Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అతను వెళ్ళిపోగానే ఆదిత్యసింహుడు రమణయ్య వైపు చూసి, “ఇప్పుడు మంజులకు మనకు అనుకూలంగా చేయడం తప్పించి వేరొక దారి లేదు…ఒక వేళ మనకు ఎదురుతిరిగితే ఇక్కడ ఆమె మొగుడు, కొడుకు కడతేరిపోతారు…అది కాక తనకు ద్రోహం చేసినందుకు మా వదిన గారు మంజులను చంపేస్తుంది…అందుకని మీరు మీతో పాటు మంజులని నిరభ్యంతరంగా తీసుకెళ్ళొచ్చు…ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా?” అని అడిగాడు.

దాంతో రమణయ్య, “మీరు ఇంత నమ్మకంగా చెప్పిన తరువాత నేను అభ్యంతరం ఎందుకు చెబుతాను ప్రభూ…..,” అన్నాడు.

[Image: Emperor-Chandragupta-Maurya-I-aka-Rajat-Tokas1.jpg]

అది విని ఆదిత్యసింహుడు కాపలావాడిని పిలిచి మంజుల వాళ్ళను లోపలికి రమ్మన్నాడు.
కాపలావాడు బయటకు వెళ్ళి మంజుల వాళ్ళను లోపలికి పంపించాడు.
మంజుల, ఆమె మొగుడు, కొడుకు లోపలికి వచ్చి ఆదిత్యసింహుడికి నమస్కారం చేసి నిల్చున్నారు.
ఆదిత్యసింహుడు మంజుల మొగుడి వైపు చూసి, “నీ పేరు ఏంటి?” అని అడిగాడు.
“రాజయ్య ప్రభు,” అన్నాడు మంజుల మొగుడు.
“ఇప్పుడు ఎక్కడైనా పని చేస్తున్నావా?” అని ఆదిత్యసింహుడు అడిగాడు.
“లేదు ప్రభు…..తమరు ఏదైనా దయ తలిస్తే మీ దగ్గర కొలువు చేసుకుంటూ నమ్మినబంటుగా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను,” అన్నాడు రాజయ్య వినయంగా చేతులు కట్టుకుని.
దాంతో ఆదిత్యసింహుడు రాజయ్య వైపు చూసి ఆలోచిస్తూ ఒక సారి తల ఊపి రమణయ్య వైపు చూసి సైగ చేసాడు.
ఆదిత్యసింహుడి సైగను అర్ధం చేసుకున్న రమణయ్య మంజుల వైపు చూసి, “మంజుల…నువ్వు ప్రభువుల వారికి అనుకూలంగా చేసిన పనికి గాను నిన్ను ఆదిత్యసింహ ప్రభువుల తరుపున రాణి స్వర్ణమంజరీ దేవి గారి దగ్గర చెలికత్తెగా ఉంటూ…ఆమెకు అక్కడ జరిగే విషయాలు అన్నీ ఇక్కడ చెప్పాలి…,” అన్నాడు.

[Image: C0HTs2NWEAAgTb8.jpg]

రమణయ్య మాటలు విన్న మంజుల ఆదిత్యసింహుడి వైపు తిరిగి, “ప్రభూ…..ఈ విషయం రాణిగారికి తెలిసిందంటే నన్ను చంపేస్తారు,” అన్నది.
వెంటనే రమణయ్య మంజుల మాటను అడ్డుకుంటూ, “నువ్వు ఈ పనులు చేస్తుంన్నందుకు గాను…ప్రభువుల వారు నీ మొగుడు రాజయ్యను నా అనుచరగణంలో గూఢచారిగా చేర్చుకోవడానికి నిర్ణయించారు,” అని, ఆదిత్యసింహుడి వైపు తిరిగి, “ప్రభు…నాదొక్క మనవి,” అన్నాడు.
ఆదిత్యసింహుడు ఏంటి అన్నట్టు చూసాడు…..
“ప్రభూ…..ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఈ మంజుల మాతో రావడం కన్నా ఇక్కడ స్వర్ణమంజరి గారి దగ్గర ఉండటం ఉత్తమం అనిపిస్తున్నది….ఎందుకంటే రాణి గారికి ఈమెను మించిన నమ్మకమైన చెలికత్తె ఇంకొకరు లేదు….అదీకాక మంజుల…రాణిగారు పాల్గొనే ప్రతి సమావేశంలోను పక్కనే ఉంటుంది…దాంతో ఆమె ప్రతి కదలిక మనకు వెంటనే సంకోచం లేకుండా తెలుస్తుంది…ఈమెకు బదులుగా నేను రాజయ్యను తీసుకుని వెళ్తాను,” అన్నాడు.
దాంతో ఆదిత్యసింహుడు రమణయ్య చెప్పిన దానికి అంగీకారం తెలుపుతూ, “అలాగే చేద్దాం…..” అని మంజుల వైపు తిరిగి, “ఇక నువ్వు నీ పనిని సక్రమంగా పూర్తి చేయి…..అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలియాలి……నీకు ఏ విధమైన లోటు లేకుండా నేను చూచుకుంటాను….” అన్నాడు.
మంజుల అలాగే అన్నట్టు తల ఊపింది……
ఆదిత్యసింహుడు మంజుల వైపు చూసి, “ఇక నీవు వెళ్ళొచ్చు……నీ మీద మా వదినగారికి అనుమానం రాకుండా చూసుకో….” అన్నాడు.
“అలాగే ప్రభు…..ఇక నాకు సెలవు ఇప్పించండి…..రేపు వచ్చి అక్కడ జరిగిన విషయాలు చెబుతాను,” అని మంజుల అక్కడ నుండి తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతూ, మళ్ళి వెనక్కు తిరిగి ఆదిత్యసింహుడి వైపు చూసింది.


