Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సెల్‌ఫోన్‌ దొంగలను పట్టించిన హాక్‌ ఐ యాప్
#2
(13-01-2019, 01:13 PM)Vikatakavi02 Wrote: సెల్‌ఫోన్‌ దొంగలను పట్టించిన హాక్‌ ఐ యాప్‌
[Image: 12brk101a.jpg]
హైదరాబాద్‌: అత్యాధునిక సాంకేతికతను వినియోగించి హైదరాబాద్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు సెల్‌ఫోన్‌ దొంగలను పట్టుకొన్నారు. ఫోన్లు పోగొట్టుకొన్న బాధితుల ఫిర్యాదు మేరకు దొంగలను అదుపులోకి తీసుకొన్నారు. దొంగతనానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను నిందితులు పగటిపూట గుర్తించే వారు. రాత్రి పూట అక్కడ చోరీలకు పాల్పడేవారు. ఈ క్రమంలో 28 డిసెంబర్‌ 2018లో బీరంగూడ వద్ద రామచంద్రపురంలో ఉన్న బిగ్‌సీ మొబైల్స్‌ షోరూం వెనుక కన్నం పెట్టి 35 ఖరీదైన సెల్‌ఫోన్లను చోరీ చేశారు. నేడు అబిడ్స్‌ సెక్యూరిటీ అధికారి‌ స్టేషన్‌ పరిధిలో ఒక ప్రైవేటు మార్కెట్లో వీటిని విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకొన్న సెక్యూరిటీ ఆఫీసర్లు వారిని అరెస్టు చేశారు. హాక్‌ ఐ యాప్‌ ద్వారా ఈ ఫోన్లను సెక్యూరిటీ ఆఫీసర్లు గుర్తించారు.

ఈ కేసు వివరాలను సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. ప్రజలు హాక్‌ ఐ యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని మొత్తం 60 సెక్యూరిటీ అధికారి‌ స్టేషన్లకుగానూ 34 చోట్ల సీసీ కెమెరాలను వీక్షించే పీవీఎస్‌లను  ఏర్పాటు చేశామన్నారు. మరో రెండు నెలల్లో మిగిలిన స్టేషన్లలో కూడా వీటిని పూర్తి చేస్తామన్నారు. వాణిజ్య, విద్యా, వైద్య కేంద్రాల్లో సాధ్యమైనంతగా సీసీ కెమేరాల వినియోగాన్ని పెంచాలని సీపీ కోరారు.

Thanks for the sharing information.
Like Reply


Messages In This Thread
RE: సెల్‌ఫోన్‌ దొంగలను పట్టించిన హాక్‌ ఐ యాప్ - by Yuvak - 13-01-2019, 03:01 PM



Users browsing this thread: 1 Guest(s)