Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అలా ఇద్దరమూ మాట్లాడుకోకుండా పొట్లాడుతూ , అమ్మా అమ్మమ్మ ప్రక్కన ఉన్నప్పుడు మాత్రం సైలెంట్ ఉన్నట్లు నటిస్తూ, రూంలో ఉదయం అంతా బెడ్స్ కలిపి రాత్రి అమ్మ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోగానే కోపంతో చురచురా చూసుకుని దూరంగా జరిపి పడుకొని , ఉదయం లేవగానే బాత్రూం లో ఒకరోజు తను ఆలస్యం చేసి నన్ను ఇబ్బందిపెట్టడం , మరొకరోజు నేను అదేపనిగా ఆలస్యం చేసి తనను ఇబ్బందిపెట్టడం , క్లాస్ లో దూరం దూరం కూర్చోవడం , తను స్టడీస్ లో టాప్ ఉండటం , నేను స్పోర్ట్స్ లో నెంబర్ వన్ కానీ స్టడీస్ లో కేవలం టీచర్స్ దయ వల్ల పాస్ మార్కులతో గట్టెక్కి టెన్త్ క్లాస్ చేరుకున్నాము.



సెలవులలో అమ్మమ్మ పల్లెకు వెళ్లి స్వచ్ఛమైన పచ్చటి తోటలలో రెండు నెలలపాటు సిటీకి దూరంగా , నాన్నతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంజాయ్ చేసాము. ఆ రెండు నెలలు వ్యవసాయం గురించి తెలుసుకొని వరి నాట్లు ఎలా పెట్టడమే నేర్చుకున్నాను. రైతులతో పాటు ఉదయం నుండి సాయంత్రం వరకూ పొలాలలోనే కష్టపడటం నేర్చుకున్నాను. దానివల్ల ఆరెండు నెలలు ప్రత్యేకంగా జాగింగ్ మరియు జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఫ్రెష్ వెజిటబుల్స్ తిని ఆరోగ్యానికి ఆరోగ్యంతోపాటు పొలంలో విశ్రమించకుండా కష్టపడటం వల్ల స్ట్రాంగ్ గా తయారయ్యాను. నా వయసుకు మించిన బరువును మోయటం , పొలాల్లో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి కంచె దగ్గర అవలీలగా వెయ్యడం చూసి అమ్మమ్మ చాలా సంతోషించింది. మహి మాత్రం అమ్మమ్మా పని వాడిలా ఉన్నాడు , వీడికి సరిగ్గా సరిపోయే జాబ్ ఇదే , చదువు మానేసి ఇక్కడే ఉంచి వొళ్ళు వొంచేలా పనిచేయించడం మంచిది అని చెప్పడంతో , అమ్మావాళ్ళు విని సంతోషంగా నవ్వుకున్నారు. 



కోపంగా వెళ్లిపోవడం చూసి బుజ్జికన్నా , నాన్నా వ్యవసాయం గురించి తనకేమీ తెలుసు ఇప్పటివరకూ నువ్వు కష్టపడి చెయ్యడం వల్ల కొన్ని నెలల తరువాత బియ్యంగా మారి ప్రపంచమంతా సులభంగా తినేలా ఇంటికి చేరుతాయి. అందుకే రైతే రాజు అన్నారు , నువ్వు తన మాటలను పట్టించుకోకు, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు అని పొగడటంతో , లవ్ యు అమ్మమ్మా అంటూ మరింత ఉత్సాహంతో రైతులతోపాటు సంతోషంగా పని పూర్తిచేసాను. రెండు నెలలు రెండు రోజులులా గడిచిపోవడంతో సిటీకి బయలుదేరుతూ,  పంట జాగ్రత్త అని మరీ మరీ అమ్మమ్మ వాళ్లకు చెప్పింది.



కాలేజ్ కి వెళ్లిన మొదటిరోజే 10 th క్లాస్ స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలని , అమ్మా మరియు అమ్మమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలని నిర్ణయానికి వచ్చినట్లు అందుకు అనుగుణంగా టైం టేబుల్ వేసుకొని మరీ రాత్రి పగలూ చదవడం మొదలెట్టింది. 



