07-09-2019, 10:10 AM
మేము పెట్టిన కేకలకు నిట్టుపడి ఏమిజరిగిందో అని అమ్మ , అమ్మమ్మా మరియు అత్తయ్యా పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మా గదిలోకి వచ్చి ముందు నా చేతికి అంటిన రక్తాన్ని చూసి మహేష్ ఏమయ్యింది నాన్నా అంత రక్తం చేతులకి అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో నా చేతులను సున్నితంగా అందుకొని భయంతో కంపిస్తున్న నన్ను మోకాళ్లపై కూర్చుని హత్తుకొని చేతులకి ఎక్కడా గాయం అవ్వకపోవడంతో రక్తం ఎక్కడిది అని అనుకునేంతలో ,
మహి అమ్మా ........అని నొప్పితో ఏడుస్తూ పిలిచి స్పృహతప్పి అమాంతం వెనక్కు సోఫాలో పడిపోయింది. మహి అంటూ ముగ్గురూ తనవైపు చూసి తన పొత్తికడుపులో గుచ్చుకున్న విభాగినిని చూసి , నోట్లో మాట పడిపోయినట్లు మ...... మ........ అంటూ వేగంగా వెళ్లి ఏమయ్యిందిరా బంగారు , ఎలా జరిగింది అంటూ రోధిస్తుండటంతో ,అమ్మమ్మ కూడా కళ్ళల్లో నీళ్లతో బాధపడుతూ ఏమిచెయ్యాలో తోచక చేతులు కాళ్ళు ఆడకపోవడంతో , ఇందు దాని సూదులు మాత్రమే గుచ్చుకున్నాయి నెమ్మదిగా ఎత్తుకొని కిందకు రా నేను కారు తీస్తాను రేణుకా మేడం దగ్గరికి వెళదాము అని చెప్పడంతో కన్నీళ్ళతోనే అమ్మ మహిని ఎత్తుకొని , నా చేతిని అమ్మమ్మ పట్టుకొని అప్పుడే గాలికి ఎగిరిన పేపర్ కింద ఉన్న బాక్స్ చూసి దీనివల్లనే ఇదంతా జరిగి ఉంటుంది అని హుటాహుటిన కిందకు వచ్చి కారులో వెళుతూనే అమ్మమ్మ డాక్టర్ అంటీకి కాల్ చేసి విషయం చెప్పింది.
లౌడ్ స్పీకర్ on చెయ్యమని చెప్పి ఇందు ఏమీ కంగారుపడకు మీరు చెప్పినదాని బట్టి సూదులు మాత్రమే గుచ్చుకున్నాయి , కేవలం పదే పది నిమిషాల్లో ట్రీట్మెంట్ చేసేస్తాను , నెనున్నానుగా అని ధైర్యం ఇవ్వడంతో అమ్మ కన్నీళ్లను తుడుచుకుని గిరిజా తొందరగా పోనివ్వమని చెప్పి మహి బుగ్గలను ప్రేమగా స్పృశిస్తోంది.
ట్రాఫిక్ ఉండటం వలన అర గంటలో చేరుకొని నేరుగా ICU కి మహిని ఎత్తుకొనివెళ్లాము. అమ్మ చేతులలోని మహిని ఎత్తుకొని సూదులు గుచ్చుకోవటమే కాదు పొట్లాటలో అటూ ఇటూ కదలడం వలన రంద్రం వెడల్పు అయ్యి ఉండటం చూసి అమ్మను కంగారుపెట్టకూడదని , అమ్మా ఇందుని అలా కూర్చోబెట్టు చిన్నదంటే చిన్న గాయమే పదే పది నిమిషాలు అని చెప్పి నర్సు చెప్పినవన్నీ రెడీ చెయ్యండి అని చెప్పి లోపలకు తీసుకువెళ్లింది.
అమ్మ మాత్రం కన్నీళ్లు కారుస్తూ మిర్రర్ లోనుండి లోపలకు చూస్తూనే ఉంది. అంటీ మహికి మత్తు ఇంజక్షన్ వేస్తూ అమ్మను చూసి నర్సుని పంపించింది.నర్సు బయటకువచ్చి మేడం కంగారుపడకుండా అలా కూర్చోండి అని చెప్పి అమ్మమ్మకు చూసుకోండి అని చెప్పి లోపలకు వెళ్ళింది. అమ్మ మళ్లీ లెవబోతుండటంతో ఇందు రేణుక తన సొంత కూతురు కంటే బాగా ట్రీట్ చేస్తుంది , కొద్దిసేపు గుండె ధైర్యం తెచ్చుకో మహికి ఏమీ కాదు అంటూ కన్నీళ్లను తుడిచి తలపై ముద్దుపెట్టి చెప్పింది. అమ్మా .........అంటూ బాధపడుతూనే అమ్మమ్మ చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది.
