Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మేము కూడా వెళ్లి గడ్డిలో కూర్చుని బుజ్జాయిలను ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దుచేస్తూ , ఆకలేస్తోందా బుజ్జికన్నా అని అడిగాను . అవునన్నట్లుగా ఇద్దరూ తల ఊపడం .దేవతలు తదాస్తు అన్నట్లుగా భూమిపై ఉన్న వరాలిచ్చే నిజమైన దేవత -అమ్మ తలుపు దగ్గరికి వచ్చి , కన్నయ్యా కృష్ణా పిల్లలకు వెజిటబుల్ రైస్ రెడీ అని పిలిచింది .



కృష్ణగాడు నేను ఆశ్చర్యపోతూ అమ్మా నువ్వు భువిపై ఉన్న దేవతవు అమ్మా అని ఇద్దరమూ ఒకేసారి అంటూ నవ్వుకుని , రేయ్ నువ్వు తాగడానికి వాటర్ అందుబాటులో ఉంచు , నేను రైస్ పాత్రలు బయటకు పెడతాను అనిచెప్పి అమ్మదగ్గరకు చేరుకొని , భుజం చుట్టూ చేయివేసి నవ్వుతూ కురులపై ముద్దుపెట్టి లోపలకువెళ్లి , పెద్ద పెద్ద నాలుగు పాత్రలను సులభంగా ఎత్తుకొని బయటకు తీసుకువచ్చాను . 



అంతలో చెల్లెమ్మ వచ్చి పేపర్ ప్లేట్ లు అందుకొని చూసి ఆశ్చర్యపోయి , ఒక పాత్రను ఎత్తబోయింది . ఎత్తడం దేవుడెరుగు కొద్దిగా కూడా కదలలేదు . నవ్వుతూ నావైపు చూసి రాముడూ భీముడు కలిస్తే నువ్వు అన్నయ్యా , లవ్ యు soooo మచ్ అంటూ పెద్దవాళ్ళందరమూ ప్లేట్లలో వడ్డించుకొని కూర్చున్న పిల్లలకు ఆనందించాము . తింటూ చాలా రుచిగా ఉంది అని మళ్ళీ మళ్ళీ పెట్టించుకోవడంతో , మా అమ్మ వండితే ఇలాగే ఉంటుంది . మీకు మల్లీ మళ్లీ తినాలనిపిస్తే ఒక్క కాల్ చెయ్యండి మీ అక్కయ్యే మొత్తం చూసుకుంటుంది అని చెప్పడంతో , థాంక్స్ అన్నయ్యా అంటూ కడుపునిండా తిన్నారు . పిల్లలతో వచ్చినవాళ్ళు కూడా తిన్నారు . 



 మేము థాంక్స్ చెప్పి అభినందించడానికి వస్తే ప్రేమతో ఆకలి తీర్చారు . మీరు పిల్లల కోర్కెలు తీర్చడానికే పుట్టిన దేవతలు అంటూ రెండు చేతులతో నమస్కరించారు . అమ్మా నేను కూడా ఈ పిల్లల్లో ఒకరిని అని చెప్పాను కదా అంటూ ఆపి , మనసారా కౌగిలించుకుంది. చాలా సంతోషం మహి అని పిలువగానే , చెల్లి పెదాలపై చిరునవ్వు విరిసింది . నన్ను అలా పిలవండి అని బదులిచ్చింది . పిల్లలకు కాలేజ్ సమయం అవుతోంది మీరు సెలవిస్తే వెళతాము . పిల్లలూ మహి అక్కకు టాటా చెప్పండి మనం చాలా దూరం నడవాలి అనిచెప్పారు . అక్కయ్య అమ్మ అద్భుతమైన వంటను తృప్తిగా తిన్నాము . ఎన్ని కిలోమీటర్ లయినా నడుస్తాము అంటూ చెల్లి చుట్టూ చేరి హత్తుకొని మహి అక్కా మళ్లీ ఇప్పుడు కలుస్తామో బై అంటూ బాధపడుతూ చెప్పారు . 



రేపు నేనే మీ శరణాలయానికి వద్దామనుకుంటున్నాను .......అని చెప్పిందో లేదో , పిల్లలంతా లవ్ యు అక్కా మీరు ఖచ్చితంగా రావాల్సిందే మాట ఇచ్చారు అనిచెప్పి బయటకు పద్ధతి ప్రకారం నడిచారు . అన్నయ్యలూ పిల్లలు నడుచుకుంటూ వెళుతున్నారు అని బాధపడుతూ నా చేతిని చుట్టేసి భుజం పై వాలింది .



