Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక ప్రేమకథ... by sindhukumari
#21
మేము బైటకి వెళ్లి ఆవిడకోసం వినాయకుడి ఐడల్ కొన్నాం.....వుడ్ తో చేసినది.......దాని కార్వింగ్స్ అన్ని చాలా బాగున్నాయి....చూడగానే మాకు ఇద్దరికీ నచ్చేసింది........సో కోనేసాం.. ఆర్చీస్ లో కార్డు కూడా తీస్కున్నాం.......Thanks or being our mentor అని రాసుంది ఆ కార్డు లో.. మేమిద్దరం దాన్లో సైన్ చేసాం..... ప్యాకింగ్ చేయిన్చేసి రిటర్న్ బైల్దేరాం....ఒక ఆటో తీస్కుని.......

అలా ఇద్దరం ఆటో లో తిరిగి మా కాంపస్ కి వెళ్తున్నాం.....దార్లో ఒక దగ్గర మొక్క జొన్న పొత్తులు అమ్ముతున్నారు......నాకు మొక్కజొన్నపొత్తులు తినాలని అనిపించింది......స్టాప్ స్టాప్ అన్నాను వెంటనే.....ఆటో అతను స్లో చేసాడు..... అతను ఆపేలోపే ఆటో దిగేసి జొన్నపొత్తుల దగ్గరకి వేల్తంకి పరిగెడ్తున్నాను నేను.నేను దిగి పరిగెడ్తుంటే ఆర్యన్ నా పేరు బిగ్గరగా అరవడం వినిపించింది నాకు.....తనే వస్తాడులే అని తిరిగి చూడకుండా జొన్నపొత్తులు అమ్ముతున్నదగ్గరకి వెళ్లి ఆ అవ్వతో మాట్లాడుతున్నాను.అంతే నన్ను మాట్లాడనివ్వకుండా నా చెయ్యి పట్టుకుని ఆటో దగ్గిరకి ఈడ్చుకెళ్ళాడు ఆర్యన్..........

"అరేయ్.. కొనుక్కుని వస్తా " అన్నాను నేను.
"పిచ్చానీకు.. ముందు వెనక చూస్కోవ?కొంచెం సేపుంటే ఏమయ్యేదో తెల్సా అసలు"అని గట్టిగా కళ్ళు ఎర్రచేసి అరిచేసాడు ఆర్యన్.......

ఎప్పుడూ కనీసం గట్టిగా కూడా మాట్లాడని ఆర్యన్ నా మీద అలా అరిచేసేప్పటికి నా కళ్ళ లో నీళ్ళు వచ్చేసాయి.........

"ఏడవకు..తగుల్తాయింక నీకు .అంటూ చెయ్యి ఎత్తాడు.......తను ఎప్పుడు నాతో అలా behave చెయ్యలేదు...నా దుక్ఖం ఆపుకోవడం నావల్ల కాలేదు.... ఎక్కు ఆటో "అన్నాడు తను అదే సీరియస్ టోన్ తో.
"నా జొన్నపొత్తు మరి"అన్నాను ఏడుపు ఆపుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్ళతో నేను ఆటో ఎక్కుతూ......
తను వెళ్లి జొన్నపొత్తు తెచ్చాడు ..నేను తీస్కోబోతుంటే,నీక్కాదు నాకు అంటూ తను నా పక్కన కుర్చుని తింటున్నాడు ......
"నీకు కావాలంటే కొనేదాన్ని గా....నాకు ఎందుకు కొనకుండా నువ్వే కొనుక్కుని తింటున్నవ్ "అన్నాను నేను కళ్ళు తుడ్చుకుంటూ..
"నీకు పనిష్మెంట్.......ఇవ్వను..నేనే తింటాను.."అన్నాడు కోపంగా......
నాకు ఒక్క గింజ కూడా ఇవ్వలేదు....మొత్తం తనే తినేసాడు......నేను అలా బిక్కమొహం వేస్కుని కూర్చున్నాను....

కాంపస్ కి వచ్చేసాం ..ఎవరి హాస్టల్ కి వాళ్ళు వేల్లిపోయం.... Asusual గా లైబ్రరీ దగ్గర కల్స్కున్నాం ఫ్రెష్ అయ్యాక..........

ఇద్దరం సైలెంట్ గా కూర్చున్నాం..
"నువ్వు మాన్స్టర్ వి ..నీకు అసలు కోపమే రాదనుకున్నాను.. కాని నువ్వు చాలా కోపిస్టివి అని అర్ధమయింది"అన్నాను నేను.
"ఇంకో సారి రన్నింగ్ వెహికల్ నుంచి ముందు వెనక చూస్కోకుండా దిగి చూడు.....నిజం గా మాన్స్టర్ ని చూస్తావ్ "అన్నాడు తను ఇంకా అదే సీరియస్ పేస్ తో....నాకు మళ్లీ నీళ్ళు తిరిగాయి....ఎప్పుడు ఎవరి చేత ఒక్క మాట కూడా పడలేదు.....ఇలా కోపంగా కూడా చూడలేదు.....ఇలా ఒక్కసారి తను నా మీద సీరియస్ అవ్తున్నాడు........
"పో.....నేను వెల్తునా.....నువ్వు ఇంకా అరుస్తున్నావు "అంటూ లేచాను నేను..
"హా వెళ్ళు..ఇది నీకోసం కొన్నాను..తీస్కుని వెళ్ళు"అంటూ నా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి మొక్కజొన్నపొత్తు నా చేతిలో పెట్టాడు......

