11-01-2019, 11:00 AM
(This post was last modified: 11-01-2019, 11:01 AM by adultindia.)
నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నిన్న వద్దన్నవాడు ఈరోజు తనంతట తానే స్త్రీగా మారిపోయాడు ఎవరి సహాయం లేకుండా! నేను ఆలోచనల్లో ఉండగానే "ప్రమీ! నేను చీర కట్టుకోవడం ఎలా ఉంది. బాగానే ఉందంటావా? ఏమైనా సరి చేసుకోవాలా?" అని అడిగాడు కమల్. "లేదు. నాకే ఆశ్చర్యంగా ఉంది కమలా" అంటూ నేను తన బుగ్గ గిల్లాను. తనే మళ్ళీ "నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నా కానీ ప్రమీ! నాలో ఉన్న స్త్రీత్వాన్ని చూపించి నాకు గమ్యం ఏమిటో చూపించావు. నీకు థాంక్స్ యెట్లా చెప్పుకోవాలో తెలియడం లేదు. మీ అమ్మ గారు వాళ్ళు వచ్చేవరకూ రోజూ మీ ఇంటికి వస్తే ఏమన్నా ఇబ్బందా? నాలో ఇమిడి ఉన్న ఈ రహస్యం నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు .... ప్లీజ్ కాదనవుగా!" అని అడిగాడు. ఈ రోజు కొనుక్కున్న డ్రెస్ లు కుట్టించి పెట్టావా ప్లీజ్ అంటూ ఇంకో అభ్యర్ధన. నేను "నా ముద్దుల ఫ్రెండ్ కమల అడిగితే యెట్లా కాదంటాను చెప్పు" అంటూ తనను కౌగిలించుకున్నాను. కానీ నాలో నేనే ఏమైనా తప్పుచేసానా .... పాపం లక్షణమైన మగాడిని ఆడదానిగా మార్చేసి ఏమైనా తప్పు చేస్తున్నానా? ఆ నైట్ నేను కొంచెం మూడి గా ఉన్నా తన మాత్రం గల గలా మాట్లాడుతూనే ఉన్నాడు. నిద్ర లేచేసరికి తను రాత్రి కట్టుకున్న చీర లోనే ఉన్నాడు కానీ బ్రష్ చేసినట్లున్నాడు .... నన్ను చూసి తను చదువుతున్న పేపర్ ప్రక్కన పెట్టి ప్రమీ! లేచావా అంటూ ఉండు కాఫీ తెస్తాను అంటూ లేచి వెళ్లి ట్రే లో కాఫీ కప్ పట్టుకొచ్చాడు. ఆ మార్నింగ్ తనే వంట వండాడు. కాలేజీ కి వెళ్దాం అనుకుంటుంటే తను నేను ఈ రోజు కాలేజీ కి రాను ... ఇంట్లోనే ఉంటాను అన్నాడు. నేను నాకు పని ఉంది వెళ్ళాలి అంటూ ఇంటిలో తను ఉంటానంటే సరే అని బయలుదేరాను ..... ఈ లోపు తను ముందు రోజు కొనుక్కున్న సల్వార్స్ లో పింక్ కలర్ సల్వార్ తీసుకుని తన కోసం కొనుక్కున్న అండర్ గార్మెంట్స్ తీసుకుని వాటికి తోడు బ్రెస్ట్ ఫార్మ్స్ కూడా ఫిట్ చేసుకుని సల్వార్ తొడుక్కున్నాడు. తన హెయిర్ విగ్ షార్ట్ పాటర్న్ ఉన్నది తీసుకుని తలపై పెట్టుకుని కళ్ళకు తనే కాటుక పెట్టుకున్నాడు ,,,,, పెదవులకు లిప్ స్టిక్ తనే రాసుకున్నాడు. అచ్చు ఎవరో కాలేజీ అమ్మాయిలా ఉన్నాడు .. నా కళ్ళ ముందు తయారయ్యాడు కాబట్టి తను మగాడే అని నాకు తెలుసు కానీ చూడకుంటే నేను కూడా తను ఆడపిల్లే అను కొనేవాడిని. నేను పనిమనిషి కోసం వెయిట్ చేస్తున్నాను కానీ తనకు చెప్పలేదు. ఈ లోపు తనే అడిగాడు "ఇంకా టైం ఉందా? ఏమైనా పని ఉందా? బయలుదేరకుండా వెయిట్ చేస్తున్నావ్? అని అడిగాడు. నేను ఐలమ్మ కోసం చూస్తున్నా అన్నాను. తను నువ్వులేవకముందే వచ్చి వెళ్ళిపోయింది .... అంట్లు తోమేసి బట్టలు కూడా ఉతికేసి వెళ్ళిపోయింది అన్నాడు. నాకు కమల్ ధైర్యానికి ముచ్చటేసింది. లేకపోతే రెండు రోజుల వ్యవధిలోనే తను ఆడవేషంలో ఉండి పనిమనిషిని మేనేజ్ చేసేస్తాడా? నేను కాలేజీ కి వెళ్లి రికార్డ్స్ సబ్మిట్ చేసి ఇంటికి వచ్చేసరికి తను టీవీ చూస్తున్నాడు. ఇల్లు సర్దినట్లున్నాడు ... అందంగా కనపడుతోంది అల్మైరా. తను ఆ 10రోజులూ అమ్మ వాళ్ళు వచ్చే ముందురోజు వరకూ ఉండి తన డ్రెస్ లూ అవన్నీ కుట్టించుకుని .... నన్ను అడిగి నా పాత డ్రెస్సెస్ కొన్నీ పట్టుకెళ్ళాడు వెళ్తూ వెళ్తూ.