Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit
#11
సాఫ్ట్*వేర్ ఫీల్డ్ వల్ల కూడా..

సాఫ్టవేర్ బూమ్ వల్ల, ఇతర వృత్తుల్లో మితిమీరిన పోటీతత్వం వల్ల, నిత్యం పనిలో పెరుగుతున్న ఒత్తిడి వల్ల భార్యాభర్తలు రోజులో కలిసి ఉండే సమయం తగ్గుతోంది.

దీంతో వారిరువురి మధ్య అనుబంధం గట్టిపడడం లేదని చెబుతున్నారు.


కలిసి ఉండే సమయం ఏది..

భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుండడంతో ఇరువురు తమ సమస్యలను, సంతోషకర క్షణాలను పంచుకునే సమయం క్రమంగా తగ్గిపోతున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.


ఓ సర్వేలో ఇలా..

రోజులో తాము కలిసి ఉండే సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమేనని ఇటీవల బ్రిటన్*లో దంపతుల సమయంపై జరిగిన ఓ సర్వేలో పలువురు చెప్పారు.


ఆధునిక ప్రపంచంలో..


పని ఒత్తిడి, విశ్రాంతి సమయం తగ్గడంతో లైంగిక జీవితంలో జడత్వం చోటు చేసుకుంటోంది.
దీంతో ఐరోపా, అమెరికాలో, జపాన్ తదితర పారిశ్రామిక దేశాల్లో సంతానోత్పత్తి కరువై జనాభా పెరుగుదల తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.


ఆసియా దేశాలు నయమే..

జడత్వం కారణంగా సంభవించే దుష్పరిణామాలు ఆసియా దేశాలకు ఇప్పటికిప్పుడే వర్తించక పోయినా దంపతుల జీవితంలోని అతి ముఖ్యభాగమైన లైంగిక సంబంధాలు తగ్గిపోతున్నాయని తేలింది.
ఇది హెచ్చరికలాంటిదే.


పొద్దున వెళ్తే, తిరిగి ఎప్పుడో..

ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయటపడితే రాత్రి ఓ పదికో పదకొండుకో ఇంటికి చేరడం అనేది ఆనవాయితీగా మారింది.

ఆఫీసులో పని గంటలు, ప్రయాణాలు కలుపుకుని చూస్తే పరిస్థితి అలాగే ఉంది.


తీరికే లేదు, ఇంకెలా..

మంచి సంగీతాన్ని ఆస్వాదించేందుకు, మంచి పుస్తకం చదివేందుకు, మార్కెట్*కు వెళ్లి వాటిని తెచ్చుకునేందుకు కూడా సమయం చిక్కడం లేదు.
వారంతాలు కూడా ఇలాగే కరిగిపోతున్నాయి.


షిఫ్టుల గోల..

ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే, భర్త ఓ షిఫ్టులో భార్య మరో షిఫ్డులో కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి.

ఒకరు ఇంటికి వస్తే, మరొకరు ఆఫీసుకు వెళ్లే పరిస్థితి.
ఇద్దరు కలుసుకుని ఒకరినొకరు చూసుకునే సమయాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి.
ఇది రతిక్రీడపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.


గాడ్జెట్లూ తినేస్తున్నాయి.

అదృష్టవశాత్తు కాస్తా సమయం చిక్కితే మన ఇంట్లో, మన చుట్టూ వచ్చి పడుతున్న హైటెక్ గాడ్జెట్లతో మన అనుబంధం పెరుగుతోంది తప్ప దంపతులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండడం లేదు.

ఒకరు టీవికి అతుక్కుపోతే, మరొకరు సిస్టమ్*కు కరుచుకుపోవడం జరుగుతోంది.
Like Reply


Messages In This Thread
RE: శృంగారంలో చిట్కాలు...by Dr.Sarit - by Milf rider - 29-09-2019, 05:32 PM



Users browsing this thread: