Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కృష్ణగాడు అమ్మావాళ్లను మరియు తన పేరెంట్స్ దివ్యక్కను కారు దగ్గర వరకూ వదిలి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపించి లోపలకు వచ్చి ICU బయట కుర్చీలో కూర్చున్నాడు . అంటీ వచ్చి కృష్ణా లోపలే ఉండు ఏమి పర్లేదు అని చెప్పింది . మేడం వాళ్ళను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు , వాళ్లిద్దరూ ఇలా సంతోషన్గా కలిసిపోవాలని మీతోపాటు నేనుకూడా ఎదురుచూసాను , ఇదిచాలు I am happy మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని సంతోషన్గా చెప్పాడు . అంటీ సంతోషిస్తూ లోపలకు వచ్చి నన్నే ప్రేమతో చూస్తున్న మహి దగ్గరికివచ్చి , ఇంతప్రేమను మీ అన్నయ్య తట్టుకుంటాడో లేడో అంటూ తలపై ప్రేమగా స్పృశించి , పని చూసుకొని వస్తాను ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి , కృష్ణ కూడా బయటే ఉన్నాడు అనిచెప్పి వెళ్ళింది . 



అన్నయ్యా హాయిగా నిద్రపో అంటూ నా కురులలో వేళ్ళను పోనిచ్చి మృదువుగా నిమురుతూ కలిసిన చేతులపై ముద్దుపెట్టి నన్నే చూస్తూ అలాగే కూర్చుంది . సుమారు 12 గంటల సమయంలో నిద్ర దేవత ఆవహించినట్లు నెమ్మది నెమ్మదిగా నా గుండెలపై వాలిపోయింది . ఆ కదలికకు ఇంకా మత్తుగానే సగం కళ్ళుతెరిచి అలసిపోయి నా గుండెలపై నిద్రపోతున్న మహిని చూసి సంతోషించి . ఆ........ఆక్...........అక్కా.......అక్కా.......అంటూ మత్తులోనే పిలవడంతో , అన్నయ్యా...........ఇప్పుడెలా ఉంది నొప్పిగా ఉందా , అంటీని పిలుస్తాను ఉండు అని చెప్పేంతలో ........., చేతిని గట్టిగా పట్టుకొని అక్కయ్యా అని ప్రేమతో పిలిచి చేతిని గుండెలపై హత్తుకొని సగం కళ్ళతోనే చుట్టూ చూసి కాస్త దూరంలో ఖాళీ బెడ్ కనిపించడంతో , అక్కయ్యా I am ok , నీకు కాళ్ళు నొప్పిస్తాయి అక్కడ వెళ్లి హాయిగా పడుకో అనిచెప్పి నిద్రలోకి జారుకున్నాను . లవ్ యు అన్నయ్యా అంటూ సంతోషం పట్టలేక నా చేతిపై ముద్దులతో ముంచెత్తి , ఈ క్షణం నుండి నేను మా అన్నయ్య ముద్దుల చెల్లిని నువ్వు కూడా అలాగే పిలు అంటూ నిద్రపోతున్న నన్ను చూసి తియ్యగా నవ్వింది .మా అన్నయ్య చేతిని వదిలి నేను అడుగు కూడా వెయ్యను అంటూ అలాగే కూర్చుని , ఉదయం కూడా ఇలానే చూశాడంటే అన్నయ్య బాధపడతాడు . ఇప్పుడెలా అని ఆలోచించి ఐడియా అంటూ తియ్యగా నవ్వుకుని నా స్థానం మా అన్నయ్య హృదయం దగ్గరే అంటూ లేచి , 



