Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక ప్రేమకథ... by sindhukumari
#23
ఆర్యన్... మన లగేజ్? అసలేం జరుగుతోంది?" అని అడిగాను నేను.
"ఇదిగో నీ ఫిల్టర్ కాఫీ, వన్ లాస్ట్ టైం ఎంజాయ్* చెయ్. మళ్ళీ ఇక్కడికి రాగలమో లేదో..!" అన్నాడు తను.
"ఒహ్హో... ఇది మనం రైల్వే స్టేషనులో కూడ కొనుక్కునేవాళ్ళం కదా..!" అంటూ తీసుకున్నాను నేను.
"రైల్వే స్టేషన్ మైలాపూర్ లో లేదు కదా మరి," అన్నాడు తను చిన్నగా నవ్వుతూ...
"ఇది మైలాపూర్ ఫిల్టర్ కాఫీనా...?" అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాను నేను.
"హా... నీకోసమే మైలాపూర్ నుంచి తెప్పించాను. పాపం సెల్వమణి! నేనడిగానని అంత దూరం వెళ్ళి మరీ తెచ్చాడు," అన్నాడు.
నేను చాల హ్యాపీగా ఫీలయ్యా... తనకి నేను మైలాపూర్ వెళ్ళి కాఫీ తాగాలి అని ఒకసారి చెప్పింది ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాడని...
కాఫీ తాగేసి... "హ్మ్... ఇంక వెళ్దాం," అన్నాను.
"పద," అంటూ సైకిల్ ఎక్కాడు తను.
"సైకిల్ మీదా..?" అడిగాను నేను.
"IIT - Chennai, pollution free campus... ఇక్కడ సైకిల్స్ రెంట్ కి ఇస్తారు. నాకు నీతోపాటు సైకిల్ మీద వెళ్ళాలని ఉంది, రావా ప్లీజ్..." అన్నాడు బతిమాలుతున్నట్టు ఫేస్ పెట్టి.
"ఇది కూడ సెల్వమణే తెచ్చాడా పాపం..!" అని అడుగుతూ సైకిల్ ముందర రాడ్ మీద కూర్చున్నాను నేను.
"ఊహు.. అన్నీ తనకే చెప్తే బాగోదు కదా... అందుకే కృష్ణన్ కి చెప్పాను," అన్నాడు తను నవ్వుతూ. నేను కూడా నవ్వేసా...
"ప్రతి ఫ్రెండూ అవసరమేరా...!" అని హమ్ చేసాను.... తను కూడా నాతో హమ్మింగ్ లో జాయిన్ అయ్యాడు.
ఇద్దరం కొంతసేపయ్యాక మెయిన్ గేట్ రీచ్ అయ్యాం. తమిళ్ తంబీలకి థాంక్స్ చెప్పాను... అక్కడ్నుంచి మమ్మల్ని రైల్వే స్టేషన్ కి అజయ్ డ్రాప్ చేసాడు. ఫైనల్లీ, మా వూరు వెళ్ళే ట్రెయిన్ కోసం వెయిట్ చేస్తున్నాం... announcement విన్నాం... మరికొద్దిసేపట్లో మేమున్న ప్లాట్ఫారంకి వస్తుంది అని...
ఇది నిజంగా చాల sweetest experience నా లైఫ్ లో...'ఒక్క నిముషం కూడా ఉండలేను వీడితో' అనుకున్న వ్యక్తితో జీవితాంతం కలిసుండాలి అనేంతగా నా ఆలోచనల్ని మార్చేసిన ఈ రెండునెలలు చాల హాయిగా గడిచిపోయాయి...
మా ట్రెయిన్ వచ్చింది, మేం వెళ్ళి సెటిలయ్యాం...
అజయ్ మా ట్రెయిన్ కదిలే వరకు ఉన్నాడు...
మేం తనకి బాయ్ చెప్పాము... వచ్చేటప్పటి జర్నీలా కాదు, ఈసారి మేము క్లోజ్ అయ్యాం కాబట్టి బోల్డన్ని మాటలు మాట్లాడుకున్నాం...
క్యాంపస్ లో తీసుకున్న ఫొటోస్ అన్నీ చూస్కుని అక్కడి మెమొరీస్ అన్నిటిని తల్చుకుంటున్నామ్మేము...
"రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నాను, అప్పా నాకోసం రైల్వే స్టేషన్ కి వస్తారు, త్వరగా వెళ్ళిపోతే బాగుండును..!!!" అని అన్నాను నేను.
"మనం ఊరు వెళ్ళాక, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా... అమ్మకి పరిచయం చేయడనికి," అన్నాడు తను.
"నువ్వు కూడ మా ఇంటికి రావాలి... అమ్మా, అప్పా, నా కిట్టు ఇంకా నా రూం అన్నీ చూద్దువుగానీ.." అన్నాను నేను.
