Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మ మహి ప్రింటౌట్ లన్నింటినీ చూసి పక్కన పెట్టేస్తూ చివరగా తన ఎంసెట్ ర్యాంక్ ప్రింటౌట్ తో ఆగిపోయి మరియు నా ఎంసెట్ ర్యాంక్ ప్రింటౌట్ అందుకొని , మహి ఎంసెట్ ద్వారా మాత్రమే నువ్వు కాలేజ్ లో చేరబోతున్నావు కాబట్టి వైజాగ్ మరియు చుట్టుప్రక్కల ఉన్న నీకు ఇష్టమైన కాలేజ్ సెలెక్ట్ చెయ్యి అందులో సంతోషంగా జాయిన్ అవుదువు అని మహి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి  చెప్పింది. 



మహి తను ఏమి విన్నదో అర్థం కాక షాక్ లో కదలకుండా ఉండిపోయింది . మహి బంగారు నీకు ఇష్టమేగా వెళ్లి ఏ కాలేజ్ కావాలో సెలెక్ట్ చేసి చెప్పు అని భుజం తాకింది. అమ్మా.........నేను ఐఐటీ అంటుంటే మీరు ఆఫ్ట్రాల్ ఎంసెట్ ద్వారా కాలేజ్ అంటున్నారు అని మాట్లాడింది. చూడు తల్లి మహేష్ ఎక్కడ చదివితే అక్కడే నువ్వుకూడా చదవాలనేదే నా ఏకైక కోరిక అని నీకు తెలుసుకదా , కన్నయ్య ఎంసెట్ ద్వారా మాత్రమే పై చదువులకు అర్హత సాధించాడు కాబట్టి , మీరిద్దరూ ఒకే దగ్గర చదువుకోవాలి కాబట్టి , ఎంసెట్ ద్వారానే నువ్వుకూడా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసింది. అమ్మా..........అనేంతలో , ఇది ఫైనల్ అని బల్లగుద్దినట్లు చెప్పింది.



అమ్మమ్మా మీరైనా చెప్పండి ఎంతో కష్టపడి అన్ని ఐఐటీ క్యాంపస్ లలో సెలెక్ట్ అయ్యే ర్యాంకు సాధించాను. ఇప్పుడు ఎంసెట్ లో చివరి ర్యాంకు సంపాదించిన వాడితోపాటు స్టేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలా చూడండి వాడు ఎలా నవ్వుతున్నాడో అని చూపించింది. ఇలా రా నా బంగారు తల్లి అంటూ మహి చెయ్యి అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , మూసిముసినవ్వులు నవ్వుతున్న నన్ను సున్నితంగా కొట్టి బుజ్జికన్నా నువ్వు నీరూమ్ కు వెళ్లి క్రికెట్ చూడు అని చిరుకోపంతో చెప్పగానే , ok అంటూ అమ్మమ్మ తలపై ముద్దుపెట్టి మహివైపు చూసి కవ్విస్తున్నట్లు నవ్వి పైకి వెళ్ళిపోయాను. మహి అంటూ భుజం చుట్టూ చేయివేసి ప్రేమతో నిమురుతూ , నాకూతురు అదే మీ అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచికోసమే తీసుకుంటుంది. బయట ఎక్కడా సేఫ్టీ లేదమ్మా , మేము ఇక్కడ నువ్వు అక్కడ హాస్టల్ లో ఒక్కటే ఉంటే ప్రతిరోజు , ప్రతి క్షణమూ నీ గురించే ఆలోచిస్తూ ఇక్కడ ప్రశాంతంగా ఉండగలమా . మీ తమ్ము.........sorry అదే మహేష్ తోడుగా ఉంటే మేము ఏ భయం లేకుండా ఉంటాము. నా బంగారుతల్లికి ఉన్న టాలెంట్ కు ఐఐటీ లలో చదివినా ఇక్కడే ఉండి చదివినా ఫ్యూచర్ ఓకేవిదంగా ఉంటుంది కాబట్టి అమ్మచెప్పినట్లు వినమ్మా నా బంగారుకొండ కదూ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి చెప్పింది. 



