Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చివరగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ స్టేజి పైకి పిలిచి ఫేర్వెల్ ఫంక్షన్ లో ఏమేమి చేస్తారో అవన్నీ చేశారు . మేము కాలేజ్ లో చేసిన గొప్పతనాన్ని , చిలిపి ఆటలను జూనియర్స్ చెప్పి అందరినీ నవ్వించారు . 



టాపిక్ చెల్లి దగ్గరకు చేరుకునేసరికి 5 నిమిషాలపాటు స్టూడెంట్స్ సంతోషంతో అరుస్తూనే ఉన్నారు . చదువులో రాణించడం మరియు మహి ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ గురించి గుర్తుచేసుకొని గ్రౌండ్ మొత్తాన్ని సంతోషంతో మోతమోగించారు  .



ఒక జూనియర్ మైకు అందుకొని అక్కా మీరంటే మాకు చాలా అభిమానం . మీరు కాలేజ్ లో సంపాదించిన పేరు మరియు సాధించిన విజయాలు మా అందరికీ ఆదర్శం . కానీ మీరు ఒక్క క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాకపోవడానికి కారణం మాకు తెలుసుకోవాలని ఉంది . 



చెల్లి మైకు అందుకొని లీవ్ లో ఉండటం వల్ల అప్లై చెయ్యలేకపోయాను . కాలేజ్ కు వచ్చేటప్పటికి ఇంటర్వూస్ స్టార్ట్ అయిపోయాయి అని బదులిచ్చింది . 



అక్కా నేను మా ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ గారిని కలవడం జరిగింది . మీరు ఇంటర్వూస్ కు అట్టెండ్ కాకపోయినా one crore , two crore ..........5 crores దాకా annual సాలరీ గా ప్యాకేజీ ఇవ్వడానికి ఇండియాస్ మోస్ట్ prestigious కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిసింది అని చెప్పింది .



One crore......... no no no...... నాకే ఇప్పటివరకూ తెలియదు అని నవ్వుతూ చెల్లి బదులిచ్చింది .



అక్కా ఈ ఫైల్ దానికి సాక్ష్యం అంటూ స్క్రీన్ పై అపాయింట్మెంట్ లెటర్స్ చూపించేసరికి అందరూ ఆశ్చర్యపోయి సంతోషించారు . ఇంతటి ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు , మీరు రిజెక్ట్ చెయ్యడానికి కారణం తెలుసుకోవాలని నాతోపాటు అందరమూ కోరుకుంటున్నాము . ప్రిన్సిపాల్ గారికి చెప్పినట్లు ఫ్యామిలీ అని మాత్రం మాకు చెప్పకండి . ఎందుకంటే మీరు కాలేజ్ లో ఎంతోమందికి ఆదర్శం మీరు ఏది చేస్తే చాలామంది అది పాటించారు భవిష్యత్తులో కూడా పాటిస్తారు . మీ జీవిత గమ్యం ఏంటి , మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి , కాలేజ్ తరువాత మీరు ఏమి చేయబోతున్నారు .........అక్కా మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాము . ఫ్రెండ్స్ మీకు ఆ కోరిక లేదా అనడంతో అందరూ లేచిమరీ ఉంది ఉంది...... అని అడుగుతున్నారు . సీఎం గారు ఇంటరెస్టింగ్ అంటూ ప్రిన్సిపాల్ గారితో చెప్పి తన కోరిక కూడా అదే అన్నట్లు చెల్లి మాటల కోసం వేచి చూస్తున్నారు .



అన్నయ్యా అంటూ నావైపు తిరిగింది . కృష్ణగాడు చెల్లి దగ్గరకువెళ్లి go ahead చెల్లి అని చెప్పడం నేను నవ్వడంతో , పెదాలపై చిరునవ్వుతో సీఎం  స్టూడెంట్స్ వైపు తిరిగి ఒకే ఒక్కమాట "AGRICULTURE" అని చెప్పడంతో గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దన్గా అయిపోయింది . కొద్దిసేపటి తరువాత వ్యవసాయం ......అంటూ గుసాగుసలాడుతుండటంతో ...........yes వ్యవసాయం చెయ్యబోతున్నాము .



మా అమ్మమ్మ పల్లెలో అమ్మమ్మకు కొంత భూమి ఉంది , ఫైనల్ exams అయిన వెంటనే అమ్మమ్మా , అమ్మా ,మా అత్తయ్యా , నా ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యతోపాటు వ్యవసాయం చెయ్యడానికి వెళ్లిపోతున్నాము , 



మీలో కొంతమందికి ఇంత చదువూ చదివి వ్యవసాయమేంటి అని , sorry to say this .........డిగ్రీ పూర్తిచేసి ఇంటర్వూస్ లో సెలెక్ట్ అయ్యి ఫ్యామిలీకి దూరంగా ఉదయం నుండి రాత్రివరకూ రెస్ట్ లేకుండా ఒకరోజు ఎలా అయిపోయిందో కూడా తెలియకుండా ఆర్డర్ వేస్తే వాడు చెప్పినట్లుగా మన మనసుని చంపుకొని పనిచేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు .



సీఎం గారి ఆర్థికంగా సహాయం చెయ్యడంతో మనుగడలోకి వచ్చిన మహి ఫౌండేషన్ ద్వారా సహాయం అందగానే , ఇంత ఇంత చిన్న చిన్న పాపం పుణ్యం కూడా ఎరుగని పిల్లలు నన్ను కలవడానికి 10 km లు నడిచి మాఇంటికివచ్చారు . ఇదేదో నేను గర్వపడుతూ చెప్పుకోవడం లేదు . వాళ్ళను అన్నయ్యా నేను ఇదేమాట ఆడిగాము . ఒకే ఒక్క మాట పుట్టినప్పటి నుండి ఒక్కపూట కడుపు నిండా ఎప్పుడూ తినలేదు అక్కా , ఫౌండేషన్ ద్వారా అందిన డబ్బుతో తృప్తిగా తిన్నాము . రాష్ట్రం లో ఉన్న పిల్లలందరి తరుపున మా అక్కను కలవకపోతే మేము జీవించి వృధా అని చెప్పడంతో , నా గుండె తరుక్కుపోయి అన్నయ్య వైపు చూసాను . వెంటనే అమ్మ పిల్లలతో వచ్చిన అమ్మల సహాయంతో ఫుడ్ తయారుచేసి పిల్లలు తినేలా చేసాము. 



ఆ క్షణం ఆపిల్లలలో కలిగిన సంతోషం ఇక్కడ ఉన్న మీరందరూ ప్రత్యక్షంగా చూసి ఉంటే ........వాహ్.......ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము అని చెల్లి మురిసిపోతూ గర్వపడుతూ చెప్పింది . 



ఎక్కడి నుండో తీసుకొచ్చిన రైస్ , కూరగాయలతో వండి తినిపిస్తేనే అంత సంతోషం కలిగితే , ఎవరి కింద అది చెయ్ ఇది చెయ్ అని ఆర్డర్ తీసుకోకుండా మా పొలంలో మేమే యజమానులుగా , సేంద్రీయ ఎరువులతో ఇటువైపు అన్నయ్య , అటువైపు అమ్మా అమ్మమ్మా అత్తయ్యా సంతోషన్గా ఇష్టంతో కష్టపడి పండించిన వాటితో , వీలైనంత పిల్లల ఆకలి తీరిస్తే కలిగే ఆనందపు అనుభూతి ఎలా ఉంటుందో మీరే guess చెయ్యండి . దానిని పొందితే చాలు ఈ మనిషిగా పుట్టినందుకు ధన్యం అయిపోయినట్లే ........, అలాగే ఇప్పుడు కృత్రిమ ఎరువులు వాడటం వలన భూసారం తగ్గిపోయి సరైన ప్రోటీన్స్ , విటమిన్స్ లేని ఆహారాన్ని తింటూ రోగాలభారిన పడుతున్నారు . 



అలాకాకుండా మా అమ్మమ్మావాళ్ళు పండించినట్లుగా మొత్తం సేంద్రీయ ఎరువులతో ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని , యంత్రాలను వాడి అత్యధిక దిగుబడిని సాధించి ఒకప్పుడు దేశమంతా ప్రపంచమంతా గర్వాంగా చెప్పుకున్న "రైతేరాజు" అనేది ఒట్టిమాట మాత్రమే కాదు అదే నిజం అని నిరూపించాలనుకుంటున్నాను అనిచెప్పి పరుగున నాదగ్గరికివచ్చి నాగుండెలపై వాలిపోయింది . 



చెల్లి మాట్లాడటం మొదలెట్టిన దగ్గర నుండి పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటూ మాటలు అయిపోగానే సీఎం గారు మరియు university నుండి వచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్చరర్లు లేచి చప్పట్లు కొట్టగానే , స్టూడెంట్స్ మొత్తం స్టాండింగ్ ఓవియేషన్ తో కరతాళధ్వనులతో చెల్లిని అభినందించారు . సీఎం గారు ఏకంగా స్టేజి మీదకు వచ్చి చెల్లిని స్వయంగా అభినందించారు . అగ్రికల్చర్ లెక్చరర్ మైకు అందుకొని ఇప్పటి యూత్ టెక్నాలజీ టెక్నాలజీ అంటూ వాళ్ళ పూర్వీకులు ఇష్టంగా చేసిన వ్యవసాయాన్ని మరిచిపోవడం వలన చివరకు దేశంలో తినడానికి సరిపడా దొరకకుండా అల్లకల్లోలం అయిపోతుంది . వయసులో చిన్న అమ్మాయి అయినా సరిగ్గా చెప్పింది తల్లి నీకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పడంతో , చెల్లి కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . 



