16-11-2018, 07:30 AM
వారం రోజుల తర్వాత,ఆయన డిశ్చార్జ్ అయ్యారు.ఈ వారం రోజులు వీలయినప్పుడల్లా హాస్పిటల్ కు వెళ్లి ఆయనను పలకరించేవాడిని.ఆయన కూడా బాగానే మాట్లాడేవారు.బాగనే కోలుకున్నారు కాని,కాలు మాత్రం సర్దుకోడానికి కనీసం మూడు నెలలు పట్టోచ్చు అంటున్నారు.అప్పుడప్పుడు మాలతికి ఫోన్ చేసి ఆయన బాగోగులు కనుక్కునే వాడిని.ఇంటికి వెళ్లి పరామిర్శించేవాడిని. మాలతి ఇంటి పనులు బయటి పనులతో సతమతం అవుతుండేది.తన మొహం మీద చిరునవ్వు చూసి చాలా కాలమయింది.రెండు వారాల తర్వాత తన ఆడపడుచు వెళ్ళిపోయింది.మాలతి తో మనసు విప్పి మాట్లాడి చాలా కాలమయ్యింది.తనూ కాలేజ్ కు వెళ్ళడం మొదలుపెట్టింది.
ఒకరోజు మాలతిని చూడాలని,సింధును క్లాసు రూం లో వదలి గేటు దగ్గర నిలబడ్డాను,ఇంతలో మాలతి వచ్చింది.ముఖం లో కళలేదు.నన్ను చూసి పేలవంగా నవ్వింది.
"ఎంత సేపయ్యింది శివా?... వచ్చి"
"ఇప్పుడే.. బాగున్నవా?"
"ఏదో ఉన్నాను”.
“ఆయన ఎలా ఉన్నారు?"
"పర్వాలేదు,కాని రెండు నెలలదాకా ఆయన నడవలేరు",గొంతు గాద్గికంగా ఉంది.కంట్లో నీరు.
"మాలతి ప్లీజ్...కంట్రోల్ యువర్ సెల్ఫ్ "
"మ్మ్....."కళ్ళు తుడుచుకుంటూ నన్ను చూసింది.
"నువ్వెలా ఉన్నావు శివా?"
"బాగానే ఉన్నాను.మనసు బాగోలేదు అందుకే నిన్ను చూడాలని వచ్చాను"
"మ్మ్...."
"సారి...నీకిన్ని కష్టాలు వస్తాయని అనుకోలేదు మాలతి"
"నేను చేసిన పాపానికి ఆయన ఫలితం అనుభవిస్తున్నారు" (పెద్ద నిట్టూర్పు )
"నో మాలతి.నీవేమి చేశావు?అలాంటిదేమి లేదు"
"లేదు శివా,నాకు తెలుసు.ఇదంతా నా పాప ఫలితమే.పాపం ఆయనకు శిక్ష పడింది"
"వ్వాట్? నువ్వేమి చెశావు?
చెమర్చిన కళ్ళతో నన్ను చూస్తూ "శివా,నా ముఖం చూసి చెప్పు,నీకేమి తెలియదా?నేనేమి పాపం చెయ్యలేదా?" సూటిగా అడిగింది.
"నో..ఇప్పుడు జరిగిన దానికి,మనం చేస్తున్నదానికి సంబంధమే లేదు.గజిబిజి ఆలోచనలతో నీ మనస్సు పాడుచేసుకోకు."
"మ్మ్...."
కొంచం సేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.తను కళ్ళు తుడుచుకొని"సరే శివా,ఇక నేను వెళతాను.క్లాసుకు టైం అయ్యింది"అంటూ కదలింది.