నేనేంటి స్టడీస్ అంటే ఏమాత్రం ఇంటరెస్ట్ లేని ఆ వేస్ట్ ఫెల్లో తోపాటు ఈ వేస్ట్ కాలేజీలలో చడవడo ఏంటి .......noway అని తెగేసి చెప్పడంతో , అమ్మా నా కూతురికి నామీద ఏమాత్రం ప్రేమ లేదు అంటూ కళ్ళల్లో నీళ్ళు కూడా రాక ఏడుపు నటిస్తూ ...........అమ్మా నేనెప్పుడైనా ....పుట్టినప్పటి నుండి ఇప్పటివరకూ నీ మాట కాదన్నానా , నీ మాటకు ఎదురు నిలిచానా అంటూ బోరున ఏడుపు నటిస్తూ , వీల్లే నా ప్రాణం అనుకున్నాను కదమ్మా , వీళ్ళు నా మాట ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తను దూరంగా వెళ్లిపోతే తనకోసం తన సేఫ్టీ కోసం తిండి తిప్పలు లేకుండా బాధపడుతూ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాలనే కదా వీళ్ళ కోరిక , అయితే అదే జరగనీ నేనేమైనా పర్లేదు నా ప్రాణానికి ప్రాణమైన నా పిల్లలు సంతోషంగా ఉంటే నాలు అదే చాలు , మహి నీ ఇష్ట ప్రకారమే మాకు దూరంగా కష్టపడి సాధించిన ఆ గ్రేట్ ఐఐటీ లోనే చేరి హాయిగా ఉండు , ఇక్కడ మీ అమ్మ , అమ్మమ్మా సంతోషన్గా , అదే చెప్పలేని సంతోషంతో ఉంటాము అని చెప్పి ఏడుస్తూ అమ్మా తను ఏమి అడిగితే , ఎంత డబ్బు అడిగినా ఇచ్చెయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ తన రూంలోకి వెళ్లి  బెడ్ పై బోర్లాపడి బయట హాల్ లోకి వినపడేలా ఏడుస్తూనే ఉంది. ఇందు కుంభస్థలం బద్ధలుకొట్టావు కంటిన్యూ అంటూ వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుని , నీఇష్టం రా బంగారు అనిచెప్పి మధ్యాహ్నానికి వంట చెయ్యడానికి అత్తయ్యతోపాటు వెళ్ళింది.



అమ్మను అంతగా బాధపెట్టానా అని బాధపడుతూ త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని పైన మా రూమ్ కు వచ్చి క్రికెట్ ఎంజాయ్ చేస్తున్న నన్ను చూసి , వీడి బొంగులో ర్యాంకుకు కాలేజ్ లో కూడా చేర్చుకుంటారా ?. అమ్మకు నేనంటే ప్రాణం కొద్దిసేపు అయితే తానే అర్థం చేసుకుంటుంది అని ఆనుకొని ఐఐటీ క్యాంపస్ లతోపాటు వైజాగ్ లోని కాలేజీలను ఒకసారి లాప్టాప్ లో సెర్చ్ చేసింది. అమ్మ ఒంటి గంటకే రూంలో కడుపునిండా తిని అమ్మమ్మతోపాటు తన రూంలోని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు నాతోపాటు మహి కిందకురాగానే అత్తయ్య ద్వారా మెసేజ్ వెళ్లిపోవడంతో , టీవీ ఆఫ్ చేసి అమ్మ బెడ్ పై ఏడుపు నటించడం , అమ్మమ్మ భోజనం ప్లేట్ పట్టుకొని ప్రక్కనే కూర్చుంది.



