Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఉదయం అందరికంటే ముందుగా లేచి చెల్లిని నెమ్మదిగా దిండుపై పడుకోబెట్టి నెమ్మదిగా గోడను పట్టుకొని బాత్రూం లోకి వెళ్లి నడుముకు మరియు చేతికి ప్లాస్టిక్ కవర్స్ చుట్టుకొని శుభ్రన్గా చాలారోజుల తరువాత తలస్నానం చేసి బట్టలువేసుకొని కాలేజ్ కు రెడీ అయిపోయి వచ్చి బెడ్ పై చెల్లిప్రక్కనే కూర్చుని తననే చూస్తున్నాను . సమయం 7 గంటలు అవుతుండగా చెల్లికి మెలకువ వచ్చి ప్రక్కనే నేను తగలకపోయేసరికి అన్నయ్యా అంటూ సడెన్ గా లేచి కూర్చుని నన్ను ఆశ్చర్యంగా చూసింది . గుడ్ మార్నింగ్ ఏంజెల్ ఈరోజు నుండి మనం కాలేజ్ కు వెళుతున్నాము , నేను రెడీ వెళ్లి రెడీ అవ్వు అను చేతితో బుగ్గలను ప్రేమతో తడిమాను . అన్నయ్యా ...........నువ్వు ఇంకా ........, నాకోసం మా చదువుల దేవత స్టడీస్ ఆగిపోరాదు , ఇక్కడైనా కాలేజ్ లోనైనా ఎక్కడైనా జాగ్రత్తగా చూసుకోవడానికి మా చెల్లి నా ప్రక్కనే ఉంటుంది కదా అనడంతో , పెదాలపై చిరునవ్వుని చూసి సంతోషిస్తూ తొందరగా వెళ్లు అనిచెప్పాను . అలాగే అన్నయ్యా అంటూ నా గుండెలపై ఒకసారి హత్తుకొని సంతోషన్గా రెడీ అవ్వడానికి వెళ్ళింది .



అమ్మా అమ్మమ్మా .........మేము కాలేజ్ కు వెళుతున్నాము టిఫిన్ రెడీ చెయ్యండి అని అరిచాను . ఇద్దరూ వచ్చి చూసి ఆనందించి ఇందు ఇక నువ్వు కూడా కాలేజ్ కు వెళ్ళవచ్చు తొందరగా వెళ్లు పాపం నీకోసం ఎంతమంది స్టూడెంట్స్ ఎదురుచూస్తున్నారో అని పంపించి , నాదగ్గరకు వచ్చి నా బంగారు బుజ్జికన్నయ్య అంటూ తలపై ప్రేమగా నిమిరింది . అమ్మమ్మా చెల్లి బ్యాగు రెడీ చెయ్యి అనిచెప్పి కృష్ణగాడికి కాల్ చేసి చెప్పాను. 9 గంటలకల్లా టిఫిన్ చేసి అమ్మ తన కాలేజ్ కు మేము చెల్లి కారులో మా కాలేజ్ కు చేరుకున్నాము .



కృష్ణగాడు మరియు నా బెస్ట్ ఫ్రెండ్స్ అంతా మాకోసమే ఎదురుచూస్తూ కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు . చెల్లి కారు దిగి నావైపుకు వచ్చి డోర్ తీసి భుజం చుట్టూ చెయ్యివేసుకొని దింపి క్లాస్ వైపుకు నడిపించింది . చెల్లెమ్మా వాడిని నాకు అందివ్వు అంటూ నాదగ్గరకు వచ్చాడు . రేయ్ పుచ్చపగిలిపోతుంది ఎవడు ఆడిగాడురా నీ సహాయం ,నీ హద్దుల్లో నువ్వు ఉండు  అని తిట్టడంతో , వాడి తలపై వాడే కొట్టుకొని ఇంట్లో అమ్మమ్మ మొత్తం చెప్పిందిగా మళ్లీ ఇద్దరిమధ్య దూరడం అవసరమా అని తిట్టుకొని మౌనంగా మా ప్రక్కనే నడిచాడు . చెల్లి మరియు వినీత్ గాడు అయితే క్లాస్ చేరేంతవరకూ నవ్వుతూనే ఉన్నారు . ప్రమీలాతోపాటు క్లాస్ మొత్తం మాకు స్వాగతం పలికి ముందువరుసలో కూర్చోబెట్టారు . అలా వారం రోజులు గడిచింది . అంటీ గాయాలు పూర్తిగా మానిపోయాయని కట్లు కూడా తీసేసింది . పూర్తిగా కోలుకున్న తరువాత కూడా కాలేజ్ కు వెళ్లినా గ్రౌండ్ మరియు కోచ్ కు కనిపించకుండా చెల్లితోనే సమయం గడిపాను . 