నా ఎడమ ప్రక్కన వీలైనంత స్థలo ఉండటంతో నెమ్మదిగా బెడ్ ఎక్కి , చేతులను విడదియ్యకుండా చుట్టూ వేసుకొని నా గుండెలపై వాలిపోయి , అన్నయ్యా ఇంత సేఫ్ place ప్రపంచంలో ఎక్కడా ఉండదు అంటూ మరొకచేతితో నా భుజం పై జోకొడుతూ జోకొడుతూ హాయిగా నిద్రలోకి జారుకుంది . నాకైతే స్వర్గంలో ఉన్నట్లుగా వెచ్చగా హాయిగా ఆనిపించడంతో కళ్ళుతెరిచి చూసాను . అంతే అప్పుడు కలిగిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోనంతంగా పరవశించిపోయి , లవ్ యు అక్కయ్యా అంటూ కష్టంగా తలెత్తి ముద్దుపెట్టి పెదాలపై చిరునవ్వుతో , దేవుడా ఈ జీవితానికి ఇంతకంటే ఏమీ వద్దు మా అక్కయ్య ప్రేమ చాలు అంటూ తననే చూస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాను.



కొద్దిసేపటి తరువాత అంటీ వచ్చి నిద్రపోకుండా మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటున్న కృష్ణ భుజం పై సంతోషన్గా తాకి లోపలికివచ్చి,మహి అని పిలవబోయి మా ఇద్దరినీ అలా చూసి సంతోషం పట్టలేక నోటికి చేతిని అడ్డుపెట్టి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ మాదగ్గరికివచ్చి , మహి బుగ్గను ప్రేమతో స్పృశించి ఏదో ఐడియా వచ్చినట్లు మొబైల్ లో capture చేసి వెంటనే అమ్మ మొబైల్ కు send చేసి , నెమ్మదిగా బయటకువచ్చి కృష్ణగాడిని పిలిచి చూపించి వాడి సంతోషాన్ని కూడా ఆస్వాదించి , కృష్ణా బెడ్ ఖాళీగానే ఉంది , నీ ప్రాణమైన ఇద్దరూ కూడా పడుకున్నారు కదా కొద్దిసేపు పడుకో అనిచెప్పి మహి నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి గుడ్ నైట్ అనిచెప్పి వెళ్ళిపోయింది . కృష్ణగాడయితే god నువ్వున్నావు అంటూ సంతోషిస్తూ నిద్రపోయాడు . ఇక సూర్యుడు వచ్చేన్తవరకూ మేల్కొంటే ఒట్టు సంతోషమనే ప్రపంచంలో ప్రశాంతంగా నిద్రపోయాము.



ఇంటిలో అమ్మ తెల్లవారకముందే లేచి మొబైల్ లో టైం చూస్తూ అంటీ నుండి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి ఫోటోని చూసి , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో my లవ్లీ ట్విన్స్ అంటూ ప్రేమతో స్క్రీన్ తాకి , ప్రక్కనే పడుకున్న అమ్మమ్మను కొట్టిమరీ లేపి చూపించింది . అమ్మమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయి నేను వెంటనే నా ప్రాణాల్ని చూడాలి అంటూ ఆవయసులో కూడా పరుగున రెడీ అవ్వడానికి వెళ్ళింది . అమ్మా నెమ్మది అని నవ్వుతూ చెప్పి అమ్మమ్మ కంటే ముందుగా రెడీ అయిపోయి అత్తయ్యతోపాటు ముగ్గురూ హాస్పిటల్ చేరుకున్నారు . 



ICU లోపలికి వచ్చి నేను , అక్కయ్య , కృష్ణగాడు మరియు అంటీ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవడం చూసి సంతోషంతో అమ్మ అక్కడే ఆగిపోయింది . అమ్మా , అమ్మమ్మా , అత్తయ్యా ...........అంటూ నవ్వుతూ పిలిచి ,అక్కయ్య ఉండగా ఇక నాకేమీ కాదు పదండి ఇంటికి వెళ్లిపోదాము అని అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి చెప్పగానే , అన్నయ్యా చివరిసారిగా చెబుతున్నాను చెల్లి అని పిలు అంటూ చిరుకోపంతో చెప్పింది . అలాగే నా ముద్దుల ప్రాణమైన చెల్లి అంటూ నవ్వుతూ బదులిచ్చాను . కన్నయ్యా ..........అంటూ అమ్మ దగ్గరకు వచ్చి ఆనందబాస్పాలతో మాఇద్దరినీ తన గుండెలపై హత్తుకొని , అమ్మా రావే అంటూ అమ్మమ్మను పిలిచింది . అమ్మమ్మా ఇప్పటికి మీ కోరిక తీర్చాము. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమి........అనేంతలో , అమ్మమ్మ నానోటిని చేతితో ఆపేసి ఆనందబాస్పాలతో మా ఇద్దరి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది. 