చెల్లెమ్మా బాధపడ్డావా , ఒరేయ్ నువ్వు నవ్వుతున్నావా ..........అంటే వీడు అప్పుడే మొత్తం arrange చేసాడన్నమాట అనేంతలో మా కాలేజ్ బస్సులు 4 వచ్చి ఇంటిబయట వరుసగా నిలబడ్డాయి. 



రేయ్ మామా హాట్స్ ఆఫ్ to యు రా .........అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నాడు . చెల్లి అయ్యితే ఆనందబాస్పాలతో నావైపే కన్నార్పకుండా చూస్తూ , నా నడుము చుట్టూ రెండుచేతులు వేసి గట్టిగా హత్తుకొని లవ్ యు soooo మచ్ అన్నయ్యా అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి అదికూడా సరిపోనట్లు బుగ్గను నొప్పిపుట్టేలా కొరికేసింది . స్స్స్...........చెల్లెమ్మా........అంటూ నొప్పితో రుద్దుకోబోతుండగా , నొప్పిగా ఉందా అన్నయ్యా , లవ్ యు లవ్ యు లవ్ యు ........అంటూ కందిపోయిన దగ్గర మృదువుగా ముద్దులుపెట్టింది .



బయట బస్ డోర్ లను తెరిచి పిల్లలూ మీకోసమే మహేష్ arrange చేసాడు ఎక్కండి మిమ్మల్ని ఎక్కడ వదలమంటే అక్కడకు వధులుతాము అని చెప్పగానే , పిల్లలంతా ఒకరినొకరు చూసుకొని సంతోషంతో నవ్వుకుని , గేట్ లోనుండి ఒక్కసారిగా పిల్లలంతా అన్నయ్యా ,అక్కయ్యా ..........అంటూ పరిగెత్తుకుంటూ రావడం చూసి , ఇంకా చూస్తావే వెళ్లరా అని సైగ చెయ్యడం ఆలస్యం , చెల్లి తియ్యగా నవ్వి వారిదగ్గరికి పరిగెత్తి బుజ్జిపాపాయిని ఎత్తుకొంది . థాంక్స్ అక్కా మాకోసం బస్ ఏర్పాటుచేసినందుకు అంటూ చెల్లిని సంతోషపు చిరునవ్వులతో చుట్టుముట్టారు . మీ అన్నయ్య మీరు నడిచివెళ్తారని తెలిసి బాధపడి బస్ లు తెప్పించాడు , వెళ్లి అన్నయ్యను ముద్దులతో ముంచెత్తండి అని చెల్లి నావైపు ప్రేమతో చూస్తూ చెప్పింది . 



కొంతమంది పిల్లలు నా చుట్టూ చేరి , అన్నయ్యా కిందకు ఒంగు అని డిమాండ్ చెయ్యడం చూసి , చెల్లి గట్టిగా నవ్వుతూనే పిల్లలూ ఏమాత్రం తగ్గకండి అని చెప్పింది .చెల్లి నవ్వుని చూసి మురిసిపోతూ పిల్లల ముందు మోకాళ్లపై కూర్చున్నాను . పిల్లలు ఒకరి తరువాత మరొకరు ముద్దులతో ముంచెత్తారు . ఆ దృశ్యాన్ని చూసి చెల్లి సంతోషించి , పిల్లలూ కాలేజ్ సమయం అంటూ పాపను ఎత్తుకునే పిల్లల మధ్యలో బస్ ల దగ్గరికి వెళ్లి అందరినీ ఎక్కించాము . నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకువెళ్లండి అని చెల్లి డ్రైవర్ కు మరీ మరీ చెప్పింది . సరే మేడం అంటూ బస్ లు కదిలాయి . పిల్లలంతా టాటా అక్కయ్యా , అన్నయ్యా అంటూ కనిపించేంతవరకూ చేతులు ఊపారు . 



మనసు పులకించి పోయిందిరా .......అన్నయ్యా ......., చెల్లి రా అని పిలిచినా మధురంగా ఉంది అని నవ్వుతూ చెప్పాను . పోరా అంటూ నా చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి ముగ్గురమూ సంతోషన్గా మాట్లాడుతూ లోపలకు వచ్చాము , చెల్లెమ్మా ఆకలి వేస్తుంది అని కృష్ణగాడు కడుపు చూపించి దీనంగా అడగడంతో , నాకు కూడా అన్నయ్యా అని చెప్పింది . చెల్లి లోపల కూర్చో తెచ్చేస్తాను అని పంపించి , అంతే ఆలస్యం చెయ్యకుండా చేతులు కడుక్కొని  ప్లేట్ అందుకొని బయట ప్లేట్స్ మూసిన పాత్రలో నుండి నిండుగా వడ్డించుకొని చెల్లి ముందు వాలిపోయాను. 



రేయ్ మామా ఇవ్వరా కుమ్మేస్తాను అని చెల్లిప్రక్కనే దర్జాగా కూర్చుని రెండుచేతులు చాపాడు . నీకెవ్వరు తెచ్చారురా వెళ్ళడానికి కాళ్ళు లేవా వడ్డించుకోవడానికి చేతులు లేవా , అక్కడ ఉంది ఎంత కావాలంటే అంత వడ్డించుకొని కుమ్ముతావో నోట్లో కుక్కుకుంటావో నీఇష్టం అని చెప్పాను . అంతే చెల్లితోపాటు అమ్మావాళ్ళు కళ్ళల్లో నీళ్ళు వచ్చేన్తలో ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు . వాడు ఇంకా చేతులను అలాగే చాపి షాక్ లో ఉండటం చూసి , అమ్మ లేచి కృష్ణ నేను తీసుకువస్తాను అని బయటకు వెళుతుండగా , అమ్మా మీరు కూర్చోండి అంటూ నవ్వుతూ వెళ్లి వడ్డించుకొనివచ్చి నావైపు చిరుకోపంతో చూస్తూ , ఆకలిగా ఉన్నట్లు పిల్లలు చెప్పినట్లు చాలా రుచిగా ఉండటంతో నోట్లోకి కుక్కుకుంటున్నాడు . రేయ్ నెమ్మదిగా తిను ప్లేట్ ఏమీ ఎక్కడికీ పారిపోదు అని చెప్పాను . చెల్లి నవ్వడం ఆపలేదు . 



అన్నయ్యా చేతులు బాగాలేవు డస్ట్ అంటింది తినిపించు అని కోరడంతో , లవ్ to my లవ్లీ ఏంజెల్ అంటూ మురిసిపోతూ చెల్లికి తినిపించాను . అన్నయ్యా నువ్వు కూడా తిను అని ప్రేమతో చెప్పింది . అలాగే రా అంటూ టీ టేబుల్ పై కూర్చుని నేను ఒక ముద్ద నా నోటిలోకి పెట్టుకొని wow అమృతం అమ్మా లవ్ యు అంటూ పొగిడాను . అమ్మ మురిసిపోయింది . అన్నయ్యా ఇప్పుడు నాకు అంటూ నోరు పూర్తిగా తెరిచింది . ఇదిగో అంటూ నోటికి అందించాను . నావేళ్ళను పూర్తిగా నోటిలోకి తీసుకొని నా ఎంగిలితోపాటు అన్నం నమిలి కళ్ళుమూసుకుని ఫీల్ అవుతూ ఇప్పుడు ఇంకా రుచిగా ఉంది అన్నయ్యా , లవ్ యు అంటూ ఇద్దరమూ చెరొక ముద్ద నోటిలోకి తీసుకొని తృప్తిగా తిన్నాము. చెల్లి అన్నయ్యా ఇక చాలు అంటూ కృష్ణవైపు చూసాము . వాడు ఇంకా కుమ్ముతూనే ఉండటం చూసి నవ్వుతుండగా , ఇక్కడే తింటే నాకు మీ దిష్టి తగిలేలా ఉంది అంటూ బయటకువెళ్లాడు. రేయ్ పాత్రల్లో మొత్తం తినేవు కడుపు పగిలిపోతుంది అని వాడికి వినబడేలా చెప్పాను . నాకు తెలుసులేరా అంటూ నోట్లో ఉండగానే మాట్లాడుతుండటంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నాము.



చెల్లికి నీళ్లు తాగించి పేపర్ ప్లేట్ డస్ట్ బిన్ లో పడేసి కృష్ణ గాడితోపాటు వచ్చి సోఫాలో కూర్చుని మాట్లాడుతున్నాము . నా మొబైల్ మ్రోగడంతో చూస్తే కాలేజ్ ప్రిన్సిపాల్ నుండి సర్ మాటలకు నవ్వుతూ స్పీకర్ on చేసాను . మహేష్ మీరిద్దరూ కాలేజ్ లో లేకపోయేసరికి ఉత్సాహం హుషారు కనిపించడం లేదు , ఎప్పుడు వస్తున్నారు అని అడిగారు . వెంటనే చెల్లి మొబైల్ అందుకొని సర్ ఒక్కరోజైనా రెస్ట్ తీసుకొనివ్వరా అని చెప్పింది . Sooooo sorry మహి మీఇష్టం ఎప్పుడు కాలేజ్ కు రావాలంటే అప్పుడు రండి ,కానీ ఎక్కువ సమయం తీసుకోకండి please....... అని బ్రతిమాలారు . ఇలా అడిగారు బాగుంది సర్ వీలుచూసుకొని వస్తాము అని బదులివ్వడంతో ,థాంక్స్ ట్విన్స్ అంటూ మరొకమాట మాట్లాడకుండా కట్ చేశారు . చెల్లి ప్రిన్సిపాల్ గారినే భయపెట్టేశావు అంటూ నవ్వుకున్నాము .