కాలేజ్ లోకి అడుగుపెట్టగానే PET నాతోపాటు స్పోర్ట్స్ ఎంచుకున్న వాళ్ళందరినీ పిలిపించి నెక్స్ట్ month state ఛాంపియన్ షిప్ జరగబోతోంది కాబట్టి మీరు ప్రాక్టీస్ మరింత పెంచి మనమే అన్ని స్పోర్ట్స్ , అథ్లెటిక్స్ లో రాణించి ఛాంపియన్ షిప్ ను మన కాలేజ్ కి వచ్చేలా చెయ్యాలి. మనం ఈ కాలేజ్ లో ఉండబోయేది ఇక కేవలం ఒక సంవత్సరం మాత్రమే , మీరు కాలేజ్ వదికివెళ్లిన మరుక్షణం మీరు ఎవరన్నది కాలేజ్ మొత్తం మరిచిపోతుంది. అలా కాదు కాలేజ్ ఉన్నంతకాలం మీపేర్లు స్పోర్ట్స్ బోర్డ్ పై చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మీ ముందు ఉన్న ఏకైక గమ్యం ఈ స్టేట్ ఛాంపియన్ షిప్ , ఇప్పుడు చెప్పండి మీరు ఏమి చేయబోతున్నారు అని అడుగగానే ,ఒక్క స్వరంతో మనం స్టేట్ ఛాంపియన్స్ అంటూ గట్టిగా అరిచిమరీ చెప్పడంతో , గుడ్ బాయ్స్ ఈరోజు నుండి మనకు స్పోర్ట్స్ తప్ప మరొక దానిమీద ధ్యాస ఉండకూడదు అని మోటివేషన్ స్పీచ్ కు అందరూ గొప్పగా ఫీల్ అయ్యి విశ్రమించకుండా ప్రాక్టీస్ లో మునిగిపోయాము. మహేష్ నా hopes అన్నీ నీమీదనే అని గర్వంగా చెప్పి , సెలవులో బాగా స్ట్రాంగ్ గా తయారయ్యావు గుడ్ ఒక స్పోర్ట్స్ బాయ్ ఎలా ఉండాలో ఇప్పుడు exact గా అలా ఉన్నావు అంటూ భుజం తట్టి ప్రశంశించారు. Thank యు సర్ కచ్చితంగా నావంతు శాయశక్తులా ప్రయత్నిస్తాను సర్ అని చెప్పి  అమ్మమ్మా అంతా నీవల్లనే లవ్ యు అంటూ మనసులో అనుకోని మురిసిపోయి ప్రాక్టీస్ మొదలెట్టాను.



సాయంత్రం 4 గంటల వరకూ కాలేజ్ లో PET కింద చెయ్యడంతో పాటు అమ్మ కాలేజ్ కు చేరుకొని , అమ్మ పరిచయం చేసిన కాలేజ్ PET అంటీని కలిసి స్టేట్ ఛాంపియన్ షిప్ పోటీల గురించి వివరిస్తుండగానే , మహేష్ నేనే నీకు కాల్ చేసి విషయం చెబుదామనుకున్నాను , ఏకంగా నువ్వే వచ్చేసావు అని చెప్పింది. అంటీ మా కాలేజ్ సర్ కూడా బాగానే ప్రాక్టీస్ చేయిస్తున్నారు కానీ అన్నింటిలో ఫస్ట్ ఉండాలంటే నాకు మీ గైడెన్స్ కూడా కావాలి అని అడగడంతో , sure మహేష్ ఇలాగే నెలరోజులపాటు కాలేజ్ అయిపోగానే వచ్చెయ్ ఇక్కడ ప్రాక్టీస్ చేసేద్దాము అని బదులివ్వడంతో , థాంక్స్ అంటీ అంటూ అమ్మావాళ్లను ఇంటికి వెళ్ళమని చెప్పాను. అత్తయ్య మాత్రం నేను అంటీతో ప్రాక్టీస్ చేసేంతవరకూ ఉండి చూసి మురిసిపోయి , మా మహేష్ బంగారం అంటూ తలపై ప్రేమతో నిమిరి ఇంటికి వస్తూ దారిలో ఫ్రూట్ జ్యూస్ తాగించింది.