[Image: PCTV-1000011821-hcdl.jpg]


అది గమనించిన ఆదిత్యసింహుడు రమణయ్య ఎదో చెప్పబోతుండగా అతన్ని ఆగమన్నట్టు సైగ చేసి, మంజుల వైపు చూస్తూ, “ఏమయింది మంజులా….ఇంకా ఏమైనా మాతో చెప్పదలుచున్నావా?” అని అడిగాడు.
మంజుల ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి, “అవును ప్రభూ….ఒక్క ముఖ్య విషయం చెప్పడం మరిచిపోయాను ప్రభూ,” అన్నది.
“ఆ విషయం చెబితే మీ కార్యం ఇంకా తేలిగ్గా….తొందరగా అయిపోతుంది ప్రభూ….” అన్నది మంజుల.
అప్పటికే ఆదిత్య సింహుడుకి మంజుల మీద నమ్మకం వచ్చేసింది.
దాంతో ఆదిత్యసింహుడు మంజుల వైపు చూస్తూ, “ఏంటది….చెప్పు,” అన్నాడు.
మంజుల అక్కడే కూర్చుని ఉన్న రమణయ్య వైపు, పక్కనే నిల్చుని ఉన్న తన మొగుడు రాజయ్య వైపు చూసి, “ఈ విషయం నా మొగుడి ముందు కూడా చెప్పడానికి వీలు లేదు ప్రభు….అందుకని నేను ఈ విషయం నేను మీకు ఏకాంతంలో చెప్పాలనుకుంటున్నాను,” అన్నది.
దాంతో ఆదిత్యసింహుడు రమణయ్య వైపు చూసాడు.
అతని చూపుని అర్ధం చేసుకున్న రమణయ్య అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళబోయాడు.
కాని ఆదిత్యసింహుడు రమణయ్యను అక్కడే కూర్చోమని చెప్పి రాజయ్యను, అక్కడ ఉన్న మిగతా పరివారాన్ని బయటకు వెళ్లమని చెప్పాడు.
దాంతో అక్కడ అందరు బయటకు వెళ్ళి పోయిన తరువాత ఆదిత్యసింహుడు, రమణయ్య, మంజుల మాత్రమే మిగిలారు.
ఆదిత్యసింహుడు మంజుల వైపు చూసి, “ఇప్పుడు చెప్పు మంజుల….ఆ రహస్యం ఏమిటి?” అని అడిగాడు.
మంజుల ఆదిత్యసింహుడి వైపు చూసి, “అది ఏమిటంటే ప్రభు….నేను నా చిన్నతనం నుండి స్వర్ణమంజరి రాణిగారికి చెలికత్తెగా ఉంటున్న విషయం మీకు తెలిసిందే, కొద్ది సంవత్సరాల క్రితం నేను స్వర్ణమంజరి గారి గదిలో ఆమెకు సపర్యలు చేస్తుండగా ఆమెకు మీ అన్నయ్యగారితో వివాహం అయిన తరువాత…మీ వదిన గారు తన అన్న అయిన విక్రమవర్మగారితో ఏకాంతంగా మాట్లాడుతుండగా, మాటల సందర్బంలో మీ వదిన గారు తన అన్న గారితో తను ఏమైనా రహస్య సందేశం పంపించాలనుకున్నప్పుడు ఒక రహస్య సంకేతం చెప్పి పంపిస్తానన్నది,” అన్నది.
దాంతో ఆదిత్యసింహుడు ఆత్రంగా, “ఏమిటా సంకేతం?” అని అడిగాడు.
“ఆ సంకేత ఏంటంటే ప్రభూ…“మహాభారతంలో శకుని పాండవులకు ఆప్తమిత్రుడు” ఈ సంకేతం విక్రమవర్మ మహారాజు గారికి చెబితే మీ పని ఇంకా సులువుగా అయిపోతుంది ప్రభు…అప్పుడు రమణయ్య గారితో ఎవరు వెళ్లినా కార్యం అయిపోతుంది ప్రభూ,” అన్నది మంజుల.

(To B Continued....................)
(తరువాత అప్డేట్ 47వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=47)
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 20-09-2019, 03:06 PM



Users browsing this thread: 3 Guest(s)