మాహి (రే) ...మరిది
Rajsunrise
అదొక పల్లెటూరు. పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు ఏమి కాదు. ఇప్పుడిప్పుడే చిన్న పట్టణంగా రూపాంతరం చెందుతూ కావలసిన మౌలిక వసతులన్నీ ఉన్న గ్రామం. చాల కుటుంబాల లాగే శంకర్, శరత్ ల కుటుంబం మంచి పలుకుబడి, ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం. శంకర్ , శరత్ లు అన్నదమ్ములు. అన్న దమ్ములు అంటే సొంత అన్నదమ్ములు కారు. శంకర్ వాళ్ళ అమ్మ, శరత్ వాళ్ళ అమ్మ అక్కచెల్లల్లు. శరత్ పుట్టిన వన్ ఇయర్ లోపు ఒక రోడ్ ఆక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోతే, చిన్నప్పటి నుండి పెద్దమ్మ దెగ్గర అంటే శంకర్ వాళ్ళ అమ్మ దెగ్గర పెరిగాడు. అల అని ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ కూడా కాదు. ఇద్దరికీ ఒక 12 ఏళ్ల తేడా ఉంది. శంకర్ వాళ్ళ అమ్మ శరత్ ని కూడా సొంత కొడుకుల పెంచడం వల్ల, ఇద్దరు సొంత అన్నదమ్ముల్ల పెరిగారు. అన్నయ్య అంటే శరత్ కి చాల గౌరవం. చిన్నోడు అని అందరు గారాబం చేయడం వల్ల కొంచెం అల్లరి పిల్లవాడే అని చెప్పుకోవాలి. శంకర్ ఇంటర్ చదివి, చదువు వొంటబట్టక, తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ, పొలం పనులు, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ, ఎప్పుడు బిజీ బిజీగా ఉంటాడు. శంకర్ కి పెళ్లీడు వొచ్చింది. సంబందాలు చూస్తున్నారు. శరత్ తొమ్మిదో తరగతి పరిక్షలు అయిపోయి ఫ్రెండ్స్ తో ఇష్టం వొచ్చినట్టుగా తిరుగుతూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే వాడిలో యవ్వనం ఛాయలు తొంగి చూస్తున్నాయి.
"ఏమండి..రెడీ నా...పెద్దోడు ఎక్కడ.టైం అయిపోతుంది. మళ్ళి దుర్ముహూర్తం వచ్చేస్తుంది తొందరగా తెమలండి..చిన్నోడు ఎక్కడ.." అంటూ హడావుడి చేస్తుంది శంకర్ వాళ్ల అమ్మ. ఈ హడావుడి అంత శంకర్ కి పిల్లని చూడడానికి పక్క ఉరికి వెళ్ళడానికి. "హ ..నేను రెడీ
అమ్మ...చిన్నోడు ఎక్కడ.వీడికి ఈ మధ్య బాగా బయట తిరగడం అలవాటు అయింది." అంటూ లోపలి వొచ్చాడు శంకర్. "వాడు నీ కంటే ముందే వొచ్చాడు లే.." అంది శంకర్ కి ఎదురోస్తూ వాళ్ల అమ్మ. శరత్ కూడా అప్పుడే హాల్ లోకి వొచ్చాడు. "ఏరా..నువ్వు రావా.ఇంకా రెడీ కాలేదు "అంటూ అడిగాడు వాళ్ల నాన్న. "ఉహు ..నేను రాను...మీరు వెళ్ళండి.."అన్నాడు. "ముస్కోని రెడీ అయి రా.నాకు కూడా బోర్ కొడతాది నువ్వు లేకుంటే."అన్నాడు శంకర్ తమ్ముడితో. ఇక తప్పదు అన్నట్టుగా ఇష్టం లెకపొఇన రెడీ అయి వాళ్ళతో పాటు బయలు దేరాడు శరత్.
ఒక గంట ప్రయాణం తర్వాత, పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన వాళ్ల ఇంటికి చేరుకున్నారు. ఇల్లు చాల పద్దతిగా అలంకరించి ఉంది. వాళ్ల మర్యాదలు అన్ని వీళ్ళకు నచ్చాయి. వాళ్ళకి ఒక్కతే కూతురు. మాటల మధ్య తెలిసింది దూరం చుట్టరికం కూడా ఉంది అని. "సరే ఇంకా ఎందుకు ఆలస్యం అమ్మాయి ని రమ్మనండి ."అన్నాడు శంకర్ నాన్న. అమ్మాయి వాళ్ల అమ్మ వెళ్లి తీస్కొని వొచ్చింది అమ్మాయిని. అమ్మాయి వొస్తు ఉంటె ఇద్దరు అన్న తమ్ములు కన్ను ఆర్పకుండా చూసారు. "అన్నయ్య..వొదిన చాల బాగుంది.." అన్నాడు మెల్లిగా అన్నతో శరత్. తను వోచి ఎదురుగ కూర్చుంది తల దించుకొని. "ఎం చదువు కున్నావు అమ్మ." అని అడిగాడు మృదువుగా శంకర్ నాన్న. తను తల ఎత్తి " డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాను అండి." అంది. వాయిస్ కూడా చాల బాగుంది. "అన్నయ్య నువ్వు ఇంటర్ కదా మరీ ఎలా." అన్నాడు మెల్లిగా అన్నతో శరత్. వీడి డౌట్ ని క్లియర్ చేస్తున్నాడా అన్నట్టుగా " మరీ మా వాడు..ఇంటర్ నే చదివాడు..చదువు అబ్బలేదు వాడికి..పర్లేదా.." అంటూ అమ్మాయి వైపు చూసి, అమ్మాయి తల్లితండ్రుల వైపు చూసాడు శంకర్ నాన్న.