15-11-2018, 07:09 PM
కుమార్: అదీ... నేను బేగంపేటలో దిగిపోతా జ్యోతి. నెక్స్ట్ వీకెండ్ వస్తా ఖచ్చితంగా...
జ్యోతి: హ్మ్మ్... ఎక్కువ ఊహించుకున్నానా... ఈ వీకెండ్ ఏంటో తమరికి ఉన్న పనులు.
కుమార్: ఉందిలే ఏదో పని. మా దూరపు అత్త ఒకరున్నారు ఇక్కడ. వెళ్లి పలకరించాలి. ముందే ఫిక్స్ చేసుకున్న పని. తప్పదు.
జ్యోతి: నెక్స్ట్ వీక్ రాకపోతే చంపేస్తా...
ఈ మాటల్లోనే బేగంపేట్ స్టేషన్ వచ్చేసింది. నలుగురు చూస్తున్నారు అని కూడా పట్టింపు లేకుండా కుమార్ కి ఒక తడిముద్దు ఇచ్చేసింది జ్యోతి. గత పది నిముషాలలోనే బాగా బరువెక్కిన గుండె తేలికపడటమూ మరలా ఇంకా బరువుగా అవ్వటమూ జరిగాయి. ఈ వింత ఫీలింగ్ అర్ధం అయ్యేలోపు బేగంపేట్ స్టేషన్ లోనుంచి కూడా రైలు కదిలిపోయింది. అదే బరువైన గుండెతోనే తన బెర్త్ ఎక్కేసి నిద్రలోకి జారిపోయింది జ్యోతి.
రూప పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఊరుకాని ఊరిలో ఒక్కత్తే ఎలా ఉంటుందో జ్యోతి అని తెగ ఆరాటపడిపోతుంది మనసు. అవే ఆలోచనలతో అడుగులో అడుగు వేసుకుంటూ కార్ దగ్గరికి వచ్చింది. కార్ విండ్ షీల్డ్ మీద ఉన్న పేపర్ మీద దృష్టి పడింది. తీసి చుస్తే పెద్ద అక్షరాలతో సారీ అని రాసి ఉంది. కింద కుమార్ అనే ఒక సంతకం కూడా ఉంది. ఆంటే ఆ కుమార్ వచ్చాడన్నమాట. దొంగ వెధవ రాను అని చెప్పాడు. ఈ మగ వెధవలు మారరు. అప్రయత్నంగానే కళ్ళు వాడికోసం వెతుకుతున్నాయి. ఎక్కడా కనపడలేదు వాడు. ఆనందపడాలో బాధపడాలో కూడా అర్ధం కాలేదు తనకి. పోకిరి వెధవ అని తిట్టుకుంటూ కార్ ఎక్కింది రూప. పర్సు లోంచి తాళాలు తీస్తూ, అలవాటుగా ఫోన్ తీసింది. వాట్సాప్ లో కుమార్ నుంచి మెసేజ్లు ఉన్నాయి. తాను జ్యోతి లోకాన్ని మర్చిపోయి నవ్వుకుంటున్న ఫోటోలు. ఆ ఫోటోలు చూడగానే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది రూపకి. కింద ఇంకా రెండు మెసేజ్లు కూడా ఉన్నాయి.
కుమార్: సారీ. మీ అమ్మాయి వెళ్తోందన్న బెంగతో నువ్వు ఉంటే నేను ఆట పట్టించా... కానీ మీరిద్దరూ చాలా బాగున్నారు అలా ఫ్రెండ్స్ లాగా నవ్వుకుంటూ. చిన్నప్పటినుంచీ హాస్టల్ లో ఉండటం వల్ల ఫామిలీ కి కొంచెం దూరం నేను. మీ ఇద్దరినీ చూసాక నేనేమి పోగొట్టుకున్నానో అర్ధం అయ్యింది. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతు ఉండాలని కోరుకుంటున్నా...
రూపకి తెలియకుండానే తన కళ్లలోనుంచి ధారగా కన్నీటి ప్రవాహం మొదలైంది. కానీ దానికి కారణం మాత్రం తనకి కూడా తెలియటం లేదు. /33