నెలరోజుల తరువాత ఒకరోజు కోచ్ మా బ్యాచ్ తోపాటు నేరుగా మా క్లాస్ లోకే వచ్చేసారు . మహేష్ గాయం అయ్యింది ok అందుకే నిన్ను డిస్టర్బ్ చెయ్యలేదు , పూర్తిగా కొలుకున్నావని తెలిసింది , అయినా గ్రౌండ్ వైపు అడుగుపెట్టడం లేదు , నన్ను నీ టీమ్ వాళ్లకు కూడా దూరంగా ఉంటున్నావు , రెండు నెలల్లో నేషనల్స్ సెలక్షన్ మరో నాలుగు నెలల్లో ఢిల్లీ లో నేషనల్ గేమ్స్ నా ఆశలన్నీ నీమీదనే పెట్టుకున్నాను . గాయం వలన ఇబ్బంది అయితే చెప్పు నీకోసం ప్రత్యేకంగా డాక్టర్ ను arrange చేస్తాను , వారంలో గ్రౌండ్ లో అడుగుపెట్టవచ్చు అనిచెప్పాను . అలాంటిదేమీ లేదు సర్ కొద్దిరోజుల ముందే నా గమ్యాన్ని నేను తెలుసుకున్నాను . తనను సంతోషన్గా చూసుకోవడం తప్ప మరేదానిపై నాకు ఆశ లేదు సర్ అనిచెప్పేసాను . 



సర్ కు మొత్తం అర్థమైపోయి నా చెయ్యి అందుకొని మహి నువ్వుకూడా మాతోపాటు రా అని స్పోర్ట్స్ రూమ్ కు పిలుచుకొనివెళ్లాడు . మహి మీ అన్నయ్య నీ సంతోషం కోసమే అన్నీ వదిలేసాడని తెలుస్తోంది . ఇక నీమాట తప్ప మహేష్ ఎవ్వరి మాట వినడు ఇక మీఇష్టం అనిచెప్పి బాధపడుతూ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు . అన్నయ్యా నాకోసం నీ గోల్ ను మార్చుకున్నావా ? , అంటూ నా గుండెలపై వాలిపోయి స్పోర్ట్స్ అంటే నీకు ఎంత ప్రాణమే నాకు తెలుసురా , అప్పుడంటే తెలియక ఇద్దరమూ తప్పుచేసాము . ఇప్పుడు నేను చెబుతున్నాను నువ్వు నేషనల్స్ కు సెలెక్ట్ అయ్యి స్టేట్ తరుపున ఆడి చాంపియన్ గా నాకు కనిపించాలి అని చెప్పింది . చెల్లెమ్మా నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను , గంటలు గంటలు దూరంగా గ్రౌండ్ లో ఉండాలి అంటే నావల్ల కాదు అని చెప్పాను . అన్నయ్యా నేను నీ ప్రాణం కదా మొదటి కోరికను కోరాను తీర్చడం తీర్చకపోవడం నీఇష్టం అంటూ పాదాలను పైకెత్తి నా నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ఒక్కమాట కూడా మాట్లాడకుండా క్లాస్ లోకి వెళ్ళిపోయింది . 



చెల్లెమ్మా నీ కోరిక అదే అయితే సెలెక్ట్ అయ్యి ఆడటమే కాదు అన్నింటిలో గోల్డ్ మెడల్స్ సాధించి నీ పాదాల ముందు ఉంచుతాను అని గట్టిగా నిర్ణయించుకొని అటు నుండి ఆటే గ్రౌండ్ కు వెళ్లి , కోచ్ పాదాలకు నమస్కరించి sorry సర్ అనిచెప్పాను . థాంక్స్ మహి అని తలుచుకున్నారు .  గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చెయ్యడం చూసి కృష్ణగాడు పరిగెత్తుకుంటూ వెళ్లి కాలేజ్ మొత్తం వినేలా మైకులో అనౌన్స్ చేసేసాడు . చెల్లి పెదాలపై చిరునవ్వు విరిసింది .



మధ్యాహ్నం వరకూ ప్రాక్టీస్ చెయ్యడం , భోజనానికి ఇంటికివెళ్లి వచ్చినవెంటనే నేను గ్రౌండ్ కు చెల్లి క్లాస్ కు వెళ్ళిపోయి , క్లాస్ వదలగానే కారుని గ్రౌండ్ దగ్గరకు తీసుకువచ్చి చీకటిపడేంతవరకూ నేను ప్రాక్టీస్ చేసేంతవరకూ కారులోనే చదువుకుంటూ , ముగించుకొని రాగానే నా చెమటను తన కొంగుతో తుడిచి తాగడానికి నీళ్లు అందించి ఇంటికి చేరుకునేవాళ్ళము . మళ్లీ 4 గంటలకే లేచి ఇంటిదగ్గర ఉన్న గ్రౌండ్ కు వెళ్లివచ్చేటప్పటికి కోచ్ ఇచ్చిన మెనూ ప్రకారం చెల్లినే మొత్తం చూసుకునేది . 