మనమిలా ఇంత సంతోషన్గా ఉన్నారంటే దానికి కారణం మాత్రం మా గ్రేట్ లవ్లీ డాక్టర్ అంటీనే , చిన్నప్పుడు నా ప్రాణానికి ఇప్పుడు నాకు కుట్లు వేసి మాఇద్దరినీ ఇంత దగ్గర చేసింది . అంటీ లవ్ యు అని నవ్వుతూ చెప్పడంతో , అంటీ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఇద్దరూ పెద్ద దొంగలు ఇంకొక్కసారి హాస్పిటల్ కు ఇలా వచ్చారంటే నేనేమి చేస్తానో నాకే తెలియదు అంటూ కొట్టబోయి , మా ఇద్దరినీ ప్రేమతో కౌగిలించుకుంది . అక్కా అంటూ అమ్మ అంటీని సంతోషంతో కౌగిలించుకుంది . అంటీ డిశ్చార్జ్ చేసేయ్యండి ఇంటికి వెళ్లిపోతాము అని చెప్పడంతో , నీ ఇష్టం రా అంటూ బాస్పాలను తుడుచుకుని ఒకసారి కట్లను పరిశీలించి , జాగ్రత్తలు మహికి వివరించింది . 



మరి మీరు రారా అంటీ అని మహి అడిగింది . నేను రాకపోతే మా అందమైన దెయ్యం ఊరుకుంటుందా , రోజుకు రెండు మూడు సార్లు వస్తాను సరేనా అని చెప్పడంతో , లవ్ యు అంటీ అంటూ కౌగిలించుకుంది . బ్రతికిపోయాను అంటూ గుండెలపై చెయ్యివేసుకొని నవ్వి కృష్ణా ఆ వీల్ చైర్ తీసుకురా అని చెప్పడంతో తీసుకొచ్చి నన్ను నెమ్మదిగా కుర్చీలో కూర్చోబెట్టాడు . అన్నయ్యా రాత్రన్తా కృష్ణ అన్నయ్య నిద్రపోకుండా బయటే కూర్చున్నాడు అని చెప్పింది . ఒక్కరోజు కాదు ఎన్నిరోజులైనా ఉండాలి ........ఏరా ......అని గట్టిగా అడిగాను . నాకు తెలుసురా మామా అందుకే అమ్మావాళ్ళు అడగకముందే ఉంటానని చెప్పాను అని భయంతో బదులివ్వడంతో , అందరూ సంతోషన్గా నవ్వుతూ బయటకువచ్చి అందరమూ రెండు కార్లలో , చెల్లి ప్రక్కనే కూర్చుని చేతిలో చేయివేసి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము .



అంటీ చెప్పినట్లుగా కొన్ని వారాలపాటు స్టెప్స్ ఎక్కవద్దనడంతో కింద ఖాళీగా ఉన్న రూమ్ లోకి మొత్తం మావస్తువులను మార్చేశారు . నన్ను బెడ్ పై కూర్చోబెట్టి అమ్మా ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యివస్తాను అనిచెప్పి కృష్ణగాడు వెళ్ళిపోయాడు . కొద్దిసేపటి తరువాత చెల్లి సహాయంతో బాత్రూం లోకి వెళ్లి తలుపేసుకుంటుండగా , అన్నయ్యా వద్దు నేనిక్కడే ఉంటాను వెళ్లు అని చెప్పింది . గోడను పట్టుకొని లోపలికివెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని సింక్ దగ్గరకువచ్చి , చెల్లి అని పిలువగానే , నవ్వుతూ లోపలికివచ్చి అమాంతం నాగుండెలపై వాలిపోయి పిలుపు చాలా మధురంగా ఉంది అన్నయ్యా ఇలాగే పిలు అనిచెప్పింది . నవ్వుతూ బ్రష్ పైన.........క్షణంలో తీసుకొస్తాను అనిచెప్పి తీసుకొచ్చింది . కుడిచేతి కట్టుతోనే అందుకోబోగా అన్నయ్యా............నిన్నూ అంటూ నెమ్మదిగా చేతిని దించి , బ్రష్ కు పేస్ట్ పూసి తనే స్వయంగా నవ్విస్తూ బ్రష్ చేయించి కొద్దిగా వొంగమని చెప్పి చిన్న పైపు ద్వారా నోటిని శుభ్రం చేయించి , తడి గుడ్డ ద్వారా ముఖం చేతులు తుడిచి భుజం పై చేతిని వేసుకొని నడిపించుకుంటూ వచ్చి బెడ్ పై కూర్చోబెట్టి , అమ్మమ్మా టిఫిన్ చెయ్యడానికి ఎంతసేపు అని కోపంగా అరిచింది . 