అన్నయ్యా ఏదైనా ఇండోర్ గేమ్స్ ఆడదాము అని నా చేతిని చుట్టేసి ముద్దుగా అడిగింది . అయితే క్యారెమ్స్ ఆడదాము అంటూ కృష్ణగాడు సలహా ఇవ్వడంతో , చెల్లి కూడా ఆడదాము అని ఉత్సాహం చూపడంతో , ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకోవడానికి కొన్న బోర్డ్ స్టోర్ రూంలో ఉన్నట్లు గుర్తుకువచ్చి , one minuite చెల్లి అంటూ వెళ్లి స్టోర్ రూంలో 5 నిమిషాలపాటు వెతికితే చెక్కుచెదరకుండా గుడ్డచుట్టిన బోర్డ్ మరియు coins తెచ్చి శుభ్రం చేసి 4 సోఫాలు టీ టేబుల్ చుట్టూ సెట్ చేసి బోర్డ్ మధ్యలో పెట్టి , మరొకరు కావాలి అమ్మావాళ్ళంతా వంట గదిలో పాత్రలను శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడెలా అని ఆలోచించేంతలో బయట కారు చప్పుడు  దివ్యక్క మరియు అమ్మగారు బయటి నుండే మహి అని పిలవడంతో , ముగ్గురమూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుని దివ్యక్కా అంటూ బయటకు పరిగెత్తి అమాంతం కౌగిలించుకొని సరైన సమయానికే వచ్చావు అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని లోపలికివచ్చి క్యారెమ్స్ చూసి , wow చిన్నప్పుడు ఎప్పుడో ఆడాము అంటూ చెల్లిని సంతోషం పట్టలేక గట్టిగా కౌగిలించుకుంది .



కృష్ణగాడు సోఫాలో నుండి లేచి ok my డియర్ లవ్లీ ఫామిలీ , ఇప్పుడు మన దగ్గర బోర్డ్ ఉంది .......ఆడటానికి నలుగురమూ ఉన్నాము .........బాయ్స్ ఒక జట్టు గర్ల్స్ ఒక జట్టు ..............గేమ్ స్టార్ట్ చేయబోయే ముందు బెట్ ఏంటి అని అడిగాడు .



రేయ్ నీమనసులోనే ఏదో ఉన్నట్లుందిగా కక్కేయ్ అని అడిగాను . సరే నేనే చెబుతాను .......వంట గదిలోకివెళ్లి శుభ్రం చేస్తున్న నలుగురిని వెంటబెట్టుకొనివచ్చి, అమ్మావాళ్ళు ఉదయం పిల్లలకోసం , మనకోసం కష్టపడి రుచికరమైన వంట చేశారు కాబట్టి వారికి ఇప్పుడు రెస్ట్ ఇస్తూ గేమ్ లో ఎవరైతే ఓడిపోతే వాళ్ళు లోపల మరియు బయట ఉన్న dishes అన్నింటినీ శుభ్రం చేయాలి అని చెప్పాడు .



అందరమూ కొన్ని క్షణాలపాటు షాక్ లో ఉండిపోయాము . అన్నయ్యా అద్భుతమైన బెట్ చెప్పావు . నువ్వు గ్రేట్ అసలు అంటూ చెల్లి వాడి చెయ్యి అందుకొని పైకెత్తి ఈ బెట్ కు మేము రెడీ ఏమంటావు దివ్యక్కా అని అడగడంతో తను కూడా చెయ్యి ఎత్తింది . అన్నయ్యా.......అని పిలవడంతో షాక్ లోనుండి ఇంకా తెరుకోనట్లు లేచి రేయ్ మామా ఏమయ్యిందిరా నీకు తలకు ఏమైనా దెబ్బ తగిలిందా అంటూ వెంట్రుకలు లేపి చూసి ,ఏమీ కాలేదు మొత్తానికి నీకు కూడా మైండ్ మరియు అందులో ఐడియాలు ఉన్నాయని ఇప్పటికి తెలిసింది అనడంతో అందరిలో నవ్వు ఆగలేదు . లవ్ యు రా మామా సూపర్ బెట్ అంటూ వాడిని భుజాలపై లేపేసాను . ఒరేయ్ కిందపడితే ఎముకలువిరుగుతాయి ధింపరా అనడంతో దిగి , ఏదో మీ అందరి  అభిమానం అంటూ సిగ్గుపడ్డాడు . 



