Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక ప్రేమకథ... by sindhukumari
#25
Next day వెళ్ళి వాళ్ళ మమ్మీని కలిసాను. ఆంటీ చాల ఫ్రెండ్లీ... నన్ను చాల బాగ రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు, ఆవిడ కూడ నాలాగే ఫిల్టర్ కాఫీ fan..
ఇంకాతర్వాత బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం మేము.
నేను ఆర్యన్ రూమ్ చూసాను. చాల క్రియేటివ్ గా డెకరేట్ చేసుంది... తను రాసిన కవితలన్నీ చదివాను, తను గీసిన బొమ్మలు కూడ చూసాను. ఆంటీని అడిగి తన చిన్నప్పటి విశేషాలూ తెలుసుకున్నాను.
ఆంటీ మోర్ దేన్ హ్యాపీ నన్ను చూసి... "వస్తూవుండమ్మా..." అని చెప్పారు. నేను ఆవిడకి నమస్తే చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను.
మనం ఇష్టపడే వ్యక్తిని మన వాళ్ళు accept చెయ్యడం, వాళ్ళ ఇంట్లోవాళ్ళకి మనం నచ్చడం చాల సంతోషాన్నిస్తాయి...
మేము ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లో ఉన్నాము...

Two days off తర్వాత మా కాలేజీకి మేము తిరిగి వెళ్ళిపోయాం... కానీ, ఇంతకుముందులా కాదు, ఇప్పుడు మేం ఒకరికొకరం సపోర్టుగా ఉన్నాం. డౌట్స్, డిస్కషన్స్, గ్రూప్ స్టడీ... అన్నింటిలో చాల హెల్దీ కాంపిటీషన్ ఉండేది మా ఇద్దరి మధ్యలో... అలా, హ్యాపీగా మా బీ. టెక్ కంప్లీట్ చేసాం. ఇద్దరికీ మంచి రెప్యూటెడ్ MNCలో placements కూడ వచ్చాయి...

