Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక ప్రేమకథ... by sindhukumari
#22
ఇద్దరం మేడం దగ్గరికి వెళ్ళాం.. ఆవిడ మాకు సర్టిఫికేట్స్ ఇచ్చారు..
"Good work both of you," అని మెచ్చుకున్నారు కూడా...
మేము కొన్న గిఫ్ట్ 'n' కార్డ్ ఆవిడకి ఇచ్చాము...
"Thank you for mentoring us, madam... knowingly or unknowingly... మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేసుంటే, kindly forgive us," అని చెప్పాం.
ఆవిడ నవ్వుతూ, "Forgive me if I hurted you..." అన్నారు.
"No, madam, not at all... this is a wonderful experience to work with you... you helped us alot with your suggestions, ma'am.." అన్నాను.
తను మమ్మల్ని వాళ్ళ ఇంటికి డిన్నర్ కి invite చేసారు... మేము ఈవెనింగ్ వెళ్ళిపోతున్నామని చెప్పాం... సో, లంచ్ కి రమ్మన్నారు.
మేము 'సరే' అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాం... మా labలో and మేము రోజూ లంచ్ చేసే Cafetariaలో అన్ని ప్లేసెస్ లో ఫొటోస్ తీసుకున్నాం...
లంచ్ టైం అయ్యింది కాబట్టీ మేడం వాళ్ళ స్టాఫ్ రెసిడెన్స్ కి వెళ్ళాం...
మేడం నవ్వుతూ మమ్మల్ని లోపలికి invite చేసారు... మాకు వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళారు.
మేము లివింగ్ రూంలో కూర్చున్నాం... అక్కడ షెల్ఫ్ లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి... నేను వాటి దగ్గరికి వెళ్ళి నించుని చూస్తున్నాను... ఇంతలో ఆవిడ వచ్చారు, వాటర్ తీసుకుని... "Thanks.. madam," అని గ్లాస్ తీసుకున్నాను నేను...
"పిక్స్ చాల బాగున్నాయి మేడం.. ఈ అబ్బాయి చాల అందంగా మీలానే ఉన్నాడు," అన్నాను ఒక పిక్ చూపించి...
"తను మా అబ్బాయి శిశిరా... మీ ఏజ్ నే తను కూడా... ఇప్పుడు మీలానే B. Tech చదువుతుండేవాడు," అన్నారు ఆవిడ.
"చదువుతూ ఉండేవాడు ఏంటి మేడం?" అన్నాడు ఆర్యన్, సోఫాలోంచి లేచి మా దగ్గరికు వస్తూ...
"He is no more, Aaryan... 2 years back బైక్ ఏక్సిడెంట్లో చనిపోయాడు," అన్నారు ఆవిడ.
"Sorry madam," అన్నాం ఇద్దరం.
"That's alright," అన్నారు, చిన్నగా కన్నీళ్ళు పెడుతూ...
మేము ఆవిడ దగ్గరకి వెళ్ళాం... తను మా ఇద్దరి తలపై ఆశీర్వదిస్తున్నట్టుగా చెయ్యివేసి, "అయినా... నాకు మీరంతా పిల్లలే కదా...." అన్నారు, కన్నీళ్ళు తుడుచుకుని నవ్వుతూ.
మేము కూడా నవ్వాం...
"పదండి, లంచ్ చేద్దాం," అన్నారావిడ.
అలా లంచ్ కోసం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత చాల కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసాం అందరం కలిసి...
ఎప్పుడూ సీరియస్*గా, ప్రొఫెషనల్ గా ఉండే మేడం మొహంలో ఆరోజు నవ్వుని చూసాను. ఇంకా మాకు dishes వడ్డిస్తున్నప్పుడు చాల కేరింగ్ గా... ప్రేమతో వడ్డించారు. ఎంతైనా హోమ్ ఫుడ్ టేస్ట్ వేరు కదా...
అన్నీ ఆవిడ మాకోసం స్వయంగా చేసారు, half-day లీవ్ తీసుకుని మరీ...! ఆవిడ మామీద చూపించిన అభిమానానికి చాల ఆనందం కలిగింది నాకు...
లంచ్ తర్వాత కొంచెంసేపు కూర్చుని మాట్లాడుకున్నాం... మేడంకి తెలుగు కూడా వచ్చు కాబట్టీ ఆర్యన్ చెప్పిన కొన్ని కవితలు విని ఆవిడ ఎంజాయ్* చేసారు.
"నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, ఆర్యన్... నువ్వు మంచి రైటర్ వి అవుతావ్, ట్రై చేస్తే..." అన్నారావిడ.