అమరావతిలో సెలెక్షన్స్ సమయం రానే వచ్చింది . రెండు బస్ లలో కోచ్ కింద ట్రైనింగ్ అయినవాళ్ళందరమూ వెళ్లి మాక్సిమమ్ మెంబెర్స్ సెలెక్ట్ అయ్యి ఇంటికి చేరుకున్నాను . అన్నయ్యా అంటూ సంతోషన్గా కౌగిలించుకొని కంగ్రాట్స్ చెప్పింది . బుగ్గలను అందుకొని నా ప్రాణమైన చెల్లి మొదటి కోరిక తీర్చడమే ఇక మిగిలింది అంటూ అమ్మావాళ్ళతో సంతోషాన్ని పంచుకున్నాను . 



ఇక ఆరోజు నుండి రాత్రి పగలూ తేడాలేకుండా కోచ్ సలహాలను మరియు కష్టతరమైన సాధనలను మరియు అన్ని గేమ్స్ ప్రాక్టీస్ అలుపు వచ్చినా రెస్ట్ తీసుకోకుండా ఇష్టంగా కష్టపడ్డాము . ఫామిలీ , కాలేజ్ , ఫ్రెండ్స్ మరియు ముఖ్యన్గా చెల్లి ప్రోత్సాహం మరియు నాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తప్పకుండా అమలుపరిచేలా చదువుకుంటూనే తనవంతు సహాయం అందించింది . 



నేషనల్ గేమ్స్ షెడ్యూల్ రానే వచ్చింది . రెండు నెలల ముందుగానే అమరావతిలో అసెంబుల్ కావాలంటూ స్టేట్ క్రీడా శాఖ నుండి లెటర్ రావడంతో , చెల్లిని వదిలి వెళ్లాలని లేకపోయినా తన కోరికను తీర్చాలని కృష్ణ గాడికి చెల్లి అమ్మావాళ్ళు జాగ్రత్త అనిచెప్పి , చెల్లిని గట్టిగా కౌగిలించుకున్నాను . లవ్ యు soooo మచ్ అండ్ sorry అన్నయ్యా మమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అని కన్నీళ్లు కార్చడం చూసి , అదేమీ లేదు చెల్లి అంటూ కన్నీళ్లను తుడుచుకుని రెండే రెండు నెలలు అంతే , అమ్మా అమ్మమ్మా చెల్లిని బాగా చూసుకోండి అనిచెప్పి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లి బస్ లో కూర్చున్నాను . అమ్మా అంటూ చెల్లి అమ్మ కౌగిలిలో ఉండిపోయింది . మహేష్ అండ్ టీం all the best అంటూ కోచ్ wish చేసి పంపించారు .



అక్కడకు చేరుకుని రెండురోజులు పరిస్థితిని గమనిస్తే మా కోచ్ లోని passion ఎక్కడా అక్కడ కనిపించకపోయేసరికి , వెంటనే స్పోర్ట్స్ కమిటీకి విన్నవించుకున్నాము . ఎవరెవరి పేర్లు ఉన్నాయో వారందరినీ పిలిపించి ఒకరోజంతా మా ఆట చూసి సంతోషం వ్యక్తం చేస్తూ వెంటనే మేము కొరినట్లుగానే మా కోచ్ ను యుద్ధప్రాతిపదికన పిలిపించారు . బాయ్స్ నా చిరకాల కోరిక అలాగే మిగిలిపోతుందని అనుకున్నాను , కానీ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీరేట్లు చేస్తున్నారు అంటూ మా అందరినీ కౌగిలించుకొని , బాయ్స్ లెట్స్ ప్రాక్టీస్ అంటూ ఉత్సాహంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టి ప్రాక్టీస్ చేస్తుంటే మిగతావాళ్ళంతా చూసి ఆశ్చర్యపోతూ , సర్ మాకు కూడా అలాంటి ప్రాక్టీస్ కావాలని మేము కష్టపడతామని చెప్పడంతో , coaches అందరూ కలిసి చర్చించి నెక్స్ట్ రోజు నుండి అందరూ వారి శక్తికి మించేలా కష్టపడ్డాము . రోజూ ప్రాక్టీస్ కాగానే చెల్లి మరియు అమ్మావాళ్ళతో వీడియో కాల్ చేసి ఆరోజు ప్రాక్టీస్ గురించి సంతోషన్గా మాట్లాడేవాడిని . చెల్లి చిరునవ్వే నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేది .రెండు నెలలు గడిచిపోయాయి , వైజాగ్ మీదుగా ట్రైన్ లో ఢిల్లీ వెళుతూ స్టేషన్ లో చెల్లితో , అమ్మావాళ్ళతో సంతోషన్గా మాట్లాడాను . రేయ్ మామా ఏంట్రా హల్క్ లా తయారయ్యావు నిన్ను చూస్తే చాలు అవతలి జట్టు భయంతో వనికిపోతుంది అంటూ కౌగిలించుకొని మాట్లాడి, ట్రైన్ కదులగానే అమ్మా , అమ్మమ్మా ఆశీర్వాదం తీసుకొని లవ్ యు చెల్లి అంటూ కౌగిలించుకొని రేయ్ మామా జాగ్రత్త వెళ్ళగానే కాల్ చేస్తాను అని చెప్పి రన్నింగ్ ట్రైన్ ఎక్కాను . అన్నయ్యా all the best అన్న చెల్లి మాటలు నా మెదడులో ముద్రపడిపోయాయి .