మైండ్ లో ఛాంపియన్ షిప్ కొట్టడం మాత్రమే పెట్టుకొని ఉదయం 4 గంటలకు గ్రౌండ్ మరియు జిమ్ కు వెళ్లిపోవడం , పుష్టిగా తిని కాలేజ్ కు వెళ్లిపోవడం సాయంత్రం వరకూ కాలేజ్ లోనే అన్ని గేమ్స్ అలుపులేకుండా , రెస్ట్ తీసుకోకుండా ఆడడం , కాలేజ్ వదలగానే నేరుగా అంటీ దగ్గరికి అత్తయ్య పిలుచుకొనివెళ్లి పూర్తిగా శక్తిలేనంతవరకూ అంటీతోపాటు ప్రాక్టీస్ చేసి అలసిపోయి చిన్న చిన్న దెబ్బలతో ఇంటికి చేరడం , అమ్మావాళ్ళు ఒకవైపు చెప్పలేనంత సంతోషం మరొకవైపు గాయాలను రక్తాన్ని చూసి కళ్ళల్లో నీళ్లతో బాధపడుతూ మందురాయడం . 



ఎందుకమ్మా బాధపడతావు అంటూ అమ్మ కన్నీళ్లను తుడిచి ఇప్పుడు ఎంత కష్టపడితే నెల తరువాత పోటీలలో ఒక్కొక్కటే గెలుస్తుంటే అంత ఆనందం మీ కళ్ళల్లో చూడాలనేదే అమ్మా నాకొరిక అనిచెప్పి అమ్మా మీ ఒడిలో కాసేపు పడుకుంటే నొప్పులన్నీ వెళ్లిపోతాయి అని నవ్వుతూ చెప్పడంతో , రెండు చేతులు చాపి రా నాన్నా అని పిలిచి తన ఒడిలో పడుకోబెట్టుకొని కురులను ప్రేమతో నిమురుతూ ,మా మహేష్ బంగారం అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది. ఆహా.........ఎంత హాయిగా ఉందమ్మా అంటూ అమ్మ నడుము చుట్టూ చేతులువేసి గట్టిగా హత్తుకొని ఏఏ ఆటలలో పోటీపడుతున్నానో వివరించాను. మా బుజ్జి కన్నయ్యే అన్నింటిలో ఫస్ట్ వస్తాడు అంటూ మురిసిపోయింది. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా అని చెప్పి రేపటి నుండి మరింత ప్రాక్టీస్ పెంచాలి అని మనసులో అనుకొని , అమ్మా రేపు తొందరగా లేవాలి అనిచెప్పి భోజనం చేసి పైకివెళ్లి తొందరగా పడుకున్నాను. కొద్దిసేపటి తరువాత మహి వచ్చి బుక్స్ తెరిచి చదువుకోబోతుండగా , నేను తొందరగా లేవాలి నాకు లైట్స్ ఉంటే నిద్రపట్టదు అని కోపంతో చెప్పాను. అది తెలిసే లైట్స్ అన్నింటినీ on చేసి చదువుకుంటున్నాను మూసుకొని రగ్గు నిండుగా కప్పుకొని పడుకో అని చిలిపిగా నవ్వుకొంది.



కొవ్వు అంటూ మళ్లీ ఒకసారి చెప్పినా వినకపోవడంతో అమ్మా అమ్మా.........అంటూ గట్టిగా అరవడంతో, ఒరేయ్ అమ్మను ఎందుకురా పిలుస్తావు అంటూ లేచి లైట్స్ అన్నింటినీ ఒఫ్చేసి టేబుల్ లైట్ మాత్రమే వేసుకొని చాలాసేపటివరకూ చదువుకుంది. 



అలా అలా 28 రోజులు గడిచిపోవడంతో పోటీలు తిరుపతిలో కాబట్టి మా అందరికీ కాలేజ్ తరుపు నుండి ట్రైన్ రిజర్వేషన్స్ చెయ్యడంతో , రెండు రోజుల ముందు అమ్మావాళ్ళంతా మరియు కాలేజ్ అంటీ , డాక్టర్ అంటీ స్టేషన్ కు వచ్చి all the best అని చెప్పి , మహి మహేష్ కు all the బెస్ట్ చెప్పమనడంతో , ఇంట్లోనే చెప్పానమ్మా అని అనడంతో , ఏమీ పర్లేదు మళ్లీ చెప్పమని ఫోర్స్ చెయ్యడంతో నావైపుకు చూడకుండా all the best అని చెప్పింది. నీ బోడి విషెస్ ఎవరికి కావాలి పోవే అన్నట్లు కళ్ళతో సైగ చేసి , ట్రైన్ horn సౌండ్ విని లవ్ యు అమ్మా , లవ్ యు అమ్మమ్మా , లవ్ యు అత్తయ్యా , లవ్ యు.........పోవే అంటూ కళ్ళతో సైగ చేసి ట్రైన్ అందరమూ ఎక్కాక పిల్లల పేరెంట్స్ అందరికీ నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మా సర్ ఎక్కారు.



