Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కవి చౌడప్ప
#10
భంగే పస సాహెబునకు భామల కైతే దెంగుడు పస ఆ మీదట కంగులుపస కాకోదర కుందవరపు కవిచౌడప్పా..
 
పొగతాగని నరుని బ్రతుకు పొగడగా నివ్వలేని భూపతి బ్రతుకున్ మగడొల్లని సతి బ్రతుకును నగుబాటేగద కుందవరపుకవిచౌడప్పా..
 
ఎంతటి దేవులకైనన్ గట్టిగ మనవూరి లంజకాంతలకైనన్ దెంగక బిడ్డలుపుట్టరు.. కట్టడి యిది కుందవరపుకవిచౌడప్పా.
 
ఇంటికి పదిలము బీగము వింటికి పదిలంబు నారి వివరింపంగా చంటికి పదిలము రవికయు కంటికి పదిలంబు రెప్ప కుం.కవి.
 
చౌడప్ప శతకానికి చివరి మాటలు శృంగార కళాభిమానులు రసపోషకులైన మన మిత్రులకు చిన్నమాట... ఇప్పటివరకు మనవర్గ ప్రాతః స్మరణీయుడు అనదగ్గ కవిచౌడప్ప మనకందించిన ఆణిముత్యాలను నావంతు ప్రయత్నంగా మీకు కొన్ని అందించాను.. ఒక శతకంలో దాదాపు 108 పద్యాలు వుంటాయి.. అందులో శృంగార / బూతు పరమైన రసగుళికలు అని నాకనిపించిన 3వ వంతు (దాదాపు 40) పద్యాలు మన మిత్రులకోసం పొందుపరచటం జరిగింది.. ఇవికాక ఇంకేమైనా ఆణిముత్యాలుంటే మీరు అందించవచ్చు.. అప్పుడే ఈసైట్లో ఈ విభాగానికి పరిపూర్ణత వస్తుంది అనుకుంటున్నాను.. అలాగే ఈ ముత్యాలు ఏరుకొని దాచుకొని ముందు తరాలకు అందించగలిగితే మన శృంగార కళా పిపాసకు సార్థకత చేకూరుతుందని నా విశ్వాసం..
 
మనిషి ఎంతగా ఎదిగినా, ఏ వృత్తిలో వున్నా తాత్కాలిక అవసరాలకోసం ఏ బాటలో పయనించినా మనిషిలో మనసుని, ఆత్మను ఎప్పుడూ చంపుకోకూడదు.. అలాగే ఆకాశంలో ఎగిరే విమానంలో కూర్చున్నా కాళ్ళూమాత్రం అక్కడకూడా నేలవైపే చూస్తుంటాయని మరిచిపోకూడదు.. సుఖ లాలసలో ఎంతగా భోగించినా పారమార్ధపు విషయాలను విస్మరించ కూడదు.. అప్పుడే మన చదువులకు జన్మలకు సార్థకత..
 
విషయ లాలసతలో పడిపోయి సర్వం కోల్పొయిన సెలబ్రటీలు మహానటి సావిత్రి, రాజబాబు జీవితాలకు.. అదే స్థాయిలో బ్రతికి అన్నీపోగొట్టుకున్నా; కోవెల మెట్లు కడుగుతూ పారమార్ధ చింతనతో జీవితం గడుపుతున్న కాంచన జీవితానికీ ఎంత తేడా!!... సరిగ్గా ఇదే విషయం కవిచౌడప్ప శతకం చదివిన ఏ పాఠకుడికైనా ఈ 4పద్యాల ద్వారా స్ఫురించి తీరుతుంది..
 
ఇప్పటివరకూ మనం చదివిన పద్యాలలో చౌడప్పను ఓ శృంగార కవిగా మాత్రమే గుర్తిస్తాము..కానీ అతనిలో ఎంత గంభీరమూర్తి వున్నాడో.. ఎన్ని జన్మ సాఫల్యతా లక్షణాలున్నాయో.., ఆ మనిషిలోని మనసు ఏమిటో మీరే గమనించండి..
 
తనయునికిని, పరదేశికి,
పెనిమిటి కిని ఒ క్కరీతి భోజన మిడు ఆ
వనితను పుణ్యాంగనయని
ఘనులనుదురు  కుందవరపు కవి చౌడప్పా!
 