గేమ్స్ కు ముందు రెండురోజుల ముందుగానే ఢిల్లీ చేరుకొని రెండురోజులు కోచ్ శిక్షణలో ఆ వాతావరణానికి అలవాటుపడ్డాము. OPening ceremony ఘనంగా జరిగింది . అలాంటి ఓపెనింగ్ చూడటం అదే తొలిసారి , రేపటి నుండి గేమ్స్ స్టార్ట్ అవుతాయి అని అనౌన్స్మెంట్ జరిగి రెస్ట్ తీసుకోవడానికి మా రూమ్స్ కు చేరుకొని గంటసేపు చెల్లితో అమ్మావాళ్ళతో సంతోషన్గా మాట్లాడి నిద్రలోకి జారుకున్నాను . 



తెల్లవారుఘామునే లేచి కోచ్ దగ్గర అసెంబుల్ అయ్యి షెడ్యూల్ ప్రకారం గేమ్స్ అథ్లెటిక్స్ వేరు వేరు ప్లేస్ లలో స్టార్ట్ అయిపోయి మొదటిరోజే నేను పార్టిసిపేట్ చేసిన మూడింటిలో మూడు  గోల్డ్ మెడల్స్ ఓవర్ అల్ గా 7 గోల్డ్ మెడల్స్ 5 సిల్వర్ గెలుచుకుని మొదటిరోజును సంతోషన్గా ముగించాము . స్టేడియం నుండి రూమ్ లు చేరుకున్నామో లేదో చెల్లి ఫోన్ చేసి ఉమ్మా...........అన్నయ్యా అధరగొట్టావు , టీవీల్లో నిన్ను చూసిన మరుక్షణం మన కాలనీ ప్రెసిడెంట్ రోడ్ మీదనే పెద్ద టెంట్ వేయించి స్క్రీన్ మీద ప్లే అయ్యేలా చేశారు . నువ్వు గెలిచిన ప్రతిసారి గుంపులుగుంపులుగా కాలనీ మొత్తం ఇక్కడికే చేరిపోయి కేరింతలు కొడుతున్నారు . చెల్లి వాళ్లంతా కాదు నువ్వు happy నా కాదా అని ఆడిగానో లేదో , ఉమ్మా ఉమ్మా...........ఉమ్మా......అంటూ ముద్దుల వర్షం కురిపించడంతో , ఇదిచాలు చెల్లి రెపట్నుండి చూడు అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడంతో , లవ్ యు soooo మచ్ అన్నయ్యా , all the best అంటూ సంతోషన్గా చెప్పింది . 



అలా ప్రతిరోజు ముందురోజు కంటే ఎక్కువ గోల్డ్ సాధిస్తూ చెల్లి మరియు అమ్మ వాళ్ళల్లో మరింత సంతోషాన్ని నింపుతూ ఓవర్ అల్ గా అద్భుతమైన results తో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మా కోచ్ కూడా ఆశ్చర్యపోయేలా చివారిరోజుకు చేరుకున్నాము . పాయింట్స్ పట్టికలో మహారాష్ట్రతో పాటు సమానంగా టాప్ లో ఉన్నాము . రేపు చివరిరోజు జరిగే కబడ్డీ ఫైనల్ లో బీహార్ తో గోల్డ్ మెడల్ సాధిస్తే ఫస్ట్ ప్లేస్ కు చేరుకుంటాము . దానికోసం స్టేట్ మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది . చెల్లి కోరిక తీర్చడానికి ఒకే ఒక్క పతకం అవసరం , దానికోసం టీం మెంబెర్స్ అంతా ఇంతా కష్టమయినా సాధించాలని నిర్ణయించుకున్నాము . చెల్లితో కూడా అదే మాట్లాడి కోచ్ సలహాల ప్రకారం సాయంత్రమే రూమ్స్ కు చేరుకున్నాము . 



బీహార్ అంటేనే భయం వాళ్ళు ఎలా ఉంటారో , ఎలా ఆడారో సెమి ఫైనల్ మ్యాచ్ చూసి మాలో సగం మంది భయపడిపోయారు .  చివరి రోజు ఉదయం నుండే అంతకుమించి ఆత్నస్థైర్యాన్ని , ధైర్యాన్ని నింపే పనీలో మా కోచ్ మునిగిపోయారు . వాళ్ళ ప్లస్ లు మైనస్ లు వివరించి అన్నింటికీ మమ్మల్ని సిద్ధం చేశారు . వీక్షకులలో కూడా ఉత్సాహం నింపడానికి చివరి గేమ్ గా కబడ్డీ ఫైనల్ ను సెట్ చేశారు . 