తిరుపతి చేరుకొని అక్కడి పరిస్తులకు ఒక్కరోజులో అలవాటు పడి మాకు allot చేసిన గ్రౌండ్ లో చివరిసారి ప్రాక్టీస్ చేసి పోటీల రోజు సర్ useful స్పీచ్ విని , షెడ్యూల్ ప్రకారం 10 రోజులపాటు రోజుకు రెండు మూడు గేమ్స్ లో పోటీపడి స్టేట్ లెవెల్ లో చాలా పోటీ ఉన్నప్పటికీ అమ్మ కాలేజ్ PET అంటీ దగ్గర నేర్చుకున్నదీ మరియు ప్రాక్టీస్ చేసినది మరింత సహాయపడి ఎక్కడా తగ్గకుండా దాదాపు 75% గేమ్స్ , స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్ లో మొదటి బహుమతులను మరియు నేను పోటీ చేసిన అన్నింటిలో దాదాపు అన్నింటిలో గోల్డ్ మెడల్స్ సాధించడంతో, మా సర్ ఆనందానికి అవధులు లేక అందరూ వచ్చి నన్ను సంతోషం పట్టలేక అమాంతం పైకి ఎత్తి సంబరాలు చేసుకున్నాము. 



మా కాలేజ్ తో పాటు తిరుపతి నుండి ఒకటి , అనంతపురం నుండి ఒక కాలేజ్ మరియు తూ గో కాలేజ్ ఓవర్ అల్ ఛాంపియన్షిప్ కోసం దాదాపు ఒకే స్టేజి లో ఉండటంతో స్టేట్ స్పోర్ట్స్ కమిటీ ఎవరికి అనౌన్స్ చెయ్యబోతున్నారో అని ఒకటే టెన్షన్ పడుతుంటే సాయంత్రం 5 గంటలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్టేజి మీదకు వచ్చి అదే విషయం చెప్పి , ముందుగా పోటీలు succussful గా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపి , 



Overall స్టేట్ థర్డ్ ప్లేస్ గోస్ టు - తూ గో ..........కాలేజ్.



సెకండ్ ప్లేస్ గోస్ టు - తిరుపతి..........కాలేజ్ . 



అండ్ ఫైనల్లీ much awaited స్టేట్ overall ఫస్ట్ ప్లేస్ అండ్ ఛాంపియన్షిప్ గోస్ టు ఇక్కడ రెండు కాలేజ్స్ పొటాపోటీని చూపిమ్చాడంతో ఇద్దరికీ ఇవ్వాల్సిందిగా కమిటీ నిర్ణయించింది అవి - వైజాగ్.........కాలేజ్ మరియు అనంతపురం........కాలేజ్ అని అనౌన్స్ చెయ్యగానే , మహేష్ నా చిరకాల కల సాధించిపెట్టావు అంటూ ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలించుకొని మురిసిపోయారు. మిగతా పిల్లలంతా  మహేష్ , మహేష్ , మహేష్..........అంటూ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లేలా సంతోషంతో కేకలుపెట్టారు. 



కొద్దిసేపటి తరువాత ప్రైజెస్ అందుకోవడానికి థర్డ్ , సెకండ్ తరువాత ఓవర్ అల్ ఛాంపియన్స్ అంటూ మా రెండు కాలేజ్ లను విడివిడిగా పిలవడంతో సర్ తోపాటు అందరమూ వెళ్లి పెద్ద షీల్డ్ ను రాష్ట్ర క్రీడా మంత్రి నుండి అందుకొని , మహేష్ అంటే నువ్వేనా అని అడగడంతో అందరూ ఆశ్చర్యపోతుండగానే స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఆయనే స్వయంగా అందించారు . ఫోటోలు మరియు సెల్ఫీ లు దిగి సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకొని కిందకు దిగి, సర్ మొబైల్ తీసుకొని ఫస్ట్ ఇంటికి కాల్ చేసి విషయం చెప్పగానే అమ్మవాళ్ళంతా నోటి మాట రానట్లు పులకించిపోయి ఆనందాన్ని పంచుకున్నారు , అమ్మా అంటీ కి కూడా చెప్పండి అనేంతలో ........బుజ్జికన్నా నువ్వు కచ్చితంగా సాధిస్థావని నమ్మకంతో ఎప్పుడెప్పుడు కాల్ చేస్తావా అని ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఫోన్ అందించింది. 



అంటీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను కాలేజ్ ప్రాక్టీస్ తోపాటు అతిముఖ్యమైన మీ దగ్గర నేర్చుకున్న మెళకువలు అడుగడుగునా ఉపయోగపడ్డాయి thank యు so so sooooo మచ్ అంటీ అంటూ సంతోషంతో చెప్పగానే , తన కళ్ళల్లో కారుతున్న ఆనందబాస్పాలను చూసి అమ్మావాళ్ళు అంటీని మనసారా కౌగిలించుకొన్నారు , అమ్మా ఇక్కడ సరిగ్గా వినపడటం లేదు తరువాత కాల్ చేస్తాను , ముందు దానికి చెప్పండి కుళ్ళుకోవాలి అని చెప్పడంతో , అప్పటివరకూ ఒక చెవితో వింటున్న మహి కోపంతో పళ్ళు కోరుక్కుంటుండటం చూసి అమ్మావాళ్ళు మూసిముసినవ్వులు వినిపించి ఏమిజరిగింతుందో ఊహించి లవ్ యు మా బై అని చెప్పి కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఫ్రెండ్స్ తో కలిసిపోయి ఎంజాయ్ చేసాను. అలాగే అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది మీకు ఇంటరెస్ట్ ఉంటే తిరుమల స్వామి వారిని ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా వీలు కల్పించాము వచ్చి కాలేజ్ పేర్లు ఇవ్వండి వారికి సమయం ఎప్పుడో చెబుతాము అని అనౌన్స్ రావడంతో , మహేష్ అందరూ ఇక్కడే ఉండండి ఫస్ట్ మన కాలేజ్ పేరు ఇచ్చివస్తాను ఎందుకంటే రేపే వైజాగ్ ప్రయాణం అని చెప్పి స్టేజి పైకి అందరికంటే ముందు చేరుకొనివచ్చి సంతోషంతో నవ్వుతూ మరో రెండు గంటల్లో దర్శనం బస్ నేరుగా మనకు allot చేసిన కాలేజ్ దగ్గరికి వస్తుంది గంటలో అందరూ రెడీ అయిపోవాలి అని సర్ ను అన్ని కాలేజ్ వాళ్ళు అభినందిస్తుండగా మురిసిపోతూ కాలేజ్ చేరుకున్నాము.



సర్ చెప్పినట్లు గంటలో రెడీ అయ్యి అమ్మకు కాల్ చేసి దర్శనానికి వెళుతున్న విషయం చెప్పాను , చాలా సంతోషం నాన్నా నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వెళ్ళాము మళ్లీ లైఫ్ లో ఒక మెట్టు ఎక్కి వెళుతున్నావు అని చెప్పింది. బయట వేచిచూస్తుండగానే బస్ రావడంతో లవ్ యు బై అని చెప్పేసి సర్ కు మొబైల్ ఇచ్చి ఏడుకొండల అందాలను ప్రకృతిని వీక్షిస్తూ పైకి చేరుకొని ప్రశాంతంగా ఎక్కడా ఆగకుండా వెళ్లి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కిందకు దిగి భోజనాలు చేసి చాలాసేపు అమ్మా , అమ్మమ్మా , డాక్టర్ అంటీతో మాట్లాడి , ఇదిగో నాన్న ఉన్నారు మాట్లాడు అని అందివ్వబోతుంటే , ఇందు పార్టీకి వెళుతున్నాను రేపు వస్తాడుగా మాట్లాడతాలే అని వెళ్ళిపోయాడు. అమ్మా నేను మాట్లాడతానని చెప్పనా , నాకు మా అమ్మ , అమ్మమ్మా , అత్తయ్యా అంతే అంటూ కోపంతో చెప్పి బై రేపు రాత్రికి వైజాగ్ చేరుకుంటాము అని చెప్పి కట్ చేసాను. రాత్రంతా సర్ మేము సాధించిన పతకాలను , కప్పులను మరియు  షీల్డ్స్ ను చూస్తూ మురిసిపోతూ అలాగే నిద్రలోకి జారుకున్నారు. 



