కలుస్తారో లేక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక ఎక్కడికైనా వెళ్ళిపోతారో అని భయమేసింది. అందుకే, మిమ్మల్ని సడన్*గా కలిపేద్దామని అనుకుని ఇంటర్వ్యూలో సెలక్ట్ అయినందుకు అన్నట్టుగా కావాలనే పార్టీ ఎరేంజ్ చేసి మా ఇంట్లో అందరం కలుసుకునేలా ప్లాన్ చేసా..." అన్నా..
"నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావ్.." అంటూ ఆర్యన్ ఇంకా ఆ షాక్ లోనే ఏదేదో మాట్లాడేస్తూ ఏడుస్తున్నాడు..
నేను తన ముఖాన్ని నా దగ్గరికి తీసుకుని తన పెదాలపై ఓ ముద్దుపెట్టాను. కాసేపు అలా ఉన్నాక తనతో, "నా పెదాలపై ఎప్పుడూ ఉండే చిరునవ్వుని నీ పెదాలపై సంతకం చేసా.. ఇక ఎప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉండాలి.. అస్సలు ఏడ్వకూడదు.." అన్నా...
తను నవ్వాడు... నేను కూడా నవ్వుతూ తనని గట్టిగా పట్టేస్కున్నాను.
★★★
ఆర్యన్ కోరుకున్నట్టే వాళ్ళ డాడీ తనని దగ్గరికి తీస్కున్నారు... నేను ఎంతో ఇష్టపడ్డ వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసుండే అవకాశం నాకు దొరికింది.
లైఫ్ ఇంత పెర్ఫెక్ట్ గా ఉంటుందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. నిజంగా.. I am a gifted soul... ఈ క్రెడిట్ అంతా నేను మా అప్పాకి and బాబాజీకి ఇస్తాను... ప్రతీ సెకండ్ నాకు వెన్నంటే ఉండి నా లైఫ్ ని ఒక బ్యూటిఫుల్ world గా మార్చుకోడంలో వాళ్ళే కీ రోల్ ప్లే చేసారు...
నా ఫస్ట్ లవ్ ఎప్పటికి మా అప్పానే అవుతారని ఆర్యన్ కి కూడా చెప్పేసా... తను కొంచెం కూడా insecure అవ్వలేదు.. 'Aaryan is the best son and the best boyfriend..!!'
తెలుసా...?
ఆర్యన్ ఇప్పుడు నాతో లైఫ్ షేర్ చేస్కోడమే కాదు... నాతోపాటు ఫిల్టర్ కాఫీ షేర్ చేస్కోడానికి కూడా రెడీ అయ్యాడు.
"అంత కష్టపడి అలవాటు చేస్కో వద్దు..." అని నేను అంటే, "నీకు నచ్చినవి ఏవైనా అవి నాకూ నచ్చుతాయి..." అని చెప్పాడు...!!
So, altogether నా లైఫ్ సూపర్బ్!!
ఆ internship రెండు నెలలు నా లైఫ్ ని ఎంతలా మార్చేసాయో కదా అని ఈ రోజుకీ అనుకుంటాను నేను.
మనకి suitable కారు అనుకున్న వాళ్ళు కూడా మనకి ఎంత బాగా సెట్ అవుతారో తెల్సుకున్నాను.
మనకి కనిపించినట్టుగా అందరూ ఉండరనీ... లైఫ్ ఎప్పుడూ ఓపెన్ బుక్ లా ఉండదని తెలుస్కున్నాను.
నా లైఫ్ ని 'ఒక' అందమైన 'ప్రేమ కధ'గా మల్చిన నా ఫేవరేట్ దేవుడు వినాయకునికి ఎప్పుడూ thanks చెప్పుకుంటూ ఉంటాను.
So, ఫ్రెండ్స్.... ఇది.... నా లవ్ స్టోరీ. మీకు నచ్చుతుందని అనుకుంటూ...

మీ శిశిర ఆర్యన్.
[+] 5 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ఒక ప్రేమకథ... by sindhukumari - by Milf rider - 02-10-2019, 09:12 PM



Users browsing this thread: 3 Guest(s)