భావం: తన కుమారునికైనా, భర్తకైనా పరాయి వాడికైనా ఆకలి గమనించి కడుపారా అన్నం పెట్ట గలిగిన వాళ్ళనే పుణ్యవతి అని జనులు మెచ్చుకుంటారట.. (అటువంటి స్త్రీని గౌరవించకుండా మరో దృష్ఠితో చూడటం పాపం ఆయనకు చేతకాలేదు..)
 
పరవిత్తము గోమాంసము పరసతి తన తల్లియనుచు భావించిన ఆ నరుండు నరుండా రెండవ కరివరదుండె కాకోదర కుందవరపుకవిచౌడప్పా..
 
కరి వరదుండు = గజేంద్రుని బ్రోచిన విష్ణుమూర్తి..
చిత్తము శ్రీహరిపై కిం చిత్తును నిలుపంగలేని చెడుగుల; మడియన్ మొత్తి యమభటులు ద్రోతురు కత్తులపై కుందవరపుకవిచౌడప్పా
 
తన మదిలోపల దశరధ తనయులలో పెద్దవాని దలచిన జన్మం బనయంబు పావనంబని.. ఘనులందురు కుందవరపుకవిచౌడప్పా.
 
భావం: మనసులో శ్రీరాముడిని తలచుకున్నప్పుడే జన్మ పావన మౌతుందట..
 
ఎప్పుడు పడిపోనున్నదో తెప్పున ఈ తనువుకీర్తి గురవెరుగడు దామొప్పె ధనగర్వ తిమిరము గప్పినచో కుందవరపుకవిచౌడప్పా.
 
భావం: ఈ జీవితం, ఈ శరీరానికి ఆపాదించుకున్న కీర్తి, ధనగర్వంతో ఏర్పరుచు కొంటున్న చీకటి పొరలు.. ఇవన్నీ బుద్బుదాలు.. పంపిన భగవంతునికి కూడా తెలియకుండా ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు..
 
మునుపటి సుకవుల నీతులు జననుతములు, కుందవరపు చౌడుని నీతుల్ వినవినఁదేట తెనుంగై కనబడుగద కుందవరపు కవి చౌడప్పా!
 
(సమాశష్పవిజయం.." ఈ " శష్పవిజయం " గురించి ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను..వారణాశి లైబ్రరీ తెలుగు విభాగంలో కూడా ప్రయత్నిచినా దొరకలేదు.. అసలు చాలామందికి ఆపేరే తెలియదు.) యుద్ధాలంటే గిట్టని రామలింగడు ఆ కుతంత్రాలకు వ్యతిరేకంగా, అలాగే ఆస్థానంలో గీర్వాణాలు పోయే పెద్దన, తాతా చార్యులు మొదలైన వారి వ్యవహార శైలికి నిరసనగా ఈ శష్పవిజయం రాశాడని చెప్పుకొనేవారు. సాధారణంగా ప్రతి కావ్యపు మొదట్లో ఇష్టదేవతా ప్రార్థన వుంటుంది.. అలానే ఈ కావ్యంలో కూడా ఇష్టదేవతా ప్రార్థన వుంటుంది.. నాకు గుర్తున్నంతవరకూ ఆప్రార్థన గమనించండి.. ఇక అసలు కావ్యం ఎలావుంటుందో వూహించండి..
 
 
కందము నీవలెఁ జెప్పే యందము మఱిగాన మెవరియందును గవిసం క్రందన యసదృశ నూతన కందర్పా కుందవరపు కవి చౌడప్పా!
Like Reply


Messages In This Thread
కవి చౌడప్ప - by xyshiva - 27-08-2019, 04:35 PM
RE: కవి చౌడప్ప - by xyshiva - 27-08-2019, 04:38 PM
RE: కవి చౌడప్ప - by xyshiva - 27-08-2019, 04:40 PM
RE: కవి చౌడప్ప - by xyshiva - 27-08-2019, 04:40 PM
RE: కవి చౌడప్ప - by kamaraju50 - 28-08-2019, 06:38 AM
RE: కవి చౌడప్ప - by xyshiva - 28-08-2019, 01:26 PM
RE: కవి చౌడప్ప - by rascal - 28-08-2019, 01:58 PM
RE: కవి చౌడప్ప - by xyshiva - 28-08-2019, 05:45 PM
RE: కవి చౌడప్ప - by xyshiva - 28-08-2019, 05:46 PM
RE: కవి చౌడప్ప - by mickymouse - 30-08-2019, 09:00 AM



Users browsing this thread: 2 Guest(s)