Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#13
అందానికి పడిపోతాడు..

మగాడు అందానికి పడిపోతాడు .
కానీ అతని మనసును దోచుకోవడానికి భార్య విషయంలో అందం ఒక్కటే సరిపోదు.

నిజానికి, మన దగ్గరలేని వాటికోసం నిరంతరం పోరాటం చేస్తుంటాం. అవి లభ్యమైన తర్వాత అది సాధారణంగా మారిపోతాయి.

అందువల్ల భర్తతో బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి మహిళ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుండాలి.



పెళ్లయిన కొత్తలో..

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య శారీరక ఆకర్షణ వారిని ఒకరికొకరిని కట్టి పడేస్తుంది.

రోజులు గడుస్తున్న కొద్దీ ఆకర్షణ తగ్గుతుంది.

దాన్ని ప్రేమ కిందికి, ఒకరినొకరు పట్టించుకునే కిందికి మారాలి.


అతను అక్కడ, ఆమె ఇక్కడ ..

పురుషుడు తన పనిలో మునిగిపోతుంటాడు. మహిళ ఇంటి పనులు, పిల్లలను సాకడంలో మునిగిపోతూ ఉంటుంది.

ఇద్దరు పరస్పరం కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. ఈ విషయాన్ని ఇరువురు కూడా పట్టించుకోకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది.

దాంతో ఇరువురి మధ్య బంధం బలహీన పడుతుంది.

అందువల్ల మహిళ ఎల్లవేళలా భర్తను మహిళ కనిపెట్టుకుని ఉండాలి. అతని పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండాలి.


బుద్ధిని కేంద్రీకరించాలి..

ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావడం వల్ల దృష్టి కేంద్రీకరించి చేయలేకపోవడంతో పనుల్లో నాణ్యత తగ్గుతుంది.

జీవితంలో కూడా అదే జరుగుతుంది.

మహిళ కూడా చాలా పనులు చేయాల్సి రావడం వల్ల భర్తను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తుంది.

పడకగదిలో కూడా తాను చేయాల్సిన పనుల గురించే అలోచిస్తుంది. దాంతో లైంగిక జీవితంపై దాని ప్రభావం పడుతుంది.

పడకగదికి వెళ్లిన తర్వాత అన్నీ మరిచిపోయి భర్తకు సుఖాన్ని అందించడానికి సిద్ధపడాలి.

బహుమతి ప్రదానం .

ప్రేమ చంద్రుడిలాంటిదంటారు.
పెరగడం మానేసినప్పుడు తగ్గుతుంది.

ప్రేమ సంబంధాలను పెంచుకోవడానికి ఎల్లవేళలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి.

ప్రేమ కబుర్లతో, బహుమతులతో భర్తను ఆకట్టుకోవడానికి మహిళ ప్రయత్నించాలి. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది.


భాగస్వామికి ప్రాధాన్యం

ఎల్లవేళలా భర్తను గౌరవించాలి.
అవమానించే రీతిలో మాట్లాడడం సరి కాదు.
దానివల్ల సంబంధాలు దెబ్బ తింటాయి.

అన్ని సంబంధాల కన్నా భర్తతో సంబంధమే ముఖ్యమనే పద్ధతిలో వ్యవహరించాలి.

అతని హృదయాన్ని సంతోషపెట్టడమే కాకుండా అతని కామవాంఛను కూడా తీర్చాలి.


కలిసి సంతోషపడాలి..

రతిక్రీడలో భర్తతో పాటు సమానంగా మహిళ ఆనందం పొందితే ఇరువురి మధ్య సంబంధం గట్టి పడుతుంది.


సాకులు చెబుతూ లైంగిక క్రీడకు దూరంగా ఉండవద్దు .


బాస్*లా కాకుండా...

బాస్*లా కాకుండా మహిళ తన భర్తతో భాగస్వామిగా వ్యవహరించాలి.
కొంత మంది మహిళలు సేవకుల్లా వ్యవహరిస్తారు. అది సరి కాదు.

ప్రతి విషయంలోనూ అతనితో సమానంగా వ్యవహరిస్తూనే గౌరవించే విధంగా ఉండాలి.

అతని కష్టసుఖాల్లో తనకూ భాగం ఉందనే పద్ధతిలో మహిళ వ్యవహరించాలి.


అతని కోసం వస్త్రధారణ..

మహిళ తన పురుషుడి కోసం ప్రత్యేకంగా దుస్తులు ధరించాలి.
సాయంత్రం వేళలో అతని కోసమే అన్నట్లుగా సిద్ధపడాలి.

తాజాదనంతో అతనితో పడక మీదికి చేరుకుంటే అతనికి ఎంతో ఆనందంగా ఉంటుంది.

రతిక్రీడకు ముందు తలుపులకు గొళ్లెం పెట్టాలి. ఎవరూ అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి.


కమ్యూనికేష్ గ్యాప్ వద్దు..

భర్తతో కమ్యూనికేషన్ గ్యాప్ మంచిది కాదు.
ఇరువురు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి.

నెగిటివ్*గా ఆలోచించడం మానుకోవాలి.
ప్రేమ, అనుమానం కలిసి ప్రయాణం చేయలేవు.


అందువల్ల ఇద్దరు పరస్పర విశ్వాసంతో వ్యవహరించాలి.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 05:43 PM



Users browsing this thread: 3 Guest(s)