అత్తయ్యా అమ్మ భోజనం చేసిందా అని మహి అడిగింది. అత్తయ్య నటనలో phd చేసినట్లు మరింతగా పండిస్తూ , ఎక్కడ బంగారు ఆ రూమ్ నుండి బయటకు వస్తే కదా , మీ అమ్మ ఎప్పుడూ ఇంత బాధపడటం చూడలేదు , ఏమిచేస్తావో నీఇష్టం రా అనిచెప్పి మీకు వడ్డించినా , మీరైనా తృప్తిగా తినండి అని చెప్పింది. ఏంటి అమ్మ భోజనం చెయ్యకుండా బాధపడుతోందా , దీనివల్లనేనా అయ్యే ఉంటుంది లే , అమ్మా అమ్మా..........అంటూ పరుగున అమ్మ దగ్గరికి కంగారుపడుతూ వెళ్ళాను. అమ్మమ్మ acting అని చిన్నగా చెప్పింది. మొత్తం అర్థమైపోయి నేను కూడా నావంతు జీవించడం మొదలెట్టాను. మహి లోపలకు రావడం చూసి ఇందు కొద్దిగా తినవే లేకుంటే నీరసం వచ్చేస్తుంది అంటూ అమ్మమ్మ ముద్దకలుపుతూ బ్రతిమిలాడింది. 



నా ప్రాణానికి ప్రాణమైన నీ మనవరాలే నామాట వినడం లేదు ఇక నేను ఎవరికోసం తినాలమ్మా నాకు వద్దు అని ప్లేట్ ప్రక్కకు తోసేసింది. అమ్మా నీమాట నేను వింటాను ఆర్డర్ వెయ్యమ్మా మీకోసం ఏమైనా చేస్తాను , ఒసేయ్ చదువులో ఫస్ట్ వస్తే సరిపోదే అమ్మ అంటే దేవత , దేవత మాట మనకు బాధ కలిగించినా వినాలి . తరువాత తెలుస్తుంది తను ఎందుకు అలా చెయ్యమందో , అమ్మ ఏదీచేసినా అది మన మంచికోసమే అని తెలుసుకో అని చెప్పి, అమ్మా దీనికోసమా మీరు బాధపడుతున్నది చూడు మనం ఎంతబాధపడుతున్నా కొద్దిగా అయినా ఫీల్ అవుతోందా , నేనొక్కడినే అమ్మా మిమ్మల్ని ప్రేమగా చూసుకునేది అని చెప్పాను. మా మాటలకు కొద్దికొద్దిగా కరిగినా మళ్లీ నన్ను చూసి వీడికోసమా నావల్ల కాదు అంటూ భోజనం చేయకుండానే పైకి వెళ్ళిపోయింది. అమ్మా అది తినకుండా వెళ్ళిపోయింది .......ఇందు నేనున్నాను కదా అంటూ ప్లేట్ లో వడ్డించుకొని వెళ్లి ఏవో మాయమాటలు చెప్పి తినిపించింది. అమ్మమ్మ ఖాళీ ప్లేట్ తో రావడం చూసి లవ్ యు అమ్మా అంటూ అమ్మమ్మను బెడ్ పైనే కౌగిలించుకుంది.



రాత్రి కూడా మహి కిందకు రాకముందే కడుపునిండా తినేసి ఎవరికి తగ్గట్లు వారు మళ్లీ నాటకం మొదలెట్టాము. మహి కిందకువచ్చి అత్తయ్యా అమ్మ తినిందా అని నెమ్మదిగా అడిగింది . లేదు మహి అమ్మమ్మ ఎంత బ్రతిమాలినా తినకుండా ఆ రూమ్ వదిలిరాకుండా బెడ్ మీదనే ఉండిపోయింది. అందుకనే మీ డాక్టర్ అంటీకి కాల్ చేసాము అని మాట్లాడుతుండగానే అంటీ లోపలికి వచ్చి hi మహి అమ్మ ఎక్కడ అంటూ తన భుజం చుట్టూ చేయివేసి రూంలోకి వచ్చారు. అమ్మను చూసి ఇందు .........ఏంటి అలా ఉన్నావు అంటూ తన స్టైల్ లో అంతా తెలిసినా నాటకం పండిస్తూ , కిట్ తెరిచి కంగారుకంగారుగా BP , షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసి , అంతా పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ , అమ్మా BP పెరిగిపోతోంది , షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి వెంటనే భోజనం అన్నా చెయ్యాలి లేకపోతే గ్లూకోజ్ ఎక్కించాలి అని చెప్పింది. 