నా చేతిని పెట్టుకొన్న అత్తయ్యకు నేను భయంతో వనికిపోతుండటం తెలిసి అమ్మమ్మ ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టి మహికి ఏమీ కాదు మరికొద్దిసేపట్లో నవ్వుతూ నడుచుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పింది. అత్తయ్యా అంతా నావల్లనే అంటూ కళ్ళను చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టాను. అదేమీ కాదు ఏదో accidental గా జరిగిపోయి ఉంటుంది అంటూ నా కన్నీళ్లను తుడిచి అత్తయ్య తన గుండెలపై నన్ను హత్తుకొంది.
ఐదు నిమిషాల తరువాత నా ఏడుపు ఆపడంతో అమ్మమ్మ తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఎలా జరిగింది అని అడగడమే ఆలస్యం మళ్లీ ఒక్కసారిగా నా కళ్లల్లో కన్నీళ్లు కారి , జరిగిందంతా వెక్కివెక్కి ఏడుస్తూ తడబడుతూ వణుకుతూ చెప్పాను. అలా జరిగిందా డివైడర్ ను మహి కాలేజ్ లో ఎక్కడో పెట్టి మరిచిపోయి ఇంటికి వచ్చింది , బాక్స్ చూసి డివైడర్ మిస్ అవ్వడంతో కాలేజ్ లో నువ్వు బాక్స్ మొత్తం చూడటం గుర్తుకువచ్చి నువ్వే తీసుకున్నావేమో అని పరుగుపరుగున అమ్మ దగ్గర నుండి నీదగ్గరకు వచ్చి , అదే సమయానికి నేను ఇచ్చిన బాక్స్ లో నుండి నువ్వు పరిశీలిస్తున్న డివైడర్ ను చూసి , మరొక బాక్స్ నీకోసం కొన్న విషయం తెలియని మహి నాది అంటూ లాక్కునేటప్పుడు కడుపులో గుచ్చుకుంది అంతే ఇందులో నీతప్పు ఏమీ లేదు బుజ్జికన్నా , సరిగ్గా తను వేగంగా లోపలికిరావడంతో గాలికి ప్రక్కనే ఉన్న పేపర్ బాక్స్ మీద పడటంతో అది చూడకపోవడంతో ఇదంతా జరిగింది అంతే అంటూ నాతలపై ముద్దుపెట్టి ఓదార్చింది.
లేదు అమ్మమ్మా తప్పంతా నాదే చూడండి రక్తం నాచేతులకు ఎలా అంటుకుందో , నేనే చెల్లిని..........కాదు కాదు అక్కయ్యను పొడిచాను , అక్కయ్యను తమ్ముళ్లు ఎవరైనా ప్రాణంగా చూసుకోవాలి కానీ నేను ఇలాచేసాను నాకు పెద్ద శిక్ష పడాల్సిందే అంటూ అమ్మమ్మ గుండెలపై వాలిపోయాను. నేను అక్కయ్య అని మొదటిసారిగా పిలవడంతో ముగ్గురూ ఒకరిముఖాలుమరొకరు చూసి ఆనందిస్తూ ముగ్గురూ నాచుట్టూ చేరి మేము చెబుతున్నాము కదా మహేష్ ఇందులో నీతప్పేమీ లేదు. గిరిజా ముందు మహేష్ చేతులను శుభ్రన్గా కడుక్కొని రా అని చెప్పడంతో , అలాగే అమ్మగారు అంటూ నన్ను పిలుచుకొనివెళ్లి వాష్రూమ్ లో చేతులను సబ్బుతో శుభ్రం చేసి dettol పట్టించి కడిగి అమ్మ దగ్గరికి తీసుకువచ్చిన మరుక్షణమే , ICU లోనుండి అంటీ బయటకువచ్చి సమయం చూసి 10 నిమిషాలు ఎక్కువ అయ్యింది sorry రా ఇందు , రెండంటే రెండే రెండు కుట్లువేశాను మరో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది , వారం రోజుల్లో కాలేజ్ కి కూడా వెళ్ళిపోతుంది అనిచెప్పి, అందరినీ లోపలకు పంపించి గిరిజా చెయ్యి అందుకొని ఎలా జరిగిందో తెలుసుకొని లోపలికివచ్చి మహేష్ మీ అక్కయ్యకు ఏమీ కాలేదు నిద్రపోతోంది అంతే అంటూ తలపై నిమిరి , దీనివాళ్లనైనా ఇద్దరూ కలిసిపోతారేమో అమ్మా అని ఆశ పెంచింది.