ఇదిగో బంగారు అంటూ అమ్మ పరుగున వచ్చి ప్లేట్ అందించింది . నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదమ్మా , చేతులు చూడండి ఎలా ఉన్నాయి అని చూపించి , మీరు తినిపించండి అనిచెప్పింది . అమ్మా నాకు చెల్లి తినిపిస్తే తినాలని ఉంది అని ముద్దుగా కొరగానే , చెల్లి ఆనందానికి అవధులు లేనట్లు టవల్ మరియు డ్రెస్ అందుకొని పరుగున బాత్రూం లోకి దూరి అర గంటలో దేవతలా వచ్చి వేడివేడిగా తీసుకురా అమ్మా అని పంపించి , అందుకొని స్పూన్ తో తినిపించబోగా నోటిని మూసేసి తలను అడ్డంగా ఊపాను . అమ్మా అన్నయ్యకు ఇష్టమైనది చెయ్యొచ్చుగా అని కోపంతో అమ్మవైపు చూస్తుండగా , అమ్మమ్మ చెల్లి తలపై సున్నితంగా కొట్టి సరిగ్గా చూడవే మీ ఇద్దరికీ ఇష్టమైన టిఫిన్ , నా బుజ్జికన్నయ్య వాళ్ళ చెల్లి చేతుల ద్వారా తినాలని ఆశపడుతున్నాడు . నువ్వేమో స్పూన్ తో తినిపిస్తున్నావు అని నవ్వుతూ చెప్పింది . సిగ్గుపడి నవ్వుతూ స్పూన్ ను అమ్మమ్మ మీదకు విసిరేసి ఇంతకంటే అదృష్టం ఏముంది అన్నయ్యా అంటూ స్వయంగా చెల్లి తన చేతితో తినిపించింది . చెల్లి చాలా రుచిగా ఉంది అంటూ తింటున్నాను . బుజ్జికన్నా నీకోసం నేనే టిఫిన్ చేసాను లవ్ యు for the కాoప్లిమెంట్ అని మురిసిపోతుండగా , అమ్మమ్మా నా చెల్లెలు తినిపించడం వల్ల మాత్రమే దీనికి ఇంత రుచి వచ్చింది . ఇప్పటివరకూ ఇన్నిరోజులు నీ వంట తిన్నాము ఎప్పుడూ ఇంతలా అనిపించలేదు అని బదులివ్వడంతో , ఒసేయ్ ఇందు , జానకి ఇక మన అవసరం వీళ్లకు లేదే ఇప్పటి నుండి మనల్ని భోజనంలో కరివేపాకులా తీసేస్తారు అని చెప్పడంతో అందరమూ సంతోషన్గా నవ్వుకున్నాము . చెల్లెమ్మా నువ్వు కూడా తిను అని చెప్పడంతో మా అన్నయ్య బంగారం అంటూ అదే చేతితో తానూ తింటూ నాకు కడుపునిండా తినిపించింది . అదంతా డోర్ దగ్గర నిలబడి చూసిన కృష్ణా , దివ్యక్క లోపకు వచ్చారు . చూడరా దివ్యా , కృష్ణా ..........పోటుగాడు మాదిరి అమ్మమ్మా మొత్తం విన్నాము ..........అంటూ వెంటనే అయినా మనం ఇక ఏమీ చేయలేము అమ్మమ్మా వాళ్ళ సంతోషాన్ని చూస్తూ మురిసిపోవడం తప్ప అని బదులివ్వడంతో , అమ్మమ్మ దగ్గరికివచ్చి మా ఇద్దరికీ ప్రాణంగా ముద్దిపెట్టి మా నలుగురినీ వదిలి సంతోషన్గా బయటకువెళ్లారు .మా కోచ్ మరియు అమ్మ కాలేజ్ PET అంటీ దగ్గర నుండి ఫ్రెండ్స్ , relatives ............అందరూ వచ్చి తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించి వెళ్లారు.