"కిట్టు అంటే?" అన్నాడు తను.
"కిట్టు, మా కుక్క... చాల క్యూట్ గా ఉంటుంది. ఉండు చూపిస్తా..." అని ఫోన్ లో ఉన్న కిట్టూ ఫొటోని చూపించాను.
"చాలా చిన్నది... నిజంగానే క్యూట్ గా ఉంది.." అన్నాడు తను.
"హా... దానికి 4 months అంతే... నేను గొడవచేసి మరీ కొనిపించుకున్నాను... అసలు ముందు అయితే అమ్మ ఒప్పుకోలేదు... కానీ, అప్పా నా మాట కాదనరు కదా... సో, తీసుకున్నాం. ఇప్పుడైతే మా ఇద్దరికన్నా అమ్మనే దాన్ని ఎక్కువ ముద్దుచేస్తోంది.." అన్నాను నేను.
నేను చెప్పిందంతా విని తను నవ్వాడు. ఇంకొన్ని కబుర్లు, పాటలు, కవితలతో రాత్రయిపోయింది. ఇద్దరం ఎవరి బెర్తుల మీద వాళ్ళం నిద్రపోయాం...
తెల్లవారేసరికి, ఆర్యన్ ఫిల్టర్ కాఫీతో నాకు good morning చెప్తూ నిద్రలేపాడు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగాను; తనకి share ఇద్దామని అనుకున్నాను గానీ, తను 'నో' అంటాడని తెల్సు కాబట్టి ఇంక ఆఫర్ చెయ్యలేదు. జస్ట్ Thanks చెప్పాను, అంతే...
కొంచెంసేపయ్యాక మా destination వచ్చింది.. ఇద్దరం దిగాం.
అప్పా already వచ్చి నాకోసం ప్లాట్*ఫాంమీద వెయిట్ చేస్తున్నారు. ఆర్యన్ చెయ్యి పట్టుకుని ట్రెయిన్ దిగాను నేను.
అప్పాని చూడగానే, తనని, లగేజ్ ని వదిలేసి అప్పా దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాను...
"అప్పా... I am back!" అంటూ వెళ్ళి గట్టిగా పట్టేస్కున్నాను... వెళ్ళేప్పుడు ఎన్ని కన్నీళ్ళు వచ్చాయో గుర్తులేదుగానీ, అప్పా దగ్గరికి తిరిగొచ్చేసాను అనే ఆనందంతో చాలనే కన్నీళ్ళు వచ్చాయి.
ఆనందభాష్పాలు అంటారే, అవన్నమాట... అప్పాని చూసి ఆయనతో మాట్లాడుతూ ఆర్యన్ కూడ నాతో వచ్చాడనే విషయమే మర్చిపోయాను.
"ఆర్యన్ ఏడి?" అని అప్పా అడిగేదాకా గుర్తురాలేదు నాకు.
"వచ్చాడు... నా లగేజ్ తో సహా తనని వదిలేసి మిమ్మల్ని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చేశాను," అని జవాబిచ్చాను నేను.
"పిచ్చి పిల్లా... పద," అని నా తల నిమురుతూ అన్నారు ఆయన. ఇద్దరం వెనక్కి వెళ్ళాం.
ఆర్యన్, పాపం...ఇద్దరి లగేజ్ మోసుకుంటూ నడిచి వస్తున్నాడు.
"సారీ బాబు... నేను తీసుకుంటాను, ఇలా యివ్వు," అని అప్పా నా trolly హాండిల్ తీసుకున్నారు.
"పర్లేదు అంకుల్... శిశిరకి మీరుంటే ఇంకెవరూ గుర్తురారు," అని నవ్వుతూ అన్నాడు. మాటైతే నవ్వుతూ అన్నాడు కానీ, నాకు మాత్రం తను నన్ను దెప్పినట్టు అనిపించింది... నేను నవ్వాను అంతే..
"పద తల్లీ.. అమ్మ నీకోసం ఎదురుచూస్తుంది ఇంటి దగ్గర," అన్నారు అప్పా...
"హ్మ్..." అన్నాను నేను.
"నువ్వు రేపు మాయింటికి లంచ్ కి రా బాబు," అని ఆర్యన్ని invite చేసారు ఆయన.
'వస్తాను' అన్నట్టుగా ఆర్యన్ నవ్వుతూ తల ఊపాడు... తర్వాత నేను అప్పా మా ఇంటికి, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం.
Like Reply


Messages In This Thread
RE: ఒక ప్రేమకథ... by sindhukumari - by Milf rider - 02-10-2019, 09:07 PM



Users browsing this thread: 1 Guest(s)