అమ్మా ప్రశాంతంగా కూర్చొని గేమ్ ఎంజాయ్ చెయ్యండి అంటూ కృష్ణగాడితోపాటు వెళ్లి అమ్మావాళ్లకు మా చుట్టూ కుర్చీలు వేశాము . మహి అడగడం మరిచిపోయాను ఆ పెద్దపెద్ద పాత్రలు ఏంటి అని దివ్యక్క అడిగింది . కృష్ణగాడు నేను చెబుతానుగా అక్కా అంటూ పిల్లలు గురించి మొత్తం చెప్పి చివరగా అమ్మ వంట sooooo tasty అంటూ లొట్టలేసుకుంటూ చెప్పాడు . ఒరేయ్ రోజూ నేను వండినది కూడా అలాగే తింటావు కదరా అని చెప్పింది . సోఫాలో నుండి లేచి దూరంగా వెళ్లి అక్కోవ్ నీ తమ్ముడిని కాబట్టి నువ్వు రోజూ వండుతున్న కారం ఉప్పు లేని వంటలను ఎలాగోలా తినేస్తున్నాను . పెళ్లయ్యాక బావకు పెట్టావనుకో అటునుండి ఆటే కాశీకి వెళ్ళిపోతాడు . ఇప్పటి నుండైనా రోజూ ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గర ఎలావండాలో నేర్చుకో అని చెప్పడం ఆలస్యం , రేయ్ రోజూ కష్టపడి వండితే tasty tasty అంటూ దున్నపోతులా మెక్కి ఇప్పుడు ఇలా అంటావా అంటూ చేతికి దొరికిన దానిని వాడిమీదకు విసిరింది . వెనక్కు తిరుగడంతో వీపుకి తగిలి అమ్మా ఇది చంపేసింది అంటూ వీపుపై రాసుకుంటూ వచ్చాడు . అందరమూ గట్టిగా నవ్వుతూనే ఉన్నాము . 



మహి అంత tasty గా ఉందా అంటూ నోరూరుస్తూ బయటకు పరిగెత్తి పాత్రలన్నీ చూసింది . ఖాళీగా దర్శనం ఇవ్వడంతో నిరాశగా వెనుతిరిగింది . అమ్మ ఎప్పుడు వెళ్లిందో వేడి చేసుకొని ప్లేట్ లో తీసుకువచ్చింది . చూసి అమ్మదగ్గరకు వెళ్లి లవ్ యు అమ్మా అంటూ హత్తుకొని రెండు చేతులతో అందుకొని వాసన చూసే wow అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది . అమ్మా స్పూన్ అని అడగడంతో అమ్మ వెళ్లి తీసుకువచ్చి ఇచ్చింది . స్పూన్ తో తిని wow .........అంటూ మైమరచి నిజమేరా తమ్ముడూ ..........నావీపు విరగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఫీల్ అవుతూ తింటున్నావు . లవ్ యు రా రేపటి నుండి నువ్వు చెప్పినట్లుగానే అమ్మతో వంట నేర్చుకుంటాను అని చెప్పడంతో , అమ్మ సంతోషంతో ఎక్కడికో వెళ్ళిపోయింది . 



ఊ.......... స్టార్ట్ చెయ్యండి నేను తింటూ ఆడతాను అని చెప్పింది .కాయిన్స్ ను బోర్డ్ మధ్యలో సెట్ చేసి , బెస్ట్ ఆఫ్ 3 అంటూ టాస్ వేసి గెలవడంతో మొదట కృష్ణగాడు స్ట్రైక్ కొట్టాడు . నలుగురమూ ఎప్పుడో చిన్నప్పుడు ఆడి వదిలెయ్యడం వలన గేమ్ లో పట్టు సాధించడానికి కొద్దిసమయం పట్టింది . ఒక దగ్గర గురిచూసి కొడుతుంటే మరొక దగ్గరికి స్ట్రైకర్ వెళ్లిపోతుండటం చూసి అందరూ నవ్వుకోసాగాము . అలా అలా సరదాగా ఫస్ట్ గేమ్ దివ్యక్క మహి జట్టు గెలిచింది . ఎదురెదురుగా కూర్చున్న ఇద్దరూ పైకి లేచి చేతులు కొట్టుకొని we won the first game అంటూ సంతోషంతో గట్టిగా కేకలు వేశారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2019, 10:40 AM



Users browsing this thread: 197 Guest(s)