ఆ సమయం రానే వచ్చింది . మొత్తం అన్ని క్రీడలలో పార్టిసిపేట్ చేసినవాళ్ళు మరియు వీక్షకులతో స్టేడియం ఫుల్ గా నిండిపోయింది . కోర్ట్ లోకి రెండు జట్లు చేరిపోయి టాస్ తరువాత టీం మెంబెర్స్ అంతా రౌండ్ చేరి all the బెస్ట్ చెప్పుకొని కోచ్ చెప్పిన దానిలో ఏదీ మిస్ కాకూడదని , భయపడలుండా మొదటి క్షణం నుండి దూకుడుగానే ఉండాలని నిర్ణయించుకొని గట్టిగా అరుస్తూ చేతులు కలిపి, తొలి కూతకు నేను రెడీ అయిపోయాను . 



చెల్లెమ్మా నీ కోరిక తీర్చే శక్తిని ఇవ్వు అని మనసులో తలుచుకొని లైన్ దాటే సమయానికి , అన్నయ్యా........all the best అని అంతటి నాయిస్ లో కూడా క్లియర్ గా నా చెవులకు వినిపించగానే అటువైపు చూసాను . నిజంగానే ఎదురుగా చెల్లి , దివ్యక్క మరియు కృష్ణగాడు కనిపించేసరికి హృదయం పరవశించిపోతూ ఒక్కసారిగా ఆనందబాస్పాలతో లవ్ యు చెల్లి అని గుండెలపై చేతినివేసుకొని ,లైన్ మొక్కి వర్ణించలేని ఉత్సాహం , ధైర్యం మరియు బలం వచ్చినట్లుగా పెదాలపై చిరునవ్వుతో కబడ్డీ కబడ్డీ..........అంటూ వెళ్లి మొదటి బొనస్ తాకి ఇద్దరిని తాకి ఏకంగా మూడు పాయింట్ లు సాధించడంతో , స్టేడియం మొత్తం దద్దరిల్లిపోవడం చూసి మావాళ్ళల్లో ఉత్సాహం ఉరకలై పారింది . కృష్ణగాడు నా పేరు రాసిన పెద్ద బ్యానర్ ను పట్టుకొని చిందులు వేస్తున్నాడు . ప్రక్కనే చెల్లి మరియు దివ్యక్క ఇద్దరూ సంతోషన్గా కౌగిలించుకొని చప్పట్లతో ప్రోత్సహించారు . 



నెక్స్ట్ కూతకు వచ్చిన బలమైన వాణ్ణి బోనస్ కోసం try చేసేంతలో మా డిఫెండర్స్ ఒడిసి పట్టేసుకోగానే , కోచ్ వాల్యూ తెలిసినట్లు ఆయన వైపు చూడటంతో ఆయన ఆనందానికి అవధులు లేవు . అదే ఉత్సాహంలో మళ్లీ కూతకు వెళ్లి ఒక పాయింట్ సాధించాను . అలా వాళ్ళు పాయింట్ సాధించేలోపల వాళ్ళందరినీ allout చేసేసాము . 



ఇప్పుడు స్కోర్ 9--0 , మళ్లీ మొత్తం టీం ఎంటర్ అయ్యింది . మాలో ఉన్న ఉత్సాహంతో వాళ్ళు ఒక పాయింట్ సాధిస్తే మేము రెండు మూడు పాయింట్ లు సాధించాము . కృష్ణ గాడు పెద్ద బ్యానర్ పెట్టుకొని ఉండటం వలన వాడి ఆనందం చూసి కెమెరా ప్రతిసారి వాళ్ళవైపు తిప్పుతుండటంతో స్క్రీన్ పై చెల్లి సంతోషాన్ని మనసారా చూస్తున్నాను . బ్యానర్ పై ఉన్న పెరు చూసి స్టేడియం మొత్తం మహేష్ మహేష్ మహేష్ ............అంటు దద్దరిల్లిపోయింది . హాఫ్ టైం కు ముందు చివరి రైడ్ అప్పటికే వాళ్ళు మూడు సార్లు allout అవ్వడంతో స్కోర్ 40--15 , మా టీం లో నేను మరొకరు ఇద్దరము 10 పాయింట్స్ దాటించాము , ఇద్దరు డిఫెండింగ్ లో హై 5 దాటారు, హాఫ్ టైం గొప్పగా ముగించాలని మా కెప్టెన్ నన్ను రైడ్ కు వెళ్ళమని చెప్పదంతో , థాంక్స్ రా అనిచెప్పి వెళ్ళడానికి రెడీ అయ్యాను  . అటువైపు 5 మంది ఉన్నారు . 



అంతలో వాళ్ళు టైం ఔట్ తీసుకొన్నారు . ఏకంగా బీహార్ కోచ్ తోపాటు మహారాష్ట్ర కోచ్ కూడా రావడం గమనించి మా కోచ్ వైపు మా కెప్టెన్ చూడటంతో , ఇది ఆటకు విరుద్ధం అని చెప్పేంతలో వాళ్ళు వాళ్లపని చూసుకొని sorry అనిచెప్పి వెళ్లి కూర్చున్నారు . వాళ్ళ కన్నింగ్ ప్లాన్ ను మా కోచ్ మేము కనిపెట్టలేకపోయాము .  