అక్కా నాకేమీ కాలేదు నేను తినను , గ్లూకోజ్ ఎక్కించుకోను నా ప్రాణమైన కూతురే నామాట వినడం లేదు , నన్ను ఇలాగే వదిలేసి మీరుకూడా వెళ్లిపోండి అని నీరసంగా నటిస్తూ చెప్పింది. ఎవరు మహి నీమాట వినడం లేదా నేను నమ్మను , నీకోసం ప్రాణాలైనా అర్పించడానికి రెడీగా ఉన్నారు ఏమంటావు మహి అని అడిగింది. అది కాదు అంటీ అని ఐఐటీ గురించి చెప్పేంతలో .........మహి నిజమే అన్నమాట ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అధికాదు అంటీ ........మహి రీజన్ ఏమైనా కానీ నాకు వినాలని లేదు. మరొక గంటలో మీ అమ్మ నేను చెప్పినట్లు చెయ్యకపోతే స్పృహ కోల్పోతుంది అప్పుడు హాస్పిటల్ కు పిలుచుకొనివెళ్లాలి నీఇష్టం అంటూ వెళ్లిపోతుండగా , మహి కళ్ళల్లో కన్నీళ్ళతో అంటీ ఆగండి అమ్మమాట వింటాను అనిచెప్పి అమ్మా నన్ను క్షమించు అంటూ పాదాలను తాకి మీరు చెప్పినట్లుగానే ఇక్కడే చదువుకుంటాను ,మీకు ఏమైనా అయితే ఈ హృదయం తట్టుకోలేదు అనిచెప్పింది. తన మాటలకు అందరూ లొలొపలే సంతోషిస్తూ అమ్మ అమాంతం లేచికూర్చోని మా బంగారుతల్లి అంటూ కౌగిలించుకుంది. మనసారా కౌగిలించుకొని ఆత్రంగా వెళ్లి ప్లేట్ నిండా భోజనం తీసుకువచ్చి, అమ్మా నాచేతులతో తినిపిస్తాను ఈమొత్తం తినేయ్యాలి అంటూ కన్నీళ్లను తుడుచుకుని తినిపించడం మొదలెట్టింది.



అప్పటికే కడుపునిండా తిని ఉండటం వల్ల నోటిలో నుండి ఒక సౌండ్ కూడా వచ్చి , అమ్మా ...............అని అమ్మమ్మ వైపు సైగ చేసింది. అమ్మమ్మా మరియు అత్తయ్య చిలిపిగా నవ్వుతూ మీ తల్లికూతుళ్ళ ప్రేమ మధ్యన మేమెందుకు రేణుకా , బుజ్జికన్నా వెళదాము పదా అంటూ నవ్వుతూనే బయటకు వచ్చేసాము. 



ఆ రాత్రికే వైజాగ్ లోని నెంబర్ వన్ కాలేజ్ లో అమ్మ చూస్తుండగానే అప్లై చేసింది. నా బంగారుతల్లి అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ,అలాగే మహి నీ తమ్ముడికి అదే కాలేజ్ లో పేమెంట్ సీట్ కు అప్లై చెయ్యి అని చెప్పింది. అమ్మా ఆ పని మాత్రం నేను చేయలేను తాటిచెట్టులా ఆరడగులు పెరిగాడు అదికూడా చెయ్యలేడా  , మా బంగారుతల్లి కదూ మా బుజ్జి కదూ అంటూ బుగ్గలు పట్టుకొని బ్రతిమాలడంతో , అమ్మా వాడికోసం మీరెందుకు బ్రతిమాలడం చేస్తానులే అంటూ చకచకా అప్లై మరియు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు సంతోషమేనా అయితే నవ్వు అని చెప్పింది. అమ్మ నవ్వగానే లవ్ యు మా అంటూ ఒడిలో వాలిపోయి మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి నాకు నిద్రవస్తుంది అని చెప్పి పైకి వెళ్ళిపోతూ , అప్లై చెయ్యడానికి కూడా రాదు వెధవకి అంటూ కోపంతో నన్ను చూస్తూ వెళ్ళిపోయింది. అందరమూ సంతోషం పట్టలేక గట్టిగా కేకలతో అరిచి చిందులెయ్యబోయి మహి వింటుందని ఆగిపోయి ఒకరినొకరు కౌగిలించుకొన్నాము.



