Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రణయ కథలు...by pranay
#13
నేను అలా ఆలోచిస్తూ ఉండగానే, అతను సడెన్ గా బైక్ ఆపాడు. ఒక్కసారిగా అతన్ని ఒత్తుకొని, సర్దుకున్నాక చూస్తే, ఎదురుగా ఐస్ క్రీమ్ పార్లర్. అతను �దిగు..� అన్నాడు. �ఎందుకూ!?� అన్నాను నేను. �చాక్లెట్ లాంటి పాప పక్కన ఉంటే, ఐస్ క్రీమ్ తినకపోవడం చట్టరీత్యా నేరం కాబట్టి.� అన్నాడు అతను. అతను అన్న తీరుకి ఫక్కున నవ్వాను. అంతలోనే ఇంట్లో నా కోసం వెయిట్ చేసే నాన్న గుర్తొచ్చాడు. �అమ్మో..� అనుకొని, �వద్దు సార్.. ప్లీజ్.. ఇంటికి వెళ్ళాలి.� అన్నాను. అతను కాస్త అలిగినట్టు చూసి, �సార్ అనొద్దన్నానా!� అన్నాడు. నేను ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, �ఓకే..శ్రీ.. సరేనా! ప్లీజ్.. ఇప్పుడు వద్దు.. లేట్ అయిపోతుంది.� అన్నాను. అతను నా కళ్ళలోకే చూస్తూ, �మరి ఎప్పుడూ!?� అన్నాడు. అవును, మరి ఎప్పుడూ? ఎప్పుడూ కుదరదని నాకు తెలుసు. ఎందుకంటే, నాన్న లేత్ అయితే ఒప్పుకోడు, తిడతాడు. నేను ఆలోచనల్లో ఉండగానే, అతను �రోజూ ఇదే టైం కి నువ్వు కాలేజ్ నుండి బయటకి వస్తావ్. ఇదే టైంకి ఇంటికి వెళ్ళాలి అన్నావ్. మరి ఎప్పుడూ!?� అన్నాడు. నాకు ఏం చెప్పాలో అర్ధంగాక, �నన్ను ఇంటిదగ్గర దింపండి సార్.. సారీ శ్రీ.. ప్లీజ్..� అన్నాను. అతను మౌనంగా బైక్ స్టార్ట్ చేసి, ముందుకు పోనిస్తూ, �చెప్పు ఎటు వెళ్ళాలీ!?� అన్నాడు. నేను దారి చెబుతూ ఉంటే, అతను తీసుకెళ్ళసాగాడు. మా ఏరియాకి రాగానే, �ఇక్కడ ఆపు.� అన్నాను కంగారుగా. �ఇక్కడేనా మీ ఇల్లు?� అన్నాడు అతను. �కాదు, కానీ ఇంకా ముందుకు వద్దు.� అంటూ, కిందకి దిగి నడవసాగాను. �ఏయ్ నీరూ! వన్ మినిట్..� అని అరిచాడు. నేను ఆగి అతని వైపు చూసాను. అతను బైక్ స్టేండ్ వేసి, నా దగ్గరకి వచ్చాడు. �ఒక విషయం మరచిపోయాను.� అన్నాడు. ఏమిటీ అన్నట్టు చూసాను. అతను అటూఇటూ చూసాడు. ఎవరూ లేరు. పైగా మేమున్నది కాస్త చీకట్లో. ఆ చీకటి ఎందుకో నాలో కాస్త గుబులు రేపుతుంది. ఆ గుబులుతోనే, అతను ఏం చెబుతాడా అన్నట్టు అతని కళ్ళలోకి చూసాను. అయితే అతను ఏమీ చెప్పలేదు. అలానే చూస్తున్నాడు. �మ్.. అలా చూడడానికేనా ఆపిందీ!?� అని, ముందుకు కదలబోతుండగా, అతను గబుక్కున నన్ను కౌగిలిలోకి లాక్కొని, చప్పున నా పెదాలపై ముద్దు పెట్టేసాడు. అదీ ఒక్క అరక్షణం మాత్రమే. ఆ అరక్షణం లోనే, నాకు ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. అతను మాత్రం తాపీగా తన బైక్ దగ్గరకి వెళ్ళి, �గుడ్ నైట్..� అని చెప్పి, స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన ఐదు నిమిషాలకి గానీ, నాలో చెలరేగిన తుఫాన్ ఆగలేదు. కోపం, మురిపెం, తమకం లాంటి రకరకాల భావాలతో నా మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, మెల్లగా ఇంటికి చేరాను.

రాత్రి నిద్రపోదామనుకుంటే, నా పెదవులపై అంటిన అతని తడి నిద్ర పోనీయడంలేదు. అతను చేసిన పనికి ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. చిన్నప్పుడు మధు చేసిన పనికి కూడా వేడెక్కింది. కానీ ఆ వేడికీ, ఈ వేడికీ మధ్య తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఎంత ఆలోచించినా అర్ధం కావడంలేదు. ఇక ఆలోచించే ఓపిక లేక నిద్ర పోదామన్నా, నిద్ర రావడం లేదు. మాటిమాటికీ ఎందుకో నవ్వొస్తుంది. అంతలోనే కోపం వస్తుంది. ఈ రెంటినీ భరించలేక చిరాకొస్తుంది. ఆ చిరాకు చూసి మళ్ళీ నవ్వొస్తుంది. ఈ విచిత్రమైన భావ ప్రకంపనలను ఏమంటారో తెలియడం లేదు. ఆ ప్రకంపనలలోనే అలాగే గిలగిలా కొట్టుకునేసరికి తెల్లారిపోయింది. నిద్ర లేక కళ్ళు భగ్గుమని మండిపోతున్నాయి. కాలేజ్ కు డుమ్మా కొడదామనుకున్నాను. కానీ నాకే తెలియకుండా నా కాళ్ళు కాలేజ్ వైపుకు నడిచేసాయ్. కాలేజ్ కు వెళ్ళాక, నా కళ్ళు అతని కోసం వెదికేసాయ్. అలా వెదుకుతూ ఉండగా, నాపై ఒక చీటీ పడింది. ఉలిక్కిపడి చుట్టూ చూసాను. అతను కనబడలేదు. తిట్టుకుంటూ చీటీ తెరిచాను. �ఆడపిల్ల కళ్ళు ఎర్రబడ్డాయీ అంటే, కారణాలు రెండు. ఒకటి, ప్రియుడు అల్లరి చేస్తే తాపంతో, అల్లరి చేయకపోతే కోపంతో.. మరి నీ కారణం ఏమిటో!?� అని ఉంది అందులో. నేను చీటీ చదవడం అతను చూస్తున్నాడని తెలుసు. చూస్తూ చిలిపిగా నవ్వుకుంటున్నాడని తెలుసు. ఈ చీటీలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అలా ఇవ్వడానికి వీలుగా, నేను క్లాస్ కు వెళ్ళకుండా, కాలేజ్ ప్రిన్సిపల్ రూం దగ్గరకి నడిచాను.
Like Reply


Messages In This Thread
RE: ప్రణయ కథలు...by pranay - by Milf rider - 31-08-2019, 04:30 PM



Users browsing this thread: 2 Guest(s)