ఆరోజు మా కాల్ లెటర్స్ వచ్చాయి.. నేను సూపర్ హ్యాపీ... ఇద్దరికీ మా ఊరిలోనే జాబ్, అన్నిటికీ మించి అప్పా, అమ్మ నా దగ్గరే ఉంటారు; నేను వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఈ హ్యాపీనెస్ ని మా రెండు ఫ్యామిలీస్ వాళ్ళం సెలబ్రేట్ చేసుకోడానికి అందరం మా ఇంట్లోనే కలిసాం... హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నాం... అమ్మా ఇంకా ఆంటీ లంచ్ ప్రిపరేషన్స్ లో పడ్డారు... ఆర్యన్ అప్పాతో తన ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు... నేను కాసేపు వాళ్ళతో మరికాసేపు వీళ్ళతో గడిపాను... తర్వాత అందరం లంచ్ చేయటానికి రెడీ అవుతున్నాం...
ఇంతలో, మా కాలింగ్ బెల్ మోగింది.
"ఆర్యన్... ఎవరో వెళ్ళి చూడవా..!" అని చెప్పాను నేను.
తను డోర్ తీయడానికి వెళ్ళాడు... మా స్వీటీ నా తలమీద ఓ మొట్టికాయ వేసి, "తనకి పనులు చెప్తావేంటే..!" అంది.
"అబ్బా.. స్వీటీ! ఏం కాదు, ఆర్యన్ కి ఓ గిఫ్ట్ ఇస్తున్నా... ప్లీజ్... సైలెంట్!" అని సిగ్నల్ ఇస్తూ అన్నా...
ఆర్యన్ డోర్ ఓపెన్ చేసాడు...
"డాడీ.....!" అంటూ అలా చూస్తూ ఉండిపోయాడు తను.
నేను వెళ్ళి ఆర్యన్ పక్కన నిలబడి, "రండి అంకుల్... లోపలికి రండి..." అన్నా...
ఆయన ఆశ్చర్యంగా మా వంక చూస్తూ లోపలికి వచ్చారు.
"నేనూ ఆర్యన్ క్లాస్ మేట్స్, అంకుల్," అని అతనికి క్లారిఫై చేసాను.
ఆయన ఒక నవ్వు నవ్వి, "కంగ్రాచ్యులేషన్స్ అమ్మా..." అంటూ ఫ్లవర్ బొకే నా చేతికి ఇచ్చారు.
"నాకేనా అంకుల్.... తను కూడా సెలెక్ట్ అయ్యాడు," అన్నాను.
అంకుల్ ఆర్యన్ వైపు తిరిగి, "కంగ్రాచ్యులేషన్స్..." అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి ఇచ్చారు...
ఆర్యన్ ఇంకా ఏం జరుగుతుందో అర్ధంకాక షాక్ లో ఉన్నాడు... వాళ్ళ నాన్నని చూసిన ఆనందంలో తనకి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి...
అప్పుడే ఆంటీ కూడా వంటింట్లో నించి వచ్చారు. అంకుల్ ని చూసి షాకై అలా చూస్తూ ఉన్నారు...
అంకుల్ కూడా ఆర్యన్ వైపు ఇంకా ఆంటీ వైపు అలా చూస్తూ ఉన్నారు, ఏమీ మాట్లాడకుండా...
అతని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టా... స్వీటీ అంకుల్ కోసం వాటర్ పట్టుకొచ్చింది... నేను అప్పా, అమ్మ మధ్యన చేరి, వాళ్ళ భుజాలమీద చేతులు వేసి, "అంకుల్... మా అమ్మా, నాన్నా.." అని చెప్పాను.
అమ్మ అతనికి వాటర్ ఇచ్చింది... అంకుల్ దాన్ని తాగకుండా అలా మా అందరి వైపు చూస్తున్నారు...
నేను అతని దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్ళపై కూచుని, "Sorry, అంకుల్... మనఫ్యామిలీ అంతా కలుసుకోవాలనే ఇలా చేసా.. అంతే తప్ప ఇంకే ఉద్దేశ్యం నాకు లేదు," అన్నా...
ఆయన నా తలపై చెయ్యివేసి నిమిరి నించున్నారు... ఆర్యన్ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకున్నారు.
"కంగ్రాట్యులేషన్స్... my dear son..." అన్నారు.
ఆర్యన్ కూడా ఆయన్ని గట్టిగా పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు. తర్వాత, అంకుల్ ఆర్యన్ని ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరి చేతులని పట్టుకుని, "నన్ను క్షమించండి, ఇకపై మనం అందరం కలిసే ఉందాం... ఓకేనా..!" అన్నారు.
ఆంటీ కూడా ఏడుస్తూ అంకుల్ ని పట్టేస్కున్నారు... అప్పా, అమ్మా ఆశ్చర్యంగా జరిగేదంతా చూస్తున్నారు.
ఆంటీ నన్ను దగ్గరికి తీసుకుని ఆర్యన్ పక్కన నించోబెట్టి, "వీళ్ళిద్దరినీ ఆశీర్వదించండి... ఒకర్నొకరు ఇష్టపడుతున్నారు..." అని చెప్పింది.
నేనూ, ఆర్యన్ అంకుల్ కాళ్ళపై పడ్డాం.. అంకుల్ తన చేతిని మా తలపై ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంచారు... తర్వాత మమ్మల్ని లేపి, ఆర్యన్ వైపు చూస్తూ, "ఆర్యన్... ఇప్పటి వరకూ నువ్వు సాధించింది ఒకెత్తు... కానీ, శిశిరలాంటి మంచి పిల్లని మన ఫ్యామిలీ లోకి తీసుకొస్తున్నావ్... I am proud of you, my son..." అంటూ ఆర్యన్ని దగ్గరికి తీసుకుని తన నుదుటిమీద ముద్దుపెట్టుకున్నారు.
"మీకు అసలు శిశిర ఎలా తెలుసండీ!" అని మా స్వీటీ అంకుల్ ని అడిగింది.
అందుకు అంకుల్ సమాధానం చెప్పబోతుండగా, "తర్వాత అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం.. ముందు పదండి, ఆకలేస్తుంది నాకు," అన్నా...
అందరం కలసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసాం...
వాళ్ళు బయల్దేరేముందు ఆంటీ నా రూమ్ కి వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని, "ఇన్నాళ్ళ మా బాధనీ ఒక్కరోజులో తీర్చేసావమ్మా..." అని మెచ్చుకుని నా నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి అప్పా, స్వీటీ నా దగ్గరికి వచ్చారు. "ఇంకా నువ్వు చిన్నపిల్లవే అనుకున్నా.. పెద్దదానివి అయిపోయావురా..!" అన్నారు అప్పా.
"నీలో ఇంత మెట్యూరిటీ ఉందని ఇప్పుడే తెలిసింది," అంది స్వీటీ.
ఆర్యన్ని హ్యాపీగా ఉంచుదామని నేను చేసిన పని ఇంతమందిని హ్యాపీగా ఉంచుతుందని అస్సలు అనుకోలేదు నేను!!
నేనలా ఆలోచిస్తుండగా నా మొబైల్ మోగింది... ఆర్యన్ ఫోన్ చేస్తున్నాడు
Like Reply


Messages In This Thread
RE: ఒక ప్రేమకథ... by sindhukumari - by Milf rider - 02-10-2019, 09:11 PM



Users browsing this thread: 1 Guest(s)