మామూలుగానే కబడ్డీ కబడ్డీ ........అంటూ కూతకు వెళ్ళాను . బోనస్ లేకపోవడంతో అందరూ వెనుక లైన్ దగ్గర నిలడ్డారు . నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆడుతూ వాళ్లదగ్గరకు చేరి ఒకడిని టచ్ చేయగానే మరొకడు మరొక సైడ్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చినా వాడిని తోసుకుంటూ వచ్చి లైన్ టచ్ చేశాక , మిగతా ముగ్గురూ నామీదకు పడిపోయి కుట్లు పడిన చోట ఇష్టమొచ్చినట్లుగా నిలిపేశారు . ఒకడయితే బలంగా ఒక దెబ్బ వేయడంతో అమ్మా అంటూ స్టేడియం మొత్తం వినిపించేలా నొప్పితో కేక పెట్టాను , కోచ్ మా టీం అంతా ఏమయిందో అని కంగారుపడుతున్నారు  . అంపైర్ allout 7 పాయింట్స్ to రైడర్స్ టీం అంటూ విజిల్ ఊది . నామీద పడిన ఒక్కొక్కరి జెర్సీ నెంబర్లు చెప్పి లేవమని చెబుతున్నాకూడా మరింత నొప్పిని కలిగిస్తూ లేచి దుమ్ము దులుపుతూ , నెక్స్ట్ హాఫ్ టైం ఎలా ఆడతారో ఆడండి రా అంటూ వెళ్లిపోయారు . 



నడుము దగ్గర రక్తం చూసి మావాళ్ళంతా కోచ్ డాక్టర్ అని కేకవేసి లేస్తున్న నన్ను ఎత్తుకొనివెల్లి ప్రక్కన కూర్చోబెట్టారు . ఇంతలో అంపైర్ హాఫ్ టైం అని అనౌన్స్ చేశారు . స్క్రీన్ పై రక్తం చూసి చెల్లి హృదయం చలించినట్లు , అమితవేగంతో కొట్టుకుంటున్న హృదయంతో ముఖమంతా చెమటతో దివ్యక్క చేతిని నొప్పి పుట్టేలా పట్టుకొంది . మహి మహేష్ కు ఏమీ అవ్వదు , రేయ్ కృష్ణా ఎక్కడరా నువ్వు అని అరిచేంతలో , స్క్రీన్ పై నా ప్రక్కనే చూసి కృష్ణ కూడా వెళ్ళాడు మహి అంటూ కౌగిలించుకొని ధైర్యాన్ని ఇచ్చింది.



డాక్టర్ వచ్చి చూసినా నొప్పిని తట్టుకోలేకపోతుండటంతో కోచ్ పర్మిషన్ తీసుకొని కృష్ణగాడు వెళ్లి చెల్లిని దివ్యక్కను పిలుచుకొనివచ్చాడు. చెల్లి కన్నీళ్లను చూసి వెంటనే డాక్టర్ గారు its all right అని చెప్పాను . NO not ఆల్రైట్ మహేష్ రక్తం కారుతోంది , ప్రస్తుతానికి ఆపాను వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి  , నువ్వు ఇక ఆడటానికి నేను పర్మిషన్ కూడా ఇవ్వను వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే , ఎలాగో మీరు 32 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరు గెలుస్తారు అని కోచ్ కు కూడా చెప్పడంతో , కోచ్ కు కూడా ఇష్టం లేకపోయినా మహేష్ రెస్ట్ తీసుకో , ఈ లీడ్ పాయింట్ లతో ఎలాగోలా మనమే గెలిచేలా ఎక్కువ జీరో రైడ్ లతో సమయాన్ని వృధా చేస్తాము అని నన్ను ఒప్పించి వెనుక కూర్చోబెట్టారు . చెల్లి దివ్యక్కా నాకు ఇరువైపులా కూర్చుని నా చేతులను పట్టుకొని నొప్పిని తగ్గించడానికి ప్రయత్నించారు .



ఇంతలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి రెండు జట్లు పూర్తి టీమ్ తో రంగం లోకి దిగింది . సెమి ఫైనల్ లో చూసిన ఆజానుబావులు అప్పుడే substitute గా ముగ్గురి ప్లేస్ లలోకి మారారు . మా టీం అంతా నేను కూడా లేకపోవడంతో కంగారుపడుతూ కోచ్ వైపు చూడటంతో , ప్లాన్ అమలుచేయ్యండి చాలు అని ధైర్యం నింపారు . రావడం రావడమే వాడే కూతకు వచ్చి ఏకంగా నలుగురిని ఔట్ చేసి సూపర్ రైడ్ గా నవ్వుతూ వెళ్లడం చూసి , స్టేడియం మొత్తం సైలెంట్ గా అయిపోయింది . వాళ్ళ సపోర్టర్స్ గోల గోల చెయ్యసాగారు . కేవలం రెండే రెండు నిమిషాల్లో మావాళ్లు allout , 5 నిమిషాల్లో రెండో allout తోపాటు మరొక allout కు చేరువయ్యారు . కోచ్ ఎన్ని ప్లాన్స్ మార్చినా మా టీమ్ లో ఉత్సాహాన్ని నింపలేకపోయారు , రైడ్ రైడ్ కు భయం పెరిగిపోతోంది . వాళ్ళు ఔట్ చేయడమే కాదు మావాళ్లను injure కూడా చేస్తున్నారు . Umpires రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అంటూ టెక్నికల్ పాయింట్స్ ఇచ్చి వదిలేస్తున్నారు . కోచ్ ఎన్ని టైం ఔట్ లు తీసుకున్నా ఫలితం లేకపోయింది . బాధతో చూడ్డం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను.