"Thank you, madam. కానీ, నా లైఫ్ లో వేరే goals ఉన్నాయి... రైటింగ్ నాకొక రిలీఫ్ అంతే, అదే passion కాదు," అన్నాడు తను.
"నీ goals అన్నీ నువ్వు definiteగా achieve చెయ్యాలి," అని bless చేసారు ఆవిడ. "ఇంకా మీ పెళ్ళికి నన్ను పిలుస్తారా..?" అన్నారు మేడం.
నేను ఆశ్చర్యంగా ఆవిడవైపు చూసాను... ఆవిడ నవ్వుతూ మా వైపు చూసి, "నాకు అంతా తెలుసు... Nice couple మీరిద్దరూ..." అన్నారు.
నేను కొంచెం సిగ్గు పడుతూ ఉన్నా...
ఆవిడ నా దగ్గరికి వచ్చి, "పిలుస్తారుగా...!" అన్నారు.
"హ్మ్... తప్పకుండా... మేడం," అన్నాను.
"ఇంక మేం వెళ్తాం మేడం," అన్నాం.
"సరే... మ్...ఆగండి ఒక్క నిముషం," అని లోపలికి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత 2 packets తీసుకుని బయటకి వచ్చారు.
"ఇదిగో... ఇవి తీస్కోండీ," అన్నారు.
మేము ఆ కవర్స్ ఓపెన్ చేసి చూసాం...
ఆర్యన్ కి ఒక డ్రెస్ ఇంకా నాకు శారీ ఉన్నాయి అందులో...
కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి నాకు... "మేడం.." అని తన కాళ్ళపై పడబోయాం ఇద్దరం... ఆవిడ మమ్మల్ని ఆపి తనకు దగ్గరగా తీసుకొని, "All the best... and... I wish you all the success in your future..." అని మమ్మల్ని ఆశీర్వదించారు.
అక్కడి నుంచి ఇంక బయల్దేరుతున్నాం... తను నన్ను దగ్గరకు తీసుకుని నుదుటిమీద ముద్దుపెడుతూ, "అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి..." అని మా ఫోన్ నంబర్స్ తీసుకున్నారు.
"తప్పకుండా మేడం..." అని, 'Bye' చెప్పేసి ఆవిడ blessings ని మరోసారి తీసుకుని హాస్టల్స్ కి బయల్దేరాం...
ముందురోజు night నే మా టీం మేట్స్ తో డిన్నర్ ఎంజాయ్* చేసాం కాబట్టీ, మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యడానికి అవ్వకపోయినా పెద్దగా బాధ అనిపించలేదు మాకు. మా హాస్టల్స్ నుంచి లగేజ్ అంతా తీసుకుని అక్షయ కేంటీన్ దగ్గరకి వచ్చేసరికి అజయ్ తన కార్ తో పాటు అక్కడ వెయిట్ చేస్తున్నాడు.
"నేను డ్రాప్ చేస్తా మిమ్మల్ని..." అన్నాడు తను.
"Send-off ఇవ్వడానికి వచ్చావా..?" అని అడిగాను నేను.
"హా.." అన్నాడు తను.
వన్ లాస్ట్ టైం ఇక్కడి ఫిల్టర్ కాఫీ తాగాలని అనిపించింది... కానీ, ఆల్రెడీ అజయ్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టీ ఏం మాట్లాడలేదింక.
లగేజ్ అంతా కార్ లో పెట్టేసి స్టార్ట్ అవ్వబోయాం... ఇంతలో, "ఆర్యన్..." అన్న పిలుపు వినబడింది. చూస్తే మా ఇద్దరు తమిళ్ టీం మెంబర్స్ వస్తున్నారు.
"ఆర్యన్... నువ్వు చెప్పినట్టే ఫిల్టర్ కాఫీ 'n' సైకిల్ రెడీ," అని ఒకరు సైకిల్ కీస్ and ఇంకొకరు ఫిల్టర్ కాఫీ ఆర్యన్ చేతిలో పెట్టారు.
"ఏం జరుగుతోంది?" అని confused గా మొహంపెట్టి అడిగాను నేను.
వాళ్ళు స్మైల్ ఇచ్చి, "ఆర్యన్ చెప్తాడులే..." అనేసి అజయ్ తో పాటు కార్ ఎక్కి మా లగేజ్ తీస్కొని వెళ్ళిపోయారు.
"Come soon... we will be waiting at the main gate," అని అజయ్ కార్ లో నుంచి అరుస్తూ వెళ్ళిపోయాడు.
Like Reply


Messages In This Thread
RE: ఒక ప్రేమకథ... by sindhukumari - by Milf rider - 02-10-2019, 09:05 PM



Users browsing this thread: 1 Guest(s)