16-11-2018, 09:22 AM
నేను మౌనంగా,తన చేయిపట్టుకుని గేట్ దాకా నడుస్తున్నాను...ఇంతలో తను,నన్ను ఆగమని,తను బయలుదేరిన కొద్దిసేపు తర్వాత రమ్మని చెప్పి,గేట్ తెరుచుకుని తల వంచుకుని,వడి వడిగా నడచుకుంటూ వెళ్ళింది. నేను కాసేపాగి, బండి పెట్టిన చోటుకు వెళ్ళి,బండి స్టార్ట్ చేసి,తనను దాటుకుంటూ కొద్ది దూరం వెళ్ళి ఆగాను.తను పైటను తల మీదగా కప్పుకుని,బైక్ ఎక్కింది.దగ్గరలో ఉన్న బస్ స్టాప్ లో మాలతిని దించి,ప్రక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర నిలబడ్డాను.కొద్ది సేపు తర్వాత వచ్చిన బస్ లో ఎక్కిన మాలతి, వెనకకు తిరిగి,కళ్ళతో నాకు వీడ్కోలు చెప్పింది.నేను పెద్దగా నిట్టూర్స్తూ, బైక్ స్తార్ట్ చేసి ఇంటి వైపు ముఖం పట్టాను..
(అయిపోయింది- తనతో ఒంటరిగా గడపాలన్న శివ కోరికను మాలతి తీర్చేసింది.)
2వ అంకం అయిపోయింది