చివరి నిమిషానికి చేరుకునే సరికి 53 -- 55 కు చేరుకొంది , మావాళ్ళ నలుగురు అటువైపు ఓకేఒక్కడు అదికూడా ఆజానుబావుడు ఉన్నాడు . మా కోచ్ ఏమాత్రం భయపడకండి వాడిని పట్టేసామంటే allout పాయింట్స్ తో విజయం మనదే అని ధైర్యాన్ని నింపి వచ్చారు . వాడు భయపెట్టేలా వచ్చి చివరి సెకన్లలో ఒకడిని ఔట్ చేసి వెల్తూ సహాయంగా వచ్చిన మరొక ఇద్దరినీ కాదా ఔట్ చేసి సూపర్ రైడ్ తో గెలుపొందలేని  లీడ్ లోకి వెళ్లిపోయారు . స్కోర్ 53--58 , ఇప్పుడు మావైపు ఓకేఒక్కడు అటువైపు నలుగురికి చేరింది . స్టేడియం మొత్తం సైలెంట్ గా కొందరైతే స్టేడియం వదిలి వెళ్ళడానికి లేచారు . వాళ్ళ ఆనందం పీక్స్ లోకి వెళ్ళిపోయింది .



కోచ్ మళ్లీ టైం ఔట్ అడగడంతో , you have used all of your timeouts అని వెనక్కు పంపుతూ , జడ్జెస్ involve అయ్యి టైం ఔట్ ఇచ్చారు . చెల్లి నేను వెళతాను అని చెప్పాను . అన్నయ్యా...........రక్తం ఇంకా కారుతూనే ఉంది అని వెళ్లకుండా నన్ను గట్టిగా పట్టేసుకుంది . వాళ్ళు ఇక గెలిచామని ఎగిరి గెంతులేస్తూ మీ హీరో ఎక్కడరా , ఒకే ఒక దెబ్బ రక్తం కారి ఎక్కడెక్కడో కూర్చున్నాడు . త్వరగా లాస్ట్ రైడ్ పూర్తి చేస్తే , ఎవడు వస్తాడో కానీ వాడు అయిపోయాడు అంటూ ఎముకలు విరిచినట్లు సైగలతో హేళన చెయ్యడం చూసి , చెల్లి ఆగ్రహం కట్టలు తెంచుకొని నా చేతులను వదిలి ,బాధపడకు అన్నయ్యా వెళ్లు అంటూ తన కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి పంపించింది . 



రక్తం కారుతున్న బ్యాండేజ్ పై చేతిని పట్టుకొని కోచ్ దగ్గరకు వెళ్లి కోచ్ లాస్ట్ రైడ్ నేను వెళతాను అని చెప్పగానే , నా కాన్ఫిడెంట్ ను చూసి ఒకవైపు అంపైర్ its time its time అని పిలుస్తుండటంతో , ఆ సమయంలో ఏమి చెయ్యాలో తోచక  అంపైర్ substitute అని నన్ను చూపించి కౌగిలించుకొని మహేష్ తెలుసుకదా మొత్తం allout అయితేనే అనిచెప్పి వెళ్లిపోయారు , అందరూ ఆశ్చర్యంతో గుసాగుసలాడుతూ , వెళ్ళేవాళ్ళు ఆగిపోయి ఏమి జరుగుతుందో అని ఉత్సుకతతో చూస్తున్నారు . లాస్ట్ రైడ్ అని చెప్పడంతో నేను నడుముపై చేతిని పట్టుకునే గీత దాటుతుండటం చూసి నలుగురూ హేళనగా నవ్వుతున్నారు .



