08-09-2019, 06:15 AM
ఇంత అప్డేట్ .ఎంత బాగా రాసావ్ సోదరా . చంపేశావ్ నీ కథలో ప్రతిదీ ప్రేమతోనే మలుస్తావ్.మహి మహేష్ ల మధ్య అపార్దానికి కారణమైన అమ్మాయి కూడా తన తప్పు తనే తెలుసుకుని నిజం చెప్పుదామ నుకుని మానేసిన కూడా ఆ అమ్మాయనికి కూడా మంచిగానే చూయించారు.అసలు చిన్నపిల్లలు దగ్గర నుంచి కథను మొదలు పెట్టి వారి మధ్యలో విభేదాలకు కారణం కూడా చిన్న విషయమే అయిన దానితో కథను చాలా బాగా నడిపించారు.ఈ అప్డేట్ లో మహి మహేష్ ల ఆధిపత్య పోరు అద్భుతంగా ఉంది.ప్రతిసారి నువ్వా నీనా అని తలపడ్డారు ఇద్దరు.వీళ్లద్దరిని కలపాలని ప్రయత్నాలు బెడిసిగొట్టడం అన్ని చక్కగా కుదిరాయి. మళ్ళీ కృష్ణ దివ్య వొచ్చేశారుగా.మీ కథలో ప్రతిపాత్ర ను కథకు అనుసంధానం చేసే విధానం చాలా బాగుంటుంది.వీనీత్ ప్రమీల అనే కొత్త పాత్రలు వచ్చాయి వాటిని కూడా చక్కగా వినియోగించుకున్నారు ఇప్పటివరకు.ఈ అప్డేట్ లో హైలైట్ మాత్రం చివరలో మహేష్ మహి నమ్మక్కాన్ని గెలుపొందడం కోసం తనని తానే గాయ పరచు కోవడం. చాలా చాలా బాగా రాసారు.