కాలేజ్ జాయిన్ అవ్వడానికి ఇంకా రెండునెలల సమయం ఉండటంతో నేను , మహి విడివిడిగా వేరు వేరు డ్రైవింగ్ లెర్నింగ్ లలో కారు డ్రైవింగ్ నేర్చుకున్నాము. అమ్మమ్మ మాకోసం తీసిపెట్టిన డబ్బులతో నాకు పెద్ద కారు మహికి సరిపోయే చిన్న కారు కొనివ్వడంతో సంతోషం పట్టలేక నా పెద్ద కారులో అందరినీ ఎక్కించి టెన్త్ క్లాస్ లో  విజయవాడకు వెళ్లినా నాన్న, దుర్గమ్మ దర్శనం చేయించకుండా తీసుకువచ్చిన సంగతి గుర్తుకువచ్చి , విజయవాడ తీసుకెళ్లి దర్శనం చేయించి అమ్మకళ్ళల్లో ఆనందం చూసి పొంగిపోయాను. రెండురోజులు విజయవాడ మొత్తం చుట్టేసి ఇంటికి చేరుకున్నాము. 



 మా కాలేజ్ కు రెండువారాల ముందుగానే అమ్మ కాలేజ్ స్టార్ట్ అవ్వడం ,అక్కడ పంట వెయ్యడం కోసం తొలిపూజకు అమ్మమ్మను పల్లెకు పిలవడంతో అత్తయ్యను అమ్మదగ్గరే వదిలి అమ్మమ్మ కోరిక ప్రకారం మహితో పూజ జరిపించాలని రాత్రికల్లా వచ్చేస్తామని చెప్పి అమ్మని కౌగిలించుకొని , నేను అమ్మమ్మా , మహి పల్లెకు చేరుకున్నాము. పొలంలో పండగ వాతావరణం నెలకొన్నట్లు కన్నుల పండుగగా మాకోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. మహిని రైతులు పిలుచుకొనివెళ్లి పూజ చేయించి పనులు ప్రారంభించారు. మహి సంతోషన్గా వాళ్ళతోపాటు మధ్యాహ్నం వరకూ కలిసిపోయి గడిపి ,అక్కడే భోజనం చేసి అమ్మమ్మ ఇంటికి చేరుకొని సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకొని చీకటిలోనే వైజాగ్ బయలుదేరాము. నెమ్మదిగా చినుకులు పడి వర్షం పెద్దది అయ్యింది. బుజ్జికన్నా నెమ్మదిగానే వెళ్లు ఎంత ఆలస్యం అయినా పర్లేదు అని అమ్మమ్మ చెప్పడంతో , అలాగే అమ్మమ్మా అంటూ వేగం పూర్తిగా తగ్గించేసాను.



అమ్మమ్మా పొలంలో ఉన్నవాళ్ళంతా చాలా మంచివాళ్ళు నేనంటే చాలా ఇష్టం వాళ్లకు అంటూ వాళ్ళ పేర్లూ కూడా చెబుతూ సంతోషన్గా వెనుక కూర్చుని మాట్లాడుతూ సడెన్ గా ఒరేయ్ కారు ఆపరా అని గట్టిగా కేక వేయడంతో , సడెన్ బ్రేక్ వెయ్యగానే అమ్మమ్మా మీరు ఇక్కడే ఉండండి , ఒరేయ్ నాతోపాటు రా అంటూ డోర్ తీసుకొని దిగిపోయి వర్షం లోనే తడుస్తూ పరిగెత్తింది. ఏమైంది దీనికి అంటూ కారు ప్రక్కకు తీసుకెళ్లి ఆపి కంగారుపడుతున్న అమ్మమ్మను చూసి అమ్మమ్మా నేను వెళ్లి చూస్తాను అంటూ కారు దిగి వెనక్కు చూస్తే ఆ చీకటిలో మహి కనిపించకపోవడంతో , గుండె వేగం అమాంతం పెరిగిపోయి వెనక్కు పరిగెత్తాను . 