చెల్లిని ఒకసారి చూసి లైన్ మొక్కి లోపలకు వెళ్ళగానే నొప్పిని చెల్లి కోరిక ఎలాగైనా తీర్చాలనే సంకల్పాన్ని గుర్తుచేసుకొని భరిస్తూ , రేయ్ వీడెమీ పీకలేడు నొప్పితో వాడే ఔట్ అయిపోతాడు చివర ఉండండి చాలు అని casual గా నిలబడ్డారు . అదే అదునుగా తీసుకొని శక్తికి మించిన ప్రాక్టీస్ గుర్తుతెచ్చుకొని ఉఫ్.......అంటూ గాలివదిలి వేగంగా వెళ్లి ఎడమవైపు చివరన ఉన్న ఒకన్ని బాలన్స్ తప్పి అటువైపు పడేలా సక్సెస్ అయ్యాను , ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లైన్ అంపైర్ వాడిని కోర్ట్ లోకి మళ్లీ రాకుండా లాగేసారు . స్టేడియం మొత్తం గేమ్ ఇంకా ఉంది అంటూ మహేష్ మహేష్ ........అంటూ ఎంకరేజ్ చేస్తుండటం చూసి మిగిలిన ముగ్గురూ అలెర్ట్ అయిపోయి రేయ్ నువ్వు వెనుక ఉండు మాదగ్గరకు రాకు అని చెప్పి ఇద్దరు మాత్రమే ముందుకు వచ్చారు .  వెంటనే నవ్వుతూ వాళ్లకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఇద్దరి మధ్యలో దూరిపోయి toe crush లో వెనుక ఉన్న వాన్ని తాకి మిగిలిన ఇద్దరూ ఆజానుబావులు అడ్డుగా రావడంతో వారిమీదుగా ఎగిరి గీత దగ్గరకు చేరిపోయాను . రేయ్ మావాడు హై జంప్ లో గోల్డ్ మెడల్ రా అని కృష్ణగాడు స్టేడియం మొత్తం వినిపించేలా అరవడంతో , షాక్ లో ఉన్న స్టేడియం మొత్తం నా పేరుతో మారుమ్రోగించారు . రెండు చేతులతో fuck off చూపించి గీత దాటేశాను . మావాళ్ళంతా కోర్ట్ లోకి వచ్చి సంతోషం పట్టలేక గాయాన్ని తాకకుండా పైకి ఎత్తి సంబరాలు చేసుకున్నారు . ఇక్కడ చెల్లి దివ్యక్కా , అక్కడ అమ్మా అమ్మమ్మా కౌగిలించుకొని ఆనందబాస్పాలతో మురిసిపోయారు . 



చివరి రోజును expect చెయ్యనంతగా ముగించారు అంటూ గోల్డ్ మెడల్ అందించి మా రాష్ట్రాన్ని ఫస్ట్ ప్లేస్ గా నిర్ణయించి , మా కోచ్ లను ఘనంగా సన్మానించారు . అన్నయ్యా అంటూ వచ్చి పట్టరాని సంతోషంతో కౌగిలించుకొని  అమ్మావాళ్లకు కాల్ చేయగానే , కన్నయ్యా వెంటనే చూడాలని ఉంది అని చెప్పడం ఆలస్యం , కోచ్ వచ్చి మన అందరికీ స్పెషల్ ఫ్లైట్ మన స్పోర్ట్స్ కమిటీ arrange చేసిందని చెప్పడంతో , మా అందరి ఆనందానికి అవధులు లేక అమ్మా నీ కోరిక కూడా తీరబోతోంది అంటూ ఫార్మాలిటీ లు అన్నీ చూసుకొని ఢిల్లీ నుండి ఫ్లైట్ లో వైజాగ్ చేరుకున్నాము . సంతోషంతో , చెల్లి భుజం చుట్టూ చేతిని వేసి బయటకు వచ్చాము . చాలా మంది చుట్టు ముట్టడంతో దివ్యక్కా అమ్మావాళ్ళు బయట ఉంటారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి మేము వస్తాము అనిచెప్పి కృష్ణగాడి భుజంపై చేయివేసి సెక్యూరిటీ సహాయంతో బయటకు చేరుకొని అమ్మను కౌగిలించుకున్నాను . అన్నయ్యా ముందు కారు ఎక్కు అని చెప్పడంతో నేరుగా హాస్పిటల్ కు తీసుకెళ్లారు . వచ్చావా నాయనా మొత్తానికి హీరో అయిపోయావు అంటూ అంటీ అభినందిస్తూనే ఒక కుట్టు వేసి ఏమీ పర్లేదు అంటూ మాతోపాటు ఇంటికి వచ్చింది . ఇంటిదగ్గర కోలాహలం అంతా ఇంతా కాదు . చెల్లి ఇదంతా నీవల్లనే అంటూ తన భుజం చుట్టూ సంతోషన్గా చేతులువేసి , చెల్లి ఆనందాన్ని చూసి మురిసిపోయి , ఫస్ట్ నుండి చెల్లి సర్ప్రైజ్ వరకూ జరిగిందంతా వివరిస్తూ అమ్మ ఒడిలో చెల్లి నా గుండెలపై హాయిగా నిద్రపోయాను . ఇక ఎక్కడకు వెళ్లినా , కాలేజ్ లో అభినందనల వెల్లువ , కోచ్ ఆనందబాస్పాలతో అలా రోజులు గడుస్తుండగా ,
[+] 13 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-09-2019, 10:05 AM



Users browsing this thread: 159 Guest(s)