Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#28
ఆమె భార్య కాదు.. సొంత అక్కనే.. ఎనిమిదేళ్ల తరువాత బయటపడింది.. కానీ..!!


[Image: 1112488229f88fb872d8710aeaf53ed579dc5362d.jpg]


 మనకు తెలియకుండానే పొరపాట్లు జరిగిపోతాయి. అలా పొరపాటు జరిగిపోయిన తరువాత ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉంటుంది. దిద్దుకునే పొరపాటైతే ఏదోలా దిద్దుకోవచ్చు. సరిదిద్దుకోలేని పొరపాటైతే.. దాన్ని అలా కంటిన్యూ చేయడం తప్పించి మరొకటి చేయలేము. ఓ భార్యాభర్తలు జీవితంలో సరిదిద్దుకోలేని పొరపాటు ఒకటి చేశారు. అది పొరపాటు అని తెలియకుండా జరిగిపోయింది.

అందులో వారి తప్పులేదు. కానీ, విషయం తెలిసిన తరువాత వారు విపరీతంగా బాధపడ్డారు. ఇప్పుడు భయపడుతున్నారు. కారణం ఏంటి.. వారు చేసిన ఆ తప్పు ఏంటి.. తెలుసుకుందాం. ఇంగ్లాండ్ లో నివసించే 24 ఏళ్ల ఓ యువకుడు గత ఎనిమిదేళ్లుగా ఓ అమ్మాయితో కలిసి సహజీవనం చేస్తున్నాడు.

ఆమే తనకంటే వయసులో ఒక ఏడాది పెద్ద. సంవత్సరం క్రితం ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకోలేదు.

చెప్పాలి అంటే ఇద్దరు ఆనాధలే కావొచ్చు. అలా ఇద్దరు కలుసుకోవడం.. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడటంతో కలిసి ఉండి అర్ధం చేసుకొని సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా, ఆమె ఇప్పుడు గర్భవతి. ఈ విషయంలో తండ్రిగా ఆనందపడాలి. కానీ, ఇప్పుడు బాధపడుతున్నారు. భయపడుతున్నారు. కారణం ఏంటి అంటే.. ఆ ఇద్దరు ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. ఆ విషయం ఇద్దరికి తెలియదు. ఓరోజు ఒకరి కుటుంబం గురించి మరొకరు తెలుసుకునే సమయంలో తెలియకుండా ఇద్దరు ఒకే తండ్రి పిల్లలుగా తేలిపోయింది. డీఎన్ఏ టెస్ట్ చేయించారు. అందులోను అదే తేలింది.
ఇప్పుడు ఆమె గర్భవతి కావడంతో.. భయపడుతున్నారు. పుట్టబోయే పిల్లవాడు జన్యుపరంగా ఆరోగ్యంగా ఉంటె ఈ విషయాలను బయటపెట్టరు.. కానీ పుట్టే పిల్లలు జన్యులోపంతో పుడితే.. దానికి చట్టాలు కఠినంగా ఉంటాయి. డాక్టర్లు విషయాన్ని బయటపెట్టాలి. దాంతో కేసు కావొచ్చు. జీవితం పాడైపోవచ్చు. ఏం చేయాలో తెలియడం లేదని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో తన గోడును వెళ్లబోసుకున్నారు. అయితే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తప్పకుండా అన్ని సర్దుకుంటాయని వైద్యులను సంప్రదించి మందులు వాడమని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ఇదీ సంగతి@ (Xossip to Xossipy)? - by Milf rider - 30-09-2019, 08:12 PM



Users browsing this thread: 3 Guest(s)