నెక్స్ట్ డే అమ్మావాళ్ళు వచ్చేసాక ప్రతిరోజూ ఈవెనింగ్ కమల్ రూంకి వెళ్ళేదాన్ని .... వీకెండ్స్ లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి తన రూంలోనే ఉండిపోయేదాన్ని. అట్లా ఒక ఆరునెలలు గడిచి పోయాయి. హెయిర్ కట్ మానేశాడేమో జుట్టు బాగా పెరిగిపోవడం మొదలు పెట్టింది. రూంలో క్రాస్ డ్రెస్సింగ్ చేసేటప్పుడు విగ్ పెట్టుకోవడం మానేసి తన జుట్టునే పోనీ టైల్ గా వేసుకోవడం మొదలు పెట్టాడు. మధ్యలో నా స్కూటీ మీద తను డ్రెస్ వేసుకుని నైట్ టైం నా వెనుక ప్రక్కగా కూర్చుని బీచ్ రోడ్ అవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక రోజు అలాగే తను లెమన్ యెల్లో శారీ కట్టుకుని నాతో రిషికొండ కి వచ్చాడు. మేము ఒక మూలగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంతలో ప్రమీ అంటూ వచ్చాడు మా అన్నయ్య జీవన్. ఎరా ఎప్పుడొచ్చావ్? వచ్చినవెంటనే కనీసం నాకు చెప్పకుండా ఔటింగ్ ఏమిటిరా అంటూ కావలించుకున్నాను. ఇంతలో అన్న గాడు ప్రక్కనున్న కమల్ ని రెప్పార్పకుండా చూస్తున్నాడు. కమల్ ఇబ్బందిగా తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాడు. నేనే అరేయ్ అన్నయ్యా! ఇది కమల అని నా కాలేజీమేట్. అంటూ పరిచయం చేసాను. తను నెమ్మదిగా తలెత్తి నమస్తే చెప్పింది. కాసేపు మౌనం. నేనే ఇంకా కాసేపు ఉంటే కమల్ సంగతి కనిపెట్టేస్తాడేమోనని భయమేసి అరేయ్ టైం అయిపోతోంది త్వరగా వచ్చెయ్యి అంటూ బయలుదేరిపోయాను.
కమల్ ని తన రూం దగ్గర దించేసి నేను ఇంటికెళ్ళేసరికి మా అన్నయ్య జీవన్ ఇంటికొచ్చేసి ఉన్నాడు. మామూలుగానే కలిసి భోజనం చేశాం. ఆ నైట్ 10గంటల సమయంలో నేను నా వర్క్ చేసుకుంటుంటే నా ప్రక్కన చేరిపోయి యేవో కబుర్లు చెబుతున్నాడు అన్నయ్య. కాసేపటికి ప్రమీ! ఎవరే నీ ప్రక్కన ఉన్న అమ్మాయి? అని అడిగాడు. నేను క్యాజువల్ గానే "తను నా క్లాస్స్మేట్ కమల" అని చెప్పాను. ఏంటీ సంగతి అమ్మాయిల గురించి అడుగుతున్నావ్? అని నిలదీసాను. దానికి వాడు కొంచెం తత్తర పడి ఏమీ లేడులేవే! ఎదవ అనుమానాలూ నువ్వూను .... ఎప్పుడూ నీతో చూడని అమ్మాయిని చూసేసరికి అడిగాను అంటూ వెళ్ళిపోయాడు.
ఆ మరునాడు నేను కాలేజీ కి వెళ్ళగానే కాలేజీ కాంటీన్ లో కమల్ కలిసాడు. మీ అన్నయ్య దగ్గరికి రాగానే కొంచెం భయమేసింది ఎక్కడ కనిపెట్టేస్తాడోనని అని అన్నాడు. వాడు కనిపెట్టలేదు కానీ నీ అందానికి దాసుడైపోయి నీ గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టాడు ..... అని సమాధానం చెప్పి వాడు వెళ్ళేవరకూ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటె మంచిది అని చెప్పి వచ్చేసాను.
ఒక వారం తరువాత అన్నయ్య ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చాయి .... ఒక వారం రోజుల వ్యవధిలోనే వాడికి కాంపస్ ప్లేస్ మెంట్ రావడం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగిపోయింది. వాడు చెన్నై వెళ్ళిపోయాడు. వెళ్లేముందు నాకు చాలా గిఫ్త్స్ కొనిచ్చేసాడు. ఈలోపు జగదీశ్ కి కూడా జాబు వచ్చింది. వాళ్ళమ్మా నాన్నలతో అడిగించాడు మా పేరెంట్స్ ని. వాళ్లకి తనని కాదనడానికి కారణాలు కనిపించలేదు. ఎంగేజ్మెంట్ అయిపొయింది నాకూ జగదీశ్ కి. తన ట్రైనింగ్ అయిపోయాక మా మారేజ్ అని మా రెండు కుటుంబాలు అనుకున్నాయి. ఈ హడావిడిలో నేను కమల్ ని కలవడం కుదరలేదు.ఒక రోజు మార్నింగ్ నేను ఇంటిలోనే ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది చెన్నై నుండి.