మహి , దివ్యక్కా మరియు కృష్ణగాడు నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవడం , అంటీ రోజూ వచ్చి డ్రెస్సింగ్ చేసి తగ్గిపోతోంది అని సంతోషమైన మాటను చెప్పడం , అమ్మావాళ్ళు ఆనందించటం జరుగుతూ రెండువారాలు గడిచిపోయాయి . రెండు వారాలపాటు అమ్మ మరియు మహి కూడా నాకోసం కాలేజ్ లకు కూడా వెల్లకపోవడంతో , అమ్మ కాలేజ్ నుండి అమ్మకు మరియు మా కాలేజ్ నుండి మహికి కాల్స్ వచ్చాయి . 



మేడం మీ అబ్బాయి గురించి తెలిసింది , కానీ ఫైనల్ year స్టూడెంట్స్ కు మీ సబ్జెక్ట్ ఎంత అవసరమో మీకు తెలియంది కాదు . వేరే వాళ్ళను టీచ్ చెయ్యడానికి పంపించాను కానీ స్టూడెంట్స్ మొత్తం మీరు వచ్చేన్తవరకూ wait చేస్తాము అంటున్నారు , ఏమి చెయ్యాలో నాకు తోచడం లేదు అని అమ్మ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు మహి this is the final year , కాబట్టి నువ్వు ఏది సాధించాలన్నా కాలేజ్ కు మంచి పేరు తీసుకురావాలన్నా ఫస్ట్ నుండే కష్టపడాలి , అన్నయ్య కోలుకుంటున్నాడని తెలిసింది , కాబట్టి నువ్వు ............అని చెప్పేంతలో సర్ మా అన్నయ్య కంటే నాకు లైఫ్ లో ఏదీ ఇంపార్టెంట్ కాదు , మా అన్నయ్య పూర్తిగా కోలుకునేంతవరకూ నేను అడుగు బయటకుపెట్టను అని చెప్పేసి కాల్ కట్ చేసి మారూంలోకి వచ్చింది . చెల్లి ఎవరినుండి అని అడిగాను . రాంగ్ నెంబర్ అన్నయ్యా లెట్స్ ప్లే అంటూ బెడ్ పై కూర్చుని చెస్ బోర్డ్ సిపాయిని ముందుకు జరిపింది .



అమ్మ బాధగా ఉండటం గమనించాను . అన్నయ్యా లాప్టాప్ లో మూవీ చూద్దాము పైన ఉంది తీసుకొస్తాను అంటూ వెళ్ళింది . అమ్మమ్మ లోపలికి రావడంతో అడిగాను . ఆదా అంటూ ఇద్దరి కాలేజ్ ల నుండి కాల్స్ వచ్చిన విషయం చెప్పింది . ఇంతలో మహి వచ్చి అన్నయ్యా ఏ మూవీ అంటూ లాప్టాప్ on చేసి నా గుండెలపై వాలిపోయింది . లవ్ యు soooo much చెల్లి అంటూ ప్రాణంగా తలపై ముద్దుపెట్టాను . ఎందుకన్నయ్యా .........అంటూ మురిసిపోతూ చాలా బాగుంది అంటూ నా చేతిని తనచుట్టూ వేసుకొని కామెడీ ఎంజాయ్ చేస్తూ కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా నవ్వుకున్నాము . రాత్రి నా గుండెలపై పడుకున్న చెల్లిని జోకొడుతూ సంతోషన్గా మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నాము .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-09-2019, 10:02 AM



Users browsing this thread: 90 Guest(s)