ఒరేయ్ ఇక్కడ తొందరగా రారా అన్న మహి పిలుపుకు శాంతించి అటువైపు చూసాను. ఒక కారు రోడ్ ప్రక్కకు దూసుకుపోయి చెట్టుకి గుద్దుకొని హెడ్ లైట్స్ మరియు రెడ్ లైట్స్ వెలుగుతూ ఆగిపోతుండటం చూసి పరిగెత్తుకుంటుపోయాను. చెట్టుకి బలంగా గుద్దుకొని ఇంజిన్ లోనుండి అంత వర్షం లో కూడా మంటలు వస్తుండటం చూసి మహి చెయ్యి అందుకొని వెనక్కు లాగేసి ఇక్కడే ఉండు నేను చూస్తాను అంటూ దూరంగా నిలబెట్టాను. కారుపైన చాలా బ్యాగులు ఉండటం చూసి , వెనుక అద్దం లోనుండి చూస్తే లోపల చిన్నగా మూలుగుతూ నలుగురు కనిపించడంతో , అందరూ కదులుతున్నారు నువ్వెల్లి కారుని వెనక్కు తీసుకురా అని చెప్పి డోర్ ఎంత లాగినా రాకపోవడంతో అద్దం పగలగొట్టి లోపలి నుండి డోర్ తెరిచాను. వెనుక ఉన్నవాన్ని అందుకోబోగా స.......ర్.......మాకేమీ కాలేదు ముందు మా ఫ్రెండ్స్ ......అంటూ చేతితో చూపించి దిగబోతుండగా , ఇద్దరినీ చెయ్యి అందుకొని దింపాను చిన్న చిన్న గాయాలతో ముఖం పై రక్తంతో మంటలను చూసి మరింత భయపడుతుండటంతో,మహి  కారుని నేరుగా మాదగ్గరికి తీసుకువచ్చి ఆపి అమ్మమ్మతోపాటు కిందకు దిగి నిలబడలేకపోతున్న ఇద్దరినీ కారులో వెనుక కూర్చోబెట్టాను. 



 బుజ్జికన్నా జాగ్రత్త మంటలు అని అమ్మమ్మ మాటలు వినపడుతుండగానే కారు ముందు డోర్ ను శక్తినంతా ఉపయోగించి లాగేసి వొళ్ళంతా రక్తంతో స్పృహ కోల్పోయిన ఇద్దరినీ ఒకరితరువాత మరొకరిని భుజం మీద వేసుకొని వెనుక పెద్ద డోర్ తెరిచి కింద పడుకోబెట్టి డోర్ వేసి , వెనక్కు వాళ్ళ ఫ్రెండ్స్ ను చూసి బాధపడుతున్న ఇద్దరి ప్రక్కనే కూర్చుని మహి వేగంగా పోనివ్వు అని , ఊపిరాడుతోంది బ్రదర్ ఏమీ పర్లేదు 10 నిమిషాల్లో హాస్పిటల్ కు తీసుకెళ్లిపోతాము అని ధైర్యం చెప్పాను , 100 కు కాల్ చేసి ఆక్సిడెంట్ విషయం చెప్పాను. మహి నాకంటే బాగా , వేగంగా డ్రైవ్ చేసి సిటీకి చేరుకొని కనిపించిన హాస్పిటల్ లోకి పోనిచ్చి డాక్టర్ డాక్టర్ .........ఎమర్జెన్సీ అని పిలవడంతో , స్టాఫ్ వర్షంలోనే స్ట్రెచర్ తీసుకువచ్చి వెనుక ఉన్న ఇద్దరినీ మరియు నా ప్రక్కనే ఉన్న ఇద్దరినీ నేను మరియు మరొక స్టాఫ్ భుజం పై వేసుకొని లోపలికి తీసుకువెళుతుండగా , బ్రదర్ మీరెవరో తెగేలియదు కానీ దేవుల్లా వచ్చారు అని మాట్లాడుతుండగా , ఇప్పుడు అవన్నీ ఎందుకు బ్రదర్ అనిచెప్పి ICU కు తీసుకువెళ్లాము. 