ఉదయం తెల్లవారకముందే లేచి రెడీ అయ్యి అన్నింటినీ జాగ్రత్తగా ప్యాక్ చేసి బస్ లో స్టేషన్ చేరుకొని పోటీల గురించి చర్చిస్తూ చిన్న చిన్న పోరాపాట్లకు నవ్వుకుంటూ టిఫిన్ , భోజనాలు ట్రైన్ లోనే చేసి రాత్రి 8 గంటలకు వైజాగ్ చేరుకున్నాము. విండో లో నుండే అమ్మావాళ్లను చూసి అమ్మా , అమ్మమ్మా అని గట్టిగా పిలిచాను. సర్ వెంటనే ప్యాక్ చేసిన ప్రైజెస్ బయటకు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి చివరగా నాకు overall ఛాంపియన్షిప్ షీల్డ్ ఇచ్చి , సంతోషన్గా మీ వాళ్లకు చూపించి రేపు కాలేజ్ కి తీసుకురండి అని చెప్పడంతో , thank you sir అంటూ ట్రైన్ ఆగగానే బ్యాగు భుజం మీదకు వేసుకొని అందరమూ దిగి అమ్మా ఇది నీకోసమే అంటూ అందించగానే , నా కోరిక తీర్చావు కన్నా అంటూ ఆనందబాస్పాలతో అమ్మ కౌగిలించుకొని పరవశించిపోయింది. అమ్మమ్మా సాధించాను అంటూ hifi కొట్టి ప్రక్కనే అంటీని చూసి ఆనందంతో పాదాలకు నమస్కరించి మీరు లేకపోతే ఇది సాధించేవాణ్ణి కాదు అంటీ అని మనఃస్ఫూర్తిగా చెప్పాను.



ఇదిచాలు మహేష్ అంటూ లేపి తలపై ఆప్యాయంగా నిమిరి నేను చేసింది ఏమీ లేదు నువ్వు పడిన శ్రమే నిన్ను గెలిపించింది అంటూ నీ లాంటి శిష్యుడు ఒక్కరు ఉన్నా చాలు మహేష్ అంటూ పొంగిపోతూ తన గుండెలకు హత్తుకొని మురిసిపోయింది. ప్రక్కనే ఉన్న మహి ఏంట్రా ఈ ఓవర్ ఏక్షన్ నేను చూడలేకపోతున్నాను అంటూ చూసింది. కారులో ఇంటికి వెళుతూ 10 రోజులు జరిగిన గేమ్స్ గురించి వివరిస్తూ , ఏకంగా స్పోర్ట్స్ మినిస్టర్ మాకు షీల్డ్ బహుకరించడమే కాదు నాకు స్పెషల్ షీల్డ్ కూడా ఇచ్చారమ్మా అంటూ వాట్సాప్ లో అమ్మకు పంపిన ఫోటో మరియు షీల్డ్ చూపించాను. మా బుజ్జికన్నయ్య గ్రేట్ అయితే అంటూ అమ్మమ్మ సంతోషన్గా ముద్దుపెట్టింది. ముందు కూర్చున్న మహి అంతేకదా అన్నట్లు తన ఫీలింగ్స్ పెట్టింది.



ఇంటికి చేరి అమ్మ వంట 10 రోజుల తరువాత తృప్తిగా తిని మళ్లీ స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అని గర్వంగా చెబుతుండటంతో , రేయ్ ఆఫ్టర్ అల్ ఒక మినిస్టర్ తో కప్పు అందుకొని ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు , 8 నెలలు wait చెయ్యి ఏకంగా చీఫ్ మినిస్టర్ తో నామెడలో పతకం మరియు ప్రతిభా అవార్డ్ అందుకుంటాను , నీ రెండు కళ్ళతో చూసి తరించడానికి రెడీగా ఉండు అని చెప్పి అమ్మా నేను చదువుకోవాలి వెళుతున్నాను అంటూ పైన రూంవైపు వెళుతోంది. All the బెస్ట్ ఊరికే మాట్లాడటం కాదు సాధించి చూపించి అప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడు అని చెప్పాను. అలా చేసి చూపిస్తాను అంటూ వెళ్ళిపోయింది. మహి కచ్చితంగా సాధిస్తుంది , దానికి మూలకారణం మాత్రం నా ఛాలెంజ్ అవ్వడం తో  అమ్మా , అమ్మమ్మా ఆనందాలకు అవధులు లేవు.
[+] 13 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 07-09-2019, 10:13 AM



Users browsing this thread: 192 Guest(s)