Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
దాంతో కాపలావాళ్ళు మంజుల మెగుడిని, కొడుకుని అక్కడ నుండి తీసుకెళ్ళారు.

అది చూసి మంజుల భోరున ఏడుస్తూ, “ప్రభూ…నన్ను క్షమించండి…వాళ్ళను వదిలేయండి ప్రభూ,” అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నది.
ఆదిత్యసింహుడు మంజుల చెయ్యి పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “ఎంత ధైర్యం ఉంటే నా మీద గూఢచర్యం చేస్తావు…మర్యాదగా ఏం జరిగిందో నీ నోటితో చెప్పు…నాకు ప్రతి విషయం తెలుసు…కాని నీ నోటి నుండి వినాలనుకుంటున్నాను…నువ్వు ఎవరికోసం ఈ కార్యాలన్ని చేస్తున్నావో నాకు తెలుసు…ఇప్పటికిప్పుడు నిన్ను అపరాధిగా నిరూపించి నీకు దండన విధించినా…ఎవరు నిన్ను రక్షించడానికి ముందుకు రారు…అందుకని ఇప్పుడు నువ్వు నీ నోరు తెరిచి నిజం చెప్పి నీ భర్త, కొడుకు ప్రాణాలు కాపాడుకో,” అన్నాడు.

[Image: rajat001.jpg]

ఆదిత్యసింహుడికి తన గురించి మొత్తం తెలిసిపోయిందని అర్ధం అయిన మంజుల ఇక జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పేసింది.
అంతా విన్న ఆదిత్యసింహుడు మంజుల వైపు చూసి, “ఇంతకు ముందు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే నాకు నీ గురించి తెలుసు మంజుల…నాకు నా దాసి అయిన ఉష గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు…అలాంటిది ఆమె పేరు చెప్పుకుని నా దగ్గరకు వస్తే నేను కనిపెట్టకుండా ఎలా ఉంటాననుకున్నావు…నాకు నీ వలన ఇంకొక్క పని కావాలి… అది కనుక నువ్వు చేస్తే నువ్వు, నీ భర్త, కొడుకుతో పాటు నిరభ్యంతరంగా ఈ రాజ్యంలో నివసించవచ్చు…లేకపోతే నీకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళొచ్చు,” అన్నాడు.
ఆదిత్యసింహుడు మెత్తగా మాట్లాడటం చూసి మంజుల కొద్దిగా కుదుటపడి, “ఏం పని చెయ్యాలి ప్రభూ,” అంటూ కళ్ళు తుడుచుకున్నది.
ఆదిత్యసింహుడు తన పక్కనే ఉన్న లేఖను మంజులకు ఇచ్చి, “దీని మీద మీ రాణి స్వర్ణమంజరీ దేవి రాజముద్ర వేయించుకురావాలి,” అన్నాడు.
మంజుల ఆదిత్యసింహుడి దగ్గర నుండి లేఖ తీసుకుని చదివింది.
ఆ లేఖ చదివేకొద్ది మొహంలో రంగులు మారిపోతున్నాయి.
ఆమె ఒంట్లో వణుకు మొదలయింది.

[Image: PCTV-1000011776-hcdl.jpg]

లేఖ పూర్తిగా చదివి మంజుల ఆదిత్యసింహుడి వైపు చూస్తు, “ప్రభూ ఇది చాలా కష్టమైన పని…రాణి గారికి తెలిసిందంటే నన్ను చంపేస్తారు,” అన్నది.
“ఇప్పుడు మాత్రం నువ్వు ఈ పని చేయకపోతే వదిలేస్తాననుకుంటున్నావా…నువ్వు నాకు దాసిగా ఉంటూ నా పని చేయడం చాలా మంచిది…ఒకవేళ మా వదిన గారికి ఈ సంగతి తెలిసినా నువ్వు నా దగ్గర నాకు నమ్మకంగా పని చేస్తున్నంత వరకు నీకు ఏలోటు లేకుండా చూసుకుంటాను…ఈ పని నువ్వు తప్పితే ఇంకెవరు చేయలేరు…అందుకని వీలయినంత తొందరగా పని చేసుకురా…నువ్వు ఈ పని పూర్తి చేసిన వెంటనే నిన్ను నా అంతఃపుర ముఖ్య అధికారిగా నిన్ను నియమిస్తాను,” అన్నాడు ఆదిత్యసింహుడు.
మంజుల ఇక చేసేది లేక ఆ లేఖ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
అలా వెళ్తున్న మంజుల వైపు చూసి ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వుకుంటూ, “వదిన గారు…..ఇప్పుడు మీరు మా బారి నుండి ఎలా తప్పించుకుంటారో చూస్తాను…నా మీదే మీ తెలివిని ప్రదర్శిస్తారా….నా రాజనీతి మీకు తెలిసివచ్చేలా చేస్తాను,” అనుకుంటూ ఉన్నాడు.
 
***********
 
ఆదిత్యసింహుడి దగ్గర నుండి వచ్చిన మంజులకి ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.
తన పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి లాగా తయారయ్యింది.

[Image: riya-deepsi-02e2d0e6-d03f-4989-ba59-6b42...e-750.jpeg]

ఆ లేఖ మీద స్వర్ణమంజరి దేవి రాజ ముద్ర వేయాలంటే చాలా కష్టం.
ఆ రాజముద్ర ఎప్పుడూ ఆమె వేలికే ఉంటుంది.
స్వర్ణమంజరి ఆ రాజముద్రను స్నానం చేసేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు మాత్రమే తీస్తుంది.
అందుకని మంజుల ఆ లేఖను మడతపెట్టి తన వస్త్రాల్లో దాచుకుని ఏమీ జరగనట్టు స్వర్ణమంజరీ దేవి భవనానికి వచ్చి ఆమె చెప్పిన పనులు చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నది.
ఇవేమీ తెలియని స్వర్ణమంజరి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతున్నది.
స్వర్ణ మంజరి ఏమైనా సమావేశాలు నిర్వహిస్తే మంజుల కూడా అక్కడే ఉండి ఆమె పధకాలను గమనిస్తూ ఉన్నది.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 03-09-2019, 07:46 PM



Users browsing this thread: 10 Guest(s)