5 నిమిషాల తరువాత డాక్టర్ వచ్చి ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే అని మిగతా ఇద్దరికీ తలకు తగిలి రక్తం చాలా పోయింది వేరే హాస్పిటల్ నుండి తెప్పించాలి సమయం లేదు అని చెప్పడంతో , మహి నేను ఒక్కసారిగా అయితే మా రక్తం తీసుకోండి అని చెప్పి అమ్మమ్మను కుర్చీలో కూర్చోబెట్టి అంటీకి అమ్మకు కాల్ చెయ్యమని చెప్పి బ్లడ్ ఇవ్వడం చూసి కొలుకున్నవారిద్దరూ దండం పెట్టడంతో , మీ వాళ్లకు ఏమీ కాదు అనిచెప్పి బ్లడ్ ఇవ్వడం పూర్తవగానే  అంటీ నేరుగా ICU లోకి వచ్చి చుట్టుచూసి ముందుగా స్పృహలో లేనివారి కండిషన్ చూసి బ్లడ్ ఎక్కించి హాస్పిటల్ డాక్టర్లతోపాటు ట్రీట్మెంట్ చేసి , మాదగ్గరికి వచ్చి they are safe my హీరోస్ అని చెప్పడంతో మిగిలిన ఇద్దరూ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. వారి దగ్గరకువెళ్లి మొబైల్ ఇవ్వడంతో ఇంటికి కాల్ చేసి విషయం చెప్పారు. బ్రదర్స్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటీతోపాటు బయటకు రాగానే అమ్మ చిన్నగా వణుకుతున్న మహికి జర్కిన్ వేసి , నా బంగారం అంటూ కౌగిలించుకొని టవల్ నాకు అందించింది. అమ్మా మీరు వెళ్ళండి నేను వస్తాను అనిచెప్పాను. వెళ్లడం ఇష్టం లేకపోయినా మహి , అమ్మమ్మ చలికి వణుకుతుండటం చూసి జాగ్రత్త కన్నయ్యా అనిచెప్పి అక్కా ఏదైనా టాబ్లెట్ ఇవ్వు వీళ్ళకి అనిచెప్పి అంటీతోపాటు బయటకు వెళ్లారు.



కొద్దిసేపటి తరువాత కట్లతోనే ఇద్దరూ బయటకు రావడంతో బ్రదర్స్ రెస్ట్ తీసుకోవచ్చుగా , మేము ok ఇంకొద్దిసేపు ఆలస్యం అయి ఉంటే మా ఫ్రెండ్స్......అంటూ కన్నీళ్ళతో బాధపడుతుండటంతో , ఇద్దరినీ కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్లకు ఏమీకాలేదు మీరు బాధపడకండి అని చెప్పాను. ఇంతలో వాళ్ళ పేరెంట్స్ రావడంతో కౌగిలించుకొని లోపాలకువెళ్లి చూసివచ్చి నన్ను చూపించడంతో , రెండు చేతులతో నమస్కరించడంతో మీరు పెద్దవారు వాళ్లకు ఏమీ కాదు ట్రీట్మెంట్ చేసింది మా అంటీ , త్వరలోనే కొలుకుంటారు అని ధైర్యం చెప్పి చాలాసేపు ఉండీ వాళ్ళు స్పృహలోకి వచ్చిన తరువాత వారి సంతోషం చూసి రేపు వస్తాను అనిచెప్పి 10 గంటలకి ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేన్తవరకూ అందరూ భోజనం కూడా చెయ్యకుండా వేచి చూస్తుండటంతో వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొనివచ్చి , నుదుటిపై ప్రాణంగా అమ్మ ముద్దు అందుకొని భోజనం చేసి అమ్మమ్మా మీరు ok కదా అని అడిగాను. మా బుజ్జికన్నా అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది. నవ్వుతూ మహివైపు చూసి అందరూ స్పృహలోకి వచ్చారు గుడ్ జాబ్ అని చెప్పాను. పోరా నీ బోడి పొగడ్తలు ఎవరికి కావాలి అని వెచ్చగా అమ్మ ఓడిలోనే పడుకొంది. థాంక్స్ god అంటూ మొక్కి మహికి జోకొట్టింది. 