"హాఅయ్.....జొన్న పొత్తూ...... కొన్నావ....మరెందుకు మాన్స్టర్ లాbehave చేస్తావ్.."అంటూ అది తీస్కుని మళ్లీ తన పక్కన కూర్చున్నాను.......

"జస్ట్ లో కార్ గుద్దేసేది శిశిర నిన్ను.. లక్కీ గా ఏం అవ్వలేదు....లేదంటే..అమ్మో ఊహించడానికే కష్టంగా ఉంది"అన్నాడు తను.
నేను నా తల తన భుజం మీద పెట్టి..జొన్నపొత్తు తింటూ.. "చారీ" అన్నాను.
"చూస్కో శిశిర,మన లైఫ్ ఎప్పుడు మన ఒక్కరిదే కాదు,మన పి ఎన్నో ఆశలు పెట్టుకున్నవాలది కూడా,మనకి ఏమైనా ఐతే ఆ పెయిన్ అనుభావిన్చేవాళ్ళు ,మనవాళ్ళు అందరిదును"అన్నాడు తను నా తల మీద చెయ్యివేసి.
"అబ్బ.. సరే..సారీ అన్నాను గా .. ఈసారి నుంచి కేర్ఫుల్ గా ఉంటాను."అన్నాను నేను.
"హ్మ్మ్...అన్నాడు తను అదే సీరియస్ పేస్ తో.....
"బాబు నవ్వరా.....ప్లీజ్....నిన్ను నేను అలా చూడలేను" అన్నాను....
ఇంకా తను అలానే ఉన్నాడు....
"వెంటనే లేచి రెండు చెవ్వులు పటుకుని గుంజీలు తేయటం స్టార్ట్ చేశా.......సారీ....సారీ..."అంటూ
తను నన్ను ఆపి
"ఏం వద్దు....ఇకపయ్ ఇంకేప్డు అలా చెయ్యకు.....నీ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళకోసం ఆలోచించి....జాగ్రతగా ఉండు" అన్నాడు.....
"సరే...అన్నాగా....ఇకనన్న నవ్వరా బాబు" అన్నాను
"హ్మ్మ్ "...అంటూ చిన్న చిరునవ్వు నవ్వాడు.....
ఆరోజు జరిగిన ఇన్సిడెంట్ నాలో ఆలోచన తెచ్చింది....ఇకనన్న నేను నా childish behaviour ని తగ్గించుకోవాలి అని..........
అలా ఇంకొంచెంసేపు అక్కడ గడిపాం......తర్వాత రూం కి వేల్పోయ..బాగ్స్ అన్ని ప్యాక్ చేస్కుని నెక్స్ట్ డే ఈవెనింగ్ తిరిగి వెళ్ళిపోడానికి తయారయ్యి .. హాయిగా నిద్ర పోయాను.తెల్లవారింది.. ఒక విధంగా ఈ రెండు నెలలు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పొందాను అని హ్యాపీ గా ఉంది...at the same time,ఈ కాంపస్ ని వదిలేసి వెళ్ళాలి అంటే బాధగా కూడా ఉంది..రెడీ అయ్యి ఇద్దరం అక్షయ కాంటీన్ లో టిఫిన్ చేసి మా డిపార్టుమెంటు కి వెళ్ళే బస్సు ఎక్కాం...... నేను కిటికీలో నుంచి బైటకి చూస్తూ మేము ఇద్దరం ఈ కాంపస్ లో అడుగుపెట్టిన రోజునుంచి జరిగిన అన్ని మూమెంట్స్ ని గుర్తుచేస్కున్తున్నాను.." "హ్మ్మ్...ఈరోజు ఇక్కడ తుఫాను వచ్చేట్టుంది "అన్నాడు ఆర్యన్....
తన మాటలకి నా ఆలోచన ల నుంచి బయటకి వచ్చి చూసా......
"అలా అన్నవెం...బయట ఎండ గానే ఉంది గా .....తుఫాను వచ్చే సూచనలు ఏం లేవే "అన్నాను
"ఏమో మరి ..నా మేడం గారు ఎందుకో అంత సైలెంట్ గా ఉన్నారు....ఈరోజు అందుకే అలా అనిపించింది నాకు? "అన్నాడు తను.
నేను తన భుజం మీద చిన్నగా కొడ్తూ
"నేను చాల మిస్ అవ్తాను ఈ రెండు నెలల ని "అన్నాను నేను.
"నేను కూడా "అన్నాడు తను మెల్లగా..
ఇద్దరం బస్సు దిగాం..నేను తను బస్సు దగ్గర నించుని Selfiee తీస్కున్నాం .. నేను ఇక్కడ్నుంచి వెళ్ళేప్పుడు అన్ని మెమోరీస్ ని వెంట తీస్కేల్లాలి అనుకున్నాను అందుకే ఒక్కటి కూడా వదల కుండా అన్ని ఫొటోస్ తీస్కున్తున్నాను.. నా రూం నుంచి ఈ బస్సు వరకు అన్ని ఫొటోస్ తీస్కున్నాను.......


______________________________
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఒక ప్రేమకథ... by sindhukumari - by Milf rider - 02-10-2019, 09:03 PM



Users browsing this thread: 2 Guest(s)