చెల్లిని అడిగిన జూనియర్ అమ్మాయిలు చెల్లిదగ్గరకు వచ్చి లవ్ యు అక్కా అంటూ ఆనందం పంచుకున్నారు , మిమ్మల్ని కొన్నిరోజులలో మిస్ అవుతున్నందుకు చాలా బాదవేస్తోంది అని మనసారా కౌగిలించుకొన్నారు. గ్రౌండ్ మొత్తం ఉద్వేగంగా మారిపోయింది . 



తరువాత ప్రోగ్రాం లో భాగంగా కామెడీ స్కిట్ అని చెప్పడంతో అందరమూ కిందకు వెళ్లి కూర్చున్నాము . చెల్లెమ్మా స్పీచ్ అధరగొట్టావు అంటూ కృష్ణగాడు సంతోషన్గా చెప్పాడు . చెల్లి ఎంతోమందిని మార్చబోతున్నావు అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేసాము . అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తరువాత సీఎం గారు మైకు అందుకొని నేను వచ్చేముందు అన్ని కాలేజ్ లలో లాగే మామూలు ఫంక్షన్ కొద్దిసేపు ఉండి వెళ్లిపోదాము అనుకున్నాను . కానీ జీవితంలో మరిచిపోలేని సంతోషమైన అనుభూతులను ఇచ్చారు , తెలుసుగా ఎవరివల్లో yes yes . నా కాలేజ్ డేస్ గుర్తుకువచ్చాయి . కాబట్టి మీతో కలిసి డిన్నర్ కూడా తిని వెళతాను అని చెప్పడంతో గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. మాట ఇచ్చినట్లుగానే ఫంక్షన్ మొత్తం స్టూడెంట్స్ తో కలిసి ఎంజాయ్ చేసి మాతోపాటు భోజనం చేసి మహేష్ టచ్ లో ఉండు అనిచెప్పి వెళ్లిపోయారు . ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తో మరియు జూనియర్స్ తో మెమోరీస్ గా ఫోటోలు దిగాము . ఇక చెల్లితో దిగడానికి కాలేజ్ మొత్తం పోటీపడింది . అర్ధరాత్రి దాటిపోయింది . 



జూనియర్స్ అందరూ క్షేమంగా ఇంటికి చేరేలా ప్రిన్సిపాల్ తోపాటు ఉండి సెక్యూరిటీ ఆఫీసర్ల సహాయం తీసుకొన్నాము . వైజాగ్ అన్ని సెంటర్ లలో సెక్యూరిటీగా ఉండి ఇంటికి చేరారని తెలిసిన తరువాత చివరగా ప్రిన్సిపాల్ , స్టాఫ్ మరియు మేము ముగ్గురమూ ఇంటికి బయలుదేరాము .చెల్లి కారులోనే నా భుజం పై వాలిపోయి నిద్రపోయింది. మేము వచ్చేన్తవరకూ అమ్మావాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు . చెల్లిని నెమ్మదిగా ఎత్తుకొనివెల్లి అమ్మ బెడ్ పై పడుకోబెట్టాను . మా బంగారం అంటూ అమ్మా అమ్మమ్మా చెల్లిని ముద్దులతో ముంచెత్తారు . 



రూమ్ బయటకువచ్చి బుజ్జికన్నా నా బంగారుతల్లి స్టేజి పై నన్ను కూడా పొగిడింది అని మురిసిపోయింది . అమ్మమ్మా మీరు వ్యవసాయం చెయ్యకపోతే మేము ఎక్కడ అని చెప్పడంతో అమ్మమ్మ నా గుండెలపై వాలిపోయి మురిసిపోయింది . అమ్మా అమ్మమ్మా ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి , వాడు చూడు నిలబడే ఎలా తూగుతున్నాడో అని చూపించాను . రేయ్ మామా రేపు మధ్యాహ్నం వరకూ లేచేది లేదు అని చెప్పడంతో నవ్వి నీ ఇష్టం రెండు రోజులు లెయ్యకు అనిచెప్పి డోర్ లాక్ చేసి వాడితోపాటు గెస్ట్ రూంలోకి వెళ్లి AC వేసి బెడ్ పై ఇద్దరమూ వాలిపోగానే నిద్రపట్టేసింది.
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2019, 10:45 AM



Users browsing this thread: 194 Guest(s)