నెక్స్ట్ రోజు ఉదయమే హాస్పిటల్ కు వెళ్ళాను. కానీ అప్పటికే  వాళ్ళు ok అని తెలుసుకొని పెద్ద హాస్పిటల్ కు వెళ్లిపోయారని , ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పడంతో , వాళ్ళు కొలుకున్నారు అది చాలు అనుకొని ఇంటికివచ్చేసాను. 



రెండువారాలు సరదాగా గడిచిపోవడంతో మరో రెండు రోజుల్లో కాలేజ్ ఓపెనింగ్ అని మెసేజ్ రావడంతో షాపింగ్ కు వెళ్లి బట్టలతోపాటు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని చివరగా మహి నీకు ఎలాంటి చీరలంటే ఇష్టం అని అమ్మ ఆడిగింది. అమ్మా చీరలా నాకా వద్దే వద్దు , నాకు carry చెయ్యడం రానేరాదు నన్ను వదిలెయ్యండి అంటూ దండం పెట్టడంతో , ఒసేయ్ చీరలు కట్టుకోవడం నేర్చుకోకపోతే ఎలానే అమ్మాయిలకు చీరలే కదా అందం అని అమ్మమ్మ చెప్పినా వద్దే వద్దు కావాలంటే మరిన్ని డ్రెస్ లు కొనివ్వండి అని బదులిచ్చింది. ఒకసారి అప్పటికే సెలెక్ట్ చేసినవి చూసి ఆశ్చర్యపోతూ కానీ నీ ఇష్టం షాప్ మొత్తం కొనేయ్ అంటూ నవ్వుతూ తనకు ఇష్టమైనవన్నీ కొనేసి కారులో పట్టకపోవడంతో మామీద కూడా పెట్టుకొని సంతోషన్గా నవ్వుతూ ఇంటికి చేరుకున్నాము. 



భోజనం చేసి అలసిపోయి రూంలోకి వచ్చి బెడ్ పై వాలిపోతూ ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దం లో తనను చూసుకొని ఆగిపోయి , కన్నార్పకుండా చూస్తూ ఐఐటీ లో ఉండాల్సిన దాన్ని ఇక్కడ వేస్ట్ కాలేజ్ లో చేరబోతున్నావా అని మనసు మాటలు వినిపించినట్లు ఒక్కసారిగా చిరునవ్వు మాయమై తన్నుకొస్తున్న బాధతో బెడ్ పై బోర్లా పడిపోయి కళ్ళల్లో నీళ్లతో బాధపడింది , లేచి షోకేస్ లో ఉన్న డివైడర్ ఫ్రేమ్ అందుకొని అంతా వీడివల్లనే అని కోపంతో రగిలిపోయింది. నేను రూంలోకి రాగానే నేను చూస్తుండగానే దానిని నాకు గుర్తుచేస్తున్నట్లు అక్కడే పెట్టేసి బెడ్ పై వాలిపోయింది. ఇది ఇంకా మనసులోనే పెట్టుకుంది ఏమి చేస్తాం అంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను. తరువాత రోజంతా కూడా మూడీగానే ఉంది. అమ్మావాళ్ళు ఏమైందని అడిగినప్పుడు మాత్రం నవ్వుతోంది.
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 07-09-2019, 10:15 AM



Users browsing this thread: 194 Guest(s)